Friday, 24 April 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వింజమూరులో సీఎం నారా చంద్రబాబు నాయుడు భారీ సభ విజయవంతం

వింజమూరులో నిర్వహించిన భారీ ప్రజాసభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర అభివృద్ధి దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, సంక్షేమ పథకాల అమలు, రైతులకు అందిస్తున్న సహాయంపై వివరించారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల పురోగతిపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. ఈ సభకు పెద్ద ఎత్తున ప్రజలు, పార్టీ నాయకులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బందెల గౌతమ్ కుమార్ ఆదేశాలతో ఏప్రిల్ 2న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు భారీ నిరసన కార్యక్రమం

బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బందెల గౌతమ్ కుమార్ ఆదేశాల మేరకు ఏప్రిల్ 2, 2026 గురువారం ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించనున్నారు. పై అంశాలపై నిరసనగా చేపడుతున్న ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం ఈ ధర్నా కీలకమని పేర్కొన్నారు.

అనకాపల్లి

గుడ్డు ఒలిచిపెట్టి.. అన్నం కలిపిచ్చిన హోం మంత్రి! విద్యార్థులతో కలిసి భోజనం

అనకాపల్లి జిల్లా ఏప్రిల్ 1 పున్నమి న్యూస్ (ప్రతినిధి ఆనంద్) : నక్కపల్లి జడ్పీ హైస్కూల్‌లో హోం మంత్రి వంగలపూడి అనిత ఆకస్మికంగా పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో నేలపై కూర్చొని మధ్యాహ్న భోజనం చేశారు. గుడ్డు ఒలిచి అన్నంలో కలిపి స్వయంగా పిల్లలకు అందించారు. విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకుని, చదువు-సౌకర్యాలపై ఉపాధ్యాయులకు సూచనలు ఇచ్చారు. మంత్రితో కలిసి భోజనం చేసినందుకు విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పాడి పశువుల అభివృద్ధికి పశువైద్య శిబిరం – రైతులకు మార్గదర్శకం

ఎస్పీఎస్ ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 1 (పున్నమి ప్రతిని) . పాడి పశువుల అభివృద్ధి కోసం పశుసంవర్ధక శాఖ కృషి చేస్తోందని డిప్యూటీ డైరెక్టర్ సోమయ్య తెలిపారు. మనుబోలు మండలం కొమ్మలపూడిలో వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ ఆధ్వర్యంలో పశువైద్య శిబిరం నిర్వహించారు. ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ మన్నెమాల భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. పశువులకు వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. పోషకాహార లోపం నివారణకు మినరల్ మిక్సర్ ఉపయోగించాలని సూచించారు.అనంతరం ఏడి గురువారెడ్డి మాట్లాడుతూసబ్సిడీపై గడ్డి విత్తనాలు అందిస్తామని, పచ్చి మేత పెంపకంపై రైతులు దృష్టి పెట్టాలన్నారు. అవసరమైతే మినీ గోకులాలు మంజూరు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ మహమ్మద్ షరీఫ్, డాక్టర్ మంజునాథ్ పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

క్రికెట్ బెట్టింగ్‌పై కఠిన చర్యలు: ఎస్ఐ శివరాకేష్ హెచ్చరిక

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 1 (పున్నమి ప్రతినిధి) స్థానిక పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఎస్ఐ శివరాకేష్ మాట్లాడుతూ ఐపీఎల్ సీజన్ సందర్భంగా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఇటువంటి కార్యకలాపాలు అప్పుల పాలయ్యే ప్రమాదం ఉందన్నారు. వేసవిలో పిల్లలు సముద్రాలు, నదులు, చెరువుల్లో ఈతకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించారు. మైనర్లకు మోటార్ బైకులు ఇవ్వొద్దని, ప్రమాదాలైతే తల్లిదండ్రులే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. సోషల్ మీడియాలో అన్యులతో చాటింగ్ ప్రమాదకరమని, తల్లిదండ్రులు పిల్లలపై నిఘా పెట్టాలని సూచించారు. చట్టవ్యతిరేక చర్యలు గమనిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు.

అన్నమయ్య

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై ‘ఆర్ఎంపియు’ సమరభేరి

-కోడూరు పంచాయతీ కార్యాలయం వద్ద నల్ల బ్యాడ్జీలతో కార్మికుల భారీ నిరసన -లేబర్ కోడ్స్ అమలుకు నిరసనగా దేశవ్యాప్తంగా ‘బ్లాక్ డే’ విజయవంతం చేయాలి -పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప.. దాసరి జయచంద్ర పిలుపు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ (కార్మిక చట్టాల సవరణ) అమలును నిరసిస్తూ, భారత విప్లవ మార్క్సిస్టు పార్టీ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం రైల్వే కోడూరు పంచాయతీ కార్యాలయం వద్ద ‘బ్లాక్ డే’ నిర్వహించారు. ఆర్ఎంపియు పంచాయతీ మరియు స్వచ్ఛభారత్ కార్మికుల జిల్లా కన్వీనర్ చెన్నయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర కన్వీనర్ కామ్రేడ్ దాసరి జయచంద్ర ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.ఈ సందర్భంగా దాసరి జయచంద్ర మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. దేశవ్యాప్తంగా 36 కోట్ల మంది కార్మికులు గత ఫిబ్రవరి 12న సమ్మె చేసి తమ నిరసన తెలిపినప్పటికీ, మొండిగా ఏప్రిల్ 1 నుండి లేబర్ కోడ్స్ అమలు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. కార్మిక సంఘాలతో కనీస సంప్రదింపులు జరపకుండా, ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరిస్తూ కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చేందుకే ఈ చట్టాలను తెచ్చారని విమర్శించారు. “పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప” అన్న కార్ల్ మార్క్స్ నినాదాన్ని గుర్తు చేస్తూ, కార్మిక వర్గం తమ హక్కుల కోసం వీరోచిత పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.అఖిలపక్ష కార్మిక సంఘాల పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు తమ పని ప్రాంతాల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతున్నారని ఆయన పేర్కొన్నారు. భోజన విరామ సమయంలో నిరసన గళం విప్పాలని, ఈ నల్ల చట్టాలను రద్దు చేసే వరకు విశ్రమించబోమని హెచ్చరించారు. కేంద్రం తన పద్ధతి మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు, స్వచ్ఛభారత్ సిబ్బంది, ఆర్ఎంపియు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నల్ల బ్యాడ్జీలు ధరించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మికుల శ్రమను దోచుకుంటున్న పాలకుల తీరును ఎండగట్టారు.

E-పేపర్ తెలంగాణ మహబూబాబాద్

నేనున్నానంటూ అనూష కి భరోసానిచ్చి అండగా నిలిచిన రఘు అన్న

అనూష కి అండగా “రఘు” పల్లెనుండి పట్నం దాకా రఘు సేవలుఇన్స్టాగ్రామ్ వేదికగా ఆర్థిక సహాయాలు,నిత్యావసర వస్తువులు, వీల్చైర్లు పంపిణీఏకంగా లక్షా ముప్పై వేలు అందచేతమానవుని సాధారణ జీవితంలో ఎవరికి స్వార్ధం వారుచూసుకునే ఈ టెక్నాలజీ రోజుల్లో సాటిమనిషికి సమాజం ద్వారా ఎంతో కొంత ఆర్ధిక సహాయం చేసేవారు చాలా అరుదు దానికి ప్రతిరూపం కొరికి మండల కేంద్రానికి చెందిన ఇంస్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ “గంగరబోయిన రఘు”ఇటీవల కాలంలో కురవి మండలం కందికొండ గ్రామానికి చెందిన కొర్ని అనూష రైలు ప్రమాదానికి గురై జీవితం చెల్లాచెదురు అయినా సంగతి విదితమే హైదరాబాద్ లో నవీన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న అనూష కి వెన్నుపూస శస్త్ర చికిత్సకి దాదాపు పది లక్షల రూపాయలు వరకు ఖర్చు అవుతుందని తెలిపారు గ్రామస్తులు రఘుకు సమాచారం ఇవ్వడంతో వెంటనే సోషల్ మీడియా లో పోస్ట్ చెయ్యగా స్పందించిన దాతలు ఆర్ధిక సహాయం చేసి అనూష కి అండగా నిలిచారు ఈ మొత్తం రూపాయలు ఈరోజు రఘు వారియొక్క కుటుంబ సభ్యులకు అందించాడు రఘును నమ్మి కొట్టిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు బాధితురాలి సోదరుడు ప్రశాంత్,కుటుంబ సభ్యులు రఘుకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపి కన్నీటి పర్యం అయ్యారు

రాజన్న సిరిసిల్ల

ముస్తాబాద్‌లో బ్లాక్ డే నిర్వహణ– కార్మికుల డిమాండ్లు

ముస్తాబాద్ /ఏప్రిల్ / పున్నమి ప్రతినిధి ముస్తా బాద్ ఏప్రిల్ 1న సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బ్లాక్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యుడు గీస బిక్షపతి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను సవరించాలని, 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా విభజించడం వల్ల కార్మికులకు నష్టం జరుగుతోందని పేర్కొన్నారు. అలాగే 12వ జీవోను సవరించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 13న జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించి, అనంతరం చలో హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలిపారు. వెల్ఫేర్ బోర్డు నిధులను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు మళ్లించడం ఆపాలని, కార్మికుల ఆరోగ్య రక్షణ పేరిట జరుగుతున్న ప్రైవేట్ వ్యవస్థను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, లేబర్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పిట్ల ప్రవీణ్, సులూరు సత్తయ్య, చినుగురు దేవయ్య, అంజయ్య, సంజీవ్, నరేష్, రాజేందర్, శంకర్, లోకం సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. వివిధ రంగాల కార్మికులు ఐక్యంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఆంధ్రప్రదేశ్

చేనేత కార్మికుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది.:పెడన MLA కాగిత కృష్ణప్రసాద్

బ్రహ్మపురం లోని శ్రీ సదాశివలింగేశ్వర వీవర్స్ కో – ఆపరేటివ్ సొసైటీ నందు చేనేత కార్మికుల కుటుంబాలకు నెలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించిన పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ రోజున చేనేత కార్మికుల కుటుంబాలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తుందని అన్నారు. పెడన నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 2624 మంది చేనేత కార్మికుల కుటుంబాలకు ఉచిత విద్యుత్ లబ్ధి చేకూరుతుందని, ఇంకా అర్హులు ఎవరైనా ఉంటే,వారి వివరాలు అందిస్తే వారికి కూడా ఈ పథకం అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే అన్నారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు చేరుకున్న సీఎం చంద్రబాబు – ఘన స్వాగతం

నెల్లూరు జిల్లా పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం జిల్లాకు చేరుకున్నారు. వింజమూరులో హైవే పక్కన ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద ఉదయం 11.45 గంటలకు దిగిన సీఎం కు జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్ హిమాన్షు శుక్లా తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన నార్త్ ఎస్పీ కాలనీకి బయల్దేరి, స్థానికంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. సీఎం పర్యటనతో ప్రాంతంలో ఉత్సాహ వాతావరణం నెలకొంది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.