Thursday, 23 April 2026

Blog

జనగాం

జాతీయ స్థాయి కబడ్డీ క్రీడా పోటీలకు చెన్నూరు విద్యార్థిని ఎంపిక

Zphs చెన్నూరు పాఠశాల కు చెందిన 9 తరగతి విద్యార్ధిని మంచాల అంజలి జాతీయ స్థాయి కబడ్డీ సబ్ జూనియర్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పుస్కూరి రమేష్ గారు ఓ ప్రకటనలో తెలియజేశారు. మహారాష్ట్రలోని పూణే లో ఈ నెల 3,4,5,6 తేదీలలో జరుగుతున్న జాతీయస్థాయి లో తెలంగాణ రాష్ట్రం కబడ్డీ జట్టుకు ప్రాతినిథ్యం వహించడం జరుగుతుంది. అంజలి ఎంపిక పట్ల పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ కోడిశాల అశోక్ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉపాధ్యాయులు శ్రీనివాస్ గుప్తా, శోభ, శ్రీహరి, శ్రీష్మ, ఫాతిమా మేరీ, రాణి, ప్రతిభ, వకుళ, ఉమ రాణి, వెంకటేష్ , వరలక్ష్మి, చైతన్య,kranthikumar ,Dhanalaxmi మరియు యువకులు గ్రామ వార్డు సభ్యులు,AAP ఛైర్మెన్& సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు

జనగాం

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ త్యాగస్ఫూర్తి యువతకు ఆదర్శం: –జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

* జనగామ, ఏప్రిల్2,పున్నమి ప్రతినిధి: గురువారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి కార్యక్రమంలో *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* పాల్గొని, ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించి, ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… సామాజిక సమానత్వం, న్యాయం కోసం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చేసిన పోరాటం చిరస్మరణీయమని పేర్కొన్నారు. పాపన్న గౌడ్ జీవితం యువతకు స్ఫూర్తిదాయకమనిఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని సూచించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సేవలను స్మరించుకోవడం ద్వారా సమాజంలో మంచి విలువలు పెంపొందుతాయని *కలెక్టర్* తెలిపారు. అనంతరం అధికారులు, సిబ్బంది కూడా పాపన్న గౌడ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఎన్. ఎల్. నరసింహ రావు, ఏబీసీడీఓ రవీందర్, డీఎల్పీఓ (ఇంచార్జి )వెంకట్ రెడ్డి, దిశ కమిటీ సభ్యులు బక్క శ్రీనివాస్, బీసీ కుర్మ సంఘం జనరల్ సెక్రటరీ జోయ మల్లేష్, వైద్యులు బిక్షపతి, బీసీ జేఏసీ అధ్యక్షులు, వసతి గృహ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జట్లకొండూరులో వార్డ్ మెంబర్లకు ఘన సన్మానం 🏅

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 2( పున్నమి ప్రతినిధి)జట్లకొండూరు పంచాయతీలో ఐదు సంవత్సరాల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా. వెందోటి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో వార్డు సభ్యులు, గ్రీన్ అంబాసిడర్లను ఘనంగా సన్మానించారు. గుండుపోయిన సుప్రియ, ఘట్టం రమణమ్మ, కిష్టయ్య, రంగయ్యలకు శాలువాలు కప్పి అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గుండుబోయిన వెంకయ్య, హరి, పూర్ణచంద్రరావు, ధనయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే మండల కార్యదర్శి బోయిన ఆదినారాయణ హాజరై వారి సేవలను కొనియాడారు. గ్రామ అభివృద్ధికి చేసిన కృషిని ప్రశంసిస్తూ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.

E-పేపర్

అష్టావధాని సురభికి ఉగాది జాతీయ సాహిత్యఫురస్కారం…. 💐💐💐

అష్టావధానిసురభికి ఉగాది జాతీయ సాహిత్యఫురస్కారం💐 తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో, మనంఫౌండేషన్ శ్రీపరాభవఉగాది జాతీయపురస్కారాలసభ రవీంద్రభారతిలో మంగళవారం ఉదయం ఘనంగానిర్వహించింది.ఈసందర్భంగా వివిధరంగాల ప్రముఖులను ఘనంగాసత్కరించిం ది.మాజీ కేంద్రమంత్రి వేణుగోపాలాచారి, విశ్రాంత జిల్లాప్రధానన్యాయమూర్తి నేరెళ్ళమాల్యాద్రి, సినీదర్శకులు రేలంగినరసింహారావు, అష్టావధాని సురభి శంకరశర్మ, తదితరులుఅతిథులుగాపాల్గొన్నారు. మనం వ్యవస్థాపకులు అధ్యక్షులు చక్రవర్తి మాట్లాడుతూ నేటి పురస్కారాలందుకున్న ప్రముఖులందరూ పరాభవను విజయీభ వ సూచకంగా భావించి వారి వారి రంగాలలో విశేషంగా కృషిచేసి సామాజిక దేశసేవ ధ్యేయంగా ముందుకు సాగాలన్నారు.వేణుగోపాలాచారి మట్లాడుతూ, పురస్కారగ్రహీతలను అభినందిస్తూ జాతి శ్రేయస్సు, సమాజాభ్యుదయం , ప్రస్తుత దేశసమస్యలపట్ల అవగాహన, ప్రతిఒక్కరి బాధ్యత కావాలన్నారు. రేలంగి వారు ప్రసంగిస్తూ, ఆసక్తి ఉంటే, ఆశక్తి వస్తుందని ,కవులు కళాకారులు సంఘసేవకులపాత్ర దేశఉజ్వల భవితకు ఎంతో దోహదమౌతుందన్నారు. సురభి మాట్లాడుతూ, కృషిచేసేదేరంగమైనా సరే పవిత్రత ,ఐక్యత, నిబద్ధత, స్పష్టత, ఉండాలన్నారు. సురభికి జాతీయ సాహిత్యపుస్కారం. ఉభయ తెలుగు రాష్ట్రాలలో నేకాకుండా తమిళనాడు ,కర్ణాటక, మహారాష్ట్ర, తదితరప్రాంతాలలో 217అవధానాలు చేశారు . అవధానధుని అభినవ భర్తృహరి, అవధానసురభి, బిరుదులందుకొన్నారు. అవధానరంగంలో తెలుగువిశ్వవిద్యాలయంపురస్కారం , అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావుచే రవీంద్రభారతిలో సత్కారం , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్టేట్ యూత్అవార్డ్ ,పద్మశ్రీ శోభారాజ్ గారిచే అన్నమయ్య సాహితీపురస్కారం,విజయవాడ సిద్ధార్థ మహిళాకళాశాల గిడుగువారిపురస్కా రం , నెహ్రూ యువకేంద్ర వివేకానంద యువశక్తి సాహితీపురస్కారం అందుకున్నారు. ఆంధ్ర తెలంగాణ కర్ణాటక వివిధప్రాంతాలలో పలుసాహిత్యసంస్థలచే సాహిత్యపురస్కారాలందుకొన్నారు. అప్పటిగవర్నర్లు కృష్ణకాంత్ నరసింహన్ రోశయ్యలచే సన్మానాలందుకొన్నారు. అధ్యాపకునిగా జిల్లాప్రభుత్వపురస్కారమందుకున్నసురభి పలు టీవీ మాధ్యమాల‌లో తమసేవలంలదించారు. టీవీ9,సంస్కృతి, సీవిఆర్, ఆస్థా, యోగి, పియమ్ సి ,చానెళ్ళలోసమున్నత కార్యక్రమాలు నిర్వహించారు పద్యాలతోరణం వేదికగా సామాజిక శతక పద్యహేలకు పిలుపునిచ్చి నూటయాభై శతకరచనలకు ప్రేరకులయ్యారు కవిగా అవధానిగా,వ్యాఖ్యాతగా సభానిర్వాహకునిగా, ప్రవచనకర్తగా , సాహితీవేత్తగా, వివిధమాధ్యమాల ప్రతినిధిగా, విశేషసేవలనందిస్తున్నసురభి ఇంకా విశిష్ట విజయాలందుకోవాలని ఆశిద్దాం.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

*నెల్లూరు అపోలో హాస్పిటల్ లో అరుదైన గుండె శస్త్ర చికిత్స విజయవంతం*

నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో అతి క్లిష్టమైన, అరుదైన గుండె శస్త్ర చికిత్స విజయవంతంగా జరిగింది. నెల్లూరు బాలాజీనగర్ కు చెందిన 74 ఏళ్ల సరోజనమ్మ అనే మహిళకు ఓపెన్ హార్ట్ పద్దతిలో కాకుండా లాప్రోస్కోపీ పద్దతిలో గుండె రక్తనాళాలను విజయవంతంగా మార్పిడి చేశారు. దీనిపై గురువారం నెల్లూరు అపోలో హాస్పిటల్ లో ప్రముఖ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ చిర్రా భక్తవత్సల రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, యూనిట్ హెడ్ డాక్టర్ బింధు భార్గవి రెడ్డి, క్రిటికల్ కేర్ వైద్యులు డాక్టర్ ఎమ్. శ్రీనివాస్, కార్డియాలజిస్టులు డాక్టర్ షర్మిలి, డాక్టర్ నాగభూషణం కార్డియాక్ అనస్థీషియన్ డాక్టర్ మధు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ చిర్రా భక్తవత్సల రెడ్డి మాట్లాడుతూ 74 ఏళ్ల సరోజనమ్మకు గుండె వాల్స్వ్ మరియు రక్తనాళాలు పూడుకుపోయాయని, సాధారణంగా అయితే ఆమెకు వాల్వ్ రీప్లేస్మెంట్, బైపాస్ సర్జరీ చేయాల్సి ఉందన్నారు. డబుల్ వెసెల్ డిసీజ్ (Double Vessel Disease) అంటే ఆమె 94 కేజీల బరువు కారణంగా ఆమెకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడం ప్రాణానికే ప్రమాదమని వెల్లడించారు. ఈ నేపద్యంలో వారి కుటుంబసభ్యుల అంగీకారంతో TAVR మరియు RCA పద్దతి ద్వారా లాప్రోస్కోపీ విధానంలో అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో, ఆమె గుండెకు కాలి ద్వారా అరుదైన శస్త్ర చికిత్సను నిర్వహించామన్నారు. ఈ శస్త్రచికిత్సకు ముందు పేషెంట్ యొక్క గుండె పంపింగ్ 25% నుండి 30% గా ఉండగా ఇప్పుడది 65% పెరిగి నార్మలుగా ఉందన్నారు.ఈ విధానం ద్వారా ఎలాంటి కోతలు, అధిక రక్త స్రావం లేకుండా విజయవంతంగా గుండె రక్తనాళాలను మార్చామని డాక్టర్ భక్తవత్సల రెడ్డి పేర్కొన్నారు. అనంతరం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ మాట్లాడుతూ క్లిష్టమైన సర్జరీలను సైతం నెల్లూరు అపోలో హాస్పిటల్ లో ఉన్న ఆధునిక వైద్య పరికరాలు, అనుభవజ్ఞులైన వైద్య బృందాల చేత విజయవంతంగా నిర్వహిస్తున్నామని, నెల్లూరు అపోలో హాస్పిటల్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

కడప

కడప జిల్లా పొద్దుటూరు మండలం : వారి ఆస్తులకు తలాలు వేశారా..? మాజీ కౌన్సిలర్

ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి SS మాల్ రూ.8 కోట్లు, KMR ట్రావెల్స్ రూ. 70 లక్షల బాకీలున్నారని.. వారి ఆస్తులకు తాళాలు వేశారా అని స్థానిక వైసీపీ మాజీ కౌన్సిలర్ గరిశపాటి లక్ష్మీదేవి ప్రశ్నించారు. ఆమె మాట్లాడుతూ.. టీడీపీ, బీజేపీ, జనసేన వారు రూ. కోట్లల్లో బకాయి ఉన్నారన్నారు. కమలాపురం మాజీ ఎమ్మెల్యే కుమారుడు పేర్ల గోపీనాథ్ రెడ్డి ఆస్తులకు తాళాలు వేయడానికి అధికారులు రావడం తప్పన్నారు

జాతీయ అంతర్జాతీయ

నక్సలిజం నిర్మూలనలో చారిత్రాత్మక విజయం – భారత్ నక్సల్ రహితం: అమిత్ షా

కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేశారు. గత మూడు సంవత్సరాలుగా సాగిన తీవ్ర యాంటీ మావోయిస్టు ఆపరేషన్ల ఫలితంగా భారత్ ఇప్పుడు నక్సల్ రహిత దేశంగా మారిందని తెలిపారు. లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రీమిజం (ఎల్‌డబ్ల్యూఈ)పై ప్రభుత్వం చేపట్టిన కఠిన చర్యలు, భద్రతా బలగాల సమన్వయంతో ఈ విజయాన్ని సాధించామని చెప్పారు. నక్సలిజం ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల మెరుగుదల కూడా కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు. దేశ భద్రతకు ఇది ఒక కీలక మైలురాయిగా భావిస్తున్నామని, ప్రజల్లో శాంతి, భద్రత మరింత బలోపేతం అవుతుందని తెలిపారు.

జాతీయ అంతర్జాతీయ

ఇరాన్ క్షిపణి దాడి హెచ్చరికలు – ట్రంప్ కఠిన వ్యాఖ్యలతో ఉద్రిక్తతలు పెరుగుదల

ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడి జరిగినట్లు అధికారులు గురువారం వెల్లడించారు. ఈ ఘటనతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమయ్యాయి. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వచ్చే రెండు నుంచి మూడు వారాల్లో ఇరాన్‌పై భారీ దాడులు చేపడతామని హెచ్చరించారు. “స్టోన్ ఏజ్‌కు తీసుకెళ్తాం” అనే వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు క్షిపణులను అడ్డుకునేందుకు చర్యలు చేపట్టగా, పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నారు. ఈ పరిణామాలతో ప్రాంతీయ యుద్ధం ముప్పు పెరుగుతుందని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

హెల్త్ టిప్స్

పింపుల్స్ ఎందుకు వస్తాయి?

మోటిమలు (పింపుల్స్) ఏర్పడటానికి ప్రధాన కారణాల్లో ఒకటి శరీరంలో ఇన్సూలిన్ స్థాయి పెరగడం అని వైద్యులు చెబుతున్నారు. కూల్‌డ్రింక్స్, బిస్కెట్లు, వైట్ బ్రెడ్, నూడుల్స్ వంటి అధిక ప్రాసెస్ చేసిన ఆహారాలు ఇన్సూలిన్‌ను పెంచుతాయి. దీంతో ఆండ్రోజెన్ హార్మోన్ ఉత్పత్తి అధికమై, చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. ఫలితంగా బ్యాక్టీరియా పెరిగి మొటిమలు వస్తాయి. అదనంగా, హార్మోన్ అసమతుల్యత కూడా పింపుల్స్‌కు ప్రధాన కారణంగా ఉంటుంది. చర్మ ఆరోగ్యాన్ని కాపాడేందుకు వాల్‌నట్స్, అవిసె గింజలు, గుమ్మడి గింజలు, చేపలు, పాలకూర, క్యారెట్ వంటి పోషకాహారం తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్

బహురూపి బియ్యంతో భోజనాలు – గోశాలలో ప్రత్యేక విందు

సింహాచలం సమీపంలోని కృష్ణాపురం గోశాలలో బుధవారం ప్రారంభమైన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ప్రకృతి ఆధారిత పంటలతో ఉచితంగా భోజనాలు వడ్డించారు. అధిక పోషకాలు కలిగిన ‘బహురూపి’ బియ్యంతో అన్నం, ‘కాలాబట్టి’ బియ్యంతో చేసిన బెల్లం పొంగలి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ‘చింతలూరి సన్నాలు’తో పులిహోర, నవార బియ్యంతో పెరుగు అన్నం రుచికరంగా వడ్డించారు. గుమ్మడికాయ పులుసు, దొండకాయ, వంకాయ కూరలు భోజనాన్ని మరింత రుచికరంగా మార్చాయి. మొదటి రోజు 2 వేల మందికి భోజనం ఏర్పాటు చేయగా, ఇకపై రోజుకు 5 వేల మందికి వడ్డించేలా ఏర్పాట్లు చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.