శ్రీకాళహస్తి, ఏప్రిల్ 15 (పున్నమి న్యూస్) బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోల ఆనంద్ చిన్న కుమారుడు కోల వేదాంత పుట్టినరోజు వేడుకలు అత్యంత అర్థవంతంగా, సేవా దృక్పథంతో జరిగాయి. ఆడంబరాలకు పోకుండా, సమాజంలోని అభాగ్యుల మధ్య ఈ వేడుకలను నిర్వహించడం ద్వారా కోల కుటుంబం తన ఉదారతను చాటుకుంది. రేణిగుంట ఓల్డ్ ఎయిర్‌పోర్ట్ సమీపంలోని ‘అక్షయ క్షేత్రం’లో ఉన్న మానసిక వికలాంగులు, అనాథలు మరియు అభాగ్యుల మధ్య వేదాంత పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేదాంత అనాథ పిల్లల సమక్షంలో కేక్ కట్ చేశారు. వారి చిరునవ్వుల మధ్య జరిగిన ఈ వేడుక అక్కడి వారిలో ఎంతో సంతోషాన్ని నింపింది. పుట్టినరోజును పురస్కరించుకుని సుమారు వంద మంది అభాగ్యులకు హృదయపూర్వకంగా అన్నదానం చేశారు. ఒకరి పుట్టినరోజు పదిమందికి మేలు చేసేలా ఉండాలన్న ఉన్నత ఆశయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోల ఆనంద్ కుమారులు, బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కూరకాల్వ వేణు ముదిరాజ్, రాజారాయల్, హరీష్, కోల అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పుట్టినరోజు జరుపుకున్న వేదాంతను పలువురు రాజకీయ ప్రముఖులు, స్నేహితులు అభినందిస్తూ దీవెనలు అందజేశారు.

సేవా పథంలో కోల ఆనంద్ తనయుడు-అనాథల మధ్య వేదాంత పుట్టినరోజు వేడుకలు.