శ్రీకాళహస్తి, ఏప్రిల్ 15 (పున్నమి న్యూస్) ఉమ్మడి చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో కలిసి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పలు భారీ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. క్రీడారంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా తిరుపతి మరియు పరిసర ప్రాంతాల్లో కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టులను వీరు ప్రారంభించారు. తిరుపతి గొల్లవానిగుంటలో రూ. 10.10 కోట్ల వ్యయంతో నిర్మించిన ‘నందమూరి తారక రామారావు క్రీడా ప్రాంగణం’, క్రికెట్ స్టేడియం మరియు పెవిలియన్‌ను మంత్రి లోకేష్ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. దీనితో పాటు యువతలోని నైపుణ్యాన్ని వెలికితీసేందుకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఆర్చరీ వంటి ప్రత్యేక అకాడమీలను కూడా అందుబాటులోకి తెచ్చారు. శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో రూ. 5.35 కోట్లతో ఏర్పాటు చేసిన ‘కరణం మల్లీశ్వరి వెయిట్ లిఫ్టింగ్ అకాడమీ’ని ప్రారంభించడం ద్వారా క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ లభిస్తుందని వారు తెలిపారు. అలాగే గూడూరు, సూళ్లూరుపేట, రేణిగుంట ప్రాంతాల్లో కొత్తగా నిర్మించనున్న ‘ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రాల’కు సైతం శిలాఫలకాలు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ..ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ నాయకత్వంలో యువతకు ఉపాధితో పాటు ఉల్లాసాన్ని ఇచ్చే క్రీడలకు మా ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులను గుర్తించి వారిని మెరుగైన క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు మేము నిరంతరం కృషి చేస్తాం. నారా లోకేష్ విజన్ కు అనుగుణంగా అడుగులు వేస్తూ నియోజకవర్గ అభివృద్ధికి పునరంకితం అవుతామని ఆయన పేర్కొన్నారు.

తిరుపతిలో ‘బొజ్జల’ – ‘లోకేష్’ సందడి-రూ.15 కోట్లకు పైగా క్రీడా అభివృద్ధి పనులకు శ్రీకారం