Thursday, 23 April 2026

Blog

ఆంధ్రప్రదేశ్

కొత్త ఏపీ మ్యాప్ – 28 జిల్లాలతో APSDMA విడుదల

ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన కొత్త భౌగోళిక మ్యాప్‌ను APSDMA విడుదల చేసింది. ఈ మ్యాప్‌లో అమరావతిని అధికారిక రాజధానిగా స్పష్టంగా చూపించారు. ఇటీవల అమరావతికి చట్టబద్ధత లభించిన నేపథ్యంలో ఈ మార్పు ప్రాధాన్యం సంతరించుకుంది. కొత్త మ్యాప్‌లో మొత్తం 28 జిల్లాలు చూపించబడగా, తాజాగా ఏర్పడిన పోలవరం మరియు మార్కాపురం జిల్లాలు కూడా ఇందులో చేర్చబడ్డాయి. ప్రకృతి విపత్తుల నిర్వహణ, ప్రణాళికలు, మరియు పరిపాలనలో స్పష్టత కోసం ఈ మ్యాప్ కీలక పాత్ర పోషించనుంది. రాష్ట్ర భౌగోళిక నిర్మాణంలో వచ్చిన ఈ మార్పు పాలనలో వేగాన్ని పెంచే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్

టెన్త్ విద్యార్థులకు 7 మార్కులు కలపాలని బోర్డు నిర్ణయం

AP: SSC పరీక్షల్లో సందిగ్ధ సమాధానాలను ప్రశ్నలను అటెంప్ట్ చేసిన వారికి మార్పులు కలపాలని బోర్డు నిర్ణయించింది. HINDIలో 2, ENGLISHలో 5 మార్పులు కలవనున్నాయి. మరో 3 ప్రశ్నలైన పాయింట్స్ వివరించారు. కాకా ప్రశ్నల్లో పొరపాట్లు లేవని, విద్యార్థి సమగ్రత పరీక్షకు వివిధ రూపాల్లో అడుగుతుంటారని బోర్డు వర్గాలు వివరించారు. సందిగ్ధం ఉన్న వాటిపై ప్రిన్సిపల్ వాల్యుయేషన్ సూపర్వైజన్ DEOలకు పంపుతున్నట్లు తెలుస్తోంది

అనకాపల్లి

ఏటికొప్పాకలో బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి ఘనంగా నిర్వహణ..

అనకాపల్లి జిల్లా ఏప్రిల్ 5 పున్నమి న్యూస్ (ప్రతినిధి ఆనంద్), ఏటికొప్పాక గ్రామంలో మహానేత బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు కులపెద్దలు, యువత తెలిపారు. ఈ కార్యక్రమం గ్రామంలో పండుగ వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా నర్సింగరావు, సాగర్, ఆనంద్, చిన్ని, శామ్యూల్ రాజు, శాంతరాజు, చందు, విజయ్ బాబు, ప్రవీణ్ కుమార్, యేసు రాజు, దావీదు కుమార్, సతీష్, రాజ్ కుమార్ (చింటూ), రవి (యోబు), రమేష్, u.v.n.రమణ, సిద్దు, శివ, ప్రేమ దాసు, రిషి, శామ్యూల్, నాగేంద్ర, ఆనంద్ కుమార్, జైశీను, అప్పారావు (ఆర్మీ), తేజ, ఇషాక్ రాజ్, ప్రభాస్, సుశాంత్, రజిని, బాబ్జి, కిషోర్, జీవన్ తదితరులు పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ, బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను కొనసాగిస్తూ సమాజంలో సమానత్వం, సేవాభావం పెంపొందించాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ వేడుకలు ఉత్సాహభరితంగా, ఐక్యతను ప్రతిబింబిస్తూ ఘనంగా ముగిశాయి.

News

💐ఒంగోలులో సురభి అష్టావధానం 💐

ఒంగోలులో సురభి అష్టావధానం💐💐💐 షిరిడిసాయి కల్చరల్ మిషన్ ఆధ్వర్యంలో, జాతీయ సాహిత్య పురస్కార గ్రహీత సురభిశంకరశర్మ అష్టావధానంను నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు డాక్టర్ రావిపాటి ప్రసాద్ తెలియచేశారు.ఈకార్యక్రమం ఒంగోలు లాయర్ పేట షిరిడీ సాయిమందిరంలోఏప్రియల్ 5వతేది ఆదివారం సాయంత్రం ఆరుగంటలకు ఆరంభమౌతుందని , ఏ.పి.జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ డా.బి.శ్రీకృష్ణవేణి,ముఖ్య అతిథిగాపాల్గొంటారని తెలిపారు. అష్టావధాని మానేపల్లి నాగకుమార్ సభాసంచాలకులు గావ్యవహరిస్తారని చెప్పారు. నిషిద్ధాక్షరికి- అష్టావధానిదూపాటి రామాచార్యులు,న్య స్తాక్షరికి- అష్టావధాని డా.జిల్లెళ్ళవరప్రసాద్, దత్తపదికి-డా.రామచంచంద్రుని రమేష్, సమస్యకు-గుడ్లూరి వేంకటేశ్వరరాయకవి, వర్ణనకు- తెలుగు ఉపన్యాసకులు యడ్లపల్లి శ్రీరామమూర్తి,ఆశువు కు-తెలుగు అధ్యాపకులు యం.వి.యస్. శాస్త్రి, మీమాట-నాపాటకు విశ్వకళాభారతి అధ్యక్షులు నాదెండ్ల జ్వాలా ఉమామహేశ్వరశర్మ,అప్రస్తుతప్రసంగం-సంస్కృతోపన్యాసకులు దొప్పలపూడి వేంకటరావులు ప్రాశ్నికులుగా పాల్గొనబోతున్నారని డా.రావిపాటి తెలిపారు.

తిరుపతి

శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ సంగమేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

గూడలి కోట మండలం ఏప్రిల్ ( పున్నమి ప్రతినిధి ) శతాబ్దాల సాంస్కృతిక చరిత్రకు, వైభవానికి నిలువెత్తు సాక్ష్యంగా, అద్భుత శిల్పకళా సంపద ఈ ఆలయం సొంతం. స్వర్ణముఖి నది ఒడ్డున వెలసిన శైవ క్షేత్రాల్లో ప్రత్యేకత సంతరించుకున్న కోట మండలం గూడలిలోని శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ సంగమేశ్వరస్వామి ఆలయం చోళరాజుల చరిత్రకు నిదర్శనం. ఈ నెల 5వ తేదీ నుంచి ఆలయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. గూడలిలోని సంగమేశ్వరస్వామి ఆలయానికి పురాతన చరిత్ర ఉంది. తైత్రా యుగమున ఆగస్త్య మహాముని కాశీ నుంచి కన్యాకుమారికి వెళుతూ మార్గమధ్యమున శివపూజకు వేళయినందున స్వర్ణముఖి నది కూడలి వద్ద తన రుద్రాక్ష మాలను ఉంచి శివుని ప్రార్ధించడం వలన ఆ రుద్రాక్ష మాల లింగరూపమును దాల్చిందని చరిత్ర చెబుతుంది. 12వ శతాబ్ధంలో చోళరాజు కళింగతుంగ చోళుడు వేటకు వచ్చి కాంతులీనుతున్న రుద్రాక్ష లింగాన్ని పూజించి ఆలయాన్ని నిర్మించినట్లు స్థల పురాణం తెలుపుతుంది. స్వర్ణముఖి నది మూడు పాయలుగా చీలిపోవడంతో కూడలి ప్రాంతం గూడలిగా మారినట్లు చరిత్ర చెబుతుంది. సంగమేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా వైభవంగా నిర్వహిస్తారు. సంతానం లేని మహిళలు బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణ రోజు కొడి వస్త్రాన్ని కట్టుకుని కొడి ముద్దలు భక్తిభావంతో స్వీకరిస్తే సంతానం కలుగుతుందని చెప్తున్నారు. అదే సమయంలో స్వామివారి కల్యాణంతో పాటు అనేక జంటలు ఆలయ ప్రాంగణంలో వివాహాలు చేసుకోవడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. ఉత్సవాల వివరాలు : ——————- ఈ నెల 5వ తేదీన అంకురార్పణ, గ్రామోత్సవంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 6న ధ్వజారోహణ, కొడి వస్త్రాలు, 7న శేష వాహనసేవ, 8న హంసవాహన సేవ, 9న బృంగిసేవ, 10న రావణ సేవ, 11న నందిసేవ, 12న రథోత్సవం, 13న గజవాహన గ్రామోత్సవం, 14న స్వామివారి కల్యాణం, 15న ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ పాల్గొంటారని ఆలయ నిర్వాహకులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పల్లెముల్లు వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవాదాయశాఖ ఏఓ పెంచల వర ప్రసాద్ తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బొల్లినేని ప్రాపర్టీస్ సేవలు విస్తరణ

నగరంలో రియల్ ఎస్టేట్ రంగంలో ప్రముఖ సంస్థగా గుర్తింపు పొందుతున్న బొల్లినేని ప్రాపర్టీస్, వినియోగదారులకు విశ్వసనీయ సేవలను అందిస్తూ ముందుకు సాగుతోంది. ప్లాట్లు, అపార్ట్‌మెంట్లు, ల్యాండ్స్, ఇళ్లు వంటి విభిన్న ఆస్తుల కొనుగోలు, విక్రయం, పెట్టుబడులపై సలహాలు అందిస్తోంది. ఆధునిక సౌకర్యాలు, పారదర్శక వ్యవహారశైలి, నాణ్యత ప్రమాణాలు సంస్థ ప్రత్యేకతగా నిలుస్తున్నాయి. కస్టమర్లకు సురక్షిత పెట్టుబడి అవకాశాలను అందించడమే లక్ష్యంగా బొల్లినేని ప్రాపర్టీస్ కృషి చేస్తోంది. నెల్లూరు మగుంట లేఅవుట్‌లోని కార్యాలయం ద్వారా సేవలు అందిస్తూ, మరింత విస్తరణకు సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

జాతీయ అంతర్జాతీయ

శత్రు సంహారి ‘అరిధమన్’ జలాంతర్గామి నౌకలో చేరిక

భారత నౌకాదళంలో స్వదేశీ అణు శక్తితో నడిచే మూడో జలాంతర్గామి ‘ఐఎన్‌ఎస్ అరిధమన్’ను శుక్రవారం ప్రవేశపెట్టారు. ‘శత్రువులను సంహరించే వాడు’ అనే అర్థం గల ఈ నౌక అరిహంత్ తరగతికి చెందినది. సుమారు 7,000 టన్నుల బరువు కలిగిన ఈ సబ్‌మరైన్‌లో 90 శాతం స్వదేశీ సాంకేతికత ఉపయోగించారు. ఇది అణు రియాక్టర్‌తో నిరంతర శక్తిని పొందుతూ, నీటి పైకి రావాల్సిన అవసరం లేకుండా 45 కిమీ వేగంతో ప్రయాణిస్తుంది. ఎనిమిది లాంచ్ ట్యూబ్‌లతో, K-4 మరియు భవిష్యత్తులో K-5 క్షిపణులతో శక్తివంతమైన దాడి సామర్థ్యం కలిగి ఉంది. దీంతో భారత సముద్ర భద్రత మరింత బలోపేతం అవుతుంది.

ఆంధ్రప్రదేశ్

అమరావతికి త్వరలో పిన్ కోడ్ – అధికారిక గుర్తింపు దిశగా ముందడుగు

అమరావతి, ఏప్రిల్ 3: అమరావతికి చట్టబద్ధ హోదా కల్పించే బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం లభించింది. గెజిట్‌లో త్వరలో ప్రచురణకు సిద్ధమవుతున్న ఈ నేపథ్యంలో, పోస్టల్ శాఖ అమరావతికి ప్రత్యేక పిన్ కోడ్ ఇవ్వడానికి చర్యలు ప్రారంభించింది. రాజధాని ప్రాంతంలో జీపీఓ నిర్మాణానికి భూమి సేకరణ పూర్తయ్యిందని అధికారులు తెలిపారు. జీపీఓ పూర్తి తర్వాత సర్కిల్ ఆఫీస్ అనుమతితో పిన్ కోడ్ కేటాయిస్తారు. అప్పటివరకు సేవలు ప్రస్తుత ఉప కార్యాలయాల ద్వారానే కొనసాగుతాయి. ఇది పరిపాలనా సౌలభ్యానికి కీలకంగా భావిస్తున్నారు.

E-పేపర్ తెలంగాణ మహబూబాబాద్

ఆల్ ఇండియా లెవల్ ఓవరల్ ఛాంపియన్షిప్ లో అంజయ్య గౌడ్💐

మహరాష్ట్ర నాగపూర్ లో మార్చి 29నుండి ఏప్రిల్ 3 వరకు జరిగిన ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ లో మహబూబాబాద్ జిల్లా పోలీస్ విభాగానికి చెందిన కానిస్టేబుల్ అంజయ్య అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రశంసలు అందుకున్నారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వార Anti Sabotage Chech విభాగంలో Access Control 1 Silver medal.. Room Search 1gold medal.. Vehicle search 1gold medal.. Anti Sabotage Chech విభాగంలో Access Control 1 Silver medal.. ఆల్ ఇండియా లెవల్ ఓవరల్ ఛాంపియన్ షిప్ సాదించారు..

హనుమకొండ

హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ల ఇళ్లలో ఏసీబీ దాడులు – అక్రమాలు బట్టబయలు

హనుమకొండ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు నిర్వహించిన సోదాలు సంచలనం సృష్టించాయి. సబ్‌ రిజిస్ట్రార్లు ఆనంద్‌, రాంనర్సింహారావు ఇళ్లలో చేసిన తనిఖీల్లో భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. డాక్యుమెంట్‌ రైటర్లతో కలిసి అవినీతి లావాదేవీలు జరిపినట్లు ఆధారాలు లభించాయి. ఏడాదిలో సుమారు రూ.42 లక్షలు ఆన్‌లైన్‌ ద్వారా జమ అయినట్లు గుర్తించారు. రూ.24.61 లక్షల నగదు, 820 గ్రాముల బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 204 రిజిస్ట్రేషన్ పత్రాలు నిల్వ ఉంచినట్లు తెలిసింది. ఈ ఘటనపై ప్రభుత్వం తదుపరి చర్యలు చేపట్టనుంది

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.