Thursday, 23 April 2026
  • Home  
  • తెలంగాణ లో ఆర్టీసీ సమ్మె.. వెలుగులోకి వస్తున్న కార్మికుల అసలు కష్టాలు.. ప్రత్యేక కధనం.
- ఖమ్మం

తెలంగాణ లో ఆర్టీసీ సమ్మె.. వెలుగులోకి వస్తున్న కార్మికుల అసలు కష్టాలు.. ప్రత్యేక కధనం.

ఖమ్మం, ఏప్రిల్: (పువ్వాడ నాగేంద్ర కుమార్ పున్నమి దినపత్రిక జిల్లా ఇంచార్జి ) రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కార్మికుల అసలు సమస్యలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రోజువారీ విధుల్లో ఎదురవుతున్న ఒత్తిళ్లు, నిబంధనల కఠినత కార్మికులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుతం నైట్ అవుట్ సర్వీసులు, స్పెషల్ ఆఫ్ సర్వీసుల కింద రోజుకు కనీసం 528 కిలోమీటర్లు తప్పనిసరిగా పూర్తి చేయాలని ఆదేశాలు ఉన్నాయి. గతంలో టైర్ పంచర్, బ్రేక్‌డౌన్ వంటి సమస్యలు వచ్చినప్పుడు ట్రిప్పుల్లో కొంత సడలింపు ఉండేది. కానీ ఇప్పుడు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంతసేపైనా పని చేయాల్సిందేనని కార్మికులు వాపోతున్నారు. సెలవుల విషయంలో కూడా కఠిన నియమాలు అమలవుతున్నాయి. తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా, అధికారులు ఆమోదిస్తేనే సెలవు లభిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో కూడా సెలవు తీసుకునే అవకాశమే లేకుండా పోయిందని కార్మికులు అంటున్నారు. హాజరుకాకపోతే ‘ఆబ్సెంట్’గా నమోదు చేయడం వల్ల, తిరిగి డ్యూటీకి చేరాలంటే అధికారుల అనుమతి అవసరమవుతోంది. ఇక కొత్తగా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానంలో డ్రైవర్లు, కండక్టర్ల నియామకం పెరగడంతో రెగ్యులర్ ఉద్యోగులపై పనిభారం మరింత పెరిగిందని విమర్శలు వస్తున్నాయి. ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ఎప్పుడైనా డ్యూటీకి రావడం, వెళ్లడం వల్ల సమన్వయం లోపిస్తోందని వారు చెబుతున్నారు. మరోవైపు మహాలక్ష్మి పథకం కూడా కండక్టర్లకు తలనొప్పిగా మారిందని కార్మికులు అంటున్నారు. ప్రయాణికులు టికెట్ తీసుకుని మధ్యలో దిగిపోవడం, టికెట్లు పోగొట్టుకోవడం వంటి ఘటనలకు కండక్టర్లను బాధ్యులుగా చేస్తూ మెమోలు జారీ చేయడం, ఇంక్రిమెంట్లు కట్ చేయడం, సస్పెన్షన్ చర్యలు తీసుకోవడం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, లేకపోతే సమ్మె మరింత ఉధృతం కావచ్చని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి.తెలంగాణ లో ఆర్టీసీ సమ్మె.. వెలుగులోకి వస్తున్న కార్మికుల అసలు కష్టాలు.. ప్రత్యేక కధనం. ఖమ్మం, ఏప్రిల్: (పువ్వాడ నాగేంద్ర కుమార్ పున్నమి దినపత్రిక జిల్లా ఇంచార్జి ) రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కార్మికుల అసలు సమస్యలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రోజువారీ విధుల్లో ఎదురవుతున్న ఒత్తిళ్లు, నిబంధనల కఠినత కార్మికులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుతం నైట్ అవుట్ సర్వీసులు, స్పెషల్ ఆఫ్ సర్వీసుల కింద రోజుకు కనీసం 528 కిలోమీటర్లు తప్పనిసరిగా పూర్తి చేయాలని ఆదేశాలు ఉన్నాయి. గతంలో టైర్ పంచర్, బ్రేక్‌డౌన్ వంటి సమస్యలు వచ్చినప్పుడు ట్రిప్పుల్లో కొంత సడలింపు ఉండేది. కానీ ఇప్పుడు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంతసేపైనా పని చేయాల్సిందేనని కార్మికులు వాపోతున్నారు. సెలవుల విషయంలో కూడా కఠిన నియమాలు అమలవుతున్నాయి. తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా, అధికారులు ఆమోదిస్తేనే సెలవు లభిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో కూడా సెలవు తీసుకునే అవకాశమే లేకుండా పోయిందని కార్మికులు అంటున్నారు. హాజరుకాకపోతే ‘ఆబ్సెంట్’గా నమోదు చేయడం వల్ల, తిరిగి డ్యూటీకి చేరాలంటే అధికారుల అనుమతి అవసరమవుతోంది. ఇక కొత్తగా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానంలో డ్రైవర్లు, కండక్టర్ల నియామకం పెరగడంతో రెగ్యులర్ ఉద్యోగులపై పనిభారం మరింత పెరిగిందని విమర్శలు వస్తున్నాయి. ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ఎప్పుడైనా డ్యూటీకి రావడం, వెళ్లడం వల్ల సమన్వయం లోపిస్తోందని వారు చెబుతున్నారు. మరోవైపు మహాలక్ష్మి పథకం కూడా కండక్టర్లకు తలనొప్పిగా మారిందని కార్మికులు అంటున్నారు. ప్రయాణికులు టికెట్ తీసుకుని మధ్యలో దిగిపోవడం, టికెట్లు పోగొట్టుకోవడం వంటి ఘటనలకు కండక్టర్లను బాధ్యులుగా చేస్తూ మెమోలు జారీ చేయడం, ఇంక్రిమెంట్లు కట్ చేయడం, సస్పెన్షన్ చర్యలు తీసుకోవడం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, లేకపోతే సమ్మె మరింత ఉధృతం కావచ్చని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

ఖమ్మం, ఏప్రిల్:
(పువ్వాడ నాగేంద్ర కుమార్
పున్నమి దినపత్రిక జిల్లా ఇంచార్జి )

రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కార్మికుల అసలు సమస్యలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రోజువారీ విధుల్లో ఎదురవుతున్న ఒత్తిళ్లు, నిబంధనల కఠినత కార్మికులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

ప్రస్తుతం నైట్ అవుట్ సర్వీసులు, స్పెషల్ ఆఫ్ సర్వీసుల కింద రోజుకు కనీసం 528 కిలోమీటర్లు తప్పనిసరిగా పూర్తి చేయాలని ఆదేశాలు ఉన్నాయి. గతంలో టైర్ పంచర్, బ్రేక్‌డౌన్ వంటి సమస్యలు వచ్చినప్పుడు ట్రిప్పుల్లో కొంత సడలింపు ఉండేది. కానీ ఇప్పుడు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంతసేపైనా పని చేయాల్సిందేనని కార్మికులు వాపోతున్నారు.

సెలవుల విషయంలో కూడా కఠిన నియమాలు అమలవుతున్నాయి. తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా, అధికారులు ఆమోదిస్తేనే సెలవు లభిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో కూడా సెలవు తీసుకునే అవకాశమే లేకుండా పోయిందని కార్మికులు అంటున్నారు. హాజరుకాకపోతే ‘ఆబ్సెంట్’గా నమోదు చేయడం వల్ల, తిరిగి డ్యూటీకి చేరాలంటే అధికారుల అనుమతి అవసరమవుతోంది.

ఇక కొత్తగా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానంలో డ్రైవర్లు, కండక్టర్ల నియామకం పెరగడంతో రెగ్యులర్ ఉద్యోగులపై పనిభారం మరింత పెరిగిందని విమర్శలు వస్తున్నాయి. ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ఎప్పుడైనా డ్యూటీకి రావడం, వెళ్లడం వల్ల సమన్వయం లోపిస్తోందని వారు చెబుతున్నారు.

మరోవైపు మహాలక్ష్మి పథకం కూడా కండక్టర్లకు తలనొప్పిగా మారిందని కార్మికులు అంటున్నారు. ప్రయాణికులు టికెట్ తీసుకుని మధ్యలో దిగిపోవడం, టికెట్లు పోగొట్టుకోవడం వంటి ఘటనలకు కండక్టర్లను బాధ్యులుగా చేస్తూ మెమోలు జారీ చేయడం, ఇంక్రిమెంట్లు కట్ చేయడం, సస్పెన్షన్ చర్యలు తీసుకోవడం జరుగుతోందని ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, లేకపోతే సమ్మె మరింత ఉధృతం కావచ్చని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి.తెలంగాణ లో ఆర్టీసీ సమ్మె.. వెలుగులోకి వస్తున్న కార్మికుల అసలు కష్టాలు..
ప్రత్యేక కధనం.

ఖమ్మం, ఏప్రిల్:
(పువ్వాడ నాగేంద్ర కుమార్
పున్నమి దినపత్రిక జిల్లా ఇంచార్జి )

రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కార్మికుల అసలు సమస్యలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రోజువారీ విధుల్లో ఎదురవుతున్న ఒత్తిళ్లు, నిబంధనల కఠినత కార్మికులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

ప్రస్తుతం నైట్ అవుట్ సర్వీసులు, స్పెషల్ ఆఫ్ సర్వీసుల కింద రోజుకు కనీసం 528 కిలోమీటర్లు తప్పనిసరిగా పూర్తి చేయాలని ఆదేశాలు ఉన్నాయి. గతంలో టైర్ పంచర్, బ్రేక్‌డౌన్ వంటి సమస్యలు వచ్చినప్పుడు ట్రిప్పుల్లో కొంత సడలింపు ఉండేది. కానీ ఇప్పుడు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంతసేపైనా పని చేయాల్సిందేనని కార్మికులు వాపోతున్నారు.

సెలవుల విషయంలో కూడా కఠిన నియమాలు అమలవుతున్నాయి. తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా, అధికారులు ఆమోదిస్తేనే సెలవు లభిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో కూడా సెలవు తీసుకునే అవకాశమే లేకుండా పోయిందని కార్మికులు అంటున్నారు. హాజరుకాకపోతే ‘ఆబ్సెంట్’గా నమోదు చేయడం వల్ల, తిరిగి డ్యూటీకి చేరాలంటే అధికారుల అనుమతి అవసరమవుతోంది.

ఇక కొత్తగా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానంలో డ్రైవర్లు, కండక్టర్ల నియామకం పెరగడంతో రెగ్యులర్ ఉద్యోగులపై పనిభారం మరింత పెరిగిందని విమర్శలు వస్తున్నాయి. ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ఎప్పుడైనా డ్యూటీకి రావడం, వెళ్లడం వల్ల సమన్వయం లోపిస్తోందని వారు చెబుతున్నారు.

మరోవైపు మహాలక్ష్మి పథకం కూడా కండక్టర్లకు తలనొప్పిగా మారిందని కార్మికులు అంటున్నారు. ప్రయాణికులు టికెట్ తీసుకుని మధ్యలో దిగిపోవడం, టికెట్లు పోగొట్టుకోవడం వంటి ఘటనలకు కండక్టర్లను బాధ్యులుగా చేస్తూ మెమోలు జారీ చేయడం, ఇంక్రిమెంట్లు కట్ చేయడం, సస్పెన్షన్ చర్యలు తీసుకోవడం జరుగుతోందని ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, లేకపోతే సమ్మె మరింత ఉధృతం కావచ్చని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.