Thursday, 23 April 2026

Blog

తిరుపతి

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఆరోపణలు అబద్ధం… పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు

శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిపై జనసేన పార్టీకి చెందిన మాజీ, బహిష్కృత నేతలు కోట వినుత, కోట చంద్రబాబు నాయుడు చేసిన అసభ్యకర వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. పోలీసు వ్యవస్థ ఎమ్మెల్యేకు అనుకూలంగా “గుండాల్లా వ్యవహరిస్తోంది” అన్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు. శ్రీకాళహస్తి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు విజయ్ కుమార్, కాసరం రమేష్, నాగమల్లి దుర్గాప్రసాద్, జి. గోపీనాథ్, షకీర్ అలీ, కె. సుధాకర్ రెడ్డి, మహిళా నాయకులు అనిత, సుమతమ్మ మాట్లాడారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా బహిష్కరించిన కోట వినుతకు ప్రస్తుతం పార్టీతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి సంబంధం లేకుండా, చట్టబద్ధ అనుమతులు లేని అక్రమ నిర్మాణాన్ని మున్సిపల్ అధికారులు కూల్చివేశారని తెలిపారు. చట్టపరమైన వ్యవహారాల్లో ఎవరైనా తప్పు చేస్తే, వారు తమ పార్టీ వారైనా సరే ఎమ్మెల్యే ఎప్పుడూ సహించరని అన్నారు. అలాంటి నిష్పక్షపాత నాయకుడిపై అసత్య ఆరోపణలు చేయడం, అసభ్యంగా మాట్లాడడం పూర్తిగా అనైతికమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట వినుత, ఆమె భర్త కోట చంద్రబాబు నాయుడుకు గట్టి హెచ్చరిక జారీ చేస్తూ, ఇకముందు ఎమ్మెల్యేపై అసత్య ప్రచారాలు, అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని స్పష్టం చేశారు. అవసరమైతే అదే స్థాయిలో ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు. ఈ ఘటనపై శ్రీకాళహస్తి 1వ పట్టణ పోలీస్ స్టేషన్‌లో కోట వినుత, కోట చంద్రబాబు నాయుడులపై ఫిర్యాదు నమోదు చేసినట్లు తెలిపారు. పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించి, సంబంధిత వ్యక్తులను అరెస్ట్ చేసి విచారణ జరిపి, ఇలాంటి రాజకీయ కుట్రలకు చెక్ పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తిరుపతి

నాసా స్పేస్ సెటిల్‌మెంట్ పోటీల్లో ‘శ్రీ చైతన్య’ ప్రతిభ.. ‘వరల్డ్ మెరిట్ ప్రైజ్’ కైవసం.

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 06 (పున్నమి న్యూస్): అంతరిక్ష విజ్ఞాన రంగంలో శ్రీకాళహస్తి విద్యార్థులు ప్రపంచస్థాయిలో సత్తా చాటారు. పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో ఉన్న శ్రీచైతన్య పాఠశాల విద్యార్థులు ప్రతిష్టాత్మకమైన అమెరికా ఎన్.ఎస్.ఎస్ (నాసా స్పేస్ సెటిల్‌మెంట్ – కాంటెస్ట్ 2026) పోటీల్లో అద్భుత విజయాన్ని అందుకున్నారు. తమ మేధస్సు, పట్టుదలతో రూపొందించిన ప్రాజెక్టుకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిపెట్టారు.విద్యార్థులు రూపొందించిన ‘ఎంపీరియా-ఇన్’ (స్పేస్ హోటల్) ప్రాజెక్టుకు అంతర్జాతీయ స్థాయిలో ‘వరల్డ్ మెరిట్ ప్రైజ్’ లభించిందని పాఠశాల ప్రిన్సిపల్ ఎ. రూపాదేవి గర్వంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “మొత్తం 31 దేశాలు పాల్గొన్న ఈ పోటీల్లో 134 విన్నింగ్ ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. అందులో భారత్ 80 అవార్డులు సాధించగా, ఏకంగా 57 అవార్డులు శ్రీచైతన్య విద్యాసంస్థలకే దక్కడం విశేషం” అని కొనియాడారు. అంతర్జాతీయ వేదికపై తమ విద్యాసంస్థల విద్యార్థులు సాధించిన ఈ ఘనత దేశానికే గర్వకారణమని ఏజీఎం సురేష్ హర్షం వ్యక్తం చేశారు. కష్టపడి పనిచేస్తే ఆకాశమే హద్దు అని విద్యార్థులు నిరూపించారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో డీన్ త్రివేణి, ఇన్‌ఛార్జులు శ్రీహరి, వంశీ, నాసా ప్రాజెక్ట్ ఇన్‌ఛార్జ్ కవిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని విజేతలను అభినందించారు.

కడప

మహిళా ఆత్మ గౌరవాన్ని అవమానించడం తగదు: రాచమల్లు

వైసీపీ నాయకుల కుటుంబాలకు చెందిన మహిళల ఆత్మ గౌరవాన్ని కించపరిచేలా టీడీపీకి అనుకూలమైన ఓ మీడియాలో వ్యాఖ్యానించడం తగదని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. RKతో చంద్రబాబు ఈ విధంగా మాట్లాడిస్తున్నాడన్నారు. ఇటువంటి వ్యాఖ్యలను వారి కుటుంబ మహిళలకు ఆపాదిస్తే వారు అంగీకరిస్తారా అని ప్రశ్నించారు.

E-పేపర్

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లో : రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న 300 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లో : రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న 300 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత పున్నమి న్యూస్ ప్రతినిధి రంగారెడ్డి జిల్లా తెలంగాణ ఇంచార్జ్ 06 ఏప్రిల్ 2026 రేషన్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి డంప్ చేసుకొని పక్క రాష్ట్రాలకు తరలిస్తున్న ముఠా వద్ద నుంచి 300 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న ఘటన అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కొనుగోలు చేసి డంప్ చేసుకొని పక్క రాష్ట్రాలకు తరలిస్తున్న ముఠా వద్ద నుంచి 300 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న ఘటన అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అఖిల్ అలియాస్ బాబ్లు, మహమ్మద్ అమీర్ పాషా (30), హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాలలో రేషన్ బియ్యన్ని తక్కువ రేటుకు సుమారుగా 10 రూపాయల నుంచి 12 రూపాయల చొప్పున కొనుగోలు చేసి బియ్యన్ని ఆటోలలో నింపి, అబ్దుల్లాపూర్ మెట్ మండలం, కవాడిపల్లి గ్రామంలో రహస్య స్థలంలో డంపు చేస్తూ, నిల్వ చేసిన బియ్యాన్ని పక్క రాష్ట్రాలకు తరలించి అక్కడ 18 రూపాయల నుంచి 20 రూపాయల అధిక రేట్లకు విక్రయిస్తున్నట్లు పక్క సమాచారంతో అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు రేషన్ బియ్యన్ని డంపు చేస్తున్న స్థలంపై దాడి నిర్వహించారు. ఈ ఘటన మొత్తం 510 సంచులలో సుమారుగా 300 క్వింటాళ్ల రేషన్ బియ్యం, ఒకటి కంటెనర్ లారీ (ລລ໌ – 02- : -2829), ໙໖ (໖໖ -12-యు -3751), అశోక్ లేలాండ్ వాహనం (టీఎస్ -12-టీ -3265), ముగ్గురు డ్రైవర్లు ఆడే రామ్ దాస్ (42), మీర్ ఫుర్కాన్ అలీ ఖాన్(32), జస్వంత్ రే(35) పట్టుకొని, స్వాధీనం చేసుకొని అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రధాన నిర్వాహకుడు అఖిల్ అలియాస్ బబ్లూ పరారిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వడదెబ్బతో వృద్ధ మహిళ మృతి.. బీఎస్పీ నేత పుష్పాంజలి నివాళి

నేడు సోమవారం చిన్న అన్నలూరు ఎస్సీ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. వడదెబ్బ కారణంగా అజ్జిగంటి బుజ్జమ్మ (75) మృతి చెందారు. ఈ ఘటనపై బీఎస్పీ పార్టీ రాష్ట్ర మహిళా కన్వినర్ క్రాకుటూరు పుష్పాంజలి స్పందించి, స్వయంగా అక్కడికి చేరుకుని బుజ్జమ్మ పార్థివ దేహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఇటువంటి దుర్ఘటనలు మళ్లీ జరగకుండా ప్రజలు వేసవిలో జాగ్రత్తలు పాటించాలని ఆమె సూచించారు. తీవ్ర ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానికులు కూడా బుజ్జమ్మ మృతిపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

E-పేపర్

యాచారం పట్టణ కేంద్రంలో మధ్యాహ్నం నుండి లో వోల్టేజి సమస్య. పట్టించుకోని అధికారులు

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలం లో వోల్టేజి సమస్య నిద్ర మత్తులో అధికారులు పున్నమి న్యూస్ ప్రతినిధి తెలంగాణ ఇంచార్జ్ 06 ఏప్రిల్ 2026 యాచారం పట్టణ కేంద్రంలో మధ్యాహ్నం నుండి లో వోల్టేజి సమస్య. ఇప్పటికీ సమస్యను పరిష్కరించని విద్యుత్ అధికారులు. నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్న విద్యుత్ సిబ్బంది. లో వాల్టేజీ సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైన అధికారులు. ప్రస్తుతం మేము ఏమీ చేయలేము అని చేతులెత్తేసి ప్రశాంతంగా నగరంలో ఉంటున్న అధికారులు. ఈ చీకట్లో మేము పనులు చేయలేము అని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్న విద్యుత్ సిబ్బంది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మాజీ మార్కెటింగ్ చైర్మన్ ఆలీ అహ్మద్ కుమారుని వివాహానికి మేకపాటి రాజగోపాల్ రెడ్డి హాజరు

మాజీ మార్కెటింగ్ చైర్మన్ ఆలీ అహ్మద్ కుమారుని వివాహ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ శుభకార్యానికి ఉదయగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త శ్రీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి, యువ నాయకుడు అభినవ్ రెడ్డి మరియు నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మేకపాటి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, ఆలీ అహ్మద్ కుటుంబంతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని, కొత్త దాంపత్య జీవితంలో అడుగుపెడుతున్న జంట సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. యువ నాయకుడు అభినవ్ రెడ్డి కూడా వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతూ వారి భవిష్యత్తు విజయవంతంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని వధూవరులను అభినందించారు. వివాహ వేడుక ఆనందోత్సాహాల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించబడింది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జిర్రావారిపాలెం మార్కెటింగ్ యార్డ్‌లో రైతులతో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ భేటీ

కలిగిరి మండలం జిర్రావారిపాలెం గ్రామంలోని మార్కెటింగ్ యార్డ్‌ను ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సందర్శించారు. యార్డ్‌లోని సౌకర్యాలను పరిశీలించిన ఆయన, అక్కడి రైతులతో ముచ్చటిస్తూ వరి, మొక్కజొన్న, సెనగ పంటల దిగుబడులపై వివరాలు తెలుసుకున్నారు. పంటల కొనుగోలు విధానం, కనీస మద్దతు ధరల అమలు, మార్కెట్ ధరల పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. రైతుల సమస్యలను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా అధికారులకు సూచనలు చేస్తానని తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం పొడిగింపు – విపరీత స్పందనతో నిర్ణయం

జనసేన పార్టీ చేపట్టిన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా అద్భుతమైన స్పందన లభిస్తోంది. గ్రామాలు, పట్టణాలు, నియోజకవర్గాలు అన్న తేడా లేకుండా పెద్ద ఎత్తున యువత, మహిళలు, సామాన్య ప్రజలు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో వివిధ జిల్లాలు మరియు నియోజకవర్గాల నుంచి కార్యక్రమాన్ని మరికొన్ని రోజుల పాటు కొనసాగించాలని పార్టీ కేంద్ర కార్యాలయానికి విస్తృతంగా అభ్యర్థనలు అందాయి. ఈ అభ్యర్థనలను పరిగణలోకి తీసుకున్న పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సూచన మేరకు ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరికొన్ని రోజుల పాటు పొడిగించాలని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నిర్ణయించింది. పార్టీ వర్గాల ప్రకారం, ప్రజల నుంచి వస్తున్న ఈ విశేష స్పందన పార్టీపై పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. కొత్తగా చేరుతున్న సభ్యులు పార్టీ బలోపేతానికి దోహదం చేస్తారని, రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు ఇది బలమైన పునాది అవుతుందని నాయకులు తెలిపారు. పొడిగించిన గడువులో మరింత మంది ప్రజలు సభ్యత్వం నమోదు చేసుకుని జనసేన కుటుంబంలో చేరాలని పార్టీ పిలుపునిచ్చింది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సంగంలో సాగునీటి భద్రతపై రైతులతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమావేశం

సంగం మండల కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన ముఖ్య సమావేశం జరగనుంది. పాత బ్యారేజి ఇరిగేషన్ ఏఈ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గ రైతులతో సాగునీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యతలపై చర్చించనున్నారు. చెరువులు, కాలువల పునరుద్ధరణతో పాటు పూడికతీత పనులను ప్రారంభించనున్నారు. ఈ సమావేశానికి సాగునీటి సంఘాల ప్రతినిధులు, రైతు నాయకులు, కూటమి పార్టీల నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని టిడిపి నాయకులు కోరారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.