Wednesday, 22 April 2026

Blog

ఖమ్మం

అణగారిన వర్గాల ఆశాజ్యోతి పూలేకు ఘన నివాళి – అభివృద్ధే లక్ష్యము… ఖమ్మం జిల్లా లో పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన. లబ్ది దారులకి చెక్కులు పంపిణి చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ఖమ్మం ఏప్రిల్ (పువ్వాడ నాగేంద్ర కుమార్ పున్నమి జిల్లా ఇంచార్జి ) అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసిన మహానుభావుడు మహాత్మా జ్యోతిబా పూలేకు సమానత్వ సమాజ నిర్మాణమే నిజమైన నివాళి అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం శ్రీ శ్రీ సర్కిల్ వద్ద నిర్వహించిన జయంతి వేడుకల్లో పాల్గొని పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఏదులాపురం మున్సిపాలిటీ, ఖమ్మం రూరల్ మండల పరిధిలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు పరిమితమని, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి మరియు సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామని వెల్లడించారు. ఏదులాపురం మున్సిపాలిటీలోని 32 వార్డుల సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇప్పటివరకు రూ.58.95 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అలాగే వరంగల్ క్రాస్ రోడ్ ఆటోనగర్ నుంచి మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వరకు రూ.4.50 కోట్లతో నిర్మించనున్న రహదారి పనులకు భూమిపూజ నిర్వహించారు. ఖమ్మం రూరల్ మండల అభివృద్ధి కోసం గత 27 నెలల్లో రూ.64.92 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ నిధులతో సీసీ రోడ్లు, డ్రెయిన్లు, తాగునీటి సౌకర్యాలు మెరుగుపరిచినట్లు వివరించారు. మంగళగూడెం గ్రామంలో కొత్తూరు నుంచి కాచిరాజుగూడెం వరకు రూ.2.50 కోట్లతో చేపట్టనున్న రోడ్డు మరియు స్లాబ్ కల్వర్టు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో 64 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు, 227 మందికి రూ.70.42 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఖమ్మం

మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఖమ్మం జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో ఘన నివాళులు

ఖమ్మం ఏప్రిల్ (పువ్వాడ నాగేంద్ర కుమార్ పున్నమి జిల్లా ఇంచార్జి ) మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు నాయకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి మహాత్మా జ్యోతిబా పూలే చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. విద్య, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ రాష్ట్ర నాయకులు జ్వాల నరసింహరావు, ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌వీఎస్ యాదవ్, మండల అధ్యక్షులు వాకదని రామకృష్ణ యాదవ్, దానియాకుల వెంకట్ నారాయణ యాదవ్, రెండో పట్టణ ప్రధాన కార్యదర్శి రుద్రగాని మాధవ్, కుమిలి శ్రీనివాస్ తదితర మండల, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

ఖమ్మం

మొక్కజొన్న కేంద్రాలు పెంచాలి… .. బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు చావా కిరణ్ డిమాండ్.

ఖమ్మం ఏప్రిల్ (పువ్వాడ నాగేంద్ర కుమార్ పున్నమి జిల్లా ఇంచార్జి ) ఖమ్మం జిల్లా పరిధిలో ని పాలేరు నియోజకవర్గం లో గల నేలకొండపల్లి మండలం మూటాపురం గ్రామంలో ఉన్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు చావా కిరణ్ ఆధ్వర్యంలో బీజేపీ ప్రతినిధి బృందం శనివారం సందర్శించారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు మరియు రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు చావా కిరణ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల వివక్ష చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మొక్కజొన్న రైతుల వద్ద ఎలాంటి ఆంక్షలు లేకుండా పంటను కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని విమర్శించారు. అంతేకాక వరి కొనుగోలు కేంద్రాలను కూడా పెంచాలని, యాసంగి బోనస్‌ను తక్షణమే విడుదల చేయాలని కోరారు. పాలేరు నియోజకవర్గం నుంచి గెలిచిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంటనే స్పందించి రైతుల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేసారు. రైతుల ఉసురు తగలకుండా ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకుని మరిన్ని మొక్క జొన్నల, వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో రైతులు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పాలేరు అసెంబ్లీ ఇంచార్జీ నున్నా రవికుమార్, మండల అధ్యక్షులు పాగర్తి సుధాకర్, ప్రధాన కార్యదర్శులు మల్లెబోయిన గోవిందరావు, బాజా రామకృష్ణ, నాయకులు కట్టా అప్పారావు, సూరేపల్లి జ్ఞానరత్నం, సయ్యద్ మోహినుద్దీన్, పుట్టా సత్యనారాయణ, మూడు రమేష్, బానోతు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే రైతులు ఏలూరు రామారావు, చావా హరి, బాగా మురళి, భాష నెహ్రు, వెంకన్న తదితరులు హాజరయ్యారు.

ఖమ్మం

మహిళా రిజర్వేషన్ బిల్లు లో ఒ బీసీ లకు చట్టబద్ధత కల్పించాలి.. ..బిసి సంక్షేమ సంఘం సీనియర్ నాయకులు గుండాల కృష్ణ.

ఖమ్మం ఏప్రిల్ (పువ్వాడ నాగేంద్ర కుమార్ పున్నమి జిల్లా ఇంచార్జి ) మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ లకు చట్ట బద్దత కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం సీనియర్ నాయకులు గుండాల కృష్ణ పేర్కొన్నారు.సంఘం ముఖ్య నాయకుల సమావేశం శని వారం ఖమ్మం లో జరిగింది.ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ తో పాటు ఓబీసీ లకు వాటా కల్పించాలని అప్పుడే పూలేకు నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందన్నారు.జనగణన లో కులం కాలం వున్నప్పటికీ ఓబీసీ క్లాసిఫికేశన్ లేకపోవడంవల్ల బీసీల జనాభా లెక్క తేలడం లేదన్నారు.వెంటనే ఓబీసీ గణన చేపట్టి దానికి అనుగుణంగా మహిళా రిజర్వేషన్ లో ఓబీసీ లకు సాబ్ కోటా కల్పించాలని డిమాండ్ చేశారు.బిల్లు అమలు కాకపోవడం వల్లఖమ్మం లో రాజకీయ సామాజిక అసమానతలు మరింత పెరిగాయని అన్నారు.కొన్ని సంవత్సరాలు గా పూలే జయంతి వేడుకలు రోడ్ల మీద నిర్వహించుకోవడం విచారకరమని వెంటనేఖమ్మం లో బీసీ భవన్ ను వెంటనే బీసీ భవన్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరారు.అదేవిధంగా నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ లో పులె విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో డి డిసిబి మాజీ ఛైర్మన్ కూరాకుల నాగభూషణం,జిల్లా పద్మశాలి సంఘం గౌరవాధ్యక్షులు బొమ్మా రాజేశ్వరరావు,గౌడ సంఘం అధ్యక్షులు కత్తి నెహ్రూ తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం

ఖమ్మం టూ టౌన్ బీజేపీ కమిటీ కీలక సమావేశం – కార్పొరేషన్ ఎన్నికలమీదఫోకస్

ఖమ్మం ఏప్రిల్ (పువ్వాడ నాగేంద్ర కుమార్ పున్నమి జిల్లా ఇంచార్జి ) ఖమ్మం జిల్లా బీజేపీ కార్యాలయంలో ఖమ్మం బీజేపీ టూ టౌన్ అధ్యక్షుడు ధనియాకుల వెంకటనారాయణ అధ్యక్షతన ఎస్ ఐ ఆర్ & బి ఎల్ఏ. 2.సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఖమ్మం టూ టౌన్ పరిధిలోని 15 డివిజన్లకు సంబంధించి రానున్న ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి డివిజన్ నుంచి రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు పోలింగ్ బూత్ లెవెల్ ఆఫీసర్లను నియమించి, వారి పూర్తి వివరాలను జిల్లా పార్టీకి సమర్పించాలని సూచించారు. అలాగే బూత్ స్థాయి ఓటర్ లిస్టు వెరిఫికేషన్, చేర్పులు-మార్పులు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని నాయకత్వం ఆదేశించింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వేల్పుల సుధాకర్, ఈశ్వర ప్రగడ రామారావు, నక్క రవి గౌడ్, తాజానూత భద్రం, పాశం శ్రీనివాసరెడ్డి, ఇనుగుర్తి ఉపేంద్ర, భూపతి రాజు రామాచారి తదితరులు పాల్గొన్నారు.

సాహితీ

మహాత్మా జ్యోతిరావు పూలే – డా. బద్రి పీర్ కుమార్

భారతదేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా మరియు మహిళల హక్కుల కోసం పోరాడిన గొప్ప సామాజిక విప్లవకారుడు, సంఘ సంస్కర్త మరియు రచయిత అయిన మహాత్మా జ్యోతిరావు ఫూలే 199వ జయంతి నేడు జరుపుకుంటున్నాము. ఈయన ఏప్రిల్ 11, 1827న మహారాష్ట్రలోని పూణే లో జన్మించారు. మహాత్మా ఫూలేను ఆధునిక భారతదేశంలో సామాజిక విప్లవ పితామహుడిగా మరియు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా చెప్పుకుంటాము. సామాజిక సంస్కరణల పట్ల ఆయన చేసిన కృషికి గుర్తింపుగా 1888లో సామాజిక కార్యకర్త విఠల్‌రావు కృష్ణజీ వందేకర్ ఆయనకు ‘మహాత్మా’ అనే బిరుదును ప్రదానం చేశారు. తన సతీమణి సావిత్రిబాయి ఫూలేతో కలిసి భారతదేశంలో మహిళా విద్య కోసం ఎనలేని కృషిచేసిన పూలే జయంతి సందర్భంగా ఈ అక్షర నివాళి 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 *మ* మహారాష్ట్రలో జన్మించి సమసమాజాభివృద్ధినెంచి *హా* హక్కుల కోసం పోరాడిన సామాజిక విప్లవకారుడు *త్మా* తమ విధానలక్ష్యంగా సమన్యాయ సత్యశోధకుడు *జ్యో* జ్యోతి క్షేత్రంగా నడిపించు ఆదర్శభావకుడు *తి* తీవ్ర వ్యతిరేకి మూఢనమ్మకాలకు *రా* రచయితగా సామాజిక వెతలరక్షకుడు *వు* వున్నతికి విద్యార్జన మూలమన్నవాడు *పూ* పూజ్యుడు ప్రజాపక్ష సాధకుడు *లే* లేమితనం అజ్ఞానం పనితనంతో సాధిస్తాం *జ* జనజీవన తారతమ్యాలు తొలగిస్తాం *యం* యంత్రంలా పనిచేసి విజ్ఞాన బీజాలు నాటేస్తాం అంటూ *తి* తీరు మార్చిన ఇజం సత్యశోధక సమాజం స్థాపకుడు నేటికీ సామాజిక హృదయంలో స్ఫూర్తిదాయకుడు. 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

తిరుపతి

పూలే సేవలు చిరస్మరణీయం.. శ్రీకాళహస్తిలో భాజపా నివాళులు

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 11 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి పట్టణంలోని పాత బస్టాండ్ సర్కిల్ వద్ద మహాత్మ జ్యోతిరావు పూలేకు ఘనంగా నివాళులు అర్పించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ సూచనల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధి కొండేటి గోపాల్ మాట్లాడుతూ, 1827లో మహారాష్ట్రలో జన్మించిన జ్యోతిరావు పూలే గొప్ప సామాజిక సంస్కర్త, విద్యావేత్తగా దేశానికి అపార సేవలు అందించారని తెలిపారు. కుల వివక్ష, అంటరానితనం, లింగ అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన ఆయన, మహిళల విద్యకు ప్రాధాన్యత ఇస్తూ తన సతీమణి సావిత్రిబాయి పూలేతో కలిసి తొలి బాలికల పాఠశాలను స్థాపించిన మహనీయుడని పేర్కొన్నారు. దళిత, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన పూలే, సమాజంలో సమానత్వ భావనను వ్యాప్తి చేసిన చిరస్మరణీయ వ్యక్తిగా కొనియాడారు. ఆయన సేవలకు గుర్తింపుగా 1888లో “మహాత్మా” బిరుదు ప్రదానం చేయబడిందని వివరించారు. ‘గులాం గిరి’, ‘రైతు వాగ్దానం’ వంటి రచనల ద్వారా సామాజిక అన్యాయాలను వెలుగులోకి తీసుకువచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మేళాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి, సీనియర్ నాయకులు గరికపాటి రమేష్ బాబు, జీవీ అమర్నాథ్, కన్నా వెంకటేశ్వర్లు, పట్టణ దళిత మోర్చా అధ్యక్షుడు గాదెపాకుల యతీష్ సహా పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తిరుపతి

పూలే జయంతి వేడుకలు.. సమానత్వం, విద్యా స్పూర్తి పునరుద్ఘాటన

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 11 (పున్నమి న్యూస్) మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతిని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలో ఘనంగా నివాళులు అర్పించారు. స్థానిక 18వ వార్డు పూసల వీధి కూడలిలో తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం ఆధ్వర్యంలో పూలే చిత్రపటానికి పూజలు నిర్వహించి, అనంతరం అంబలి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. అణగారిన వర్గాల అభ్యున్నతికి, కుల వివక్ష నిర్మూలనకు జీవితాంతం పోరాడిన మహాత్మా పూలే సామాజిక ఉద్యమానికి ప్రతీకగా నిలిచారని కొనియాడారు. మహిళా విద్యకు పునాదులు వేసి, బాలికల కోసం తొలి పాఠశాల స్థాపనలో పూలే దంపతులు చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. పూలే ఆశయాల స్ఫూర్తితోనే రాష్ట్రంలో విద్య, సామాజిక న్యాయం, మహిళా సాధికారతకు ప్రాధాన్యం పెరుగుతోందని, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం అందరూ కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు. కులవ్యవస్థ వ్యతిరేక పోరాటం, సమసమాజ నిర్మాణం కోసం పూలే చూపిన మార్గాన్ని అనుసరించడం అవసరమని అభిప్రాయపడ్డారు. అలాగే బీసీల సాధికారతకు పునాది వేసిన నాయకత్వం, సంక్షేమ విధానాలను గుర్తుచేస్తూ, సమాజంలోని అన్ని వర్గాలకు రాజకీయ, ఆర్థిక అవకాశాలు కల్పించడం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ డా.జి.దశరథాచారి, వన్నెకుల క్షత్రియ సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, గిరిజన సలహా మండలి సభ్యులు యం.సుబ్బయ్య, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాలి చలపతి నాయుడు, బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు,తంగేళ్ళపాలెం పిఏసియస్ ఛైర్మన్ బీమాల భాస్కర్, శ్రీకాళహస్తి పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రం కిషోర్, శ్రీకాళహస్తి పట్టణ సహకార బ్యాంకు మాజీ ఛైర్మన్ డి.వి.నారాయణ, గాండ్ల తెలికుల సాధికార సమితి రాష్ట్ర సభ్యులు కన్నావరం హరిబాబు, నాయీ బ్రాహ్మణ సాధికార సమితి తిరుపతి పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్‌ కోట చంద్రశేఖర్,తొట్టంబేడు మండల ప్రధాన కార్యదర్శి చిల్లకూరు మణి,నూర్ మొహమ్మద్, గాజుల భగత్,సంజాకుల మురళీకృష్ణ,యస్వీ.రమణ,వెంకటేశ్వర్లు, వెంకటరమణ,ఆనంద్ గౌడ్,చంద్రబాబు, శ్రీనివాస్, కృష్ణమూర్తి, గంగనపల్లి రమేష్, సులేమాన్, ప్రభాకర్, భార్గవ్,చంద్రశేఖర్, చలపతి,తేజ,దండపాణి,కృష్ణయ్య,గోపీ, సుబ్రహ్మణ్యం పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తిరుపతి

ఫులే తత్వం విద్యార్థులకు స్ఫూర్తి- SKIIMS నిర్వాహకులు మిద్దెల హరి

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 11 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి మండలం కాపు గున్నేరి గ్రామ సమీపంలోని శ్రీకాళహస్తీశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్ (SKIIMS) కళాశాలలో జ్యోతిరావ్ ఫులే 199వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ మిద్దెల హరి, ప్రిన్సిపాల్ డాక్టర్ గీతాదేవి, హెచ్ఓడీలు, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఫులే చిత్రపటానికి పూలమాలలు వేసి, పూజా కార్యక్రమం నిర్వహించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మిద్దెల హరి మాట్లాడుతూ, సామాజిక సంస్కర్త జ్యోతిరావ్ ఫులే వెనుకబడిన వర్గాలు, మహిళల అభ్యున్నతికి చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. బాల్యహత్యా ప్రతిబంధక్ గృహం, సత్యశోధక్ సమాజ్ స్థాపనతో పాటు బాలికల విద్యాభివృద్ధికి ఆయన చేసిన కృషిని వివరించారు. విద్యార్థులు ఫులే జీవిత తత్వం, విద్యా భావజాలం, సమాజ సేవ దృక్పథాన్ని తెలుసుకొని స్ఫూర్తి పొందారు.

తిరుపతి

పూలే బాటలో నడవాలి-యువతకు టిడిపి పట్టణాధ్యక్షుడు పిలుపు

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 11 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి పట్టణంలోని టిడిపి కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. టిడిపి పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి భక్తిశ్రద్ధలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టిడిపి పట్టణ అధ్యక్షుడు మాట్లాడుతూ.. కుల వివక్ష నిర్మూలనకు, మహిళా విద్యాభివృద్ధికి పూలే దంపతులు చేసిన పోరాటం చిరస్మరణీయమని పేర్కొన్నారు. యువత పూలే ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో సమానత్వం నెలకొల్పేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని నాయకులు సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలు “జ్యోతిరావు పూలే అమర్ రహే” అంటూ నినాదాలు చేశారు. అనంతరం టిడిపి నాయకులు పట్టణ అధ్యక్షుడు పోలూరు శ్రీనివాసులు రెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీసీ సంఘాల ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.