Thursday, 3 September 2026
  • Home  
  • జడ్పీలో పదోన్నతులు, కారుణ్య నియామకాలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జడ్పీలో పదోన్నతులు, కారుణ్య నియామకాలు

నెల్లూరు జిల్లా ప్రజా పరిషత్ యాజమాన్య పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు పదోన్నతులు, అలాగే కారుణ్య నియామకాలు చేపట్టారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తాటిపర్తిలో జూనియర్ సహాయకురాలిగా విధులు నిర్వహిస్తున్న శ్రీమతి ఎమ్ రాజ్యలక్ష్మిని సీనియర్ సహాయకురాలిగా పదోన్నతి కల్పించి, మండల ప్రజా పరిషత్ కార్యాలయం వాకాడుకు బదిలీ చేసి నియమించారు. అదేవిధంగా, విధుల్లో ఉండగా మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో ఇద్దరికి కారుణ్య నియామకాలు ఇచ్చారు. అందులో భాగంగా ఆర్ శశిలాలాసను మండల ప్రజా పరిషత్ పెళ్లకూరు కార్యాలయానికి, వై లోకేష్ కుమార్‌ను మండల ప్రజా పరిషత్ కావలి కార్యాలయానికి ఆఫీస్ సబార్డినేట్‌లుగా నియమించారు. ఈ పదోన్నతులు, నియామకాలు సజావుగా జరిగేందుకు సహకరించిన జడ్పీ చైర్‌పర్సన్ గౌరవనీయులు శ్రీమతి ఆనం అరుణమ్మ, జడ్పీ సీఈవో గౌరవనీయులు శ్రీ ఎల్ శ్రీధర్ రెడ్డి, జడ్పీ డిప్యూటీ సీఈవో గౌరవనీయులు శ్రీ జే మోహన్ రావు గారులకు పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శ్రీ లక్కాకుల పెంచలయ్య, కార్యదర్శి శ్రీ విదేవ ప్రశ్న కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు.

నెల్లూరు జిల్లా ప్రజా పరిషత్ యాజమాన్య పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు పదోన్నతులు, అలాగే కారుణ్య నియామకాలు చేపట్టారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తాటిపర్తిలో జూనియర్ సహాయకురాలిగా విధులు నిర్వహిస్తున్న శ్రీమతి ఎమ్ రాజ్యలక్ష్మిని సీనియర్ సహాయకురాలిగా పదోన్నతి కల్పించి, మండల ప్రజా పరిషత్ కార్యాలయం వాకాడుకు బదిలీ చేసి నియమించారు.

అదేవిధంగా, విధుల్లో ఉండగా మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో ఇద్దరికి కారుణ్య నియామకాలు ఇచ్చారు. అందులో భాగంగా ఆర్ శశిలాలాసను మండల ప్రజా పరిషత్ పెళ్లకూరు కార్యాలయానికి, వై లోకేష్ కుమార్‌ను మండల ప్రజా పరిషత్ కావలి కార్యాలయానికి ఆఫీస్ సబార్డినేట్‌లుగా నియమించారు.

ఈ పదోన్నతులు, నియామకాలు సజావుగా జరిగేందుకు సహకరించిన జడ్పీ చైర్‌పర్సన్ గౌరవనీయులు శ్రీమతి ఆనం అరుణమ్మ, జడ్పీ సీఈవో గౌరవనీయులు శ్రీ ఎల్ శ్రీధర్ రెడ్డి, జడ్పీ డిప్యూటీ సీఈవో గౌరవనీయులు శ్రీ జే మోహన్ రావు గారులకు పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శ్రీ లక్కాకుల పెంచలయ్య, కార్యదర్శి శ్రీ విదేవ ప్రశ్న కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.