Tuesday, 14 July 2026
  • Home  
  • శ్రీకాళహస్తిలో ద్రౌపతి దేవి సమేత ధర్మరాజస్వామి బ్రహ్మోత్సవ ఏర్పాట్ల పరిశీలన
- తిరుపతి

శ్రీకాళహస్తిలో ద్రౌపతి దేవి సమేత ధర్మరాజస్వామి బ్రహ్మోత్సవ ఏర్పాట్ల పరిశీలన

శ్రీ కాళహస్తి, జులై 14, (పున్నమి టెంపుల్ న్యూస్): శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీ నుండి ప్రారంభం కానున్న శ్రీ ద్రౌపతి దేవి సమేత ధర్మరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను మంగళవారం ఆలయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈఓ) బి.కె. వెంకటేశులు, డీఈఓ ఎన్.ఆర్. కృష్ణారెడ్డి, ఈఈ శ్రీనివాసులు రాజు, ఏईఓ హేమమాలిని ఇతర అధికారులతో కలిసి ఉత్సవ ప్రాంతాలను స్వయంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈఓ వెంకటేశులు మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తాగునీరు, విద్యుత్ వెలుగులు, నిరంతర పారిశుద్ధ్యం, సురక్షిత బారికేడ్లు, రహదారుల మరమ్మతులు, క్రమబద్ధమైన వాహన పార్కింగ్, తాత్కాలిక షెడ్ల ఏర్పాటుతో పాటు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉత్సవాలను విజయవంతం చేయడానికి సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఇంజినీరింగ్ విభాగం అధికారులు, సిబ్బంది మరియు ఇతర శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.