Monday, 11 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

అన్నదాత సుఖీభవ ట్రాక్టర్ల ర్యాలీ ని విజయవంతం చేయండి..!!!

కలిగిరి,ఆగస్టు11,(పున్నమి ప్రతినిధి): ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవ ట్రాక్టర్ల ర్యాలీ కార్యక్రమం బుధవారం దుత్తలూరు నుండి ఉదయగిరి వరకు నిర్వహిస్తున్నారని ఈ కార్యక్రమానికి కలిగిరి మండలం నుండి మరియు నియోజకవర్గం నుండి కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు పిలుపునిచ్చారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకంలో భాగమైన అన్నదాత సుఖీభవ అమలకు శ్రీకారం చుట్టిన కూటమి అధినాయకులకు ధన్యవాదములు తెలియజేసే లక్ష్యాలలో భాగంగా ఉదయగిరి నియోజకవర్గంలో భారీగా ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహణకు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ప్రణాళికలు సిద్ధం చేశారని ఆయన తెలిపారు. బుధవారం దుత్తలూరు తాసిల్దార్ కార్యాలయం సమీపం నుండి ఉదయగిరి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ సముదాయం వరకు భారీ ట్రాక్టర్ల ర్యాలీ చేపట్టడం జరుగుతుందని తెలిపారు. రైతన్నల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ క్రమంలోనే మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమయానికి రైతులకు పెట్టుబడి సాయం కింద వారి అకౌంట్లో 7000 రూపాయలు నగదను జమ చేయడం జరిగిందన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం కూటమి ప్రభుత్వం యొక్క నిబద్ధతకు నిదర్శనం అన్నారు. కలిగిరి మండలంలోని 23 పంచాయితీలకు చెందిన టిడిపి ,బిజెపి ,జనసేన, నాయకులు ప్రతి పంచాయతీ నుంచి రైతులు యొక్క ట్రాక్టర్ ర్యాలీ ప్రక్రియను కనివిని ఎరగని రీతిలో జయప్రదం చేయగలరని బొల్లినేని వెంకట రామారావు కోరారు.

తిరుపతి

శ్రీ కాళహస్తి లోవ్యక్తి అదృశ్యం

శ్రీకాళహస్తి పట్టణం కుందేటి వారి వీధి బహుదూర్ పేట లో నివాసం ఉంటున్న రమేష్ కుమారుడు ఎన్.ప్రవీణ్ కుమార్(30) ఇతను సుమారు రెండు నెలల క్రితం కాకినాడ లో చేపలు పట్టడానికి వెళ్లి వస్తానని చెప్పినాడని ఇంతవరకు రాలేదని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని శ్రీకాళహస్తి టూ టౌన్ సిఐ నాగార్జున రెడ్డి తెలియజేశారు. ఇతని ఆచూకీ తెలిస్తే ఈ క్రింది ఫోన్ నెంబర్ కి9440900008 సమాచారం ఇవ్వాలి అని వారు కోరారు.

ఆంధ్రప్రదేశ్

జీవనశైలి, ఆహారపు అలవాట్లతో క్యాన్సర్ ముప్పు

శ్రీకాకుళం, ఆగస్టు 12 (పున్నమి ప్రతినిధి)మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు మహిళల్లో క్యాన్సర్ ముప్పును పెంచుతున్నాయని, ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ నివారణలో ‘మేమోగ్రామ్’ స్క్రీనింగ్ పరీక్ష కీలకమని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షురాలు డా. పైడి సింధూర అన్నారు.మంగళవారం మునసబుపేట గాయత్రీ కాలేజీ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్‌మెంట్‌లో జరిగిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడుతూ, దేశంలో క్యాన్సర్ బారిన పడుతున్న మహిళల్లో 28 శాతం మంది బ్రెస్ట్ క్యాన్సర్ బాధితులేనని తెలిపారు. ప్రతి మహిళా సంవత్సరానికి ఒకసారి మేమోగ్రామ్ పరీక్ష చేయించుకోవాలని సూచించారు. విద్యార్థి దశ నుంచే అవగాహన పెంపొందితే, క్యాన్సర్‌ను జయించడం సాధ్యమని పేర్కొన్నారు.విశిష్ట అతిథి లయన్ డా. బగాది శ్రావ్య మాట్లాడుతూ, బ్రెస్ట్‌లో గడ్డలు, స్రావాలు, నొప్పి వంటి లక్షణాలు కనబడితే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. తాజా కూరగాయలు, పండ్లు, ఇంటి ఆహారం తీసుకోవడం శ్రేయస్కరమని చెప్పారు.కళాశాల ప్రిన్సిపాల్ కెవి. సత్యన్నారాయణ మాట్లాడుతూ, మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ నిర్మూలనకు సంపూర్ణ అవగాహన అవసరమని, విద్యార్థినులు తమ కుటుంబం, గ్రామ మహిళలకు మేమోగ్రామ్ పరీక్ష ప్రాముఖ్యతను వివరించాలని కోరారు.కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మెంబర్షిప్ ఛైర్పర్సన్ ఎన్. రమ్య, మార్కెటింగ్ ఛైర్పర్సన్ పొడుగు చరణ్, ఇతర సభ్యులు, కళాశాల సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు. అనంతరం డా. సింధూర, డా. శ్రావ్యలకు సత్కారం అందించారు.

ఆంధ్రప్రదేశ్

10 .8.25 తేదీ నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అక్షర విద్యాలయం నందు జరిగిన రెండు తెలుగు రాష్ట్రాల అథ్లెటిక్స్ పోటీలలో అతి చిన్న వయసులో తన సత్తా చాటిన మియాపూర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థిని “విధిష్”

( పున్నమి ప్రతినిధి) ఈనెల 5వ తేదీ నుండి 10 తేదీ వరకు అక్షర విద్యాలయం నందు జరిగిన రెండు తెలుగు రాష్ట్రాల అథ్లెటిక్స్ పోటీలలో మియాపూర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 4వ తరగతి విద్యార్థిని” విధిష్”” 3000 మీటర్స్ పరుగు పందెంలో తన సత్తా సాటి రెండవ బహుమతిని(RRUNNER) గా నిలచి అందరిని ఆశ్చర్యపరిచినది. ఈ విద్యార్థిని తల్లిదండ్రులను మరియు కోచర్ ను అక్షర విద్యాలయ డైరెక్టర్ శ్రీమతి కుముద మేడం గారు, ప్రిన్సిపల్ ప్రియా జాకబ్ గారు మరియు వైస్ ప్రిన్సిపల్స్ అందరు కలిసి సత్కరించారు.. End.

చిత్తూరు

కాణిపాకం లో ఘనంగా సంకటహరి చతుర్థి వ్రతం.

కాణిపాక ఆలయంలో సంకట చతుర్థి వ్రతం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున కాణిపాక ఆలయంలో సంకట చతుర్థి వ్రతం నిర్వహిస్తారు. ఈ వ్రతంలో పాల్గొంటే సంకటాలు అన్ని తొలగి సుఖ సంతోషాలు పొందుతారని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ కార్యక్రమం కి భక్తులు అధిక సంఖ్యలో చేరుకునే పూజలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌక్యం కలగకుండా ఆలయ అధికారులు తగు చర్యలు తీసుకున్నారు.

అన్నమయ్య

రైల్వేకోడూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా ప్రమాణ స్వీకారం చేసిన బిజెపి సీనియర్ నాయకులు చక్రవర్తుల నాగేశ్వర్ రాజు

రైల్వేకోడూరు నియోజకవర్గ మార్కెట్ కమిటీ చైర్మన్ గా సోమవారం పగడాల వరలక్ష్మి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. ఆయనతో పాటు తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి హాజరయ్యి రైల్వేకోడూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పగడాల వరలక్ష్మి తో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం చైర్మన్ తో పాటు 12 మంది మార్కెట్ కమిటీ డైరెక్టర్లు గా ప్రమాణ స్వీకారం చేశారు. అందులో భాగంగా చిట్వేలి మండలం మైలపల్లి పంచాయతీ ఎం.రాచపల్లి గ్రామానికి చెందిన బిజెపి సీనియర్ నాయకులు చక్రవర్తుల నాగేశ్వర్ రాజు రైల్వే కోడూరు నియోజకవర్గ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా నాగేశ్వర్ రాజు మాట్లాడుతూ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా ఎన్నికవ్వడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అలాగే ఈ పదవి రావడానికి సహకరించిన బిజెపి జిల్లా అధ్యక్షులు సాయిలోకేష్ కు, రైల్వేకోడూరు టిడిపి ఇన్చార్జ్ ముక్కా రూపనంద రెడ్డికి, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కు, కోడూరు బిజెపి అసెంబ్లీ కన్వీనర్ గడ్డం చంగల్ రాజు కు, రైల్వేకోడూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పగడాల వరలక్ష్మి కి, అలాగే ఎన్డీఏ కూటమి నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఖమ్మం

ఖమ్మం జిల్లా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలపై ఫిర్యాదుల వెళ్ళువ

పున్నమి Daily ఖమ్మం T.రవీందర్ ఈరోజు ఖమ్మం కలెక్టర్ గారికి మరియు ఏసిపి గారికి వినతిపత్రం :- గత రెండు రోజుల కింద ఖమ్మం నగరంలో వివిధ రాజకీయ పార్టీలు చేపట్టిన ఇజ్రాయిల్ హమాస్ పై చేస్తున్న దాడులను నిరసిస్తూ. హమాస్ అనుకూల ర్యాలీలో వివిధ స్కూలు పిల్లలను ర్యాలీలో పాల్గొనేలా చేసిన ప్రైవేట్ స్కూలు యాజమాన్యాలపై చర్య తీసుకోవాలని, ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు మరియు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు కలిసి ఖమ్మం జిల్లా కలెక్టర్ గారికి మరియు ఏసిపి గారికి వినతి పత్రం ఇచ్చారు.

ఖమ్మం

ఖమ్మం జిల్లా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలపై ఫిర్యాదుల వెళ్ళువ

పున్నమి Daily ఖమ్మం T.రవీందర్ ఈరోజు ఖమ్మం కలెక్టర్ గారికి మరియు ఏసిపి గారికి వినతిపత్రం :- గత రెండు రోజుల కింద ఖమ్మం నగరంలో వివిధ రాజకీయ పార్టీలు చేపట్టిన ఇజ్రాయిల్ హమాస్ పై చేస్తున్న దాడులను నిరసిస్తూ. హమాస్ అనుకూల ర్యాలీలో వివిధ స్కూలు పిల్లలను ర్యాలీలో పాల్గొనేలా చేసిన ప్రైవేట్ స్కూలు యాజమాన్యాలపై చర్య తీసుకోవాలని, ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు మరియు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు కలిసి ఖమ్మం జిల్లా కలెక్టర్ గారికి మరియు ఏసిపి గారికి వినతి పత్రం ఇచ్చారు.

ఖమ్మం

ఖమ్మం జిల్లా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలపై ఫిర్యాదుల వెళ్ళువ

పున్నమి Daily ఖమ్మం T.రవీందర్ ఈరోజు ఖమ్మం కలెక్టర్ గారికి మరియు ఏసిపి గారికి వినతిపత్రం :- గత రెండు రోజుల కింద ఖమ్మం నగరంలో వివిధ రాజకీయ పార్టీలు చేపట్టిన ఇజ్రాయిల్ హమాస్ పై చేస్తున్న దాడులను నిరసిస్తూ. హమాస్ అనుకూల ర్యాలీలో వివిధ స్కూలు పిల్లలను ర్యాలీలో పాల్గొనేలా చేసిన ప్రైవేట్ స్కూలు యాజమాన్యాలపై చర్య తీసుకోవాలని, ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు మరియు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు కలిసి ఖమ్మం జిల్లా కలెక్టర్ గారికి మరియు ఏసిపి గారికి వినతి పత్రం ఇచ్చారు.

ఎలూరు

పోలవరం నియోజకవర్గం జనసేన మండల అధ్యక్షులతో ఎమ్మెల్యే చిరు బాలరాజు భేటీ

పోలవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం తేదీ: 11/08/2025 (సోమవారం) పోలవరం నియోజకవర్గంలోని జనసేన మండల అధ్యక్షులతో పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు గారు సోమవారం బర్రింకలపాడు క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్ గారు, నియోజకవర్గంలోని అన్ని మండల అధ్యక్షులు పాల్గొన్నారు. సమావేశంలో పార్టీ బలోపేతానికి సంబంధించిన కీలక అంశాలు, ప్రతి మండలంలో జరుగుతున్న పార్టీ కార్యకలాపాల ప్రగతి, ప్రజా సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన తక్షణ చర్యలు విస్తృతంగా చర్చించారు. ఎమ్మెల్యే చిరి బాలరాజు గారు మండల అధ్యక్షులకు తమ పరిధిలో పార్టీ విస్తరణకు కృషి చేయాలని, గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు కూటమి ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను వేగంగా అమలు చేస్తున్నామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభవ, వృద్ధాప్య పెన్షన్ల పెంపు, రైతులకు సమయానికి నాణ్యమైన విత్తనాల పంపిణీ వంటి పథకాలతో ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తెచ్చే పనిలో ఉన్నామని తెలిపారు. అలాగే నియోజకవర్గంలోని అభివృద్ధి పనులపై సమీక్షిస్తూ, రహదారులు, తాగునీటి సదుపాయాలు, విద్య, ఆరోగ్య రంగాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ కృషి చేస్తోందని అన్నారు. ప్రతి మండల అధ్యక్షుడు స్థానిక సమస్యలను క్రమం తప్పకుండా తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారం కోసం తక్షణ చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. సమావేశం చివర్లో మండల అధ్యక్షులు తమ మండలాల్లో ప్రజల నుండి అందిన సమస్యలు, అభ్యర్థనలు వివరించగా, ఎమ్మెల్యే వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులను ఆదేశించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.