Monday, 11 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

దేశ ప్రధానిని కలిసిన ఎంపీ వేమిరెడ్డి

న్యూఢిల్లీ: దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయానికి ఇతర ఎంపీలతో కలిసి వెళ్లిన వేమిరెడ్డి, ఈ సందర్భంగా మోడీని శాలువాతో సత్కరించారు.

అన్నమయ్య

స్పందన అర్జీలను పరిష్కరించండి : జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్

స్పందన అర్జీలను నాణ్యతతో పరిష్కరించడం పై అధికారులు ప్రత్యేక దృష్టితో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. రాయచోటి కలెక్టరేట్లోని స్పందన హాలులో సోమవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా అందిన ప్రజల సమస్యలను అత్యంత ప్రాధాన్యతతో బాధ్యతగా పరిష్కరించాలన్నారు.

ఆంధ్రప్రదేశ్

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం

తిరుమల తిరుపతి దేవస్థానము నందు శ్రీవారి దర్శనానికి 3 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుందని టిటిడి దేవస్థానం వారు సమాచారం ఇచ్చారు. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 82,628 మంది భక్తులు. టిటిడి దేవస్థానం నందు నీలాలు సమర్పించిన 30,505 మంది భక్తులు.హుండీ ఆదాయం రూ.3.73 కోట్లు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నాగులవెల్లటూరు లో భగవాన్ వెంకయ్య స్వామి 39వ ఆరాధన మహోత్సవం

చేజర్ల ఆగస్టు (పున్నమి ప్రతినిధి) చేజర్ల మండలం నాగులవెల్లటూరులో భగవాన్ శ్రీశ్రీ వెంకయ్య స్వామి 39వ ఆరాధన మహోత్సవ కార్యక్రమం సోమవారం ఘనంగా ప్రారంభమైంది.ఈ కార్యక్రమానికి సోమశిల ప్రాజెక్టు చైర్మన్ వేలూరు కేశవ చౌదరి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా కేశవ చౌదరి మాట్లాడుతూ,వెంకయ్య స్వామి వారి జన్మస్థలం,ఆయన నడయాడిన ఈ పవిత్ర ప్రదేశం కేవలం ఈ జిల్లాలోనే కాకుండా కడప జిల్లా వంటి ప్రాంతాల నుంచి కూడా భక్తులను ఆకర్షిస్తోందని తెలిపారు.ప్రతి సంవత్సరం ఎంతో భక్తిశ్రద్ధలతో ఆరాధన మహోత్సవాలను నిర్వహిస్తున్నామని,తాను ఆలయ కమిటీ చైర్మన్‌గా సేవలందిస్తున్నానని పేర్కొన్నారు.అదేవిధంగా స్వామి వారి కరుణాకటాక్షం వలననే తాను డిసెంబర్ నుంచి సోమశిల ప్రాజెక్టు చైర్మన్‌గా నియమితులయ్యానని,ఈ అదృష్టం పూర్తిగా ఆయన ఆశీస్సుల ఫలితమేనని ఆయన తెలిపారు.ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ,భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్నీ సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు.కార్యక్రమంలో భక్తులు నిర్వహించిన భజన కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత ఉత్సాహపరిచింది.భక్తులు తీర్థప్రసాదాలను స్వీకరించి ఆనందం వ్యక్తం చేశారు. అన్నదాన కార్యక్రమంలో మహిళలు సహా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జాతీయ నులిపురుగులు నివారణ కార్యక్రమము

తేది 12-8-2025 న జరుగు జాతీయ నులిపురుగులు నివారణ కార్యక్రమములో భాగము లో తేది 11-8-2025 న సీతారామపురం MDO ఆఫీస్ నందు MDO గారి అధ్యక్షతన కన్వర్ షన్ మీటింగ్ జరిగినది. మీటింగ్ నందు మండల విద్యా శాఖధికారి, మండలం రెవిన్యూ అధికారి, మెడికల్ ఆఫీసర్ గారు పాల్గొన్నారు. మండలము లోని 42 GOVT స్కూల్స్, 3 ప్రైవేట్ స్కూల్స్, 42 అంగనవాడి స్కూల్స్ లోని 3504 మంది పిల్లలు, విద్యార్థులకు రేపు 12-8–2025 న ఈ DEWORMING ప్రోగ్రాము 100 శాతం పూర్తి చేయవలెను అని చర్చించడము జరిగినది. ప్రవేట్ స్కూల్ యాజమాన్యలకు ఈ DEWORMING ప్రోగ్రాము సక్సెస్ చేయుటకు విద్యార్థుల పేరెంట్స్ కు మెసేజ్ పంపవలసినదిగా ఆదేశించారు. ఈ ALBENDA జోలు టాబ్లెట్స్ తీసుకోవడము వలన విద్యార్థులలో రక్తహీ నత నివారణ జరుగును. మరియు చదువు మీద ఏకా గ్రత పెరుగును.తర్వాత ఈ ప్రోగ్రాము పోస్టర్స్ ఆవిష్కరణ కార్య క్రమము జరిగినది. MPDO సీతారామపురం మండలం.

ఆంధ్రప్రదేశ్

నరసన్నపేటలో మెగా జాబ్ మేళా

నరసన్నపేట పట్టణంలోని సత్యవరం జంక్షన్ సమీపంలోని పద్మావతి కళాశాల ఆవరణలో రేపు (మంగళవారం) మెగా జాబ్ మేళా జరగనుంది. రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మేళాలో 15 ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ దుర్గాప్రసాద్ తెలిపారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి హాజరుకానున్నారు.

తెలంగాణ పెద్దపల్లి

గుంజపడుగు: పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు

మంథని, ఆగస్టు 11, పున్నమి ప్రతినిధి: రైతులను బలోపేతం చేసే దిశగా సంక్షేమ కార్యక్రమాల అమలుతో పాటు అనుబంధ రంగాల అభివృద్ధికి పటిష్ట చర్యలు చేపట్టామని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కోరారు. సోమవారం మంథని ప్రాంతంలో మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, కరీంనగర్ డిసిసిబి చైర్మన్ రవీందర్ రావు లతో కలిసి మంథని మండలం చిల్లపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో దాదాపు 7 కోట్ల రూపాయలతో 5 ఎకరాల స్థలంలో నిర్మిస్తున్న రెండు గోదాములకు, గుంజపడుగు గ్రామంలో 2 కోట్ల 90 లక్షల రూపాయలతో పీఎం కుసుమ్ ద్వారా ప్యాక్స్ ఏర్పాటు చేయనున్న సోలార్ పవర్ ప్లాంట్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మంథని ఆధ్వర్యంలో గుంజపడుగు శివారులో పి.ఎం కుసుమ్ క్రింద 3.5 కోట్ల రూపాయలతో 1 మెగా వాట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు శంకుస్థాపన చేసుకున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా మన పెద్దపల్లి జిల్లాలో నంది మేడారం, కాల్వ శ్రీరాంపూర్, అప్పన్న పేట, మంథని ప్రాంతాలలో 1 మెగా వాట్ చోప్పున ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. 4 నెలల కాలంలో ఈ విద్యుత్ ప్లాంట్ నిర్మాణం, గ్రిడ్ కనెక్షన్ పనులు పూర్తి చేయాలని అన్నారు. చిల్లపల్లి గ్రామంలో 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాము లను 7 కోట్ల రూపాయలతో చేపట్టామని అన్నారు. గుంజపడుగు ప్రాంతంలో సహకార బ్యాంక్ ఏర్పాటుకు ప్రతిపాదనలు ఆర్.బి.ఐ కు పంపాలని మంత్రి సూచించారు. సహకార శాఖ లో 20 సంవత్సరాల కాలంగా తన వంతు కృషి చేస్తున్న కరీంనగర్ డిసిసిబి చైర్మన్ కు అభినందనలు తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో ఉండే రైతు సోదరులకు సన్న వడ్లకు 500 రూపాయల బోనస్, 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా వంటి అనేక పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. రైతు సంక్షేమ కార్యక్రమాలతో పాటు అనుబంధ రంగాలైన గోదాముల నిర్మాణం, పి.ఏ.సి.ఎస్ ద్వారా సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు లాంటి కార్యక్రమాల వల్ల రైతులను బలోపేతం చేయడం జరుగుతుందని అన్నారు. మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాల అమలులో స్థానిక ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ గౌడ్, మంథని వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, ఆర్డిఓ సురేష్, సహకార సంఘ అధ్యక్షులు శ్రీనివాస్, తహశీల్దార్, ఎంపీడీఓ, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సీతారామపురం *ప్రభుత్వ కార్యాలయాలకు రక్షణ కరువు ?

సీతారామపురం* : *ప్రభుత్వ కార్యాలయాలకు రక్షణ కరువు ?* సీతారామపురం మండలం సచివాలయం. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రహరీ గోడలు లేక రక్షణకు కరువైంది దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కార్యాలయంలో విలువైన రికార్డులు ఉంటాయి. వాటిని పరిరక్షించేలా చుట్టు ప్రహరీలో నిర్మించి భద్రత చర్యలు చేపట్టాల్సి ఉంది. పోలీస్ స్టేషన్ మినహా తహసిల్దార్ ఆఫీస్ ప్రహరీ గోడ ఉన్న మెయిన్ గేటు లేదు. ఇకనైనా అధికారులు దృష్టి సాధించాల్సి ఉంది అని పలువురు ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తిరుపతి

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రికి ఘన స్వాగతం

కోడూరు మార్కెట్ యార్డు చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి మరియు జనసేన పార్టీ పీఏసీ అధ్యక్షులు శ్రీ నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా, జనసేన పార్టీ చిత్తూరు జిల్లా కార్యదర్శి శ్రీ కొట్టేసాయి నాదెండ్ల మనోహర్ ని మర్యాదపూర్వకంగా కలిసి, పార్టీ కార్యకలాపాలు మరియు స్థానిక అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గరికపాటి చంద్ర చిరంజీవి,మహిళా నాయకురాలు శ్రీమతి కవిత,లీలాధర్ తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.