Monday, 11 May 2026

Blog

ఖమ్మం

నేడు ప్రయివేట్ విద్యాసంస్థల తీరుని నిరసిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారికి పిర్యాదు చెయ్యనున్న బిజెపి బృందం

ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి) పాలస్తినా మద్దత్తు గా ఖమ్మం నగరరము లో కొన్ని రాజకీయ పార్టీలు, మత వాదులు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అయితే ఈ ర్యాలీ లో నగరము లో ని పాఠశాల ల విద్యార్థులు మరియు NCC, NSS వాలంటీర్లు ఈ ర్యాలీ లో పాల్గొనడం పట్ల దీనిని ప్రశ్నిస్తూ నేడు ఖమ్మం జిల్లా బిజెపి శ్రేణులు జిల్లా విద్యాశాఖ అధికారిని కి వినతి పత్రం సమర్పించే కార్యక్రమం నేడు జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ని విజయవంతం చెయ్యాలి అని బిజెపి జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు, జిల్లా బిజెపి ఏద్యుకేషన్ల్ సెల్ కన్వీనర్ ఆచంటి కోటేశ్వరరావు ఖమ్మం టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ, లు విజ్ఞప్తి చేశారు

ఆంధ్రప్రదేశ్

రక్షాబంధన్ సందర్భంగా సోదరి కిడ్నీ దానం – ఆదర్శంగా నిలిచిన తిరుపతమ్మ

శ్రీకాకుళం: రక్షాబంధన్ పర్వదినం సోదర–సోదరీల మధ్య ప్రేమ, అనుబంధానికి ప్రతీక. ఈ బంధానికి ఆదర్శంగా నిలిచే సంఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. నరసన్నపేట మండలం బడ్డవానిపేటకు చెందిన తిరుపతమ్మ, తన తమ్ముడు వజ్జ ప్రసాదరావుకు కిడ్నీలు పనిచేయకపోవడంతో, తన కిడ్నీలో ఒకదానిని దానం చేసింది.2011లో ప్రసాదరావు కిడ్నీలు దెబ్బతిన్నాయని వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యులెవరైనా కిడ్నీ దానం చేస్తేనే ఆయన ప్రాణాలు కాపాడవచ్చని డాక్టర్లు సూచించగా, తిరుపతమ్మ ముందుకు వచ్చి దానం చేసింది. ఆపరేషన్ విజయవంతం కావడంతో ప్రస్తుతం ప్రసాదరావు భార్యా పిల్లలతో సుఖంగా జీవిస్తున్నాడు. ఈ సంఘటన రక్షాబంధన్ స్ఫూర్తిని ప్రతిబింబించే ఉదాహరణగా నిలిచింది.

ఆంధ్రప్రదేశ్

విజయవాడ రైల్వే స్టేషన్‌లో మెడికల్ ఎమర్జెన్సీ సెంటర్ ఏర్పాటు

విజయవాడ రైల్వే స్టేషన్‌ 1వ నంబర్ ప్లాట్‌ఫారమ్ వద్ద “ఆంధ్ర హాస్పిటల్స్ మెడికల్ ఎమర్జెన్సీ సెంటర్” ను ఏర్పాటు చేశారు. రైలు ప్రయాణంలో విజయవాడ మీదుగా వెళ్తున్న ప్రయాణికులకు ఆకస్మికంగా ఆరోగ్య సమస్యలు ఎదురైతే, వెంటనే 7396222675 నంబర్‌కు కాల్ చేయవచ్చు.సమాచారం అందుకున్న వెంటనే వైద్య బృందం, రైలు విజయవాడ రైల్వే స్టేషన్ చేరుకునే సమయానికి, సంబంధిత కోచ్ మరియు బెర్త్ వద్దకు చేరుకొని అత్యవసర చికిత్స అందిస్తుంది. ఈ సదుపాయం ప్రయాణికుల ప్రాణ రక్షణలో కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు తెలిపారు.

అన్నమయ్య

మార్కెట్ యార్డ్ కమిటీలో టిడిపి, జనసేన డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం

వ్యవసాయ మార్కెట్ యార్డులో కమిటీలో చిట్వేలి మండలానికి చెందిన ఇద్దరు డైరెక్టర్లు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టిడిపికి చెందిన బొచ్చు రామచంద్ర యాదవ్, జనసేన కు చెందిన తుపాకుల పెంచలయ్య కు అవకాశం ఇస్తూ మార్కెట్ యార్డ్ డైరెక్టర్లుగా నియమించారు. ఈ సందర్భంగా తుపాకుల పెంచలయ్య మాట్లాడుతూ ఈ అవకాశం కల్పించిన టిడిపి, జనసేన ఇన్చార్జిలకు మరియు ప్రతిపాదించిన నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ మండలానికి తమవంతు రైతులకు సహకారాలు అందిస్తామని, తమ గొంతు మార్కెట్ యార్డ్ నందు వినిపించేందుకు అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి మా మీద నమ్మకం పెట్టుకున్న వారికి నమ్మకాన్ని మమ్ము చేయకుండా వారు నమ్మకం నిలబెట్టుకుంటామని ఈ సందర్భంగా వారు తెలియపరచారు. రైతుకు ఎప్పుడు అందుబాటులో ఉంటామని కష్టాలు ఏదైనా సరే వారి పనిచేస్తామని తెలియపరచారు. అనంతరం బొచ్చు రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ రైతుల సంక్షేమం, మార్కెట్ సదుపాయాల అభివృద్ధి, పారదర్శకమైన కొనుగోలు-అమ్మకపు విధానాలకు ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు. రైతులకు న్యాయమైన ధర అందించడమే తన ప్రధాన లక్ష్యమని, మార్కెట్ యార్డ్‌లో ఆధునిక సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఖమ్మం

వర్షాలకాలం లో ప్రజలు ఇబ్బంది పడకుండ చూడండి మహా ప్రభో

ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి ) వర్షాకాలం వచ్చిందంటే ఖమ్మం నగర ప్రజలు భయపడుతున్నారు. వర్షాల వల్ల డ్రైనేజీ లు పొంగి వాటి లోని మురుగు నీరు రోడ్ల మీద ప్రవహింస్తుంటే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే మున్నేరు పోయిన ఏడాది పొంగి దాని పరివాహక ప్రాంతల్లో తీవ్రంగా నష్టపరిచింది. ధన, వస్తు ప్రాణ నష్టం సం భవించాయి. మళ్ళి ఈ సంవత్సరము కూడా వర్షా కాలం ప్రారంభం అవుతున్న తరుణం లో ప్రజలు అధికారులకు ఈ వర్షా కాలం లో ఎటువంటి నష్టం జరగకుండా చూడాలి అని విజ్ఞప్తి చేస్తున్నారు

ఆంధ్రప్రదేశ్

ఆకలితో విలవిలలాడుతున్న అనాధ వ్యక్తికి భోజనం అందజేత..స్వగ్రామానికి చేరేందుకు సహకరించే యత్నం..చేస్తున్న సంగన యశ్వంత్ రెడ్డికి నేటిజన్ల ప్రశంసలు..!!

మర్రిపాడు,ఆగస్టు9,పున్నమి,ప్రతినిది: సమాజంలో రక్తసంబంధాలను సైతం పట్టించుకోకుండా ఎవరు ఎలా పోతే నాకేమీ లే అనుకుని జీవిస్తున్న మనుషుల మధ్య మన,తన అనే తారతమ్యం లేకుండా తన చేతనంత సహాయం చేసేందుకు ముందుకు వచ్చాడు ఒక యువకుడు.. వివరాల్లోకి వెళితే మర్రిపాడు మండల పరిధిలోని ఖాదర్ పూర్ గ్రామానికి చెందిన సంగన యశ్వంత్ రెడ్డి నెల్లూరు దగ్గర రాజుపాలెం ఇంజినీరింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం అభ్యసిస్తున్న నేపథ్యంలో తన సోదరుడు ఆత్మకూరు వద్ద చదువుతున్న పాఠశాలకు వెళ్లి చూసి నెల్లూరు కి తిరుగు ప్రయాణంలో బుచ్చి నెల్లూరు మధ్య లో ఓ అనాధ వ్యక్తి ఆకలితో ఆలమంటేస్తూ రోడ్డు పక్కన పడి ఉన్న వ్యక్తిని గమనించి త్రాగునీరు అందించి స్వయంగా హోటల్ కి వెళ్లి భోజనం తెచ్చి దగ్గరుండి తినిపించి తన యోగ క్షేమాలను అడిగి తెలుసుకోగా ఆ వ్యక్తిది ఉదయగిరి నియోజకవర్గం అని ఉదయగిరి నుండి సీతారాంపురం పోయేమార్గం లో తన స్వగ్రామం అని తెలపగా ఆ వ్యక్తి స్వగ్రామానికి చేరుకునేందుకు యశ్వంత్ రెడ్డి సహకరిస్తామని తెలపగా ఆ వ్యక్తి తన ఇంటి చేతులు ఎత్తి చిన్నవాడివైపోయావు నీ పాదాలకు నమస్కారం తెలిపిన సన్నివేశం చూపరులను కట్టిపడేసింది. ఈ వీడియో సోషల్ మీడియా మాధ్యమాలలో చక్కర్ల కొడుతున్నా నే పద్యంలో మానవత్వం చూపేందుకు వయసక్కర్లేదు అని అదేవిదంగా మంచి సంస్కారంతో కూడిన పెంపకంతో పెంచిన వారి యొక్క తల్లిదండ్రులను పలువురు నెటిజన్లు యశ్వంత్ రెడ్డిని ప్రశంసల వర్షంతో ముంచేత్తారు..

కడప

ఒంటిమిట్ట ప్రజలతో మమేకమైన ముక్కా రూపానంద రెడ్డి – ప్రచారానికి కొత్త ఊపు

ఒంటిమిట్ట ఆగస్టు పున్నమి ప్రతినిధి టీడీపీ పార్టీ అభ్యర్థి అద్దులూరి ముద్దుకృష్ణారెడ్డి గెలుపుకోసం మినిస్టర్ ఫరూఖ్ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లా రావు, వేమన సతీష్ కలిసి ప్రచారం చేసిన ఇంచార్జ్ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి జెడ్పీటీసీ ఎన్నికలపై ఒంటిమిట్ట గెస్ట్ హౌస్ లో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ,మినిస్టర్ ఫరూఖ్ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు భేటీ అయిన ఇంచార్జ్ ముక్కారూపానందరెడ్డి రాజంపేటనియోజకవర్గంలో జెడ్పీటీసీ అభ్యర్థి అద్దులూరి ముద్దుకృష్ణారెడ్డి గెలుపు కోసం టీడీపీ కూటమి నాయకులు కసిగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి మినిస్టర్ ఫరూఖ్ పత్తిపాటి పుల్లా రావు మరియు వేమన సతీష్ ప్రజల్లోకి వెళ్లి, ఓటర్లను కలిసి మద్దతు కోరారు.ఒంటిమిట్ట పట్టణ ప్రాంతంలో మినిస్టర్ ఫరూఖ్ గారు,ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లా రావు గారు మరియు వేమన సతీష్ గారితో పర్యటించిన ముక్కా రూపానంద రెడ్డి ప్రజలతో మమేకమై టీ షాపులో టీ తాగి, బజ్జీ షాప్ వద్ద బజ్జీలు ఆస్వాదించారు. అంతేకాదు కూరగాయల మార్కెట్‌కి వెళ్లి అక్కడి వ్యాపారులతో చర్చించారు. ఈ పర్యటనలో ప్రజల సమస్యలను ఆప్యాయంగా విన్న ఆయన, అభివృద్ధి కోసం అద్దులూరి ముద్దుకృష్ణారెడ్డిని గెలిపించాలనికోరారు.అనంతరం ఒంటిమిట్ట గౌస్ట్ హౌస్ లో మంత్రి రాంప్రసాద్ రెడ్డి , మినిస్టర్ ఫరూఖ్ , పత్తిపాటి పుల్లారావు గారితో భేటీ అయిన ముక్కా రూపానంద రెడ్డి జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి పలు ముఖ్య విషయాలపై చర్చించారు. అభివృద్ధి ప్రణాళికలు, సంక్షేమ కార్యక్రమాలు, స్థానిక అవసరాలపై సమగ్ర చర్చ జరిగింది. ఈ కార్యక్రమం లొ ఎన్ డి ఏ కుటమి నాయుకులు, ప్రజలు పాల్కొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పెరుగుతున్న సోమశిల జలాశయం నీటిమట్టం

నెల్లూరు, ఆగష్టు 10, (పున్నమి ప్రతినిధి): ఎగువ నుంచి వస్తున్న కృష్ణా జలాలతో సోమశిల జలాశయం నీటిమట్టం పెరుగుతోంది. కృష్ణా జలాల రాకముందు 29 టీఎంసీలు నీరు నిల్వ ఉండగా ప్రస్తుతం 39 టీఎంసీలకు నీటిమట్టం చేరింది. కండలేరు జలాశయానికి వరద కాలువ ద్వారా 6వేల క్యూసెక్కులు, పెన్నా డెల్టాకు 3,600 క్యూసెక్కులు సరఫరా చేస్తున్నారు. ఎగువ నుంచి 16 వేల క్యూసెక్కుల ప్రవాహం సోమశిలకు వస్తోంది.

E-పేపర్

ఏపీఎస్ఆర్టీసీ లో డ్రైవర్ పోస్టుల భర్తీకి ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదు ఏపీఎస్ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి

ఏపీఎస్ఆర్టీసీ సంస్థలో డ్రైవర్ పోస్టుల భర్తీకి ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదని ఏపీఎస్ఆర్టీసీ నంద్యాల జిల్లా ప్రజా రవాణా అధికారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. డ్రైవర్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసినట్లు పర్సనల్ అధికారి తెలిపినట్లుగా ఒక దిన పత్రికలో వార్త ప్రచురితం కావడం జరిగిందన్నారు. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని.. పర్సనల్ అధికారి ఎలాంటి ప్రకటనను జారీ చేయలేదని, కావున ప్రజలు, నిరుద్యోగులు ఈ విషయాన్ని గమనించవలసినదిగా ఏపీఎస్ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

తిరుపతి

సారథ్యం సభను విజయవంతం చేద్దాం- మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి,బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు

12 వ తేదీ జరుగు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ సారథ్యం యాత్ర సభ ను విజయవంతం చేయడం కోసం జిల్లా ఉపాధ్యక్షులు,రేణిగుంట మండల ఇంచార్జీ మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి,అధ్యక్షులు పూజారి ప్రేమ్ కుమార్ రెడ్డి మరియు మాజీ అధ్యక్షురాలు జీపాలెం తేజోవతిల నాయకత్వంలో రేణిగుంట మండలం నందు వివిధ ప్రాంతాల్లో ఇంటి ఇంటికి వెళ్లి “సారథ్యం కరపత్రాలను”ఇచ్చి బీజేపీ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు, శ్రేయోభిలాషులను వ్యక్తంగా కలసి ఆప్యాయతగా ఆహ్వానం చేయడం జరిగినది. ఈ ప్రచార కార్యక్రమంలో బిజెపి నాయకులు,జీపాలెం కృష్ణా రెడ్డి, కండ్రిగ యాతీంద్ర రెడ్డి,ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.