Tuesday, 12 May 2026

Blog

తిరుపతి

శివయ్య సేవలో రాష్ట్ర ఎస్ఎస్ఏ ప్రాజెక్టు డైరెక్టరు.

ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన శ్రీకాళహస్తీశ్వరాలయానికి శనివారం సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టరు శ్రీనివాసరావు కుటుంబ సభ్యులతో కలసి విచ్చేసి శ్రీ జ్ఞానప్రసూన్నాంబిక దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.టీడీపీ సీనియర్ నేత లక్కమనేని మధుబాబు వారికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.అంతకు మనుపు వారు రుద్రాభిషేకంలో పాల్గొన్నారు.దర్శనానంతరం మృత్యుంజయస్వామి సన్నిధిలో ఆలయ పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. అదేవిధంగా స్వామి అమ్మవార్ల జ్ఞాపిక,తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు.

అనంతపురం

మా దేవుడు జెసి ప్రభాకర్ రెడ్డి అన్న ఆశీస్సులు ఉండాలని కోరుకున్నాం. పుట్టినరోజు శుభాకాంక్షలు రాయలచెరువు ఉపేంద్ర నాయుడు

మా ప్రభాకర్ రెడ్డి అన్న దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం.పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన నా ప్రియమైన మిత్రుడు. రాయల చెరువు ఉపేంద్ర నాయుడు. వాల్మీకి సేవా సంఘం అధ్యక్షుడు బుల్లెట్ లింగమయ్య పుష్ప నారాయణ రెడ్డి ఎస్సీ ఎస్టీ గంగరాజు బోడాయిపల్లి ఆది తాడపత్రి టౌన్ ప్రెసిడెంట్ చిన్న మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసినారు ఇలాగే 100 పుట్టినరోజులు చేసుకోవాలని మా మిత్రుడు అష్ట ఐశ్వర్యాలతో ఆ దేవుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ మరి మరి ఉండాలని కోరుకుంటున్నాం జై వాల్మీకి జై జై వాల్మీకి జై వాల్మీకి సేవాదళ్

అనంతపురం

కాయల. గౌతమ్ కాయల భవాని రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు

కాయల. గౌతమ్ కాయల భవాని రాఖీ పౌర్ణమి సందర్భంగా కాయలగౌతమ్ కు. అలాగే రాఖీ పండగలు మరల మరింత ఉత్సాహంతో జరుపుకోవాలని కోరుకుంటున్నాం భవాని డాడీ బుల్లెట్ లింగమయ్య ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని అలాగే వాల్మీకి సంఘం నుంచి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని అలాగే కుటుంబ సభ్యుల నుంచి కూడా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం వాల్మీకి సేవాదళ్ బుల్లెట్ లింగమయ్య పార్లమెంట్ అధ్యక్షుడు జై వాల్మీకి వాల్మీకి జై జై రాఖీ పండుగ అందరూ హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం వాల్మీకి సేవాదళ్ బుల్లెట్ లింగమయ్య

ఆంధ్రప్రదేశ్

ఒంటిమిట్ట అభివృద్ధి ప్రజల చేతుల్లోనే : చమర్తి

ఒంటిమిట్ట అభివృద్ధి ప్రజల చేతుల్లోనే ఉందని,మీ అభివృద్ధి కి మీరు వేసే ఓటు బాటలు వేస్తుందని రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు తెలియజేశారు. శనివారం రాచగుడిపల్లి గ్రామపంచాయతీ సీతాపురం లో సీతాపురంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా రాజంపేట పార్లమెంట్ ఇంచార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు గారికి సీతాపురం ప్రజలు ఘన స్వాగతం పలికి వారికి దుశ్యాలువా కప్పి సన్మానించడం జరిగినది. అనంతరం చమర్తి ఇంటింటి ప్రచారంలో ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు పథకాల గురించి వివరించారు. ఒంటిమిట్ట మండలంలో 12వ తేదీన జరగబోయే జెడ్పిటిసి ఎన్నికలలో కూటమి ప్రభు తరఫున పోటీ చేస్తున్న ముద్దుకృష్ణారెడ్డిని ప్రజలు సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం ముఖ్య నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

అన్నమయ్య

చిట్వేలి మండలం టౌన్ పరిధిలో సింగమల వీధి లో చాపలు పట్టడానికి ప్రభుత్వం సిద్ధం కావాలి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ

చిట్వేలి ఆగస్టు ( పున్నమి ప్రతినిధి) భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ చిట్వేలిమండల సమితి ఆధ్వర్యంలో సింగమాల వీధి లో పరిశీలన చేసి చుట్టుపక్కల ఉన్న ప్రజలతో చర్చించడం జరిగినది ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రైల్వే కోడూరు నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య . సిపిఐ పార్టీ చిట్వేలి మండల కౌన్సిల్ సభ్యులు తిప్పన ప్రసాద్ మాట్లాడుతూ చిట్వేలి మండలం అంటే ఒక చరిత్ర కలిగినటువంటి మండలం ఈ మండల పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ గా మేము పరిశీలనకు పొగ సింగమాల వీధిలో దాదాపు రోడ్డు ఇరువైపులా వందల ఇళ్ళులు ఉన్నాయి అక్కడ చిన్నపిల్లలు. ముసలివారు. వర్షం వచ్చిన తర్వాత ఇండ్లలో నుండి బయటకు రావాలంటే భయం భయం భయం గా భయ ప్రాంతానికి గురవుతూ పిల్లలు బడికి పోవాలన్న వర్షం వచ్చిన రోజున పిల్లల పూర్తిగా నీటిలో మునిగి పోవాల్సిన పరిస్థితి ఉంటుంది అదేవిధంగా ముసలివారు రోడ్డుమీదికి రావాలన్నా కూడా ఆసుపత్రికి పోవాలన్నా కూడా ఈ నీటిలో అడుగుపెట్టిన జారీ ప్రమాదం జరుగుతున్నది అక్కడ ఉన్న విద్యార్థులు పెద్దవారు అందరూ చెబుతున్నారు అని అన్నారు ఈ మధ్యకాలంలో కూడా ఒక అవ్వ జారి కింద పడి హాస్పటల్ పాలు అయిందని స్వయంగా ఆమె చెబుతున్నదని అన్నారు . ఇప్పటికే ఎన్నో ప్రభుత్వాలు మారినా కూడా ఎంతమంది అధికారులు మారినా కూడా సింగమల వీధి పరిస్థితి మురికి కాలవ ఉన్నట్లు ఉన్నది ఈ మురికి నీటి వలన విష పురుగులు. మరియు దోమలు కుట్టిన వారు ఎంతోమంది ఆసుపత్రిపాలై వేలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఎన్నో అగసాట్లు పడుతున్నటువంటి సందర్భం ఉందని అన్నారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వారు గమనించి సింగమాల వీధి పనులను వెంటనే ప్రారంభించి అక్కడే ఉన్నటువంటి ప్రజలను ప్రమాదాల నుండి. విష పురుగుల నుండి కాపాడవలసిందిగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ గా మరియు సింగమల వీధిలో ఉన్న గ్రామ ప్రజలు తరపున కోరుకుంటున్నాము లేని పక్షాన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలను అందరిని కలుపుకొని తాసిల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమం చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం ఈ కార్యక్రమంలో సింగమాల వీధిలో ఉన్న ప్రజలు పాల్గొన్నారు

E-పేపర్

ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు

సిద్దవటం మండలంలోని బొగ్గిడివారి పల్లె గ్రామ సచివాలయంలో తిరుపతి పట్టణం లోని రమాదేవి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సహకారంతో టిడిపి నేత రాష్ట్ర పంచాయతీ రాజ్ ఛాంబర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కుప్పాల వెంకటసుబ్బయ్య ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా శనివారం డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ ఉచిత మెగా వైద్య శిబిరంలో పేషెంట్లు దాదాపు 75 మంది కి చికిత్స సేవలు అందించామని మా వైద్యశాలలో ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా చికిత్స సేవలు అందిస్తామని బొగ్గిడి వారి పల్లె, నే క నా పురం, చాముండేశ్వరి పేట గ్రామాలకు చెందిన వివిధ ఆరోగ్య సమస్యతో బాధపడే 10 మంది పేషెంట్లను ఉచిత ట్రావెల్స్ సౌకర్యం ఏర్పాటు చేసి చికిత్స సేవలకు తరలిస్తున్నామని అన్నారు వైద్య శిబిరం ఏర్పాటుకు అన్ని విధాల సహకరించిన టిడిపి నేత కుప్పాల వెంకటసుబ్బయ్యకు వైద్య సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు

E-పేపర్

అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్ : కమాండెంట్

అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్ అని కమాండెంట్ కే.ఆనంద రెడ్డి అన్నారు.సిద్ధవటం మండలం బాకరాపేట సమీపంలో ఉన్న APSP 11వ పోలీస్ బెటాలియన్లో శనివారం రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి నేషనల్ హైవే అథారిటీ కి సంబంధించిన అమ్రిత్ గౌతమ్,త్రిప్తా గౌతమ్ హాజరయ్యారై బెటాలియన్ పోలీసులకు రాఖీలు కట్టారు.కమాండెంట్ మాట్లాడుతూ.. అన్నా చెల్లెల అనుబంధాన్ని తెలిపే రాఖీ పండుగ చాలా గొప్పదని చెప్పారు.

ఖమ్మం

*పాలస్తీనా కి మద్దత్తు గా ఎన్ సి సి మరియు ఎన్ ఎస్ ఎస్ వారితో ర్యాలీ తీయియించడం ఏంటి*

ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి ) ఎన్ ఎస్ ఎస్, ఎన్ సి సి వారితో యూనిఫామ్ లో పాలిస్తీనా కు మద్దతుగా ర్యాలీలు తీపించిన ఖమ్మంలో కొన్ని స్కూల్ యాజమాన్యాల పై ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారి తక్షణమే చర్యలు తీసుకోవాలని జాతీయ వాదులు డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ర్యాలీ కార్యక్రమం కు పిలుపు నిచ్చిందా, స్కూల్ పిల్లలతో బలవంతంగా ర్యాలీలు తీపించే హక్కు స్కూల్ యాజమాన్యాలకు ఉందా ? యాజమాన్యాలు మతపరమైన ర్యాలీల కోసం స్కూలు పిల్లలను వాడుకోవడం ఎంతవరకు సమంజసం అని పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్కూలు యొక్క యాజమాన్యం ఆగడాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత జిల్లా విద్యాశాఖ Childhood జిల్లా కలెక్టర్ పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేస్తున్నారు.

E-పేపర్

టిడిపి అభ్యర్థిని అఖండ మెజారిటీతో గెలిపించండి

జడ్పిటిసి ఉప ఎన్నికల సందర్భంగా టిడిపి అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించాలని టిడిపి సీనియర్ నేత కాడే చెంచయ్య నాయుడు ప్రజలను కోరారు.రాజంపేట టిడిపి పార్లమెంటు ఇంచార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో శనివారం ఒంటిమిట్ట మండల పరిధిలోని కొత్త మాధవరంలో జడ్పిటిసి అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డికి మద్దతుగా సిద్ధవటం మండల టిడిపి నేతలు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు.టిడిపి ప్రభుత్వం అభివృద్ధి పనులను వివరించారు. సైకిల్ గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి వేయించి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కాడే శ్రీనివాసులు నాయుడు,రాజశేఖర్ యాదవ్, మల్లు వెంకటసుబ్బారెడ్డి,వంతాటి పల్లె సుబ్బారెడ్డి,ఎస్.రాజంపేట శ్రీనివాసరావు యాదవ్,నాగముని రెడ్డి,సిద్ధవటం మణికంఠ,జంగాలపల్లె శీను,ముద్దుకృష్ణా రెడ్డి,టక్కోలి శంకర్,తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

పులివెందులకు కృష్ణమ్మ నీళ్లు తెచ్చింది సీఎం చంద్రబాబు నాయుడే. * రఫ్ఫా రఫ్ఫా రాజకీయ స్కూల్ ప్రిన్సిపాల్ బెంగళూరుకు మకాం. * పులివెందుల జడ్ పి టి సి ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గెలుపు ఖాయం. * పులివెందుల టీడీపీ జడ్ పి టి సి అభ్యర్థి కోసం నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఎన్నికల ప్రచారం.

నంద్యాల, పున్నమి స్టాఫ్ రిపోర్టర్ ఆర్ ఎన్ రెడ్డి: ఉమ్మడి ప్రభుత్వం ఉన్నంతకాలం రాష్ట్రంలో వైసీపీ రౌడీ రాజకీయాలు ఇక సాగవని, కృష్ణానది నీరు పులివెందులకు తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కిందని, రఫ్ఫా రఫ్ఫా రాజకీయ స్కూల్ ప్రిన్సిపాల్ జగన్ బెంగళూరుకు మకాం మార్చాడని, ఇక్కడి వైసీపీ తమ్ముళ్లు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని, వైసీపీ ఎన్ని ఆరాచకాలు, దౌర్జన్యాలు చేసినా పులివెందుల జడ్ పి టి సి ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గెలుపు ఖాయమని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి ధీమా వ్యక్తం చేశారు. శనివారం కడప జిల్లా పులివెందుల జడ్ పి టి సి ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గెలుపు కోసం ఆర్. తుమ్మలపల్లె గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ రఫ్ఫా రఫ్ఫా రాజకీయాలు చేసే స్కూల్ పెట్టిన ప్రిన్సిపాల్ జగన్ మకాం బెంగుళూరుకు మార్చాడనీ, ఇక్కడ ఉన్న ఆయన అనుచరులు, వైసీపీ నాయకులకు దిక్కుతోచక ఏదేదో చేస్తున్నారన్నారు. దాడిలో గాయపడితే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాల్సిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ జగన్ మామ గంగిరెడ్డి ఆసుపత్రికి ఎందుకు వెళ్లారని, ఊరూరా సాక్షి లైవ్ వాహనాలు దింపారు ఎందుకనీ, వాళ్లను మేము ఏమైనా చేస్తే ఇష్యూ చేయాలనా అని ఎంపీ డాక్టర్ బైరెడ్డి నిలదీశారు. టీడీపీ ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలలో పోటీ చేస్తోందని, పులివెందుల జడ్ పి టి సి ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గెలిచి తీరుతుందనీ ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ధీమా వ్యక్తం చేశారు. 2019 ఎన్నికప్పుడు సొంత చిన్నాన్ననే హత్య చేశారనీ, ఇలాంటి వాళ్ళు దౌర్జన్యాలు, దాడులు కాక ఇంకేం చేస్తారనీ ఆమె మండిపడ్డారు. ఈ ప్రచారంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహాక కార్యదర్శి డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి, పులివెందుల టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.