Tuesday, 12 May 2026

Blog

E-పేపర్

టిడిపి అభ్యర్థిని అఖండ మెజారిటీతో గెలిపించండి

జడ్పిటిసి ఉప ఎన్నికల సందర్భంగా టిడిపి అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించాలని టిడిపి సీనియర్ నేత కాడే చెంచయ్య నాయుడు ప్రజలను కోరారు.రాజంపేట టిడిపి పార్లమెంటు ఇంచార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో శనివారం ఒంటిమిట్ట మండల పరిధిలోని కొత్త మాధవరంలో జడ్పిటిసి అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డికి మద్దతుగా సిద్ధవటం మండల టిడిపి నేతలు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు.టిడిపి ప్రభుత్వం అభివృద్ధి పనులను వివరించారు. సైకిల్ గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి వేయించి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కాడే శ్రీనివాసులు నాయుడు,రాజశేఖర్ యాదవ్, మల్లు వెంకటసుబ్బారెడ్డి,వంతాటి పల్లె సుబ్బారెడ్డి,ఎస్.రాజంపేట శ్రీనివాసరావు యాదవ్,నాగముని రెడ్డి,సిద్ధవటం మణికంఠ,జంగాలపల్లె శీను,ముద్దుకృష్ణా రెడ్డి,టక్కోలి శంకర్,తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

పులివెందులకు కృష్ణమ్మ నీళ్లు తెచ్చింది సీఎం చంద్రబాబు నాయుడే. * రఫ్ఫా రఫ్ఫా రాజకీయ స్కూల్ ప్రిన్సిపాల్ బెంగళూరుకు మకాం. * పులివెందుల జడ్ పి టి సి ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గెలుపు ఖాయం. * పులివెందుల టీడీపీ జడ్ పి టి సి అభ్యర్థి కోసం నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఎన్నికల ప్రచారం.

నంద్యాల, పున్నమి స్టాఫ్ రిపోర్టర్ ఆర్ ఎన్ రెడ్డి: ఉమ్మడి ప్రభుత్వం ఉన్నంతకాలం రాష్ట్రంలో వైసీపీ రౌడీ రాజకీయాలు ఇక సాగవని, కృష్ణానది నీరు పులివెందులకు తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కిందని, రఫ్ఫా రఫ్ఫా రాజకీయ స్కూల్ ప్రిన్సిపాల్ జగన్ బెంగళూరుకు మకాం మార్చాడని, ఇక్కడి వైసీపీ తమ్ముళ్లు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని, వైసీపీ ఎన్ని ఆరాచకాలు, దౌర్జన్యాలు చేసినా పులివెందుల జడ్ పి టి సి ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గెలుపు ఖాయమని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి ధీమా వ్యక్తం చేశారు. శనివారం కడప జిల్లా పులివెందుల జడ్ పి టి సి ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గెలుపు కోసం ఆర్. తుమ్మలపల్లె గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ రఫ్ఫా రఫ్ఫా రాజకీయాలు చేసే స్కూల్ పెట్టిన ప్రిన్సిపాల్ జగన్ మకాం బెంగుళూరుకు మార్చాడనీ, ఇక్కడ ఉన్న ఆయన అనుచరులు, వైసీపీ నాయకులకు దిక్కుతోచక ఏదేదో చేస్తున్నారన్నారు. దాడిలో గాయపడితే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాల్సిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ జగన్ మామ గంగిరెడ్డి ఆసుపత్రికి ఎందుకు వెళ్లారని, ఊరూరా సాక్షి లైవ్ వాహనాలు దింపారు ఎందుకనీ, వాళ్లను మేము ఏమైనా చేస్తే ఇష్యూ చేయాలనా అని ఎంపీ డాక్టర్ బైరెడ్డి నిలదీశారు. టీడీపీ ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలలో పోటీ చేస్తోందని, పులివెందుల జడ్ పి టి సి ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గెలిచి తీరుతుందనీ ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ధీమా వ్యక్తం చేశారు. 2019 ఎన్నికప్పుడు సొంత చిన్నాన్ననే హత్య చేశారనీ, ఇలాంటి వాళ్ళు దౌర్జన్యాలు, దాడులు కాక ఇంకేం చేస్తారనీ ఆమె మండిపడ్డారు. ఈ ప్రచారంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహాక కార్యదర్శి డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి, పులివెందుల టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

హైదరాబాద్

*రాష్ట్ర రాజధానిలో ఘనంగా రాఖీ వేడుకలు నిర్వహించిన మంత్రి సీతక్క*

పున్నమి ప్రతినిధి హైదరాబాద్ ఆగస్టు: “సోదరి సీతక్క” కు కృతజ్ఞతలు తెలియజేసిన ప్రముఖులు హైదరాబాద్, ఆగస్టు 9, 2025: తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క రాఖీ పండుగను రాష్ట్ర రాజధానిలో ఘనంగా జరిపారు. సోదర సోదరీమణుల అనుబంధాన్ని ప్రతిబింబించే ఈ పండుగ సందర్భంగా, సీతక్క స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, హైదరాబాదులో అందుబాటులో ఉన్న మంత్రులు, ప్రజా ప్రతినిధులు, కార్పొరేషన్ చైర్మన్లు, నేతల నివాసాలను సందర్శించారు. ప్రతి ఒక్కరి చేతికి రాఖీ కట్టి, స్వీట్లు తినిపించి పండుగ ఆనందాన్ని పంచుకున్నారు మంత్రి సీతక్క. నాయకులు తమ సొంత సోదరిగా భావించి సీతక్కను ఆప్యాయంగా ఆహ్వానించారు. రాఖీ కట్టించుకుంటూ “సోదరి సీతక్క” అంటూ ఆత్మీయంగా పలకరించి, ఆశీర్వాదాలు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. సీతక్క రాకతో సీఎం, మంత్రుల నివాసాలు సోదర భావంతో నిండిపోగా, పండుగ వాతావరణం మరింత ఉత్సాహంగా మారింది. ఈ సందర్బంగా సీతక్క “రాఖీ పండుగ మన మధ్య ఉన్న అనుబంధాలను మరింత బలపరుస్తుంది. ఇలాంటి సోదర భావం, పరస్పర గౌరవం ఎల్లప్పుడూ కొనసాగాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు. ఉదయం తన నివాసమైన ప్రజాభవన్‌కు విచ్చేసిన ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ కి మంత్రి సీతక్క రాఖీ కట్టి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తన నివాసం కి విచ్చేసిన నాయకులు, భద్రతా సిబ్బంది, వ్యక్తిగత సిబ్బందికి సీతక్క రాఖీలు కట్టి ఆశీర్వదించారు. ప్రజా పాలనలో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో వెలుగొందాలని ఆమె ఆకాంక్షించారు.

ఖమ్మం

బిజెపి రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ నివాసం లో రాఖీ పూర్ణిమ వేడుకలు :

ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి ) రాఖీ పూర్ణిమ వేడుకలు జిల్లా వ్యాప్తాముగా శనివారం ఘనంగా జరిగాయి. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ నివాసం లో ఆయనకు బిజెపి ఖమ్మం జిల్లా నాయకురాలు, శ్రీమతి పువ్వాడ ప్రవల్లిక, శ్రీమతి మంద సరస్వతి, రాష్ట్ర నాయకురాలు శ్రీమతి పమ్మి అనిత, అయన కి రాఖీ కట్టి వారి యొక్క ఆశీస్సులు పొందారు. ఈ సంధర్బముగా గల్లా సత్య నారాయణ మాట్లాడుతు అందరికి రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఖమ్మం

బిజెపి రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ నివాసం లో రాఖీ పూర్ణిమ వేడుకలు :

ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి ) రాఖీ పూర్ణిమ వేడుకలు జిల్లా వ్యాప్తాముగా శనివారం ఘనంగా జరిగాయి. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ నివాసం లో ఆయనకు బిజెపి ఖమ్మం జిల్లా నాయకురాలు, శ్రీమతి పువ్వాడ ప్రవల్లిక, శ్రీమతి మంద సరస్వతి, రాష్ట్ర నాయకురాలు శ్రీమతి పమ్మి అనిత, అయన కి రాఖీ కట్టి వారి యొక్క ఆశీస్సులు పొందారు. ఈ సంధర్బముగా గల్లా సత్య నారాయణ మాట్లాడుతు అందరికి రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు రాఖీ శుభాకాంక్షలు: అన్నగా రక్షణ హామీ

తెలుగింటి ఆడపడుచులకు సీఎం చంద్రబాబు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ‘అన్నా చెల్లెళ్ల అనుబంధానికి శుభసందర్భమే రాఖీ పర్వదినం. మీ కోసం నేనున్నాను. రాఖీ పౌర్ణమి మనందరికి ప్రత్యేకం. మీ అందరికి ఒక అన్నగా మీకు రక్షణ కల్పించే, మీ జీవితాల్లో వెలుగులు నింపే బాధ్యత నాది. ఆడబిడ్డల బాగుకోసం అహర్నిశలూ పని చేస్తా.’ అంటూ ట్వీట్ చేశారు.

ఆంధ్రప్రదేశ్

ఆదివాసీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: చంద్రబాబు

అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ సోదర సోదరీమణులందరికీ శుభాకాంక్షలు. ఏజెన్సీ ప్రాంతాలను మైదాన ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చేసి… ఆదివాసీల జీవితాల్లో వెలుగులు నింపాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. ఏడాది కాలంలో ఏజెన్సీ  ప్రాంతాల్లో అభివృద్ధి కోసం, వారి సంక్షేమం కోసం తీసుకున్న చర్యలను వివరించి…. రానున్న రోజుల్లో చేపట్టే కార్యక్రమాలపై వారితో చర్చించి నేడు నిర్ణయాలు ప్రకటిస్తాం. ఆదివాసీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలియజేస్తూ…. మరోసారి మీ అందరికీ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు.

ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ తెలంగాణ

ప్రజలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు

భారతీయ సంస్కృతిలో రాఖీ పండుగ రోజు అన్న, తమ్ములకు ఆడబిడ్డల ఆశీర్వాదం హైదరాబాద్, ఆగస్టు 09, పున్నమి ప్రతినిధి; రాఖీ, రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు. అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. రాఖీ అనగా రక్షణ బంధం. చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ. రాఖీపౌర్ణమి నాడు నిత్యపూజలు చేసి ఇంటిలో ఒక చోట ముగ్గు, పీట వేసి సోదరుడుని కూర్చోబెట్టి బొట్టు పెట్టి రాఖీ కట్టవలెను. మిఠాయిలు తినిపించవలెను. సోదరుడు కృతజ్ఞతగా తన సోదరికి ధనము, బట్టలు, నగలు గానీ కానుకగా ఇవ్వడం ఆచారం. పూర్వం దేవతలకు, రాక్షసులకు మధ్య పుష్కరకాలం యుద్ధం సాగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు తన పరివారమంతటినీ కూడగట్టుకొని అమరావతిలో తలదాచుకుంటాడు. భర్త నిస్సాహాయతను చూసిన ఇంద్రాణి తరుణోపాయం ఆలోచిస్తుంది. భర్త దేవేంద్రుడికి సమరం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది. సరిగ్గా ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను పూజించి రక్షాను దేవేంద్రుడి చేతికి కడుతుంది. అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలను తీసుకువచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు. సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. శచీదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనం.. నేడు రాఖీ పండుగగా ఆచారమైందని పురాణాలు చెబుతున్నాయి. ఇతిహాసాల ప్రకారం చూస్తే ద్రౌపది, శ్రీకృష్ణుడి కి అన్నాచెల్లెల అనుబంధం అత్యంత గొప్పగా కనిపిస్తుంది. శిశుపాలుడి ని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుందట. అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగు చింపి వేలికి కట్టు కట్టిందట. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు. అందుకు ప్రతిగా దుశ్శాసనుడి దురాగతం నుండి ఆమెను కాపాడుతాడు. శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తి కోరిక మేరకు అతనితోపాటు పాతాళంలో ఉండిపోతాడు. శ్రీమహాలక్ష్మి వెళ్లి బలిచక్రవర్తికి రక్షాబంధంకట్టి, తన భర్తను వైకుంఠానికి తీసుకొనిపోతుంది. అందుకే రక్షాబంధానికి ఇంత ప్రాధాన్యత ఏర్పడింది. యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః |తేన త్వామభి బధ్నామి రక్షమాచల మాచల || -పై శ్లోకాన్ని పఠిస్తూ సోదరి-సోదరునకు విజయ ప్రాప్తి కోసం సోదరుని ముంజేతికి రాఖీ కట్టవలెను. శ్రీ మహావిష్ణువు శక్తిచే మహాబలుడు అయిన బలిచక్రవర్తిని బంధించినట్లుగా, ఓ రక్షాబంధనమా ! నీవు చలించక వీనికి రక్షణ కల్పించుము అని పై శ్లోకం అర్దం.

యాదాద్రి భువనగిరి

భారత సేవా రత్న పురస్కారం -2025 అందుకున్న బుషపాక శివకుమార్ సేవా హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ భువనగిరి

యాదాద్రి భువనగిరి జిల్లా ఆగస్టు (పున్నమి ప్రతినిధి) యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరికి చెందిన సేవా హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న బుషపాక శివకుమార్ కు గాను భారత సేవా రత్న పురస్కారం ఎంపిక చేసి సత్కరించింది. శుక్రవారం హైదరాబాద్ లోని సూర్య కంప్లెక్ హాల్ అబిడ్స్ లో జరిగిన జాతీయ అవార్డుల “తాసుబెల్లి ఫౌండేషన్ చైర్మన్ డా: శంకర్ నాయుడు గారు మరియు వెంకట లక్ష్మి గారు రేఖ గార్ల చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. తాసుబెల్లి ఫౌండేషన్ చైర్మన్ డా: శంకర్ నాయుడు గారికి , వెంకట లక్ష్మి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అవార్డును నా తల్లిదండ్రులకు నా సంస్థ సభ్యులకు, దాతలు,రక్తదాతలు ,మిత్రులుకు శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరికి అంకితం చేస్తున్నాను. మీ అందరి మద్దతుతో ప్రేమ తో మరిన్ని మంచి సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తాము. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు …

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.