Tuesday, 12 May 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పేద విద్యార్థుల కోసం ఆర్ధిక సాయం

చేజర్ల గ్రామ రిటైర్డ్ టీచర్ లేట్ జి.శ్రీధర్ రావు ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి ధర్మపత్ని స్వర్ణగౌరీ ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచే పేద విద్యార్థులకు ప్రతి సంవత్సరం ప్రోత్సాహక బహుమతులు ఇచ్చేందుకు 50 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని యూటీఎఫ్ సీనియర్ నాయకులు ఏ.సుబ్బరత్నం ,యం. రవిబాబులకు ఆదివారం అందజేశారు. యు టి ఎఫ్ చేజర్ల మండల శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిరుపేద విద్యార్థుల పై చదువుల కోసం ఆర్థిక సహాయం అందించడం, మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదవ తరగతి విద్యార్థులందరికీ ప్రతి సంవత్సరం యుటిఎఫ్ ముద్రించిన మోడల్ టెస్ట్ పేపర్లు ఉచితంగా అందజేయడం వంటి కార్యక్రమాలతో పాటు ఎన్నో పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసి ఉన్నారు. స్వర్ణ గౌరీ గారు మండల శాఖకు అందించిన సహాయానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ మొత్తాన్ని కూడా పేద విద్యార్థుల కొరకు వెచ్చించడం జరుగుతుందని యు టి ఎఫ్ నాయకులు రవిబాబు, సుబ్బరత్నం, ఎన్ రమణయ్య ,ఆర్ వి. కృష్ణారెడ్డి, ఏ.సుబ్రహ్మణ్యం,ఏ వెంకటేశ్వర్లు, ఎన్. బుజ్జయ్య, మస్తాన్ బాషా తెలియజేశారు..

E-పేపర్

తెలంగాణ రైతు ధీమా –రైతు భీమా పధకం

నకిరేకల్ : ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి ) శాలిగౌరారం మండలంలోని కొత్త పట్టాదారు రైతులకు జూన్ 5,2025 వరకు పట్టాపాస్ బుక్ వచ్చిన వారికీ మరియు ఇంతవరకు రైతు భీమా చేసుకోని రైతులు మాత్రమే రైతు భీమా చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి కీర్తి గారు తెలిపారు. 14 ఆగస్ట్ 1966 నుండి –14ఆగస్ట్2007 మధ్యలో పుట్టిన రైతులు మాత్రమే రైతు భీమాకి అర్హులు. ఆధార్ కార్డులో 18 సంవత్సరం నుండి 59 సం. వయస్సు ఉన్న రైతులు మాత్రమే భీమా చేసుకోవాలి. రైతు భీమాకు దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన పత్రాలు : — 1.దరఖాస్తు ఫారం (పూర్తి వివరాలతో స్పష్టంగా నింపాలి.) 2.రైతు పట్టాదారు పాస్ బుక్, 3.రైతు ఆధార్ కార్డు జీరాక్స్, 4. నామిని ఆధార్ కార్డు. రైతు భీమాకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది— 13 ఆగస్ట్ 2025.

తెలంగాణ

దూపం చరణ్ కు రాఖీ కట్టిన పావని, లక్ష్మి ప్రియా, దేవి ప్రియ.

దూపం చరణ్ కు రాఖీ కట్టిన పావని, లక్ష్మి ప్రియా, దేవి ప్రియ. అన్న చెల్లెళ్ల అక్క తమ్ముళ్ల ఆత్మీయతకు ప్రతిరూపం రాఖీ పండుగ దూపం పావని. పున్నమి ప్రతినిధి: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెంట్ మండలం: రక్షాబంధన్ వేడుకను అక్కలు దూపం పావని(బూర్గుల రామకృష్ణారావు ఆయుర్వేద మెడికల్ కాలేజీకి చెందిన విద్యార్థిని), దూపం లక్ష్మీ ప్రియ, చెల్లెలు దూపం దేవి ప్రియ, తమ్ముడు దూపం చరణ్ కుటుంబ సభ్యులతో ఆదివారం రోజున తమ్ముడు దూపం చరణ్ గురుకుల పాఠశాలకు దగ్గరికి వెళ్లి రాఖీ కట్టారు. ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకుని రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్ళ అక్కతమ్ముళ్ల బంధానికి ప్రతిరూపంగా భావించే ఈ రాఖీ పండుగ సందర్భంగా అక్క తమ తమ్మునికి చెల్లెళ్లు తమ అన్నయ్యకు సంతోషంతో రాఖీలు కట్టి అన్న తమ్ముళ్లు ప్రేమతో ఆశీర్వాదం పొంది. రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నారు.

తెలంగాణ

దూపం చరణ్ కు రాఖీ కట్టిన పావని, లక్ష్మి ప్రియా, దేవి ప్రియ.

దూపం చరణ్ కు రాఖీ కట్టిన పావని, లక్ష్మి ప్రియా, దేవి ప్రియ. అన్న చెల్లెళ్ల అక్క తమ్ముళ్ల ఆత్మీయతకు ప్రతిరూపం రాఖీ పండుగ దూపం పావని. పున్నమి ప్రతినిధి: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెంట్ మండలం: రక్షాబంధన్ వేడుకను అక్కలు దూపం పావని(బూర్గుల రామకృష్ణారావు ఆయుర్వేద మెడికల్ కాలేజీకి చెందిన విద్యార్థిని), దూపం లక్ష్మీ ప్రియ, చెల్లెలు దూపం దేవి ప్రియ, తమ్ముడు దూపం చరణ్ కుటుంబ సభ్యులతో ఆదివారం రోజున తమ్ముడు దూపం చరణ్ గురుకుల పాఠశాలకు దగ్గరికి వెళ్లి రాఖీ కట్టారు. ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకుని రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్ళ అక్కతమ్ముళ్ల బంధానికి ప్రతిరూపంగా భావించే ఈ రాఖీ పండుగ సందర్భంగా అక్క తమ తమ్మునికి చెల్లెళ్లు తమ అన్నయ్యకు సంతోషంతో రాఖీలు కట్టి అన్న తమ్ముళ్లు ప్రేమతో ఆశీర్వాదం పొంది. రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నారు.

అన్నమయ్య

అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన బుల్లెట్ లింగమయ్య సైన్యం

దగ్గుపాటి వెంకటేశ్వరా ప్రసాద్ అనే నేను.అంటూ మొదలు పెట్టి.మీ ఇంటివద్దకే ఎమ్మెల్యే అంటూ. సుపరిపాలనలో తొలి అడుగు ధీటుగా వేసి, నాయకత్వానికి కొత్త అర్థం చెప్పుతూ, ప్రజా సమస్యల పరిష్కా రా మార్గాలను శోధిస్తూ… ప్రజా క్షేమమే ధ్యేయంగా, పార్టీ భవిష్యత్తు లక్ష్యంగా, ముందుకు నడుస్తూ, నడిపిస్తున్న…. మా దగ్గుపాటి ప్రసాద్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు. బుల్లెట్ లింగమయ్య వాల్మీకి సంఘం నాయకుడు. రైతు సంఘం పుష్ప నారాయణరెడ్డి ఆది ఎస్సీ ఎస్టీ గంగరాజు చిన్న వాల్మీకి రాజేష్ వాల్మీకి రామచంద్ర వాల్మీకి రాజేష్ వాల్మీకి రామకృష్ణ వాల్మీకి సురేష్ వాల్మీకి నరేష్ వాల్మీకి పెద్దిరాజు వాల్మీకి పుట్టినరోజు శుభాకాంక్షలుఘన స్వాగతం పలికిన అనంతపురం ఎమ్మెల్యే జై వాల్మీకి

అన్నమయ్య

మంగంపేట ఆర్ ఆర్ వన్ గ్రామంలో నూతన శ్రీ గణపతి ఆలయనికి భూమి పూజ కార్యక్రమం లొ పాల్కొన్న ఇంచార్జ్ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్

ఓబులవారిపల్లి ఆగస్టు పున్నమి ప్రతినిధి ఆదివారం ఓబులువారిపల్లి మండలం మంగంపేట ఆర్ ఆర్ వన్ గ్రామ ప్రజలు ఆహ్వానం మేరకు శ్రీ గణపతి దేవస్థానం నూతన నిర్మాణానికి సంబంధించి భూమి పూజ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ పుణ్యకార్యానికి *రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి , ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజ నిర్వహించడం జరిగింది,ఈ సందర్భంగా దేవస్థాన ప్రాంగణంలో వేద మంత్రాల మధ్య భూమి పూజ కార్యక్రమం జరగగా, గ్రామ పెద్దలు, భక్తులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అతిథులు గణపతి దేవుని ఆశీర్వాదంతో ఆలయం త్వరితగతిన నిర్మాణం పూర్తవ్వాలని ఆకాంక్షించారు.ముక్కా రూపానంద రెడ్డి గారు, అరవ శ్రీధర్ తెలుపుతూ గ్రామ అభివృద్ధికి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఎల్లప్పుడూ తోడ్పాటునందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లొ ఎన్ డి ఏ కుటమి నాయుకులు, గ్రామ ప్రజలు పాల్కొన్నారు

ఖమ్మం

పొద్దున్నే ఖమ్మం ని పలకరించిన వరుణుడు

ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి ) ఖమ్మం నాగరాన్ని వరుణుడు పొద్దున్నే పలకరించాడు. ఉదయం 6 గంటల నుండి భారీ వర్షం పడటం ప్రారంభం అయింది. ఈ భారీ వర్షానికి రోడ్డు మీద నీళ్లు పారుతుండటం తో వాహన దారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారూ

ఆంధ్రప్రదేశ్

ఆత్మహత్య చేసుకున్న విద్యుత్ శాఖ అధికారి భార్య

కోడూరు పట్టణం సూర్య నగర్ లో ఉంటున్న ముక్కడి చిన్న రెడ్డమ్మ (40)శనివారం ఉదయం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది ఎస్సై వివరాల మేరకు విద్యుత్ శాఖ కోడూరు రూరల్ ఏఈ గా నిధులు నిర్వహిస్తున్న యోగానంద భార్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్

ఆగస్టు 16న శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఆడికృత్తిక

తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఆగస్టు 16వ తేదీన ఆడికృత్తిక పర్వదినం జరగనుంది.ఈ సందర్భంగా ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉత్సవర్లకు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.

తిరుపతి

శ్రీ సరస్వతీ శిశు మందిర్ విద్వ్యార్ధుల చే ఘనంగా రక్షాబంధన్.

శ్రీ కాళహస్తి పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో విద్యార్థులు మరియు మాతాజీలు ప్రబంధకారిని సభ్యులు కలిసి రక్షాబంధన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.తరువాత రక్షాబంధన్ పండుగ మనలో సోదర భావాన్ని కలిగిస్తుంది,కులమత బేధం లేకుండా అందరం ఒక్కటే అనే భావనతో సామూహిక శక్తితో దేశాన్ని,ధర్మాన్ని రక్షించే సంకల్పాన్ని దృఢతరం చేస్తుందని కాబట్టి మనందరం రక్షాబంధన్ పండుగను సోదర భావం తో జరుపుకుందామని పాఠశాల విద్యార్థులతో కలిసి మాతాజీలు సమాజంలోకి వెళ్లి ప్రజలకు పోలీస్ స్టేషన్,కోర్టు,వివిధ కార్యాలయాలో అధికారులకు,షాపులకు వెళ్లి నేను నీకు రక్ష నీవు నాకు రక్ష మనమిద్దరం దేశానికి ధర్మానికి రక్ష అనే నినాదంతో అందరికి రక్షలు కట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.