Monday, 11 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

నరసన్నపేటలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్కిల్ డెవలప్మెంట్ జాబ్ మేళా – పాల్గొన్న 1000కి పైగా నిరుద్యోగులు

నరసన్నపేట పద్మావతి జూనియర్ కళాశాల ఆవరణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ భాగంగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బగ్గు రమణ మూర్తి గారు ముఖ్య అతిథిగా హాజరై, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వ కట్టుబాటును వివరించారు. ఆయన కూతురు అర్చన గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.అంతర్ముఖ్ HR కన్సల్టెన్సీ సీఈఓ మకేనా సతీష్ గారు విద్యార్థినీ విద్యార్థులను ఉద్దేశించి ప్రేరణాత్మక ప్రసంగం చేశారు. తమ నైపుణ్యాలను పెంపొందించుకొని, ఉద్యోగ రంగంలో వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పద్మావతి కళాశాలల డైరెక్టర్ దుర్గాప్రసాద్, వ్యవస్థాపక డైరెక్టర్ రామచంద్రరావు, వ్యవస్థాపకులు సూరిబాబు గారు మరియు జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ సాయికుమార్ గారు పాల్గొని జాబ్ మేళా విజయవంతం కావడానికి సహకరించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 20 కంపెనీల ప్రతినిధులు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహించగా, 1000కి పైగా నిరుద్యోగులు పాల్గొని తమకు తగిన అవకాశాల కోసం దరఖాస్తు చేసుకున్నారు.

భక్తి

కోటప్పకొండ

#గుంటూరు జిల్లా : కోటప్పకొండ “త్రికూటాద్రి ” శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయం : కోటప్పకొండ #కాకులు దూరని కారడవి అనే పదం మీరు వినే ఉంటారు. కానీ కాకులు వాలని కొండ గురించి ఎప్పుడూ విని ఉండరు. #అవును ఈ కొండపై కాకులు వాలవు. సాధారణంగా కొండ ప్రాంతాలపై ప్రతి చెట్టుపై కాకులు కనిపిస్తాయి. 3కానీ గుంటూరు జిల్లా నరసరావుపేటకు సమీపంలో ఉన్న కోటప్ప కొండపై మాత్రం కాకులు వాలవు. దీనికి కారణం కాకులకు ఉన్నటువంటి శాపం ఆ స్థానికుల అభిప్రాయం. #అసలు ఈ కొండపై కాకులు వాలకపోవడానికి కారణం ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ముందుగా కోటప్ప కొండ చరిత్ర గురించి తెలుసుకోవాలి. #కోటప్పకొండను త్రికోటేశ్వరాయలం, త్రికుటాద్రి అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఏ దిశలో చూసినా రుద్ర శిఖరం, బ్రహ్మ శిఖరం, విష్ణు శిఖరం అనే మూడు శిఖరాలు దర్శనమిస్తాయి.#అందుకే దీనిని “త్రికుటాద్రి” అని పిలుస్తారు. #కోటప్ప కొండ గొప్ప శైవ క్షేత్రంగా కీర్తి పొందింది. మహశివరాత్రికి ఘనంగా అభిషేకాలు, పూజలు జరుగుతాయి. #ఇక్కడికి చుట్టుపక్కల గ్రామాల నుండి అనేక విద్యుత్ ప్రభలు వస్తాయి. #కొండపై “చతుర్ముఖ బ్రహ్మ” ఆకృతి భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది.ఈ ప్రధాన మండపంలో స్వామికి ఎదురుగా నందీశ్వరుడు ఒక పక్క వినాయకుడు మరొక ప్రక్క కుమార స్వామి, మధ్యలో మోద దక్షిణామూర్తి అయిన శివుడ్ని ఆరాధిస్తూ, సేవిస్తూ ఉన్న ఋషి పుంగవులు దర్శనం ఇస్తారు. #ఎడమ ప్రక్క పద్మాసనం మీద ఉన్న ధ్యాన శివుడి విగ్రహం గల “ధ్యాన మందిరం” ఉంది. యాగశాల, నవగ్రహ మండపం కూడా ఉన్నవి. #దక్షయజ్ఞము వల్ల సతీదేవి వియోగం తర్వాత పరమ శివుడు పిచ్చివాడై ముల్లోకాలు తిరుగుతుండగా ఆ శివుడ్ని ఆకర్షించి, ఆశ్రయమిచ్చి, బాల దక్షిణామూర్తి రూపంలో 12 సంవత్సరాలు ధ్యాన నిమగుడ్ని గావించిన స్థలమే ఈ త్రికోటేశ్వరాలయం. #ఈ క్షేత్రం మీద శివుడు తపస్సు చేస్తుండగా “ఆనంద వల్లి” అనే గొల్ల భామ పాలు, తేనెలతో సేవించుచుండెను. శాలంకయ్య అనే రైతు శివుడు తపస్సు చేసే ప్రాంతానికి రావటంతో అతనికి బాలయోగి రూపంలో ఉన్న శివుడు కనిపించాడు. #శివుడికి భక్తితో నమస్కరించి తన దగ్గర ఉన్న పండ్లను స్వామికి సమర్పించాడు. #ఒకసారి గొల్ల భామ శివుడ్ని సేవించడానికి పాలను తీసుకువెళ్తూ అలుపు వల్ల తట్టను, పాల కుండలను ఒక గట్టు మీద ఉంచి సమీపంలో ఉన్న చెట్టు పూలను కోస్తూ ఉండగా ఒక కాకి వచ్చి పాల కుండలపై వ్రాలి పాలను ఒలకబోయటంతో అది చూచి గొల్ల భామ కోపంతో “ఈ ప్రాంతంలో కాకులు ఉండకూడదు” అని శపించెను. #ఒకనాడు శాలంకయ్య శివుని వద్దకు వచ్చి “తన యింటికి వచ్చి ఆతిధ్యం స్వీకరించమని” వేడుకున్నాడు. అప్పుడు స్వామి “అలాగే వస్తానని, నువ్వు యింటికి వెళ్లమని” చెప్పారు. గొల్ల భామ గర్భవతై “కొండకు రాలేకపోతున్నాను తండ్రీ, నీవే క్రిందకు రా!” అని శివుడ్ని వేడుకొనెను. ఆమె మొర విని శివుడు గొల్లభామతో నేను క్రిందకు దిగునంత వరకు నీవు వెనుతిరిగి చూడరాదు” అని అనగా, “సరే” అంటూ ఆ గొల్లభామ పద ముందుకు నడుచుకుంటూ పోతూ ఉండగా సాంబశివుడు వెనుకగా బయలుదేరాడు. #శివుని పాద ధాటికి కొండలు పగిలి భయానకం కలిగించగా, ఆ గొల్లభామ వెనుకకు తిరిగి చూచినది. #ఆమె చూడగానే పరమ శివుడు “లింగ రూపంగా మారాడు. ఆ గొల్లభామ “శిల” రూపంగా మారినది. ఆ సమయంలో శాలంకయ్య “స్వామి ఆతిధ్యానికి” ఇంకా రాలేదని కొండ మీదకు రాగా ఈ దృశ్యం కనబడింది. #శాలంకయ్య ఆశ్చర్యపోయి చూస్తూ విలపిస్తుంటే శివలింగం నుండి “ఈ కొండ క్రిందకు కోటి ప్రభలు ఏపుడు వస్తాయో, అప్పుడు నేను కొండ దిగి వస్తాను” అనే మాటలు వినిపించాయి. #అప్పుడు శాలంకయ్య తన గ్రామం అయిన యలమందకు వచ్చి భక్తి శ్రద్ధలతో ఒక ప్రభను తయారు చేసి, దాని గురించి ప్రజలకు వివరించి, “మీరు ప్రభలు కట్టుకొని స్వామి దగ్గరకు రమ్మని” చెప్పెను. #అప్పటి నుండి ప్రభలు కట్టుకొని భక్తులు వస్తున్నారు. స్వామి వారి అనుగ్రహంతో కొండవీడుని జయించిన శ్రీకృష్ణ దేవరాయులు “కోటప్పకొండకు వచ్చి విలువైన కానుకలు సమర్పించి, నిత్య ధూప దీప నైవేధ్యాలకు “కొండ కావూరు” అనే గ్రామాన్ని వ్రాసి యిచ్చాడు. #ఇక్కడ గొల్లభామ ఆనందవల్లికి ఆలయం ఉన్నది. ఈ ఆలయమును, స్వామి వారి ఆలయమును శాలంకయ్య నిర్మించాడు. శాలంకయ్య అమ్మవారి ఆలయం కట్టించాలని అనుకున్నాడు. కాని. స్వామి వారు శాలంకయ్య కలలోకి వచ్చి “సతీ దేవి వియోగంలో ఉన్న వాడిని, ఆమెకు గుడి కట్టించవద్దు” అని చెప్పుటవలన అమ్మ వారి గుడి కట్టించలేదు. #మహాశివరాత్రి, కార్తీక మాస సమయాల్లో కోటప్ప కొండ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. శివుడు దక్షిణామూర్తిగా, బ్రహ్మచారిగా వెలిసిన ఈ శిఖరంలో అమ్మవారి దేవాలయాలు ఉండవు. కాబట్టి ఇక్కడ పెళ్లిళ్లు కూడా జరగవు. పరమ శివుడు దక్షిణామూర్తి స్వరూపంతో ఉన్న ఏకైక క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదొక్కటే. #ఇది నరసరావుపేటకి 12 కి.మీ. గుంటూరుకి 56 కి.మీ. దూరంలో ఉంది. #ఓం నమః శివాయ

ఆంధ్రప్రదేశ్

అన్నదాత సుఖీభవ ట్రాక్టర్ల ర్యాలీని విజయవంతం చేద్దాంమేకపాటి,మాల్యాద్రి నాయుడుబిజెపి కిసాన్ మోర్చానెల్లూరు జిల్లా మాజీ ఉపాధ్యక్షులు..!!

దుత్తలూరు ఆగస్టు 11 (పున్నమి, ప్రతినిధి): అన్నదాత సుఖీభవ కార్యక్రమం బుధవారం13-8-2025 ట్రాక్టర్ ర్యాలీ కార్యక్రమం ..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా,ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ భారతీయ జనతా పార్టీ ఉదయగిరి నియోజకవర్గ కన్వీనర్ కదిరి వెంకట రంగారావు ,జనసేన ఇన్చార్జి.కొట్టే వెంకటేశ్వర్లు పాల్గొంటారు.ఉదయగిరి నియోజకవర్గం నుండి ఎన్డీఏ కూటమినాయకులుకార్యకర్తలు పాల్గొని ట్రాక్టర్ల ర్యాలీని విజయవంతం చేయాలని భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా కిసాన్ మోర్చా మాజీ ఉపాధ్యక్షులుమేకపాటి మాల్యాద్రి నాయుడునేడు మంగళవారం నర్రవాడలోపత్రికా విలేకరుల సమావేశంలో రైతు సోదరులకు పిలుపునిచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ సూపర్ సిక్స్ లో పథకంలో భాగంగా రైతు సోదరులను ఆదుకునేందుకు అన్నదాత సుఖీభవ అమలకుశ్రీకారంచుట్టినకూటమినాయకులు రైతులకు తెలియజేసే లక్ష్యంతోట్రాక్టర్ ర్యాలీని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారి ఆధ్వర్యంలోఈకార్యక్రమంజరుగుతుందని తెలియజేశారు.ట్రాక్టర్ల ర్యాలీ కార్యక్రమం దుత్తలూరు ఎమ్మార్వో ఆఫీస్ సమీపము నుండి ఉదయగిరి వ్యవసాయ మార్కెట్ సముదాయం వరకు రైతు సోదరులతో కలిసి భారీ ట్రాక్టర్ ర్యాలీని చేపట్టడం జరుగుతుందని తెలియజేశారు.మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ జీ గారు రైతుల అభివృద్ధి ఆకాంక్షించే మన ప్రధానమంత్రి గారు రైతులకు సబ్సిడీపై పనిముట్లను ట్రాక్టర్లను ఇచ్చిన ఏకైక నరేంద్ర మోడీ గారు మాత్రమే అని తెలియజేశారు .ఇచ్చిన మాట ప్రకారం రైతు పెట్టుబడి కొరకు ₹7,000 రూపాయలు రైతు సోదరుల ఖాతాకు జమ చేయడం జరిగిందని తెలియజేశారు..ఉదయగిరి నియోజకవర్గం నుండి అన్నీపంచాయతీలనుండితెలుగుదేశం,జనసేన,బిజెపి,నాయకులు కార్యకర్తలు పాల్గొని ఈ ట్రాక్టర్లు ర్యాలీని కనివిని ఎరుగని రీతిలో విజయవంతం చేయాలని మేకపాటి మాల్యాద్రి నాయుడు కోరారు..

ఖమ్మం

పారిశుధ్య కార్మికులు నివాసలని ఖాళీ చేయమనడం సరైంది కాదు. బిజెపి జిల్లా నాయకులు ఆచంటి కోటేశ్వరరావు ఆవేదన

ఖమ్మం ఆగష్టు ( పున్నమి ప్రతి నిధి) నగరపాలక సంస్థ ఖమ్మం సంబంధించిన పారిశుద్ధ కార్మికులు కేటాయించిన కోటర్స్ గత 40 సంవత్సరాల నుంచి కార్మికులు నివసిస్తున్నారు, అట్టి స్థల్లాల్లో ప్రస్తుతం నివాసం ఉంటున్న పారిశుధ్య కార్మికులకు నగరపాలక సంస్థ కార్యాలయం నుండి నోటీసులు జారీ చేసి మూడు రోజులలో ఖాళీ చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక ఆలస్య గారు నోటీసు జారీ చేయడం దూర్మార్గం అని బిజెపి జిల్లా నాయకులు ఆచంటి కోటేశ్వరరావు అన్నారు. విలేకరుల సమావేశం లో ఆయ మాట్లాడుతు ఇప్పుడు ఇప్పుడు ఉన్న పలంగా ఆ ఉన్న కోటర్స్ ని ఖాళీ చేసి రోజు పారిశుద్ధ్య పని చేసే కార్మికులు నివాసం లేకుండా చేసి రోడ్డున పడేసిన నగర పాలక సంస్థ పారిశుద్ధ్య పనులు చేసే కార్మికుల యొక్క బాగోగులు ఆరోగ్య పరిస్థితి మరియు ఇతర సదుపాయాలు కల్పించవలసిన బాధ్యత నగరపాలక సంస్థ పై ఉన్నదని కానీ దీనికి విరుద్ధంగా నగరపాలక సంస్థకు సంబంధించిన అధికారులు కార్మికులపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారుఅని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకుముందు NSP కింద ఇచ్చినటువంటి ల్యాండ్లను కూడా తుమ్మల నాగేశ్వరావు హయాంలోనే కూల్చివేయడం జరిగిందని కాంగ్రెస్ కి ఇలా చెయ్యడం కొత్తవి కాదు అని అన్నారూ. కార్మికులు పట్ల బిజెపి అవసరం అయితే తీవ్ర స్థాయి లో నిరసన కార్యక్రమం లు చెప్పడతాం అని ఆచంటి కోటేశ్వరరావు ప్రభుత్వం ని హెచ్చరించారు End.

ఖమ్మం

తిరంగా ర్యాలీ ని జయప్రదం చేయండి

ఖమ్మం ఆగష్టు ( పున్నమి ప్రతినిధి ) 79 వ స్వాతంత్ర్య దినోత్సవము ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ ని బుధవారం నాడు నిర్వహించడం జరుగుతుంది అని ఈ ర్యాలీ పేవిలియన్ మైదానం నుండి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు జరుగుతుంది అని ఈ యొక్క ర్యాలి లో పౌరులు అధిక సంఖ్య లో పాల్గొని జయప్రదం చెయ్యాలి అని ఖమ్మం జిల్లా బిజెపి తిరంగా యాత్ర ఇంచార్జ్ మందండపు సుబ్బారావు విజ్ఞప్తి చేశారు. విజ్ఞప్తి చేసిన వారి లో ఖమ్మం టూటౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ యాదవ్ రుద్ర గాని మాధవ, తదితరులు ఉన్నారు.

ఖమ్మం

బోళ్ల చిన్న లక్ష్మయ్య కి ఘన నివాళి అర్పించిన బిజెపి తెలంగాణ రాష్ట్ర నాయకులు గల్లా

ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతి నిధి ) బిజెపి సీనియర్ నాయకులు భోల్లా బిక్షపతి తండ్రి యొక్క దశ దిన కర్మ కార్యక్రమం లో బిజెపి తెలంగాణ రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ, తాండ్రా వినోద్పా రావు పాల్గొని వారి యొక్క చిత్రపటము కి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం లో భూక్యా శ్యాం సుందర్ నాయక్, డీకొండ శ్యాం, నాగేశ్వరావ్ తదితరులు పాల్గొన్నారు

జాతీయ అంతర్జాతీయ తెలంగాణ పిల్లలకు పెద్దపల్లి విద్య విజ్ఞానం

జాతీయ స్థాయి కరాటే పోటీల్లో మంథని విద్యార్థుల ప్రతిభ

*జపాన్ షెటోరియో షికోకాయ్ కరాటే శిక్షకులు కావేటి సమ్మయ్య* మంథని, ఆగస్టు 12; న్యూఢిల్లీలోని తాల్కటోర ఇండోర్ స్టేడియంలో ఈనెల 7వ తేదీ నుండి 10వ తేదీ వరకు నిర్వహించిన 19 వ ఆల్ ఇండియా ఇండిపెండెన్స్ కప్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో కరాటే శిక్షకులు కావేటి సమ్మయ్య ఆధ్వర్యంలో ఉచిత కరాటే శిక్షణ ద్వారా పెద్దపల్లి జిల్లా మంథని పట్టణానికి చెందిన జపాన్ షెటోరియో షికొకాయ్ కరాటే విద్యార్థిని విద్యార్థులు అండర్ 17 అండర్ 14 కథ, కుమితే విభాగాలలో అత్యంత ప్రతిభ కనబరిచి వెండి, కాంస్య పథకాలు సాధించారు. మంథని పట్టణానికి చెందిన విద్యార్థులు అండర్ 17 కుమితే విభాగంలో ఎండీ. తహసిన్ తైభ వెండి పతకం, ఇదే క్రమంలో కథ విభాగంలో కాంస్య పథకం, అండర్ 14 కుమితే విభాగంలో పోగుల శివ సాకేత్ కాంస్య పథకం, బండారి మణికంఠ కథ విభాగంలో కాంస్య పథకం, మారేడుకొండ రిషి కథ విభాగంలో కాంస్య పథకం సాధించినట్లు శిక్షకులు కావేటి సమ్మయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా శిక్షకులు కావేటి సమ్మయ్య మాట్లాడుతూ గత 25 ఏళ్ల నుండి మంథని పట్టణంలో ఉచిత కరాటే శిక్షణ ఇస్తూ, అంతర్జాతీయ, జాతీయ స్థాయి కరాటే పోటీల్లో మంథని విద్యార్థుల ప్రతిభకు మెరుగులు దిద్దుతున్నట్లు తెలిపారు. మలేషియాలో బంగారు, వెండి పథకం, హర్యానాలో బంగారు పతకం, మధ్యప్రదేశ్లో బంగారు పతకం, గోవాలో బంగారు పతకం, అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో మంథని విద్యార్థులు సాధించడానికి ఎంతో మంది విద్యార్థినీ, విద్యార్థులకు శిక్షణ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఉచిత కరాటే శిక్షణ ఇవ్వడమే కాకుండా, పేద విద్యార్థులకు పోటీలకు వెళ్లేటప్పుడు అయ్యే ఖర్చును కూడా తానే భరిస్తున్నట్లు సమ్మయ్య పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రోత్సహించి, దాతలు సహకరిస్తే, ఇంకా ఎంతో మంది విద్యార్థులను తయారు చేస్తానని సమ్మయ్య ధీమా వ్యక్తం చేశారు. ఉచిత కరాటే శిక్షణ కోసం ఆసక్తి గల విద్యార్థిని, విద్యార్థులు మంథని పట్టణంలోని ఓపెన్ జిమ్ దగ్గర లేదా సమ్మయ్య నివాసం దగ్గర ప్రతి రోజూ ఉదయం 6 గంటలకు లేదా సాయంత్రం 5 గంటలకు, లేదా 9848503412 నంబర్ ను సంప్రదించాలని కావేటి సమ్మయ్య కోరారు. ఈ పథకాలు సాధించిన విద్యార్థిని, విద్యార్థులను షిటోరియు షికొకాయ్ ఇండియా అధ్యక్షులు, కరాటే ఇండియా ఆర్గనైజేషన్ అధ్యక్షుడు ఢిల్లీ భరత్ శర్మ, తెలంగాణ స్పోర్ట్స్ కరాటే అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ శిఖోకాయి రిప్రెజెన్టివ్ పాలకుర్తి పాపయ్య, తెలంగాణ కార్య నిర్వహణ అధ్యక్షులు గుంటుపల్లి సమ్మయ్య, మల్యాల రామస్వామి, ఇన్స్ట్రక్టర్స్ నాగలి రాకేష్, జడగల శివాని, కాబట్టి శివ గణేష్, మెట్టు హాసిని, కే శ్వేత, నందన, టి హర్షిని, పి హర్షవర్ధన్ లు అభినందించారు.

తెలంగాణ హైదరాబాద్

తెలంగాణలో 13 నుండి 16 వరకు అతి భారీ వర్షాలు..!

హైదరాబాద్, ఆగస్టు 12, పున్నమి ప్రతినిధి: తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల ఆగస్టు 13 నుంచి 16 వరకు వరుసగా మూడు రోజులు పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, నల్గొండ, మహబూబాబాద్, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వర్షాలు బలంగా కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్‌ వాతావరణం: గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతంగా ఉంది. నేటి సాయంత్రం లేదా రాత్రి సమయంలో కొన్ని ప్రాంతాల్లో 3 నుంచి 6 సెంటీమీటర్ల వరకు వర్షం కురిసే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షం, ఉరుములు, మెరుపులు పడే అవకాశమూ ఉంది.ఆగస్టు 12 నుంచి 16 వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ, అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు సూచించారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే బయటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ సలహా ఇచ్చింది.

ఖమ్మం

గంగారం గ్రామం లోని అటవీ భూములని కాపాడండి. బిజెపి

ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి) ఖమ్మం జిల్లా లో ని సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలో ని సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలోని సర్వే నంబర్లు 133, 131, 40లోని అటవీ భూములను రక్షించేందుకు తక్షణ సర్వే నిర్వహించాలంటూ బిజెపి సత్తుపల్లి శాసన సభ కంటేస్టెడ్ అభ్యర్థి నంబూరి రామలింగేశ్వరరావు నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ బృందం, ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందజేసింది ఇటీవల హైదరాబాద్ కు చెందిన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి స్థానిక రాజకీయ నాయకులతో కుమ్మక్కై 300 ఎకరాలకు పైగా అటవీ భూమిని ఆక్రమించడానికి అక్కడ ఉన్న కొండలను అడవిని ధ్వంసం చేసి ఆక్రమణకు ప్రయత్నించాడని, ఈ విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు గంగారం రైతులు నిరసన తెలపడంతో అతను వెనుదిరిగాడని నంబూరి రామలింగేశ్వరావ్ తెలిపారు. ఇలాంటి అనేక అక్రమ ఆక్రమణలు జరుగుతున్నప్పటికీ, రెవెన్యూ అధికారులు స్పందించకపోవడం వల్ల అటవీ భూములు మాయమవుతున్నాయని నంబూరి రామలింగేశ్వరావ్ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సర్వే నిర్వహించి, అటవీ భూములను డిక్లేర్ చేసి, ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని నంబూరు రామలింగేశ్వర రావు డిమాండ్ చేశారు. ఈ అంశంపై బిజెపి జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి సహకారంతో, కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్‌లకు కూడా ఈ విషయాన్ని తెలియజేయనున్నట్లు రామలింగేశ్వరావ్ తెలిపారు. వినతి పత్రం సమర్పించిన వారిలో సత్తుపల్లి నియోజకవర్గ కన్వీనర్ భాస్కరిని వీరంరాజు, సత్తుపల్లి మండల అధ్యక్షులు సాలి శివకృష్ణ, సత్తుపల్లి టౌన్ అధ్యక్షులు బానోత్ విజయ్, ప్రధాన కార్యదర్శి వేముల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు

ఖమ్మం

గంగారం గ్రామం లోని అటవీ భూములని కాపాడండి. బిజెపి

ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి) ఖమ్మం జిల్లా లో ని సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలో ని సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలోని సర్వే నంబర్లు 133, 131, 40లోని అటవీ భూములను రక్షించేందుకు తక్షణ సర్వే నిర్వహించాలంటూ బిజెపి సత్తుపల్లి శాసన సభ కంటేస్టెడ్ అభ్యర్థి నంబూరి రామలింగేశ్వరరావు నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ బృందం, ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందజేసింది ఇటీవల హైదరాబాద్ కు చెందిన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి స్థానిక రాజకీయ నాయకులతో కుమ్మక్కై 300 ఎకరాలకు పైగా అటవీ భూమిని ఆక్రమించడానికి అక్కడ ఉన్న కొండలను అడవిని ధ్వంసం చేసి ఆక్రమణకు ప్రయత్నించాడని, ఈ విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు గంగారం రైతులు నిరసన తెలపడంతో అతను వెనుదిరిగాడని నంబూరి రామలింగేశ్వరావ్ తెలిపారు. ఇలాంటి అనేక అక్రమ ఆక్రమణలు జరుగుతున్నప్పటికీ, రెవెన్యూ అధికారులు స్పందించకపోవడం వల్ల అటవీ భూములు మాయమవుతున్నాయని నంబూరి రామలింగేశ్వరావ్ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సర్వే నిర్వహించి, అటవీ భూములను డిక్లేర్ చేసి, ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని నంబూరు రామలింగేశ్వర రావు డిమాండ్ చేశారు. ఈ అంశంపై బిజెపి జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి సహకారంతో, కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్‌లకు కూడా ఈ విషయాన్ని తెలియజేయనున్నట్లు రామలింగేశ్వరావ్ తెలిపారు. వినతి పత్రం సమర్పించిన వారిలో సత్తుపల్లి నియోజకవర్గ కన్వీనర్ భాస్కరిని వీరంరాజు, సత్తుపల్లి మండల అధ్యక్షులు సాలి శివకృష్ణ, సత్తుపల్లి టౌన్ అధ్యక్షులు బానోత్ విజయ్, ప్రధాన కార్యదర్శి వేముల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.