संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
खम्मम

గంగారం గ్రామం లోని అటవీ భూములని కాపాడండి. బిజెపి

पुन्नमी न्यूज़रूम प्रकाशित:

खबर की मुख्य बातें

  • ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి) ఖమ్మం జిల్లా లో ని సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలో ని సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలోని సర్వే నంబర్లు 133, 131, 40లోని అటవీ భూములను రక్షించేందుకు తక్షణ సర్వే నిర్వహించాలంటూ బిజెపి సత్తుపల్లి శాసన సభ కంటేస్టెడ్ అభ్యర్థి నంబూరి…
  • ఇలాంటి అనేక అక్రమ ఆక్రమణలు జరుగుతున్నప్పటికీ, రెవెన్యూ అధికారులు స్పందించకపోవడం వల్ల అటవీ భూములు మాయమవుతున్నాయని నంబూరి రామలింగేశ్వరావ్ ఆవేదన వ్యక్తం చేశారు.
  • తక్షణమే సర్వే నిర్వహించి, అటవీ భూములను డిక్లేర్ చేసి, ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని నంబూరు రామలింగేశ్వర రావు డిమాండ్ చేశారు.

ఖమ్మం ఆగష్టు
(పున్నమి ప్రతినిధి)

ఖమ్మం జిల్లా లో ని సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలో ని సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలోని సర్వే నంబర్లు 133, 131, 40లోని అటవీ భూములను రక్షించేందుకు తక్షణ సర్వే నిర్వహించాలంటూ బిజెపి సత్తుపల్లి శాసన సభ కంటేస్టెడ్ అభ్యర్థి
నంబూరి రామలింగేశ్వరరావు నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ బృందం, ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందజేసింది
ఇటీవల హైదరాబాద్ కు చెందిన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి స్థానిక రాజకీయ నాయకులతో కుమ్మక్కై 300 ఎకరాలకు పైగా అటవీ భూమిని ఆక్రమించడానికి అక్కడ ఉన్న కొండలను అడవిని ధ్వంసం చేసి ఆక్రమణకు ప్రయత్నించాడని, ఈ విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు గంగారం రైతులు నిరసన తెలపడంతో అతను వెనుదిరిగాడని నంబూరి రామలింగేశ్వరావ్ తెలిపారు.

ఇలాంటి అనేక అక్రమ ఆక్రమణలు జరుగుతున్నప్పటికీ, రెవెన్యూ అధికారులు స్పందించకపోవడం వల్ల అటవీ భూములు మాయమవుతున్నాయని నంబూరి రామలింగేశ్వరావ్ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సర్వే నిర్వహించి, అటవీ భూములను డిక్లేర్ చేసి, ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని నంబూరు రామలింగేశ్వర రావు డిమాండ్ చేశారు.
ఈ అంశంపై బిజెపి జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి సహకారంతో, కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్‌లకు కూడా ఈ విషయాన్ని తెలియజేయనున్నట్లు రామలింగేశ్వరావ్ తెలిపారు.
వినతి పత్రం సమర్పించిన వారిలో
సత్తుపల్లి నియోజకవర్గ కన్వీనర్ భాస్కరిని వీరంరాజు, సత్తుపల్లి మండల అధ్యక్షులు సాలి శివకృష్ణ, సత్తుపల్లి టౌన్ అధ్యక్షులు బానోత్ విజయ్, ప్రధాన కార్యదర్శి వేముల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *