Monday, 11 May 2026

Blog

E-పేపర్

శక్తి పథకం* ప్రారంభం కానున్న సందర్భంగా నంద్యాల డిపోను సందర్శించిన ఏపీఎస్ఆర్టీసీ కడప జోనల్ చైర్మన్ పూల నాగరాజు

స్వాతంత్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 15న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే *స్త్రీ శక్తి పథకం* ప్రారంభం కానున్న సందర్భంగా నంద్యాల డిపోను సందర్శించిన ఏపీఎస్ఆర్టీసీ కడప జోనల్ చైర్మన్ పూల నాగరాజు నంద్యాల డిపో పర్యటనకు విచ్చేసిన *పూల నాగరాజు* కి రీజినల్ మేనేజర్ రజియా సుల్తానా ఇన్చార్జి డిపో మేనేజర్ వినయ్ కుమార్ ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ డిపో బస్ స్టేషన్ ఆవరణలోని ప్రయాణ ప్రాంగణమును పరిశీలించి, ఉచిత బస్సు సౌకర్యం పై మహిళా ప్రయాణికులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకోవడం జరిగింది. మహిళలకు భద్రతా పరిరక్షణతో పాటు వినూత్న సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని ప్రయాణికులకు తెలిపారు. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయవలెనని అధికారులకు సూచించారు. డిపో గ్యారేజ్ ను సందర్శించి బస్సుల మెయింటెనెన్స్, సమయపాలన గురించి సిబ్బందితో మాట్లాడటం జరిగింది. అనంతరం నంద్యాల డిస్పెన్సరీ ని సందర్శించి అక్కడ ఉద్యోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి, అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ రజియా సుల్తానా డిపో మేనేజర్ వినయ్ కుమార్ బస్ స్టేషన్ సూపర్వైజర్లు మరియు ఇతర ఉద్యోగులు పాల్గొనడం జరిగినది.

నంద్యాల డిపోను ఆకస్మిక తనిఖీ చేసిన కడప జోనల్ చైర్మన్ పూల నాగరాజు

కడప జోనల్ చైర్మన్ పూల నాగరాజు నంద్యాల డిపో తనిఖీ చేయడం జరిగింది. బస్టాండ్ గ్యారేజ్ తనిఖీ చేసి సిబ్బందితో కూడా మాట్లాడడం జరిగింది. శ్రీ శక్తి పథకము సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయవలెనని బస్సుల కండిషన్ చెక్ చేసి ఫెయిల్యూర్ లేకుండా చూసుకోవాలని సిబ్బందికి గేట్ మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. అలాగే బస్టాండ్ లో ప్రయాణికులతో కూడా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. యాల్లూరు కు వెళ్ళు ప్రయాణికురాలు ట్రిప్పులు పెంచవలెనని కోరగా డిపిటిఓ కి వారి విజ్ఞప్తిని పరిశీలించి ట్రిప్పులు పెంచుటకు చర్యలు తీసుకోమని చెప్పినారు. బస్టాండ్ లో మహిళా ప్రయాణికులను స్త్రీ శక్తి పథకం గురించి తెలియజేయగా వారు చాలా హర్షం వ్యక్తం చేశారు.అలాగే నంద్యాల డిపోలో 493 బస్సులు ఉన్నాయని వాటిలో 378 బస్సులు పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ సర్వీస్ లు ఉన్నాయని వాటిలో శ్రీ శక్తి పథకం క్రింద మహిళలు రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చునని తెలియజేశారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బస్టాండ్ లో ప్రయాణీకులకు అన్ని సదుపాయాలు కలిగించి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని డి పి డి ఓ ని ఆదేశించినారు.

ఎలూరు

యోగా పోటీల్లో సత్తా చాటిన హీల్ విద్యార్థులు

ఆగిరిపల్లి: జిల్లాస్థాయిలో నిర్వహించిన యోగా పోటీల్లో హీల్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటి బంగారు పతకాలు సాధించారు. మండలంలోని తోటపల్లి హీల్ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఏలూరు లోని ప్రేమాలయం వృద్ధాశ్రమంలో నిర్వహించిన జిల్లా స్థాయి యోగాసనా పోటీల్లో పాల్గొని బంగారు పతకాలు సాధించారని హీల్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వై. లతా చౌదరి తెలిపారు. హీల్ సంస్థ సీఈఓ కూరపాటి అజయ్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ మిక్కిలినేని హరీష్, యోగ కోచ్ యోగా కోచ్ గోపి విద్యార్థిని,విద్యార్థులను అభినందించారు.

తూర్పు గోదావరి

జేగురుపాడు లో హర్ ఘర్ తిరంగా రాలి

*జేగురుపాడులో హర్ ఘర్ తిరంగా ర్యాలీ* కడియం మండలం జేగురుపాడులో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి అయినవిల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళవారం గ్రామపంచాయతీ కార్యాలయం నుంచి జాతీయ జెండాతో గ్రామంలో ర్యాలీ చేపట్టారు. అనంతరం పంచాయతీ కార్యాలయం వద్ద మానవహారం నిర్వహించారు. ఆగస్ట్ 15 వేడుకల్లో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నాగిరెడ్డి రామకృష్ణ,ఉపసర్పంచ్ పాతూరి రాజేష్,మాజీ ఎంపీటీసీ మర్రెడి రమేష్ జనసేన నాయకులు కర్రి చినబాబు, గ్రామ పెద్దలు, సచివాలయ,అంగనవాడీ తదితర ఉద్యోగులు,గ్రామస్థులు పాల్గొన్నారు.

అన్నమయ్య

సి.హెచ్.ఎస్ సంస్థ ఆధ్వర్యంలో వినూతన సేవా కార్యక్రమం!

చిట్వేలి — (పున్నమి ప్రతినిధి) మనుషుల మధ్య మానవత్వాన్ని పెంపొందించేందుకు మరో అడుగు! (1) ఫుడ్ బ్యాంక్ విశేష దినాలలో అన్నదానం చేయదలచిన వారు, లేదా మిగిలిన తిండి వృథా చేయకుండా ప్యాక్ చేసి ఈ ఫ్రిడ్జ్ లో ఉంచండి. ఇది ఆకలితో ఉన్న వారికి జీవనాధారం అవుతుంది.(2) ఉచిత త్రాగునీటి ఫిల్టర్ వేసవి వేడి లో లేదా ఎప్పుడైనా దాహార్తులకు శుద్ధి చేసిన చల్లటి త్రాగునీరు ఉచితంగా అందుబాటులో ఉంటుంది. (3) వస్తు వితరణ కేంద్రంమీకు అవసరం లేని కానీ ఉపయోగపడే కొత్త/పాత వస్తువులు (దుస్తులు, గృహోపకరణాలు, పుస్తకాలు మొదలైనవి) ర్యాక్స్ లో భద్రపరచండి. అవి అవసరమైనవారికి ఉచితంగా పంపిణీ చేయబడతాయి.ప్రతి ఒక్కరూ ఈ సేవలను ఉపయోగించండి అవసరమైనవారికి తెలియజేయండి సేవా మనోభావాన్ని పంచండి!సంస్థకు ధన్యవాదాలు తెలియజేస్తూ సామాజిక మానవతా సేవకు మనమంతా తోడుదండిగా నిలుద్దాం!

అన్నమయ్య

మాజీ ఎమ్మెల్యే కసిరెడ్డి మదన్మోహన్ రెడ్డి పార్థివదేహానికి బత్యాల నివాళి

రాజంపేట, ఆగస్టు — (పున్నమి ప్రతినిధి) హైదరాబాద్ మహానగరంలో మంగళవారం నాడు ఆకస్మికంగా కన్నుమూసిన మాజీ ఎమ్మెల్యే కసిరెడ్డి మదన్మోహన్ రెడ్డి గారి పార్థివదేహానికి, మాజీ ఎమ్మెల్సీ మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌ|| శ్రీ బత్యాల చంగల్‌రాయుడు పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మదన్మోహన్ రెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించిన బత్యాల, తాను తీవ్ర దిగ్భ్రాంతి చెందానని తెలిపారు. ఆయన మాట్లాడుతూ: “మదన్మోహన్ రెడ్డి నాకు ఆప్తమిత్రుడు. ఆయన మృదుస్వభావి, మితభాషి. తక్కువ కాలంలో ప్రజల్లో విశేషమైన ఆదరణ పొందిన నాయకుడు. నిజాయితీ, నిష్ట, శ్రమతో ప్రజాసేవ చేసిన శాసనసభ్యుడు. రాజంపేట బైపాస్ రోడ్, రైల్వే స్టేషన్ అభివృద్ధి వంటి కీలక అంశాల్లో ఆయన పాత్ర మరువలేనిది. అలాంటి నేత మన మధ్య లేకపోవడం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.”ఈ కార్యక్రమంలో పలువురు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, మిత్రులు పాల్గొన్నారు.

చిత్తూరు

భూమన కరుణాకరరెడ్డి ని సత్కరించిన జిల్లా వైసీపీ ఉపాద్యాయ విభాగం అధ్యక్షులుగా సోమచంద్రారెడ్డి

ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు, మాజీ టిటిడి బోర్డు ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డిని చిత్తూరు జిల్లా వైసీపీ ఉపాద్యాయ విభాగం నూతన అధ్యక్షులు ఎన్.సోమచంద్రారెడ్డి కలసి దూశాలువలతో సత్కరించారు. తిరుపతిలో మంగళవారం జిల్లా స్థాయి వైసీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులు,ముఖ్య నేతలతో ప్రత్యేక సమావేశం జరిగింది. నూతన చిత్తూరు జిల్లా ఉపాద్యాయ విభాగంలో జిల్లా అధ్యక్షులుగా చోటు కల్పించి నందులకు భూమనకు ఎన్.సోమచంద్రారెడ్డి ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలిపారు.విద్యా ఉపాద్యాయ విభాగంతో పాటు పార్టీకి తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని,అంతేగాక అవసరమైన సూచనలు సలహాలు పార్టీకీ అందిస్తానని భూమనకు తెలిపారు.జిల్లా ఉపాద్యాయ విభాగం భాధ్యతలు అప్పగించినందులకు రీజినల్ కో ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడా లకు కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నానన్నారు.జిల్లా,రాష్ట్ర స్థాయిలలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఓ ఉపాధ్యాయ సంఘానికి మూడు దశాబ్దాలుగా విశిష్ట సేవలు అందిoచిన ఎన్.సోమచంద్రారెడ్డి పదవీ విరమణ చెందినా ఉద్యోగ ఉపాద్యాయ పెన్షనర్ ల కోసం సర్వీసు సెంటర్ ను పలమనేరు లో నడుపుతూ ప్రత్యేక గుర్తింపు పొందారు.కాగా భూమనను సత్కరించిన సందర్భంలో జిల్లా క్రిస్టియన్ విభాగం అధ్యక్షులు రూబన్ కూడా వున్నారు.

ఎలూరు

యువత సాయి ప్రియను ఆదర్శంగా తీసుకోవాలి

యువత సాయి ప్రియను ఆదర్శంగా తీసుకోవాలి ఆగిరిపల్లి: మానసిక ఆరోగ్యాన్ని సమాజంలో ప్రతి ఒక్కరికి చేరువ చేయాలని లక్ష్యంతో సాయి ప్రియ చేస్తున్న సేవను యువత, మహిళలు ఆదర్శంగా తీసుకోవాలని పుదుచ్చేరి మాజీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ డాక్టర్ కిరణ్ బేడీ అన్నారు. మండలంలోని కనసానపల్లికి చెందిన సైకాలజిస్ట్ పేట సాయి ప్రియ వేలాది మందికి మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి తన మానసిక విశ్లేషణతో వారి జీవితంలో సానుకూల దృక్పథం తీసుకొచ్చినందుకుగాను హైదరాబాదులో నిర్వహించిన ఎక్స్ ఈల్లా ఉమెన్ కాన్ క్లేవ్-2025 కార్యక్రమంలో భాగంగా ఉత్తమ సైకాలజిస్ట్ అవార్డును మాజీ గవర్నర్ కిరణ్ బేడీ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా మాజీ గవర్నర్ కిరణ్ బేడీ మాట్లాడుతూ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మానసిక ఆరోగ్యం పై ఐదువందలపైగా అవగాహన కార్యక్రమాలు, వ్యక్తిత్వ వికాస్ సదస్సులు నిర్వహించి వేలాదిమందికి మానసిక ఆరోగ్యం పై అవగాహన కల్పించి వారి జీవితాలకు సరైన మార్గం చూపించడం కోసం తన వృత్తిని వారికోసం అంకితం చేయటం మంచి పరిణామం అని కిరణ్ బేడీ అన్నారు. ఈ సందర్భంగా సైకాలజిస్ట్ సాయి ప్రియ మాట్లాడుతూ భవిష్యత్తులో మానసిక ఆరోగ్యం పై అనేకమందికి నా వంతుగా సహాయ అందించడానికి శాయి శక్తుల కృషి చేస్తానని అన్నారు. ఆమెకు అవార్డు లభించడం పట్ల కనసానపల్లి గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.