అలంపూర్ : ఆగస్టు 13 ( పున్నమి ప్రతినిధి )జోగులాంబ గద్వాల జిల్లా, మానవపాడు మండలం, పొలంలో పురుగుల మందు కొడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు డ్రోన్ రెక్కలు తగిలి ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని స్థానికులు తెలిపారు. మానవపాడు మండల పరిధిలోని చంద్రశేఖర్ నగర్ గ్రామంలో ఓరైతుకు చెందిన మొక్కజొన్న పంటకు ఉండవెల్లి మండలం పుల్లూరు గ్రామానికి చెందిన అలీ బాబు ( డ్రోన్ యజమాని ) డ్రోన్ సహాయంతో మందులు పిచికారి చేశాడు, ఆయనతోపాటు బొంకూరు గ్రామానికి చెందిన నాగన్న ను, ఆలీ బాబు కూలి కోసం వెంట తెచ్చుకున్నాడు. అయితే డ్రోను ను కిందకు దించే సమయంలో ప్రమాదవశత్తు నాగన్న కుడి చేతికి రెండు వేళ్ళు తెగడంతో పాటు తలకు గాయాలయ్యాయి. డ్రోన్ యజమాని అలీ బాబుకు స్వల్ప గాయాలు అయ్యాయి. మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
రేపల్లె పట్టణంలోని శారద ఐటిఐ నందు జరిగిన మెగా జాబ్ మేళాలో 263 మంది నిరుద్యోగులు ఎంపిక అయినట్లు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్ కరస్పాండెంట్ బడుగు వెంకటనారాయణ తెలిపారు. పట్టణంలోని శారద ఐటిఐ నందు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ బాపట్ల జిల్లా సిబ్బంది శ్రీ హారిక , ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సిబ్బంది హరీష్, 18 కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్ కరస్పాండెంట్ బడుగు వెంకటనారాయణ మాట్లాడుతూ 365 మంది నిరుద్యోగులు ఈ మెగా జాబ్ మేళాలో దరఖాస్తు చేసుకొనగా, 263 మందిని వివిధ కంపెనీ లకు ఎన్నుకోవడం జరిగిందని, నియోజకవర్గం పరిధిలోనే కాకుండా చీరాల ,బాపట్ల మచిలీపట్నం , గుంటూరు తదితర ప్రాంతాల నుంచి కూడా అభ్యర్థులు ఈ జాబ్ మేళా కు హాజరవడం జరిగింది. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు కొన్ని కంపెనీ ల వారు వెంటనే ఆఫర్ లెటర్ ఇవ్వడం జరిగింది, ఈ మెగా జాబ్ మేళా కు ఎలక్ట్రో సర్క్యూట్ సిస్టమ్స్ హైదరాబాద్, 3ఎస్ ఐ ఎకో పవర్ ఎల్ ఎల్ పి కంపెనీ సూళ్లూరుపేట, రచన మిషన్స్ లిమిటెడ్ హైదరాబాద్, ప్రీమియర్ ఎనర్జీస్ హైదరాబాద్, హెట్రో డ్రగ్స్ హైదరాబాద్, కోల్గేట్ పామోలివ్ కంపెనీ శ్రీ సిటీ నెల్లూరు జిల్లా, జెయింట్ క్లౌడ్ టెక్నాలజీస్ హైదరాబాద్, ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్స్ చందోలు, డాక్టర్స్ సొల్యూషన్స్ చెరుకుపల్లె, టాటా ఎలక్ట్రానిక్స్ బెంగళూరు, ఎంఆర్ఎఫ్ చెన్నై, వసంత ఇండస్ట్రీస్ చిలకలూరిపేట, హిటాచి విజయవాడ, గోదావరి ఆంధ్ర కోఆపరేటివ్ రేపల్లె తదితర కంపెనీ లకు సంబంధించిన హ్యూమన్ రిసోర్స్ మేనేజర్లు అభ్యర్థులను ఎంపిక చేసుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రేపల్లె శారద ఐటిఐ ప్రిన్సిపాల్ బడుగు జ్యోత్స్న, ప్లేస్మెంట్ ఆఫీసర్ మండే ప్రసాద్, రేపల్లె డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్యామ్ సుధాకర్ , ఆంధ్రప్రదేశ్ బిసి విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు పరిశా వెంకటేశ్వరరావు, రేపల్లె మార్కెట్ యార్డ్ చైర్మన్ మత్తి భాస్కర రావు, రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ చెన్ను నాగమల్లేశ్వరరావు, రచన మెషీన్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ యలవర్తి హరిప్రసాద్, శారద ఐటిఐ అధ్యాపక బృందం, తల్లిదండ్రులు, అభ్యర్థులు పాల్గొన్నారు.
పున్నమి ప్రతినిధి తెలంగాణ లో భారీ వార్షాల కారణం గా హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, జనగాం, జిల్లాలో నేడు, రేపు పాఠశాల లలకి సెలవు లు ప్రకటించారు. మరో వైపు హైదరాబాద్ నగరం లో ఒక్క పూట సెలవు ప్రకటించారు.
తెలంగాణ ఆంటీ నార్కోటిక్స్ విభాగం- మాదకద్రవ్యాల వ్యతిరేక ఉద్యమ సైనికులకు విభాగం – శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించింది,బంజారా హిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో(CCC) నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ మరియు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు హాజరయ్యారు.ఈ శిక్షణా కార్యక్రమాన్ని ఇన్స్పెక్టర్లు, డిసిపి, ఎస్పీ మరియు డైరెక్టర్ సహా వివిధ పోలీసు అధికారులు ఇచ్చారు.సమాజంలో మాదకద్రవ్యాల దుష్ప్రభావాలను ఎదుర్కోవడానికి మరియు వాటిపై అవగాహన కల్పించడానికి ఈ శిక్షణ వివిధ అంశాలను వివరించారు.తల్లిదండ్రుల నుండి పాఠశాలకు వెళ్లే పిల్లల వరకు ప్రజల మనస్సులలో అవగాహన కల్పించడం ఈ శిక్షణ లక్ష్యం. యాంటీ డ్రగ్ సైనికులు పాఠశాలలు, కళాశాలలు, కమ్యూనిటీలలో వివిధ అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని కూడా చెప్పబడింది.
రైల్వేకోడూరు ఆగస్టు పున్నమి ప్రతినిధి కోడూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ యం. భాస్కర్ రెడ్డి గారి అధ్యక్షతన, కళాశాల RRC మరియు NSS ఆధ్వర్యంలో జాతీయ నులిపురుగు నివారణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఆల్బెండజోల్ టాబ్లెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ గారు నులిపురుగుల వల్ల కలిగే హానికర ప్రభావాలు, వాటి నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి విద్యార్థులకు వివరించారు.అదేవిధంగా, ఇంటర్నేషనల్ యూత్ 2025 — యూత్ ఎంపవర్‌మెంట్ అగెనస్ట్ HIV: ఎడ్యుకేట్, ప్రివెంట్, ఇన్‌స్పైర్ అనే రెండు నెలల ప్రత్యేక కార్యక్రమం లో భాగంగా, కళాశాల NSS మరియు RRC ఆధ్వర్యంలో, కోడూరు సామాజిక ఆరోగ్య కేంద్రం ICTC టీం సహకారంతో విద్యార్థులకు AIDS / HIV పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం, పట్టణంలో అవగాహన ర్యాలీ కూడా చేపట్టారు.ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి. రమేశ్, IQAC కోఆర్డినేటర్ శ్రీ జి. దయానందం, NSS కోఆర్డినేటర్ శ్రీ దాసరి మోషే, RRC కోఆర్డినేటర్ డాక్టర్ ఈ. ప్రేమలత, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
ఖమ్మం ఆగష్టు( పున్నమి ప్రతినిధి ) జీతం ఏమో చాలీ చాలానంత చాకిరేమో వెట్టి చాకిరీ.. ఇది ఖమ్మం కార్పొరేషన్ కార్మికులు స్థితి. వర్షం వచ్చిన, తడవాలి, ఎండకి ఎండాలి. చాలి కి వనకాలి. ఇంత చేసిన వీరి జీతం కేవలం 16000 కటింగ్ లు పోను 14500. దీనిలోనే ఇంటి కిరాయి. కిరాణా, ఆరోగ్యం బాలేక పోయిన 14500 లోనే చూసుకోవాలి. ఉదయం 4.45 నిముషాలకి పనికి వస్తే తిరిగి ఇంటికి వెళ్లే సరికి మధ్యాహ్నం 3 అవుతుంది. నగర శుభ్రత కోసం కష్ట పడి పని చేస్తున్న కార్మికులకి కనీస సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఎంత అయినా ఉంది. ఖమ్మం కమీషనర్ అభిషేక్ ఆగస్త్య వీరి యొక్క కష్టం ని గుర్తించాలి అని కార్మికులు కోరుకుంటున్నారూ.
మహిళ మెడలో నుంచి దుండగుడు బంగారు చైన్ లాక్కెళ్లిన సంఘటన పలమనేరు నియోజకవర్గం, గంగవరం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. భాదితరాలు కధనం మేరకు….సాయిప్యాలెస్ బ్యాక్సైడ్లో నివాసం ఉంటున్న శ్రావణి ఇంటికి చేరిన దుండుగుడు మీ ఆయన పేరు రామారావు అని అడిగాడు కాదండి అని చెప్పి ఇంట్లో లోపలికి వెళ్లిపోయింది. పది నిమిషాల తర్వాత ఇంటి లోపల దూరి మెడ పట్టుకొని చైన్ లాక్కుని డోర్ వేసుకుని వెళ్లిపోయాడు దుండగుడు గొంతు యాడ కోసేస్తాడు అని శ్రావణి కేకలు వేయడంతో చైన్ లాక్కుని పరుగులు తీసిన దుండగుడు పరారయ్యాడు. గంగవరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఘనంగా ప్రపంచ ఏనుగుల దినోత్సవం మంగళవారం పలమనేరు ఎలిఫెంట్ హబ్ లో జరిగింది.ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా పలమనేరు రూరల్ మండలంలోని మొసలి మడుగు గ్రామ సమీపంలోని ఎలిఫెంట్ ప్రాజెక్టు వద్ద అటవీశాఖ అధికారుల ఆద్వర్యంలో ఏనుగులకు ప్రత్యేక పూజాది కార్యక్రమం,ఏనుగుల దినోత్సవం విశిష్టత వంటి కార్యక్రమాలు అధికారులు నిర్వహించారు. ఇక్కడి ఎలిఫెంట్ ప్రాజెక్టు వద్ద కర్నాటక నుంచి వచ్చిన కుంకీ ఏనుగులతో పాటు మరో రెండు కలిపి ఆరు ఏనుగులకు ప్రత్యేకoగా పూలను అలంకరించి ఆకర్షనీయంగా మార్చారు.ఇందులో భాగంగా అన్ని ఏనుగులకు విడివిడిగా పూజాధి కార్యక్రమాలు చేపట్టారు. ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథులుగా అటవీశాఖ సబ్ డిఎఫ్ఓ వేణుగోపాల్,పలమనేరు మున్సిపల్ కమిషనర్ రమణా రెడ్డి,పలమనేరు రేంజర్ నారాయణ, జిల్లా రైతు సంఘాల నాయకులు ఉమాపతి నాయుడు,వెటర్నరీ విభాగం అధికారులు పాల్గొని సమావేశంలో ప్రపంచ ఏనుగుల దినోత్సవం విశేషాలు, ఇక్కడ కుంకీ ఏనుగులు క్యాంపు ఏర్పాటు అయిన విధo, ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలు గురించి వివరించారు. కార్యక్రమంలో అటవీ అధికారులతో పాటు క్షేత్ర స్థాయి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పాఠశాల విద్యార్ధులకు ప్లేట్లు,గ్లాసులు వితరణ. ఆగిరిపల్లి మండలం,సర్నాల గూడెం లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్ధులను విజయవాడ లోని వేద చారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు ట్రస్టు ఛైర్పర్సన్ శ్రీమతి యడ్లపాటి శిరీష రాణి గారు,జనరల్ సెక్రటరీ శ్రీ యడ్లపాటి శేషసాయి గారలు దత్తత తీసుకుని విద్యార్ధులకు మద్యాన్న భోజనానికి అవసరమైన ప్లేట్లు,గ్లాసులు మరియు రెండవసారి విద్యార్ధులకు అవసరమైన నోటు పుస్తకాలు,పెన్నులు,పెన్సిల్లు, అరెజెర్స్ అందించడం జరిగినది. విద్యార్ధులు కూర్చోవడానికి అవసరమైన బెంచీలు కూడా తయారు చేస్తున్నాము అని అవి తయారు కాగానే పాఠశాలకు అందచేయగలమని తెలియజేసి ఉన్నారు.వారు చేస్తున్న ఈ కార్యక్రమాల పట్ల గ్రామస్తులు ఎంతో ఆనందం వ్యక్త పరిచారు.ఈ సందర్భంగా దాతలను విద్యా కమిటీ చైర్మన్ శ్రీమతి బీను,ప్రధానోపాధ్యాయులు J. జ్ఞాన సుందరం,ఉపాధ్యాయుని శ్రీమతి V. విజయ శ్రీ మరియు గ్రామస్తులు ఘనంగా సత్కరించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ, తేది: 12-08-2025. బంగాళాఖాతం మధ్య ప్రాంతాలలో సముద్ర మట్టానికి సగటున 3.1 – 5.8 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని దీని ప్రభావంతో రేపు పశ్చిమమధ్య, దానిని ఆనుకుని ఉన్న *వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు అవకాశం* ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఆతదుపరి 48 గంటల్లో ఇది బలపడే సూచనలు ఉన్నాయని తెలిపారు. దీని ప్రభావంతో *రానున్న రెండు రోజులు కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ వర్షాలు* నమోదైయ్యేందుకు అవకాశం ఉందన్నారు. ఇప్పటికే ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు ప్రఖర్ జైన్ వెల్లడించారు. ప్రజలకు అలెర్ట్ మేసేజ్లు పంపించినట్లు తెలిపారు. గంటకు 40 -50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. *శనివారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని సూచించారు.* పిడుగులతో కూడిన వర్షాల నేపధ్యంలో ప్రజలు చెట్ల క్రింద,శిథిలావస్థలో ఉన్న భవనాలు,హోర్డింగ్స్ వద్ద ఉండరాదని హెచ్చరించారు. అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. *రానున్న రెండు రోజులు వాతావరణం క్రింది విధంగా ఉండనున్నట్లు ఎండీ ప్రఖర్ జైన్ వివరించారు.* *బుధవారం(13-08-25)* •పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. • శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, తూర్పుగోదావరి, నంద్యాల జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. *గురువారం(14-08-25)* • కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటల నాటికి ప్రకాశం జిల్లా మద్దిపాడులో 93మిమీ, కాకినాడ జిల్లా కోటనందూరులో 76మిమీ,సామర్లకోటలో 72.2మిమీ,అల్లూరి జిల్లా కరిముక్కిపుట్టిలో 68మిమీ, ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో 59.5మిమీ చొప్పున అధిక వర్షపాతం నమోదైందన్నారు.
పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం. రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.