Monday, 11 May 2026

Blog

యాదాద్రి భువనగిరి

క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఉద్యమించాలి

యాదాద్రి భువనగిరి జిల్లా ఆగస్టు ( పున్నమి ప్రతినిధి) *ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి గోరేటి రాములు ఎండీ ఇమ్రాన్ పిలుపునిచ్చారు..* క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కార్మికులు తమ హక్కుల సాధన కోసం మరియు కార్మిక చట్టాల పరిరక్షణకై ఉద్యమించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి గోరెటి రాములు ఎండీ ఇమ్రాన్ పిలుపునిచ్చారు. బుధవారం రోజున కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జాతీయ కార్మిక సంఘాలు మరియు రైతు సంఘాల పిలుపు మేరకు భువనగిరిలోని భారత రాజ్యాంగ నిర్మాత బి. ఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదురుగ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా రాములు, ఇమ్రాన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలలో భాగంగా 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తెచ్చి కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ దేశంలో కార్మికులు యూనియన్ పెట్టుకునే హక్కు లేకుండా చేస్తుందని, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటుపరం చేసి కార్పొరేట్ శక్తులకు, అదాని, అంబానీ లాంటి బడా పెట్టుబడిదారుల ఆస్తులు పెంచి కార్మికులను నిరుపేదలగా మార్చే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుందని వారు ఆరోపించారు. పబ్లిక్ సెక్టార్, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని, రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలను మరియు 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం ప్రతి కార్మికునికి 26 వేలు మరియు కనీస పెన్షన్ నెలకు రూ 5 వేలు ఇవ్వాలని, స్కీమ్ వర్కర్ లను క్రమబద్ధీకరించి ఉద్యోగ భద్రత కల్పించాలనీ, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని, మధ్యాహ్న భోజన వంట కార్మికులకు ప్రభుత్వమే వంట గ్యాస్ మరియి నిత్యవసర వస్తువులు సరఫరా చేయాలని, అసంఘటితరంగా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి గనబోయిన వెంకటేష్, కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, జిల్లా కమిటీ సభ్యులు సామల భాస్కర్, పుట్ట రమేష్, ముంతాజ్ బేగం నాయకులు కాశపాక దయాకర్, గౌరవంతుల శ్రీనివాస్, మడుగుల స్వామి, బొజ్జ గణేష్, జహంగీర్, మల్లేష్, నరేష్, బోయిని బిక్షపతి, నరసింహ, తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం

సత్తుపల్లి లో తిరంగా ర్యాలీ

ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకు బుధవారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో బిజెపి పట్టణ అధ్యక్షులు బానోతు విజయ్ అధ్యక్షతన పార్లమెంట్ కన్వీనర్ నంబూరు రామలింగేశ్వర రావు, జిల్లా అధికార ప్రతినిధి పడిగల మధు సుధన్ రావు లు ముఖ్య అతిధి లు గా హర్ గర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భముగా నంబూరి రామలింగే స్వరావ్, పడిగల మధు సుధన్ రావు లు మాట్లాడుతూ రాబోయే కాలంలో మన పిల్లలు ఒక ఆశయ సాధన కోసం క్రమశిక్షణ తో ఈ దేశ ఎదుగుదలలో భాగస్వాములు కావాలని, గొప్ప పౌరులుగా తీర్చిదిద్దాలని ప్రధాని నరేంద్ర మోదీ హర్ గర్ తిరంగా అనే కార్యక్రమానికి పిలుపునిచ్చారన్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలని వారు కోరారు. దేశభక్తితో విద్యార్థులు మరియు జాతీయవాదులు ఉత్సాహంగా ఈ ర్యాలీలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు, సత్తుపల్లి నియోజకవర్గ ఐదు మండలాల అధ్యక్షులు, రాష్ట్ర జిల్లా కౌన్సిల్ సభ్యులు, పట్టణ మండలాల నాయకులు, బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

చరిత్రలో నిలిచేలా కార్యక్రమాలు చేద్దాం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పిలుపు

చరిత్రలో నిలిచేలా కార్యక్రమాలు చేద్దాం – ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపు – సారంగధర మెట్టపై కల్యాణ మండపం నిర్మాణం – కల్యాణ మండపం కోసం రూ. 2.50 లక్షలు ఎమ్మెల్యే ఆదిరెడ్డి… రూ. 9 లక్షలు ఆలయ చైర్మన్ సాయి విరాళాలు రాజమహేంద్రవరం : మనం చేసే పనులు, కార్యక్రమాలు చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) పిలుపునిచ్చారు. సారంగధర మెట్టపై ఉన్న శ్రీ సారంగధేశ్వరస్వామి ఆలయానికి నూతనంగా నియమించినబడిన కమిటీ సభ్యుల ప్రమాణస్వీకారోత్సవం బుధవారం జరిగింది. చైర్మన్ గా కెవీడీఎస్సీవి చౌదరి, డైరెక్టర్లుగా కొలచన వెంకట సూర్య నారాయణ, అజ్జరపు శ్యామలాదేవి, సూరంపూడి అప్పాజీ, పొన్నమాటి నాగమణి, డేగల మరియ్య, రేలంగి నాగేశ్వరరావు, కుమారి శాంతకుమారి, నూకల అచ్యుతరామయ్య, ప్రమాణస్వీకారం చేశారు. వారితో ఆలయ ఈఓ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ స్థానిక ప్రజలు వారి శుభకార్యాలు చేసుకునేందుకు వీలుగా ఒక కల్యాణ మండపాన్ని నిర్మించనున్నామని తెలిపారు. అందుకోసం తాము తమ భవాని చారిటబుల్ ట్రస్ట్ నుంచి రూ. 2.50 లక్షలు ఇవ్వనున్నట్టు తెలిపారు. అలాగే సారంగదేశ్వర స్వామి ఆలయానికి నూతనంగా చైర్మన్ గా నియమితులైన సాయి కుటుంబం రూ. 9 లక్షలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కాగా కూటమి అధికారంలోకి రావడాన్ని కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. రాజమండ్రి టీడీపీకి బలమైన నియోజకవర్గమన్నారు గతంలో ఎన్నడూ రాని మెజార్టీ వచ్చిందన్నారు. కూటమి విజయం కోసం కృషి చేసిన అందరికి న్యాయం చేయడం జరుగుతుందన్నారు. గతంలో మాదిరిగా కాకుండా ఎండోమెంట్ కమిటీలను ముందుగానే వేయడం జరుగుతొందన్నారు. ఆలయ పరిరక్షణకు కృషి చేస్తూ భక్తులకు మంచి సేవలు అందించాలని ఆలయ నూతన కమిటీ సభ్యులకు సూచించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత నగరంలో గంజాయి, బ్లెడ్ లను బ్యాచ్ లను నియంత్రించినట్టు తెలిపారు. దేవాదాయ స్థలాల్లో ఉన్న వారికి ప్రభుత్వం త్వరలోనే తీపి కబురు చెప్పనుందన్నారు. నగరంలో అన్ని సమస్యలు తీరుస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, జనసేన పార్టీ నగర అధ్యక్షులు వై శ్రీను మాట్లాడుతూ వైకాపా రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించిందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రాజమహేంద్రవరంలోనే ముందుగా దేవాలయాలకు కమిటీలు చేయడం జరుగుతోందని, ఆలయాల పవిత్రతను కాపాడాల ఆయా కమిటీలకు పిలుపునిచ్చారు. నగర టీడీపీ అధ్యక్షులు మజ్జి రాంబాబు అధ్యక్షతన, 47వ డివిజన్ టీడీపీ ఇంచార్జ్ బేసరి చిన్ని పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు దొండపాటి సత్యంబాబు, వర్రే శ్రీనివాసరావు, యిన్నమూరి దీపు, నల్లం శ్రీను, ఉప్పులూరి జానకి రామయ్య, మరుకుర్తి రవి యాదవ్, శెట్టి జగదీష్, జామి సత్యనారాయణ, నిమ్మలపూడి గోవింద్, మొకమాటి సత్యనారాయణ, దాస్యం ప్రసాద్, తురకల నిర్మల, పిల్లి శ్యామ్, కందికొండ అనంత్, కానేటి కృపామణి, సలాది ఆనంద్, బొర్రా చిన్ని, కవులూరి వెంకట రావు, చింతపల్లి నాని, మళ్ల వెంకట రాజు, గుదే రఘు నరేష్, దుత్తరపు గంగాధర్, చాపల చిన్న రాజు, కానేటి ప్రభు దాస్, మదినా సాహెబ్, అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

ఈసీ తక్షణమే చర్యలు చేపట్టాలి: నరేన్

ఈసతక్షమే కమలాపురము ఆగస్టు (పున్నమి ప్రతినిధి) కమలాపురం వైయస్సార్ సిపి ఇన్ చార్జ్ నరేన్ రామాంజుల రెడ్డి కమలాపురం స్థానిక పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పులివెందుల, ఒంటిమిట్టలో నిన్న జరిగిన జడ్పిటిసి ఉప ఎన్నికలు కూటమి ప్రభుత్వం ఆప్రజాస్వామికంగా నిర్వహించింది. బై ఎలక్షన్ లను సభ్య సమాజం తలదించుకునేలా కూటమి ప్రభుత్వం ప్రవర్తించింది. కూటమి ప్రభుత్వం మొదటి సంవత్సరంలో ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసింది. రెండవ సంవత్సరంలో తల్లికి వందనం అంటూ కొంతమందికే ఇచ్చి చేయి దులుపుకుంది.కూటమి ప్రభుత్వానికి ప్రజల్లోకి పోయి ఓట్లు అడిగే దమ్ము ధైర్యం లేక ప్రజలను భయభ్రాంతులను గురిచేసింది.రోజుకో ఒకరిపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురిచేసినా వైసిపి నాయకులు ధైర్యంగా పోరాడారు.పులివెందుల, ఒంటిమిట్టలో 30 పోలింగ్ బూతులు, 35 వేల మంది ఓటర్లు ఉండగా 15 వేల మంది పోలీసులు నియమించడంలో అంతర్యం ఏమిటి. ఎవరిని చూసి ఎవరు భయపడుతున్నారో తెలియజేయాలి. ఒంటిమిట్ట కడప డివిజన్ ఎస్పీ పరిధిలో ఉంటే అన్నమయ్య జిల్లా ఎస్పీ వచ్చి విధులు నిర్వహిస్తూ అక్కడి ఎస్ఐలను సీఐలను పోలీసులను తెచ్చి రిగ్గింగ్ కు కీలక పాత్ర పోషించారు. బూతుల్లో ఉన్న అధికారులు కూడా కూటమి ప్రభుత్వానికి సహకరించారు. వీరిపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్. పులివెందులలో ఓటింగ్ జరుగుతుంటే కమలాపురం ఓటర్లకు అక్కడ ఏం పని. ఓట్లు వేశామని సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో చక్కర్లు కొలుతుంటే పోలీసు వ్యవస్థ ఏమి చేస్తుంది. పులివెందులలో దొంగ ఓట్లు వేయడానికి కూడా టిడిపి కి దిక్కులేక పక్క నియోజకవర్గం నుంచి తరలించారు. బైండ్ ఓవర్ కేసులు పెట్టి వైసిపి ఏజెంట్ అన్న అరెస్టు చేస్తే మహిళలు కుర్చుంటే మహిళలని చూడకుండా వారిపై అసభ్యకరంగా ప్రవర్తించి తరిమేశారు.అధికార మదంతో కూటమి నాయకులు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. మీ దౌర్జన్యాలను చూస్తూ ఊరుకుండేది లేదు వైయస్సార్సీపి గట్టిగా బదులిస్తుంది.పన్నుకు పన్ను, తన్నుకు తన్ను, చెంప దెబ్బకు చెంప దెబ్బ, చెప్పు దెబ్బకు చెప్పు దెబ్బ చేసి చూపిస్తుందని ఘాటుగా స్పందించిన నరేన్ రెడ్డి.

ఖమ్మం

నల్ల మల్ల రంజిత్ ని అభినందించిన నందమూరి బాలయ్య

ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నందు హిందూ పురం శాసన సభ్యులు నందమూరి బాలకృష్ణ తన తల్లి బసవతారకం పేరు మీద నడుపుతూన్న క్యాన్సర్ ఆసుపత్రి ని అమరావతి లో కూడా ఏర్పాటు చేయాలనే సదుద్దేశం తో బుధవారం భూమి పూజా కార్యక్రమం జరిపారు. ఈ కార్యక్రమం లో ఖమ్మం జిల్లా నందమూరి అభిమాన సంఘం నల్లమల్ల రంజిత్ వారి మిత్ర బృందం పాల్గొన్నారు. నల్లమల్ల రంజిత్ ఖమ్మం లో నడుపుతున్న అన్న క్యాంటిన్ గురించి తెలుసుకొని బాలయ్య నల్లమల్ల రంజిత్ కి అభినందనలు తెలిపారు.

అన్నమయ్య

రైల్వే కోడూరులో డ్రగ్స్ అబ్యూస్ ప్రతిజ్ఞ & హర్ ఘర్ తిరంగా కార్యక్రమం

రైల్వే కోడూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ యం. భాస్కర్ రెడ్డి గారి అధ్యక్షతన విద్యార్థులు డ్రగ్స్ అబ్యూస్ పై ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ గారు మాట్లాడుతూ యువత మాదకద్రవ్యాల వినియోగం నుండి దూరంగా ఉండాలని, అవి శారీరక, మానసిక ఆరోగ్యంపై కలిగించే దుష్ప్రభావాలను వివరించారు.తర్వాత, హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ గారి చేతుల మీదుగా ప్రారంభించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ, ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరేయాలని పిలుపునిచ్చారు. జాతీయ జెండా ప్రాధాన్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భాగంగా, కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు అయ్యవారిపల్లె గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి జాతీయ జెండా ప్రాధాన్యతను వివరించి, జెండాలు కట్టారు.ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి. రమేష్, స్కిల్ హబ్ కోఆర్డినేటర్ డాక్టర్ కె. రమేష్, ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ శ్రీ జి. దయానందం, డిఎఫ్‌ఏపీ కోఆర్డినేటర్ శ్రీ డి. వెంకటేశ్వర్లు, ఎన్‌.యస్‌.ఎస్‌. కోఆర్డినేటర్ శ్రీ దాసరి మోషే, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

అన్నమయ్య

రైల్వేకోడూరులో మాద శ్రీనివాస్ కు బత్యాల నివాళి

రైల్వేకోడూరు, ఆగస్టు 13 (పున్నమి ప్రతినిధి) రైల్వేకోడూరు పట్టణం హిమాంసాహెబ్ వీధి నివాసి, మాద ఫర్నీచర్ యజమాని మాద శ్రీనివాస్ నిన్న రాత్రి మృతి చెందారు.ఈ రోజు బుధవారం ఆయన పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ బత్యాల చంగల్ రాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా పలువురు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు మరియు సన్నిహితులు పాల్గొన్నారు.

తిరుపతి

తన రాజకీయ గురువుకి వీడ్కోలు పలికిన మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి .

శ్రీకాళహస్తి సీనియర్ రాజకీయ నాయకులు,మాజీ ఎమ్మెల్యే తాటిపర్తి చెంచు రెడ్డి అంతిమయాత్ర లో శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పాల్గొని తన రాజకీయ గురువు పాడే మోశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ తన రాజకీయ గురువు మరణించడం బాధాకరమని,శ్రీ కాళహస్తి కి చెంచు రెడ్డి చేసిన సేవలు ఎనలేనివాని కొనియాడారు.చెంచురెడ్డి అంతిమయాత్రలో దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు,చిదేపల్లి మధు తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

బోయపల్లి గ్రామంలో హరీష్ – నందిని వివాహం ఘనంగా

రైల్వే కోడూరు నియోజకవర్గం, చిట్వేల్ మండలం పోలోపల్లి పంచాయతీ బోయపల్లి గ్రామంలో శ్రీ సాకే నరసయ్య & శ్రీమతి సాకే లక్ష్మి దేవి కుమారుడు హరీష్ – నందిని వివాహ మహోత్సవం బోయపల్లి గ్రామం వారి నివాసంలో ఘనంగా జరిగింది. వివాహ వేడుకకు రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారి కుమారుడు, యువ నాయకుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

జోగులాంబ గద్వాల

భారీ వర్ష సూచన నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి….జిల్లా కలెక్టర్ బి. యం. సంతోష్.

అలంపూర్ : ఆగస్టు 13 ( పున్నమి ప్రతినిధి )జోగులాంబ గద్వాల జిల్లా, రానున్న 72 గంటలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికల నేపధ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ ఒక ప్రకటనలో సూచించారు. భారీ వర్ష సూచనల నేపధ్యంలో ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా, సమర్ధవంతంగా ఎదుర్కొనేలా అధికారులు అన్ని విధాలుగా సన్నద్ధం అయి ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తున్నామని, అధికారులు, సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ముఖ్యంగా రెవెన్యూ, పోలీస్, వైద్యా, ఇరిగేషన్, విద్యుత్, పంచాయతీ రాజ్, రోడ్లు-భవనాల శాఖలు, విపత్తు నిర్వహణ సంస్థలు రాబోయే మూడు రోజుల పాటు అప్రమత్తంగా ఉంటూ, క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు తలెత్తితే వెంటనే సమాచారం అందించాలన్నారు. చెరువులు, కాలువలు, నదులలో చేపల వేట, ఈత కోసం ఎవరూ వెళ్ళకుండా కట్టడి చేయాలన్నారు. పురాతన, శిథిలావస్థకు చేరిన భవనాలలో ఉంటున్న వారిని వెంటనే ఖాళీ చేయించాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలన్నారు.జిల్లాలో అన్ని పీ.హెచ్.సీలు, ఆసుపత్రులలో సరిపడా మందుల స్టాక్ ను అందుబాటులో పెట్టుకుని, వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండేలా పర్యవేక్షణ చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఎలాంటి పరిస్థితులు తలెత్తిన సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామని, ప్రజలు ఆందోళనకు గురి కావద్దని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ భరోసా కల్పించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.