Monday, 11 May 2026

Blog

అన్నమయ్య

రైల్వే కోడూరు నియోజకవర్గంలో రూ.7.52 కోట్ల వ్యయంతో రహదారి అభివృద్ధి పనుల ప్రారంభం

ఓబులవారిపల్లి, ఆగస్టు 13: పున్నమి ప్రతినిధి ఓబులవారిపల్లి మండలం చిన్నఓరంపాడు గ్రామంలో రూ.7.52 కోట్ల వ్యయంతో నిర్మించిన తారు రహదారి పనులను రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ & కడప అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ గౌ. శ్రీ ముక్కా రూపానంద రెడ్డి గారు, యువ నాయకుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు మంగళవారం ఘనంగా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో సి.కె. రోడ్డునుంచి తుమ్మకొండవడ్డిపల్లి, కాకర్లవారిపల్లి, పెద్దఓరంపాడు, చిన్నఓరంపాడు మీదుగా సి.ఆర్.ఎ. రోడ్డువరకు రహదారి నిర్మాణం చేపట్టబడుతోంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం అంచనా వ్యయం రూ.752.55 లక్షలు. ఈ సందర్భంగా రూపానంద రెడ్డి గారు మాట్లాడుతూ, “ఈ రహదారి నిర్మాణం వల్ల గ్రామాల మధ్య రవాణా సౌకర్యం మెరుగుపడింది. పల్లెప్రజలకు సులభమైన రాకపోకలు కలుగుతాయి. మరిన్ని అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసి ప్రజల వినియోగానికి అందించడానికి కృషి చేస్తాము” అని అన్నారు. స్థానిక గ్రామస్థులు రహదారి నిర్మాణంపై ఆనందం వ్యక్తం చేసి, ప్రభుత్వం మరియు ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, NDA కూటమి నేతలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

తెలంగాణ

మహానీయుల విగ్రహాలను శుభ్రం చేసిన బి. జె. పి. నాయకులు

నకిరేకల్ :ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి ) తెలంగాణ రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం 79 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నకిరేకల్ లోని మహనీయుల విగ్రహాలున్న బస్టాండ్ దగ్గరలోని బి. ఆర్. అంబేద్కర్, గాంధీల విగ్రహాలను శుభ్రం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఇంటిపైనా జాతీయజెండాను ఎగురావేయాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో నకిరేకల్ పట్టణ బి. జె. పి. అధ్యక్షులు గర్రె మురళీమోహన్ గారు, జిల్లా కౌన్సిల్ సభ్యులు జానీ గారు, పందాల సైదులు గౌడ్, భువనగిరి వెంకటేశ్వర్లు, చందుపట్ల వేణుమాధవ్, కారింగుల యాదగిరి రాజయోగి తదితరులు పాల్గొని కార్యక్రమంను విజయవంతం చేశారు.

జోగులాంబ గద్వాల

వాగు ప్రవాహాలు దాటకండి… జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు

అలంపూర్ : ఆగస్టు 13 ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకుండా వాగులు వంకలు దాటే ప్రయత్నం చేయకండనీ ప్రజలకు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప బయటకి రాకండని సూచించారు. అలంపూర్ నియోజకవర్గం మానవపాడు మండల కేంద్రంలో ప్రవహిస్తున్న పెద్దవాగును ఆయన పరిశీలించారు. గ్రామాల్లో వాగులు ప్రవహించే చోట ఇరువైపులా భారీగేడ్లు ఏర్పాటు చేయాలని.. పోలీసులు వాగులు వంకలు ప్రవహించే చోటే అక్కడ గస్తీలు నిర్వహించాలన్నారు. రాత్రి వేళలో కూడా వర్షాలు కురిసి వాగులు వంకలు పొంగి ప్రమాదం ఉందని. అలా ప్రవహించే చోట సరిహద్దు ఇరువైపు భారీ లైట్లు ఏర్పాటు చేసి వెలుతురు ఉండేటట్లు చూడాలన్నారు. మన పోలీసులు గస్తీలు చేసేవాళ్లు రైన్ కోట్స్ ధరించి జాగ్రత్తలు పాటిస్తూ విధులు నిర్వహించారు. ఎక్కడ ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు కూడా తెలియజేశారు. కార్యక్రమంలో సిఐలు టాటా బాబు, రవిబాబు, ఎస్సై చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ

చిత్తలూరు గ్రామంలో మహంకాళమ్మ పండుగ

నకిరేకల్ :ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి ) శాలిగౌరారం మండలంలోని చిత్తలూరు గ్రామంలో శ్రీ మహంకాళమ్మ పండుగను మంగళవారం (12 ఆగస్ట్ 2025) నాడు భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు. పండుగ రోజు ప్రజలు వారి యొక్క ఎడ్లబండ్లను మరియు ట్రాక్టర్లను మహంకాళమ్మ గుడి చుట్టూ త్రిప్పడం సాంప్రదాయంగా వస్తుందని, ప్రతి శ్రావణమాసంలో మహంకాళమ్మ పండుగను జరుపుకంటారు. ఉద్యోగరీత్యా వివిధ ప్రదేశాల్లో ఉన్న వారందరు ఊరికి వచ్చి పండుగను తమవారితో సంతోషంగా జరుపుకున్నారు.

ఖమ్మం

ఖమ్మం జిల్లా కి రెడ్ అలెర్ట్..

ఖమ్మం ఆగష్టు ( పున్నమి ప్రతినిధి ) తెలంగాణ కి భారీ వర్షాల సూచనలతో వాతావరణ శాఖ అధికారులు ఖమ్మం జిల్లా కి రెడ్ అలెర్ట్ జారీ చేశారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరం అయితే తప్ప బయట కి రావద్దు అని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం జిల్లా లోని విద్యాసంస్థల కి సెలవులు ప్రకటించే అవకాశం ఉంది

E-పేపర్

మంత్రి నాదెండ్ల మనోహర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన గురివిగారి వాసు

రైల్వే కోడూరు మార్కెట్ కమిటీ చైర్మన్ వరలక్ష్మి గారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్ ని రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అత్తికారి కృష్ణా ఆధ్వర్యంలో రాజంపేట జనసేన నాయకులు ఉమ్మడి కడప జిల్లా ప్రోగ్రామ్ కమిటీ సభ్యులు గురివిగారి వాసు మంత్రి నాదెండ్ల మనోహర్ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

చింతం రెడ్డి వారి పెళ్లి సందడి

సీతారాంపురం ఎంపీపీ చింతం రెడ్డి పద్మావతమ్మ వెంకట సుబ్బారెడ్డి గారి కుమారుడు చింతంరెడ్డి లోకేష్ రెడ్డి వివాహ మహోత్సవములో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన వైస్సార్సీపీ ఉదయగిరి నియేజకవర్గ సమన్వయ కర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి మరియు వైస్సార్సీపీ నాయకులు

ఖమ్మం

జాతీయ ST కమిషన్ సభ్యునికి ఘన స్వాగతం

ఖమ్మం ఆగష్టు ( పున్నమిప్రతినిధి ) అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఖమ్మం వచ్చిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతూ హుస్సేన్ నాయక్ కి బిజెపి తెలంగాణ రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ, కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు చావా కిరణ్ బిజెపి జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు, బిజెపి జిల్లా నాయకులు ఆచంటి కోటేశ్వరరావు,స్వర్ణకార్ ఖమ్మం రూరల్ మండలం బిజెపి అధ్యక్షులు జాటోతూ మధు నాయక్, స్వాగతం పలికారు అనంతరం బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా శ్యాం సుందర్ నాయక్ వివిధ సమస్య ల పరిష్కారం కోరుతూ జాటోతూ హుస్సేన్ నాయక్ కి వినతి పత్రం అందజేశారు.

ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే కాకర్ల సురేష్, ఆర్టీసీ చైర్మన్, సన్నపురెడ్డి సురేష్ రెడ్డి,ఆదేశాలతో కదిలిన పల్లె వెలుగు..!బస్సు ప్రయాణం కల నెరవేరిన వేళ పల్లె ప్రజల ఆనందం..!!!

వింజమూరు ఆగస్టు 13 పున్నమి ప్రతినిధి : వింజమూరు మండలం బుక్కాపురం గ్రామానికి, పల్లె వెలుగు ప్రయాణం కల నెరవేరింది. ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్, సహకారంతో, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి, సౌజన్యంతో, ఉదయగిరి, ఆత్మకూరు డిపో మేనేజర్, శివ కేశవ్ యాదవ్, ఆదేశాలతో వింజమూరు టు ఆత్మకూరు వయా బుక్కాపురం మీదుగా, ఉదయం, సాయంత్రం రెండు పర్యాయాలు, గ్రామంలోనికి పల్లె వెలుగు బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. బుధవారం అధికారుల ఆదేశాలతో బుక్కాపురం గ్రామానికి చేరుకున్న ఆర్టీసీ బస్సుకు, సర్పంచ్ రసూల్, ఉప సర్పంచ్ కాటం రమణారెడ్డి గ్రామస్తులు పూజల నిర్వహించారు. బస్సును అరటి బోదేలు ,మామిడి తోరణాలతో అలంకరించారు. కో క్లస్టర్ కన్వీనర్ పాములపాటి మాల్యాద్రి కొబ్బరికాయ కొట్టి బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత వైసిపి ప్రభుత్వం లో గ్రామస్తులు బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరినప్పటికీ, వారి కోరిక నెరవేరలేదు అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత, ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారికి గ్రామస్తులు, గ్రామ మరియు మండల నాయకుల సహకారంతో విన్నవించగా, వెంటనే స్పందించిన ఎమ్మెల్యే, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లారు. వెంటనే ఆర్టీసీ అధికారులతో మాట్లాడి బుక్కాపురం గ్రామానికి బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారని, తెలిపారు. ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారికి, చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారికి, డిపో మేనేజర్ శివ కేశవ్ యాదవ్ గారికి రుణపడి ఉంటామని తెలిపారు. ఈ బస్సు సౌకర్యం విద్యార్థులకు మాకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆనందం వ్యక్తం చేశారు. సహకరించిన నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేసిందని, ఆగస్టు 15 నుండి స్త్రీ శక్తి పేరుతో మహిళలందరికీ ఉచిత ప్రయాణం సౌకర్యం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు లక్ష్మీనారాయణ, గడ్డం శ్రీనివాసులురెడ్డి, కామినేని లక్ష్మీనారాయణ,బాలకృష్ణ, శ్రీను, మస్తాన్, దొరస్వామి నాయుడు, విజయ తదితరులు ఉన్నారు.

జోగులాంబ గద్వాల

జూరాల ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి దిగువనకు నీరు విడుదల.

అలంపూర్ : ఆగస్టు 13 ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా, కర్ణాటకలోని ఎగువ జలాశయాల నుంచి జూరాల జలాశయానికి వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు 10 గేట్లు ఎత్తి దిగువనకు నీరు విడుదల, ఇన్ ఫ్లో…1,15,174 వేల క్యూసెక్కులు, అవుట్ ఫ్లో..1,18,835 క్యూసెక్కులు, ప్రాజెక్ట్ ప్రస్తుత నీటి నిల్వ..317.170 మీటర్లు, ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం..318.816 మీటర్లు, జూరాల ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ..7.185 టీఎంసీలు, ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం..9.657 టీఎంసీలు. దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో 11 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.