Monday, 11 May 2026

Blog

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

కొత్తపేట ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రమాదం! నారా లోకేష్ పరామర్శ.

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ ఆగస్టు 13 పున్నమి ప్రతినిధి: కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆలమూరులో రైతు సంబరాలు వేడుకలకు బుధవారం ఆయన విచ్చేశారు. వేలాదిగా తరలివచ్చిన రైతుల మధ్యన ఎడ్ల బండి ఎక్కి నినాదాలు చేస్తున్నారు. ఆ సమయంలో బండి కి కట్టిన బెలూన్లు పేలాయి. దీంతో ఎద్దులు ఒక్కసారిగా రంకెలు వేసాయి. అంతే ఆ బండి మీద ఉన్న ఎమ్మెల్యే బండారు తో పాటు రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగు యువత అధ్యక్షులు చిలువూరి సతీష్ రాజు తదితరులు ఒకసారిగా కింద పడిపోయారు. అయితే సతీష్ కాలుకు ప్యాచ్చర్ కాగా మిగిలిన వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. రైతు కుటుంబం నుంచి వచ్చిన ఎమ్మెల్యే బండారు బండిని చాకచక్యంగా పట్టుకోవడం వల్ల ఆయనకు ప్రమాదం తప్పింది. స్వల్ప గాయాలు అయ్యాయి. అయినప్పటికీ యధావిధిగా రైతు సంబరాలు వేడుకల్లో ఆయన పాల్గొని రైతులకు సందేశం ఇచ్చారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే విద్యా శాఖ మంత్రి నారా లోకేష్, జిల్లా ఇన్ చార్జి మంత్రి అచ్చంనాయుడు, కలెక్టర్ మహేష్ కుమార్, ఎస్పీ కృష్ణారావు,పలువురు ఎమ్మెల్యేలు తదితరులు ఫోన్లో ఎమ్మెల్యే బండారును పరామర్శించారు.

చిత్తూరు

శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలకు సీఐకి ఆహ్వానం

“త్రైత సిద్ధాంతం- ప్రబోధ సేవా సమితి ఇందూ జ్ఞాన వేదిక పలమనేరు కమిటీ” ఆధ్వర్యంలో శ్రీ కృష్ణాష్టమి వేడుక, ఊరేగింపు ఆగస్టు నెల 16 వ తేది పలమనేరు, మదనపల్లి రోడ్ రఘువీర రెడ్డి కాలనీ ఎదురుగా వేదిక వద్ద పూజలు చేసి మధ్యాహ్నం 1 గంటకు ఊరేగింపు నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను పలమనేరు సి.ఐ నరసింహ రాజుకి ఉత్సవ కమిటీ సభ్యులందరూ కలిసి వారిని ముఖ్య అతిథిలు గా విచ్చేయమని ఆహ్వానించారు. అనంతరం సీఐ తప్పక వస్తామని అన్నారు.. అలాగే ఘాంటావురు గంగమ్మ గుడి ఛైర్మన్ మురుగన్ ను కలిసి ఆహ్వానించారు జరిగింది. ఈ కార్యక్రమం లో *త్రైత సిద్ధాంత ప్రబోధ సేవా సమితి ఇందూ జ్ఞాన వేదిక పలమనేరు కమిటీ అధ్యక్షుడు రెడ్డి భాస్కర్, జ్యోతి, సరళ, రోజా, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణం!

రాజమహేంద్రవరం ఆగస్టు 13 పున్నమి ప్రతినిధి: ఉత్తర ఆంధ్రప్రదేశ్ & దక్షిణ ఒడిశా తీరానికి సమీపంగా అల్పపీడనం ఏర్పడటంతో, ఆగస్టు 13 నుండి 14 వరకు జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు, ఆమేరకు క్షేత్ర స్థాయిలో తగిన చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. బుధవారం రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, సిసిఎల్ఏ కమిషనర్ జి జయలక్ష్మి లు అమరావతి నుంచి దృశ్య మాధ్యమం ద్వారా జిల్లా కలెక్టర్ లకు ముందస్తు చర్యలు పై సూచనలు చేయడం జరిగింది. స్థానిక కలెక్టరేట్ దృశ్య మాధ్యమ సమావేశ మందిరం నుంచి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి!సియం చంద్రబాబు

వరద ప్రవాహాలను ఎప్పటికప్పుడు అంచనా వేసి ప్రజలకు తక్షణ సమాచారం. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. అమరావతి, ఆగస్టు 13 పున్నమి ప్రతినిధి: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమీక్షకు మంత్రులు వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, సీఎస్ విజయానంద్ తదితరులు హాజరయ్యారు. విపత్తు నిర్వహణ, వ్యవసాయం, జలవనరుల శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ అత్యవసర సమీక్షలో పాల్గొన్నారు. వాతావరణ శాఖ సూచనల మేరకు రాగల రెండు మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తత చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో వాగులు వంకల నుంచి వచ్చే ఆకస్మిక వరద ప్రవాహాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ దిగువన ఉన్న ప్రాంతాలకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం కృష్ణా నదిలో రేపటికల్లా 5 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు సీఎంకు వివరించారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ నుంచి 3.09 లక్షల క్యూసెక్కుల నీరు 35 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నామని తెలిపారు. కాలువలకు 5 వేల క్యూసెక్కుల మేర నీరు విడిచిపెట్టినట్టు అధికారులు సీఎంకు తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం ప్రకాశం బ్యారేజికి దిగువన ఉన్న ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. మరోవైపు ఎగువన నాగార్జునసాగర్, పులిచింతల గేట్లను కూడా ఎత్తినట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని తక్షణం తొలగించేందుకు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. వరద నీటిని సద్వినియోగం చేయండి ఎగువ నుంచి వస్తున్న నీటిని సద్వినియోగం చేసుకునేలా రోజుకు నాలుగు టీఎంసీల చొప్పున తరలించి సోమశిల, కండలేరు ప్రాజెక్టులను నింపాలని సీఎం ఆదేశించారు. వరద నీటిని వృధాగా సముద్రంలోకి పోనీయకుండా సద్వినియోగం చేసుకునేలా సమర్ధ నీటి నిర్వహణ చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. మైలవరం సహా ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షం బుడమేరు, వెలగలేరులకు పెద్ద ఎత్తున వస్తోందని.. ఈ నీరు కృష్ణా నదిలోకి డిశ్చార్జి చేస్తున్నట్టు తెలిపారు. బుడమేరు డైవర్షన్ ఛానల్ పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నట్టు వివరించారు. వరద నిర్వహణా పనుల్లో భాగంగా రూ.40 కోట్లతో బుడమేరు- వెలగలేరు యూటీ నిర్మాణాన్ని చేపట్టేందుకు ముఖ్యమంత్రి అనుమతి మంజూరు చేశారు. గండ్లు పడకుండా గట్లు పటిష్ట పర్చాలి మరోవైపు భారీవర్షం కారణంగా కొండవీటి వాగు, పాల వాగులకు వస్తున్న నీటిని కృష్ణా నదిలోకి నాలుగు పంపుల ద్వారా నీటిని ఎత్తి పోస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వర్షకాల సీజన్ లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాలువల్లో నీటి ప్రవాహాలు సక్రమంగా వెళ్లేందుకు వీలుగా గుర్రపు డెక్క, తూడును తొలగించాలని ముఖ్యమంత్రి జలవనరులశాఖ అధికారులను ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. అలాగే కాలువలు, చెరువులకు గండ్లు పడకుండా గట్లను పటిష్టం చేయాలని సీఎం సూచించారు. జిల్లాల్లో వర్షాల పరిస్థితిపై ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లు కూడా అప్రమత్తంగా ఉండి రైతులకు తక్షణ సమాచారం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో భూగర్భ జలాలను రీఛార్జి చేసేలా నిర్మాణాలను చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. పంచాయతీరాజ్, అటవీశాఖ అధికారులు ఆయా ట్రెంచ్ లను ఎక్కడెక్కడ చేపట్టాలో ప్రణాళిక చేసుకోవాలన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ ట్రెంచ్ లను తవ్వేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.

తిరుపతి

తిరంగా ర్యాలీ

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మరియు జిల్లాల సూచనలు మేరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ నేతృత్వంలో శ్రీకాళహస్తి బేరివారి మండపం నుండి తిరంగా ర్యాలీ14.08.25 వ తేదీ ఉదయం 9 గంటలకు ప్రారంభమై నాలుగు మాడ వీధుల మీదుగా సాగి తిరిగి బేరివారి మండపం వద్దకు చేరును.కావున ఈ ర్యాలీలో విద్యార్థులు,యువకులు, పెద్దలు,మహిళలు, దేశభక్తులు,NDA కూటమి నాయకులు,కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయవలసినదిగా కోరుకుంటున్నాము.

ఆంధ్రప్రదేశ్

సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ట్రస్టు బోర్డు మెంబర్ గా చిట్టూరి

కోనసీమ: అమలాపురం పట్టణం లో వేంచేసి ఉన్న శ్రీ కృష్ణేశ్వర సుబ్రహ్మణ్యస్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ ల లిస్ట్ విడుదల చేశారు. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు, అమలాపురం కి చెందిన చిట్టూరి రాజేశ్వరికి డైరెక్టర్ గా నియమించినట్లు లిస్ట్ లో వచ్చింది. ఈ సందర్భంగా ఆమెను పలువురు బీజేపీ నాయకులు అభినందిస్తున్నారు.

అన్నమయ్య

కట్నం మరణ కేసు: భర్తకు 10 సంవత్సరాల జైలు శిక్ష

అన్నమయ్య జిల్లా – నందలూరు ముఖ్యమైన తీర్పులో, రాజంపేట 3వ అదనపు జిల్లా జడ్జి కోర్టు బుధవారం వరకట్న వేధింపుల కారణంగా తన భార్య మరణానికి కారణమైనందుకు పామూరి సాయి వర్ధన్‌కు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఏప్రిల్ 29, 2023న, మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో, వర్ధన్ భార్య పామూరి లక్ష్మీ ప్రసన్న అదనపు కట్నం కోసం వేధింపులు భరించలేక నందలూరులోని బ్రాహ్మణ వీధిలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకుంది. ఆమె తండ్రి రావూరు కనకరత్న ఆచారి నందలూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసును క్రైమ్ నంబర్ 79/2023, సెక్షన్ 304(B) IPC కింద నమోదు చేసి, అప్పటి ASI J.V. సుబ్బారాయుడు దర్యాప్తు చేశారు, DSPలు G. శివ భాస్కర్ రెడ్డి మరియు V.N.K. చైతన్య పర్యవేక్షణలో కేసు నమోదు చేశారు. సమగ్ర దర్యాప్తు మరియు కోర్టులో సాక్ష్యాలను సమర్పించిన తర్వాత, న్యాయమూర్తి వై.ఎస్. ప్రవీణ్ కుమార్ తీర్పు వెలువరించారు, నిందితుడికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించారు. జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు (ఐపీఎస్), దర్యాప్తు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కె. వేణుగోపాల్ మరియు ఎస్.ఎం.డి. జాని బాషా, రాజంపేట రూరల్ సిఐ బి.వి. రమణ, ఎస్ఐ వి. మల్లికార్జున రెడ్డి, కోర్టు కానిస్టేబుల్ బి. వెంకటరమణ నాయక్ మరియు విజయవంతమైన శిక్షను నిర్ధారించినందుకు సాక్షుల కృషిని ప్రశంసించారు. ఈ తీర్పు వరకట్న వేధింపులకు వ్యతిరేకంగా కఠినమైన హెచ్చరికగా ఉపయోగపడుతుందని ఎస్పీ వ్యాఖ్యానించారు.

ఆంధ్రప్రదేశ్

మా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించండి…

నాయుడుపేట,ఆగస్టు పున్నమి ప్రతినిధి దిలీప్ కుమార్  నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని శెట్టిపల్లివారీ వీధిలో ఉన్న మురికి కాలువలు పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది మురుగు నీరు కాలువ నుంచి బయటకు వచ్చి ఇళ్ళ మధ్యలో చేరుతుంది దాని నుంచి విపరీతమైన దుర్వాసన మరియు దోమలు చేరుతున్నాయి. దీని గురించి ఎన్ని సార్లు మున్సిపాలిటీ అధికారులకు విన్నవించుకున్న దానిని పట్టించుకునే నాథుడు లేదని, కాలువలు పూడిక తియ్యడానికి వచ్చినవారు కూడా తు తు మంత్రం గా చేసి వెళ్తున్నారు , ఇప్పటికైనా అక్కడ  ఉన్న సమస్య తెలుసుకుని దానికి శాశ్వత పరిష్కారం చూపాలని శెట్టిపల్లి వారి వీధి ప్రజలు కోరుకుంటున్నారు

అన్నమయ్య

రైల్వే కోడూరు నియోజకవర్గంలో 5.70 కోట్లతో కోడూరు–గుర్రప్పాళెం వంతెనకు భూమిపూజ

రైల్వే కోడూరు మండలం గుంజన ఏరు వద్ద రూ. 5 కోట్ల 70 లక్షల వ్యయంతో నిర్మించబడనున్న కోడూరు–గుర్రప్పాళెం వంతెనకు ఈ రోజు ఘనంగా భూమి పూజ జరిగింది.ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ ఇంచార్జ్ & కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారు, యువ నాయకుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు పాల్గొన్నారు.సుమారు 16 గ్రామాల ప్రజలకు రాకపోకల సౌకర్యం కల్పించనున్న ఈ వంతెన స్థానికుల ఎన్నో సంవత్సరాల కల. గ్రామస్తుల దీర్ఘకాలిక పోరాటం, రూపానంద రెడ్డి గారి కృషితో ఇది సాకారం అవుతోంది.వంతెన పూర్తయిన తర్వాత కోడూరు అభివృద్ధికి ఇది మైలురాయి అవుతుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బత్యాల చెంగల్ రాయుడు గారు, అధికారులు, కూటమి నాయకులు, గ్రామ పెద్దలు, యువత మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

అమలాపురం పాశర్లపూడి లో ఓఎన్జీసీ గ్యాస్ కలకలం

13 ఆగస్టు పున్నమి ప్రతినిధి : డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పరిధిలోని పాసర్లపూడి లంకలో ఓఎన్జీసీ నిర్వహిస్తున్న డ్రిల్లింగ్ బావిలో బుధవారం గ్యాస్ కిక్ ఇచ్చింది. భారీ శబ్దంతో బావిలోంచి గ్యాస్ పైకి తన్నడంతో రిగ్గుపై ఉన్న నిపుణులు పరుగులు తీశారు. ఓఎన్జీసీకి చెందిన E 2003 నంబర్ గల రిగ్గుతో ఇక్కడ డ్రిల్లింగ్ చేస్తున్నారు. 2900 మీటర్ల లోతు లక్ష్యం కాగా, 2800 మీటర్లు పూర్తయింది. గ్యాస్ కిక్‌ను అధికారులు నియంత్రించారు. పాసర్లపూడి లంక ప్రజలు భయందాలకు గురయ్యారు. కొద్దిసేపటికి గ్యాస్ కిక్‌ను అధికారులు నియంత్రించటంతొ పాసర్లపూడి లంక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.