Monday, 11 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

పంచాయతీల్లో రేపు ప్రత్యేక గ్రామసభలు

ఆంధ్రప్రదేశ్ ఆగస్టు 14 పున్నమి ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్ లో మూడు కీలక అంశాలపై గ్రామ పంచాయతీల్లో ఆగస్టు 15న ప్రత్యేక గ్రామసభలు నిర్వ హించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను బుధవారం ఆదేశించింది. పునరుత్పాదక ఇంధన పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, పశుసంవర్ధకశాఖ సహకారంతో కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించి వాటి సంరక్షణ చర్యలు తీసుకోవడం, పంచాయతీల సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి అమలు చేయడంపై ప్రధానంగా గ్రామసభల్లో చర్చించి తీర్మానాలు చేయాలని కేంద్రం సూచించింది. స్థానిక సంస్థల పాలనలో ప్రజల భాగస్వామ్యం కోసం ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తా యని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ మేరకు రాష్ట్రంలోని 13,326 పంచాయతీల్లో శుక్రవారం ప్రత్యేక గ్రామసభల నిర్వహణకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ చర్యలు చేపట్టింది.

ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాలతో,రైతు రథాలతో అన్నదాత సుఖీభవ భారీ ర్యాలీ,, ఈ ర్యాలీలో పాల్గొన్న రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వహాక కార్యదర్శి బొల్లినేనీ వెంకటరామారావు..!!!

దుత్తలూరు,ఆగస్టు13: పున్నమి ప్రతినిధి:: ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారి ఆదేశాల మేరకు,అన్నదాత సుఖీభవ ద్వారా రైతన్నలకు అండగా నిలిచిన, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంఘీభావంగా ఉదయగిరి నియోజకవర్గంలోని రైతన్నలు తమ రైతు రథాల ద్వారా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వహక కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు,,అనంతరం ఆయన మాట్లాడుతూ,బుధవారం నియోజకవర్గంలోని దుత్తలూరు మండల కేంద్రం తహసిల్దార్ కార్యాలయం నుండి ఉదయగిరిలోని ఏఎంసి మార్కెట్ యాడ్ వరకు రైతన్నలు టాక్టర్లతో వర్షాన్ని సైతం లెక్కచేయక భారీ ర్యాలీ నిర్వహించారుఅనీ ఆయన అన్నారు. అన్నదాత సుఖీభవ ద్వారా 46.5 లక్షల రైతన్నలకు, రూ 2325 కోట్ల లబ్ది చేకూరిందన్నారు. మన జిల్లా లో అన్నదాత సుఖీభవ మొదటి విడత లో మొత్తం 1,95,866 మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.5,000/-చొప్పున మొత్తం 97.933 కోట్లు రూపాయలు ఆర్థిక సహాయం లభించనుందని తెలిపారు. అదే విధంగా పి యం కిసాన్ 20వ విడత కింద జిల్లా వ్యాప్తంగా 1,68,350 మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.2,000/-చొప్పున 33.67 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం లభించనుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాలోని దర్శి నియోజకవర్గం పరిధిలోని ఈస్ట్ వీరయ్యపాలెం గ్రామంలో ఈనెల 1వ తేదీన ప్రారంభించారన్నారు.అలాగే జాతీయ స్థాయి లో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ వారణాసిలో ప్రారంభించారని తెలిపారు. దీనిద్వారా సాగుదారుల కుటుంబాలు అనగా స్వంతంగా సాగు భూమిని కలిగిన రైతు కుటుంబాలు మరియు ఆర్ ఓ ఎఫ్ ఆర్ భూములు సాగుచేసే కుటుంబాలకు రూ.20,000/- వార్షికంగా ప్రయోజనం లభించింది అన్నారు.ఇందులో రూ.6,000/- కేంద్ర ప్రభుత్వం నుండి పీఎం కిసాన్ పథకం ద్వారా, రూ 14000/- రాష్ట్ర ప్రభుత్వం నుండి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా లభిస్తుందని తెలిపారు. ఈ విడత లో ప్రతి రైతుకు ఏడి ఎస్ బి కింద 5 వేలు, పీఎం కిసాన్ కింద 2 వేలు కలిపి మొత్తం 7 వేల ఆర్ధిక సహాయం లభిస్తుందని తెలిపారు.ఒకవేళ ఈ విడత లో అర్హత కల్గిన రైతులు ఆర్ధిక సహాయం పొందనట్లయితే మీ సమీపంలో ఉన్న రైతు సేవకేంద్రము ను సంప్రదించి అవసరం అయిన పత్రాలు సమర్పిస్తే మలివిడత లో మొత్తం పొందవచ్చునని వివరించారు. అలాగే2025-26 సంవత్సరానికి సంబంధించిన ఉదయగిరి నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవ సుమారు 44 వేల మందికి 30.42 కోట్లులబ్దిచేకూరిందిఅన్నారు.మండలాల వారీగా, ఉదయగిరి 4693 మందికి దుత్తలూరు 4396, వరికుంటపాడు 5387, సీతారాంపురం,2881 వింజమూరు 4705 కలిగిరి7756 కొండాపురం7029 జలదంకి 6622 మంది రైతులు అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులయ్యారన్నారు.కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తుంది అన్నారు. తల్లికి వందనం పథకం ద్వారా ఎంతోమంది తల్లులకు లబ్ధి చేకూరిందన్నారు.అమ్మ ఒడికి, తల్లికి వందనం పథకానికి పోలిక లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం ద్వారా 13 వేల రూపాయలు జమ చేయడం జరిగిందన్నారు. వైసిపి ప్రభుత్వం అంకెల గారి తప్ప చేసింది ఏమీ లేదు అన్నారు. ఆగస్టు 15 నుండి స్త్రీశక్తి పేరుతో బస్సులో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించబడుతుందన్నారు. ఏడాది కాలంలో సుపరిపాలనలో రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని తెలిపారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, రాయలసీమను రతనాల సీమను చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.

ఖమ్మం

విద్యా సంస్థ ల మీద చర్యలు ఏవి..? బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఉపేందర్..

ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి ) *విలేకరుల సమావేశం లో మాట్లాడిన ఉపేందర్ గౌడ్ ఆజాదీ. జై పాలస్తీనా నినాదాలు చేస్తు ఖమ్మం లొ ర్యాలీ చేసిన హార్వెస్ట్,న్యువిజన్, BBM విద్యార్దులు.. ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలు తీసుకొని పొలీసులు.సుమోటోగా NIA &CBI సంస్థలు విచారణ జరపాలని భారతీయ జనతా యువమోర్చ ఖమ్మం జిల్లా అధ్యక్షులు అనంతు ఉపేందర్ గౌడ్ డిమాండ్ చేశారు… ఖమ్మం నగరంలో ప్రవేట్ స్కూల్ యాజమాన్యాలలో విద్యార్థులను స్కూల్ ఫీజులు మరియు భోజనం విషయాలలో విద్యార్థులకుఒత్తిడికి గురి చేసి మానసిక ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నటువంటి విషయాలు చాలా ఉన్నాయని కానీ వాటి మీద స్పందించిన ఈ స్కూల్ యాజమాన్యాలు ప్రపంచంలో ఎక్కడో దాడులు జరిగితే ఖమ్మం టౌన్ లో నిరసిస్తూ అదోలానలు నిరసన ర్యాలీలు చేయడం చాలా బాధాకరం అని అన్నారు.మన దేశం మీద ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు…మన దేశానికి మద్దతుగా కనీసం ర్యాలీలు తియ్యని ఖమ్మంలో కొన్ని ప్రైవేట్ స్కూల్ లు, ఈరోజు పాలిస్తినా దేశం కు మద్దతునిచ్చాయి అంటే సిగ్గుచేటు అని అన్నారు.

కాకినాడ

అల్పపీడనం బలపడుతుంది! కాకినాడ తీరప్రాంతానికి సమీపంలో ఉంది.

ఆగస్టు 14 పున్నమి ప్రతినిధి : అల్పపీడనం బలపడి మన రాష్ట్రంలోని కాకినాడ తీరప్రాంతానికి సమీపంలో ఉంది. ఇది ఇప్పటికే మధ్యాహ్నం నుండి అతి భారీ వర్షాలకు కారణమవుతోంది, ఇది అంచనా వేసినట్లే. ఇప్పుడు వర్షాలు మరో 6-7 గంటల పాటు విరామం లేకుండా కురుస్తాయి, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని లోతట్టు ప్రాంతాలకు విస్తరిస్తాయి. ఈ 6-7 గంటల విండోలో, మధ్య ఆంధ్రప్రదేశ్ జిల్లాలైన విజయవాడ, ఏలూరు, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, అనకాపల్లి, కోనసీమ మరియు పల్నాడు జిల్లాల్లోని చాలా ప్రాంతాలలో ఖచ్చితంగా అతి భారీ వర్షపాతం ఉంటుంది. అల్పపీడనానికి ఉత్తర ప్రాంతాలపై తూర్పు గాలులు వీయడం వల్ల, విశాఖపట్నం నగరంలో రేపు ఉదయం వరకు ఆగకుండా (తీవ్రమైన స్పెల్స్) వర్షాలు కురుస్తాయి. 10 నిమిషాల పాటు తీవ్రమైన వర్షం, గంట లేదా రెండు గంటలు విరామం, ఆపై మళ్ళీ 10 నిమిషాల తీవ్రమైన వర్షం ఉంటుంది. విజయనగరం, అనకాపల్లి, పెందుర్తి మరియు గాజువాక వంటి లోతట్టు ప్రాంతాలలో మంచి వర్షాలు కురుస్తాయి.

జాతీయ అంతర్జాతీయ

2030 కామన్వెల్త్ క్రీడలకు బిడ్.. ఐవోసీ ఆమోదం

2030 కామన్వెల్త్ క్రీడలకు బిడ్.. ఐవోసీ ఆమోదం బిడ్‌కు ఆమోదం తెలిపిన భారత ఒలింపిక్ సంఘం అహ్మదాబాద్ ఆతిథ్య నగరంగా ఇప్పటికే ఎంపిక ఆగస్టు 31 గడువుకు ముందే ప్రతిపాదనలను సమర్పించనున్న భారత్

ఆంధ్రప్రదేశ్

మన మిత్రలో కొత్త పెన్షన్లు గ్రీవెన్స్ సదుపాయం!ఆగస్టు 15 నుండి

ఆగస్టు 14 పున్నమి ప్రతినిధి : ఆగస్టు 15 నుండి కేవలం కొత్త పింఛన్ గ్రీవెన్స్ కోసం మన మిత్ర యాప్‌లో ప్రత్యేక సదుపాయం ప్రారంభం కానుంది. గ్రామీణ పెదరిక నిర్మూలన సొసైటీ (SERP) అధికారులు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. కొత్త పింఛన్ దరఖాస్తుదారులకు అర్హత, పత్రాల లోపాలు, పేరు సవరణలు, రికార్డు లోపాలు వంటి సమస్యలు ఎదురైనప్పుడు ఇకపై ప్రత్యక్షంగా కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, మొబైల్‌లోనే మన మిత్ర యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఎలా నమోదు చేయాలి? మన మిత్ర యాప్‌లోకి లాగిన్ అయ్యి, “New Pension Grievance” సెక్షన్‌ను ఎంచుకోవాలి. సమస్యకు సంబంధించిన కేటగిరీని ఎంపిక చేసి, అవసరమైన వివరాలు, పత్రాలు అప్‌లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. సంబంధిత అధికారి ఆ ఫిర్యాదును స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. యాప్‌లోనే స్టేటస్‌ను ట్రాక్ చేసే సౌకర్యం కూడా ఉంటుంది. ప్రయోజనాలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. కొత్త పింఛన్ సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి. ప్రభుత్వ ప్రక్రియలో పారదర్శకత పెరుగుతుంది.

తిరుపతి

ఆమె ఆచూకీ తెలియజేయండి.వన్ టౌన్ సిఐ

గతనెల 21 వ తేదీన సాయంత్రం శ్రీకాళహస్తిలో ని స్కిట్ బ్రాంచ్ నందు గల సీడీఎం మిషన్ లో ఒక వ్యక్తి రూ.39000 /-నగదు డిపాజిట్ చేసి వెళ్లిపోగా సీడీఎం మిషన్ డబ్బును తీసుకోకపోవడంతో వెనక్కి వచ్చింది.అది గమనించిన అక్కడే ఉన్న ఒక మహిళ ఆ డబ్బును తీసుకొని వెళ్ళిపోయింది.ఆమె ఆచూకీ తెలిసిన వారు 9440796762 నెంబర్ కి తెలియజేయాలని వన్ టౌన్ సిఐ కోరారు.

ఖమ్మం

జమ్మూ కాశ్మీర్ లో మరణించిన జవాన్ కి నివాళులు అర్పించిన జాతీయ st కమిషన్ సభ్యులు మరియు బిజెపి నేతలు

ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి ) శ్రీనగర్ లో రోడ్డు ప్రమాదంలో వీరమరణం పొందిన జవాన్ బానోత్ అనిల్ కుమార్ జన్మస్థలం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం సూర్య తండాలో అంతిమ యాత్రలో పాల్గొన్న జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు శ్రీ జాటోతు హుస్సేన్ నాయక్ , ఖమ్మం జిల్లా బిజెపి అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు పాలేరు అసెంబ్లీ కంటెస్టెడ్ అభ్యర్థి నున్న రవి కుమార్ గారు మరియు ఎస్టీ మోర్చ ఖమ్మం జిల్లా అధ్యక్షులు అధ్యక్షుడు రవి రాథోడ్. ఖమ్మం రూరల్ మండల అధ్యక్షులు జాటోత్ మధు తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

కృష్ణాజిల్లా మచిలీపట్నం

కృష్ణాజిల్లా పోలీస్ *గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకునే ఉత్సవ కమిటీలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలి – జిల్లా ఎస్పీ శ్రీ ఆర్. గంగాధరరావు, ఐపిఎస్.,* – పర్యావరణ రక్షణకు నిర్వాహకులు పోలీసువారికి సహకరించాలి. – ప్రజారోగ్యం మరియు భద్రత దృష్ట్యా DJ లు, బాణాసంచా పూర్తిగా నిషేదం. – వాహనాల రాకపోకలకు ప్రజాజీవనానికి అంతరాయం కలిగించేలా మండపాలు రోడ్లపై ఏర్పాటు చేయొద్దు. – సంభందిత శాఖల నుండి ముందస్తు అనుమతులు తప్పనిసరి. … *ఆర్.గంగాధర రావు, ఐపిఎస్, ఎస్పి కృష్ణా జిల్లా*. గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకునే నిర్వాహకులు, ప్రజలకు, ఇతరులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పి ఆర్.గంగాధర రావు ఐపిఎస్ గారు ఒక ప్రకటనలో తెలిపినారు. ▪️త్వరలో రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు ఉత్సవ కమిటీలు, యువత ముందస్తు ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని భద్రత పరమైన చర్యల దృష్ట్యా పోలీసు శాఖ సూచించే నియమ నిభందనలు పాటించాలని ఎస్పి గారు కోరారు. ▪️ మట్టి గణపతి ప్రతిమను ప్రతిష్టించి పర్యావరణ పరిరక్షణకు బాధ్యతగా ఉండాలని అన్నారు. ▪️ పరిసరాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకుంటూ, అధిక శబ్దాలతో కూడిన డీజే బాక్సులు వినియోగించడం వంటివి చేయరాదని, ప్రజలకు ఇబ్బంది కలిగేలా బాణసంచా కాల్చే వద్దని సూచించారు. ▪️ మండపాల ఏర్పాటుకు ముందస్తుగా అన్ని శాఖల నుండి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని అన్నారు. ప్రయాణికులకు, సామాన్యులకు, ఇతర మతస్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా మండపాలు ఏర్పాటు చేయడం మంచిది అని తెలిపారు. ▪️ మతసామరస్యాలకు ప్రతీకగా గణేష్ ఉత్సవాలు ఉండాలని అన్నారు. మండపాల వద్ద నిబంధనలు పాటించాలి, పోలీసు అనుమతులు తీసుకోవాలని కోరారు. శాంతి, సామరస్యానికి మనం పాటుపడాలి, సోదరభావంతో అందరూ కలిసి మెలిసి ఉత్సవాలను జరుపుకోవాలని సూచించారు. ▪️ జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు పటిష్ఠమైన పోలీసు భద్రత ఉంటుంది, ప్రశాంత వాతావరణంలో నవరాత్రులు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. *పోలీసు సూచనలు* 👉🏻 రోడ్లు ఆక్రమించి గణేష్ మండపాలు ఏర్పాటు చేయరాదు, ట్రాఫిక్ అంతరాయం కలిగించరాదు. 👉🏻 DJ ల వినియోగానికి , బాణాసంచా పేల్చుటకు కు అనుమతి లేదు. 👉🏻 మండపాల వద్ద మరియు ఊరేగింపు సమయంలో భక్తి సంబంధిత పాటలు మాత్రమే ప్రసారం చేయాలి. 👉🏻 మండపాలు ఏర్పాటు చేసే స్థలం పబ్లిక్ స్థలం అయితే సంబంధిత గ్రామ పంచాయితీ, మున్సిపాలిటీ అనుమతి పత్రం తీసుకోవాలి. 👉🏻 ప్రవేట్ వ్యక్తుల స్థలం అయితే స్థల యజమాని అనుమతి పత్రం తీసుకోవాలి. 👉🏻 ఉత్సవాలు ముగిసే వరకు ఉత్సవ కమిటీ సభ్యులు 24 గంటలు మండపాల వద్ద అందుబాటులో ఉండాలి. 👉🏻 మండపాల వద్ద CC కెమెరాలు అమర్చాలి. 👉🏻 విద్యుత్ శాఖ అనుమతి ఉండాలి. 👉🏻 వివాదాస్పద స్థలాల్లో గణేష్ మండపాలు ఏర్పాటు చేయొద్దు. 👉🏻 ఇతరులను రెచ్చగొట్టే విధంగా, వివాదాస్పదంగా మండపాల వద్ద ప్రసంగాలు చేయరాదు. 👉🏻 నిబంధనలు పాటించకపోయిన లేదా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా అనుమతి కోరిన అర్జీదారులు, ఉత్సవకమిటీ సభ్యులే పూర్తి బాధ్యత వహించాలి.

ఖమ్మం

పోలీస్ సింగ్ తో నేరాల నియంత్రణ క్షేత్రస్థాయిలో రాత్రి గస్తీ పై దృష్టి

పున్నమి Daily న్యూస్ ప్రతినిధి: T. రవీందర్ 👉 *విజబుల్ పోలిసింగ్ తో నేరాల నియంత్రణ….క్షేత్రస్థాయిలో రాత్రి గస్తీపై దృష్టి* 👉 *రైల్వే స్టేషన్, బస్టాండ్ లో విస్తృత తనిఖీలతో చట్ట వ్యతిరే కార్యాకాలాపాల కట్టడి* *నేర నియత్రణలో భాగంగా హోటల్స్, లాడ్జీలలో సోదాలు, అనుమానిత వ్యక్తుల వివరాలు సేకరణ* *గంజాయి సరఫరా, వినియోగాన్ని సమూలంగా నియంత్రించేందుకు ప్రత్యేక బృందాలు…* *సేఫ్టీ అండ్ సెక్యూరిటీ దృష్టిలో పెట్టుకొని సీసి కెమెరాల ఏర్పాటుకు స్థానిక ప్రజలు స్వచ్చద్దంగా ముందుకు రావాలని విజ్ఞప్తి* *పోలీస్ కమిషనర్ సునీల్ దత్..* నేరాల నియంత్రణ,చట్ట వ్యతిరేక కార్యకలాపాలను కట్టడి చేసేందుకు పోలీస్ యంత్రాంగం పోలీస్ కమిషనరేట్ పరిధిలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. విజబుల్ పోలీసింగ్ పటిష్టంగా అమలు చేస్తేనే నేరాలు, దొంగతనాలు నియంత్రణలో వుంటాయన్న నేపథ్యంలో అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో గత వారం రోజులుగా పోలీసు అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పోలీస్ గస్తీ పెంచి, పెట్రోలింగ్ ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. సుమారు 50 హోటళ్ళు, లాడ్జీలపై పోలీసులు సోదాలు నిర్వహించి అనుమానిత వ్యక్తుల పూర్తి వివరాలను సేకరించి, అనంతరం వారికి వెసులుబాటు కల్పిస్తున్నారు. గంజాయి సరఫరా, వినియోగాన్ని సమూలంగా నియంత్రించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి కట్టడిలో పురోగతి సాధించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా సరిహద్దు రాష్ట్రాల మీదుగా గంజాయి , రేషన్ బియ్యం, ఇసుక వంటి అక్రమ రవాణా,పాత నేరస్తుల కదలికలను కట్టడి చేసేలా జిల్లా పోలీస్ యంత్రాంగం వాహన తనిఖీలు ముమ్మరం చేస్తున్నారని తెలిపారు. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ దృష్టిలో పెట్టుకొని సీసి కెమెరాల ఏర్పాటుకు స్థానిక ప్రజలు స్వచ్చద్దంగా ముందుకు రావాలని,వ్యాపారస్తులు ఖచ్చితంగా సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ గారు తెలియజేశారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.