వెంకటాచలం అక్షర విద్యాలయంలో ట్రాఫిక్ అవేర్‌నెస్ కార్యక్రమం
తేది: 11.05.2026
జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, IPS గారి ఆదేశాల మేరకు వెంకటాచలం అక్షర విద్యాలయంలో నెల్లూరు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అవేర్‌నెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 400 మంది ఎన్‌సీసీ క్యాడెట్స్ పాల్గొన్నారు. హెల్మెట్ వినియోగం ప్రాముఖ్యత, ట్రిపుల్ రైడింగ్ వల్ల జరిగే ప్రమాదాలు, మైనర్లు వాహనాలు నడపడం చట్ట విరుద్ధమని అధికారులు వివరించారు. అలాగే రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా అమలు చేస్తే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించి విలువైన ప్రాణాలను రక్షించవచ్చని పోలీసులు తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంపొందించుకున్నారు.

వెంకటాచలం అక్షర విద్యాలయంలో ట్రాఫిక్ అవేర్‌నెస్ కార్యక్రమం
వెంకటాచలం అక్షర విద్యాలయంలో ట్రాఫిక్ అవేర్‌నెస్ కార్యక్రమం తేది: 11.05.2026 జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, IPS గారి ఆదేశాల మేరకు వెంకటాచలం అక్షర విద్యాలయంలో నెల్లూరు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అవేర్‌నెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 400 మంది ఎన్‌సీసీ క్యాడెట్స్ పాల్గొన్నారు. హెల్మెట్ వినియోగం ప్రాముఖ్యత, ట్రిపుల్ రైడింగ్ వల్ల జరిగే ప్రమాదాలు, మైనర్లు వాహనాలు నడపడం చట్ట విరుద్ధమని అధికారులు వివరించారు. అలాగే రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా అమలు చేస్తే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించి విలువైన ప్రాణాలను రక్షించవచ్చని పోలీసులు తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంపొందించుకున్నారు.

