Monday, 11 May 2026

Blog

E-పేపర్

శ్రీ త్రికోటేశ్వర విద్యాలయంలో ముందస్తు శ్రీకృష్ణాష్టమి వేడుకలు

చేజర్ల ఆగస్టు (పున్నమి ప్రతినిధి) ఆదురుపల్లిలోని శ్రీ త్రికోటేశ్వర విద్యాలయంలో సుప్రియ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థులు చిన్ని కృష్ణులుగా గోపికలుగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తదుపరి విద్యార్థినిలు శ్రీ కృష్ణ లీలా నృత్యాలతో అలరించారు. తదుపరి విద్యార్థులు ఆనందం, ఐక్యతలు ఉట్టిపడే ఉట్టి మహోత్సవ వేడుకలలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు బాల బాలికలు కోలాటాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ లక్ష్మీ నరసారెడ్డి, డైరెక్టర్ సుధాకర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు కృష్ణ చైతన్య మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఉట్టి అంటే మన హృదయం, అందులో దాగి ఉన్న వెన్న అంటే జ్ఞానం అని కుల మత వర్గ విభేదాలు లేకుండా సమిష్టిగా అజ్ఞానం,అహంకారం అనే ఉట్టిని పగలగొట్టి జ్ఞాన రూప వెన్నని అందరూ సమానంగా పొందాలి అని ఇందులోని ఆంతర్యాన్ని విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు సవాళ్లకు భయపడకుండా పట్టుదలతో కృషిచేసి మంచి ఫలితాలను సాధించాలని అందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఖమ్మం

దేశ విభజన గాయల కి వ్యతిరేకం గా బిజెపి మౌన దీక్ష..

ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిది) భారతదేశ విభజన గాయలకి నిరసన గా ఖమ్మం జిల్లా బిజెపి అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహాము ముందు బీజేపీ శ్రేణులుగురువారం మౌన దీక్ష చేశారు. ఈ కార్యక్రమం లో ధనియాకుల వెంకట్ నారాయణ నున్నా రవి కుమార్, శ్రీమతి దొడ్డ అరుణ, శ్రీమతి విజయ రెడ్డి, శ్రీమతి పమ్మి అనిత, రుద్ర ప్రదీప్, కుమిలి శ్రీనివాస్, యుగంధర్, రుద్ర గాని మాధవ, బెనర్జీ, కొనతం లక్ష్మి నారాయణ తదితరులు పాల్గొన్నారు

ఖమ్మం

బిజెపి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి) భారతదేశ 79 వ స్వాతంత్ర్య దినోత్సవం ని పురస్కరించుకొని ఖమ్మం టూ టౌన్ బిజెపి ఆధ్వర్యంలో అధ్యక్షులు దనియకుల వెంకట్ నారాయణ నెత్రుత్వం లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో వేల్పుల సుధాకర్,రుద్రగాని మాధవ, జ్యోతుల యుగంధర్ నాయుడు, దాసరి వీర భద్రం (రిటైర్డ్ సి ఐ) తదితరులు పాల్గొన్నారు

జోగులాంబ గద్వాల

జోగులాంబ ఆలయ ఈఓ బదిలీ — ముగ్గురు అర్చకులు సస్పెండ్.

అలంపూర్ : ఆగస్టు 14 ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్, శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయ ఈవో, ఉన్నతాధికారుల అనుమతులు లేకుండా ఓ ప్రజాప్రతినిధి సోదరుని కుమార్తె వివాహ వేడుకలు నిర్వహించి, ఆశీర్వాదాలు అందజేసిన అంశానికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో హల్చల్ కావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. ఈ నేపథ్యంలో జోగులాంబ దేవాలయ ఈఓను బదిలీ చేస్తూ, ముగ్గురు అర్చకులను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వపరంగా వేతనాలు పొందుతూ ఆయా దేవాలయాల్లో పనిచేసే అర్చకులు, వేద పండితులు, పురోహితులు రాష్ట్రం లేదా ఇతర దేశాల్లో మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనాలంటే లేదా నిర్వహించాలంటే దేవాదాయశాఖ కమిషనర్ అనుమతులు ముందుగానే పొందవలసి ఉంటుంది. ఈ అంశంపై విచారణ జరిపిన అధికారులు, విచారణ పెండింగ్లో ఉన్న కారణంగా సస్పెండ్ చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. కాగా, బదిలీ అయిన ఈఓ స్థానంలో జడ్చర్ల మండలం గంగాపురం దేవాలయ ఈఓగా పనిచేస్తున్న దీప్తికి జోగులాంబ దేవాలయ ఈఓగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రోడ్డు మరమ్మత్తు పనులు ప్రారంభం

పున్నమి ఆగస్టు (చేజర్ల ప్రతినిధి) చేజర్ల మండలం పడమటి కండ్రిక వద్ద రోడ్డు కుంగి ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ విషయంపై మీడియాలో వరుసగా వార్తలు వచ్చినప్పటికీ అధికారులు స్పందించలేదు. ఈ నేపథ్యంలో నిన్న భారత మహాసేన అధ్యక్షుడు జువ్విగుంట బాబు, కార్యకర్తలతో కలిసి ప్రమాదకర ప్రాంతంలో తాత్కాలిక హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. స్థానికుల సమస్యను గమనించాల్సిందిగా ప్రభుత్వ యంత్రాంగానికి విజ్ఞప్తి చేశారు. దీనికి ప్రతిస్పందనగా ఈరోజు అధికారులు అక్కడికి చేరుకుని రోడ్డు మరమ్మత్తు పనులను ప్రారంభించారు. దీంతో ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు, గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారానికి కృషి చేసిన జువ్విగుంట బాబు, మీడియా మరియు అధికారులకు స్థానికులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సంఘటన ప్రజా సమస్యల పరిష్కారంలో సామూహిక కృషి ఎంత ప్రభావవంతమో మరోసారి నిరూపించింది.

తెలంగాణ

తాటికల్ లోని కంఠమహేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

నకిరేకల్: ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి) నకిరేకల్ నియోజకవర్గం తాటికల్ గ్రామంలో జరిగిన శ్రీ కంఠమహేశ్వర స్వామి వారి పండుగకు ఎమ్మెల్యే వేముల వీరేశం గారు హాజరయ్యారు. తరువాత కంఠమహేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్బంగా గ్రామంలోని భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

జోగులాంబ గద్వాల

ఉపాధ్యాయుడు రవిచందర్‌ను సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్.

అలంపూర్ : ఆగస్టు 14 ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలంలోని చిన్నధన్వాడ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న, పి.రవిచందర్‌ను జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం, పాఠశాల సమయాల్లో మద్యం సేవించడం, విద్యార్థులపై దురుసుగా ప్రవర్తించడం వంటి తీవ్రమైన ఆరోపణలు నిర్ధారణ కావడంతో సస్పెండ్ చేయడం జరిగిందని తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం, పాఠశాలలో మద్యం సేవించడం విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించడం వంటి చర్యలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉపాధ్యాయులు తన వృత్తి పట్ల అంకితభావంతో పనిచేసి విద్యార్థులకు మంచి విద్యాబుద్ధులు నేర్పించి భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే విధంగా తమ విధులను నిర్వర్తించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

జోగులాంబ గద్వాల

రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి..మరో మహిళకు తీవ్ర గాయాలు.

అలంపూర్ : ఆగస్టు 14 ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా, ఇటిక్యాల మండలం,బీచుపల్లి దగ్గర బైక్ పై వెళ్తున్న ఇద్దరిని నాలుగు చక్రాల వాహనం డీ కొట్టడంతో, బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అదే బైక్ పై వెనుక ఉన్న మహిళకు తీవ్ర గాయాలయ్యాయి ఆ మహిళను అంబులెన్స్ లో గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. ఇటిక్యాల సీఐ రవి కుమార్, ఎస్ఐ రవి నాయక్, సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

భక్తి

రాజా సాయి మందిరం లో అన్న దానం.

ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి ) ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వంగ ముత్యాల బంజర్ గల శ్రీ రాజా సాయి మందిరం నందు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గురు వారం అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సాయి భక్తులు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు

ఖమ్మం

భారీ వర్షాల నేపథ్యంలో ప్రతి జిల్లా కి కోటి విడుదల..మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి ) తెలంగాణ రాష్ట్రము లో భారీ వర్షాల నేపథ్యంలో లో రిస్క్యు కోసం ప్రతి జిల్లా కి కోటి రూపాయలు విడుదల చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలియజేసారు. హైదరాబాద్ నగరం లో ఎక్కడ ట్రాఫిక్ సమస్య కలగకుండా అధికారులు సమన్వము తో పని చెయ్యాలి అని అన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రజలని కోరారు. End

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.