Independence Day
79th Independence day sandarbhanga Podalakur mandalam motham ghanamgaa jarigayo kaanee AE housing office lo matram egarani jendaa karanalu teliyadu
79th Independence day sandarbhanga Podalakur mandalam motham ghanamgaa jarigayo kaanee AE housing office lo matram egarani jendaa karanalu teliyadu
ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి) భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు శ్రీ నెల్లూరి కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో బిజెపి జిల్లా పార్టీ కార్యాలయం నందు 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ పతాక ఆవిష్కరణ చేసి, స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీ నెల్లూరి కోటేశ్వరరావు గారు భారతమాత దాస్య శృంఖలాలను తెంచడం కోసం తమ ప్రాణాలను సైతం తృణ ప్రాయంగా భావించి దేశం కోసం ప్రాణాలర్పించిన ఎందరో భారతమాత వీరపుత్రులను స్మరించుకుంటూ ఈ స్వతంత్ర భారతంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో “వికసిత్ భారత్” నినాదంతో దేశంలో జరుగుతున్న అభివృద్ధి మరియు సంక్షేమం సంబంధించిన తదితర అంశాల గురించి ప్రస్తావించడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రియతమ భారత ప్రధాని శ్రీ నరేంద్రమోడీ గారి ప్రేరణతో రానున్న రోజుల్లో ఖమ్మం జిల్లాలో ఎన్నిక ఏదైనా గెలుపు బిజెపిదే అవ్వాలి అనే దృఢ సంకల్పంతో మనమందరము కదం తొక్కాలి అని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర,జిల్లా మరియు మండల నాయకులు,కార్యకర్తలు తదితర పార్టీ శ్రేణులు పాల్గొన్నారు
ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి ) భారత దేశ 79 వ స్వాతంత్ర్య దినోత్సవం ని పురస్కరించుకొని ఖమ్మం జిల్లా బిజెపి కిసాన్ మోర్చా ఆధ్యక్షులు చావకిరణ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం బిజెపి రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ ముఖ్య అతిధి గా హాజరై జాతీయ జెండా ఎగుర వేశారు. అనంతరం ఉద్యోగ విరమణ చేసిన సైనికులకి సన్మానం చేశారు. గల్లా సత్య నారాయణ మాట్లాడుతూ దేశానికీ రైతు, జవాన్ లు చేసే సేవ చాలా విలువ అయినది అని 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వారి మధ్యలో జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమం యువమోర్చ జిల్లా అధ్యక్షులు ఉపేందర్ గౌడ్ భూక్యా శ్యాం సుందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు
79 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈరోజు సీతారాంపురం మండలంలో ఎంపీడీవో ఆఫీస్ అలాగే ఎంఆర్ఓ ఆఫీస్ అన్ని సచివాలయాలు బసినేనిపల్లె హైస్కూల్ నందు గణతంత్ర దినోత్సవాలు వేడుకలు ఘనంగా జరిగాయి.. హైస్కూల్ హెడ్మాస్టర్ .హై స్కూల్ స్టాప్ అలాగే స్కూల్ చైర్మన్ అందరు పాల్గొనడం జరిగింది.
నిర్మల్: (పున్నమి ప్రతినిధి): నిర్మల్ పట్టణ కేంద్రంలోని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 79 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రాసం శ్రీధర్ మాట్లాడుతూ.. ఎందరో త్యాగధనుల పుణ్యఫలితం ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్ర స్వేచ్ఛ వాయువులని అందుకు జర్నలిస్టులుగా ఉండి మన వంతు దేశం కోసం పనిచేసే ఒక అక్షరమై ప్రతి ఒక్కరు ముందుకు నడవాలన్నారు. స్వాతంత్ర ఉద్యమానికి ముందే రాంజీ గోండు నిర్మల్ గడ్డ నుండే ఉద్యమాన్ని మొదలుపెట్టి మర్రి చెట్టుకు 1000 మందిని ఉరివేస్తున్నప్పుడు దేశం కోసమే తప్ప తన కోసం కాదని ఆనందంగా ప్రాణాలు అర్పించిన త్యాగధనుడని గుర్తు చేశారు అలాంటి పోరాటపటమగల నిర్మల్ జిల్లా నుండి ఎందరో స్వతంత్ర సమరయోధులు ఉన్నారని అందుకు పాత్రికేయ మిత్రులుగా అంతా కలిసి గళాన్ని, పదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ మన వంతుగా భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచేలా వార్త విశ్లేషణలు ఉంటే యోధులు కలలుగన్న నిజమైన స్వతంత్రానికి కాస్తయినా అర్థం తెలిపిన వాళ్లమవుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సలహాదారులు కోశాధికారులు పాత్రికేయ మిత్రులు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ పాల్గొన్నారు.
అలంపూర్ : ఆగస్టు 15 ( పున్నమి ప్రతినిధి ) ఉండవెల్లి మండల పరిధిలోని తహసిల్దార్ కార్యాలయంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తాసిల్దార్ ప్రభాకర్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తాసిల్దార్ ప్రభాకర్ మహాత్ముల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తాసిల్దార్ మాట్లాడుతూ, ఎంతోమంది వీరుల ప్రాణ త్యాగాల ఫలితంగానే స్వాతంత్య్రం లభించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ రమణ, సీనియర్ అసిస్టెంట్ లక్ష్మ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ స్వరూప, రజిని కుమార్, కార్యాలయ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
నాయుడుపేట ఆగస్టు పున్నమి ప్రతినిధి దిలీప్ కుమార్ నాయుడుపేట మండల పరిధిలోని తన్నమాల గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున వరి ధాన్యం బస్తాల లోడుతో వెళ్తున్న లారీ రోడ్డు మలుపు వద్ద అదుపుతప్పి పక్కన ఉన్న పొలాల్లో బోల్తా కొట్టింది. లారీ డ్రైవర్ లారీ నీ అక్కడే వదిలి వెళ్ళిపోయాడు . స్థానికుల సమాచారం మేరకు డ్రైవర్ మద్యం తాగి లారీ నడపడం వల్ల ప్రమాదం జరిగింది అని ఎవరికి ఎలాంటి హాని జరగలేదని తెలిపారు.
ప్రకాశం ఆగస్టు పున్నమి ప్రతినిధి ప్రకాశం జిల్లా పామూరు మండల పరిధిలోని నుచ్చు పొద సచివాలయం నందు ఉప సర్పంచ్ గోళ్ళ వెంకటేశ్వర్లు జెండా ఎగర వేయగా తెలుగు దేశం పార్టీ గ్రామ. శాఖ అధ్యక్షులు కామేపల్లి సూర్య ప్రకాష్, హనీఫ్ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి) ఓటు చోరీకి నిరసనగా ఎఐసిసి పిలుపు మేరకు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నుంచి పార్టీ నేతలు కొవ్వొత్తులతో జడ్పీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొని ప్రసంగించారు ర్యాలీ అనంతరం డిప్యూటీ సీఎం శ్రీ భట్టి విక్రమార్క గారుమాట్లాడుతూ ఓటరు జాబితా అడిగితే రాహుల్ గాంధీ పై పోలీసు కేసులు పెడుతు దేశంలో బిజెపి నియంత పాలన,ప్రజాస్వామ్యం పై దాడిచేస్తుందని ఆరోపించారు.బతికి ఉన్నవారిని చనిపోయినట్లుగా, ఉన్న ఓటర్లను లేనట్లుగా చూపిన ఓటరు లిస్ట్ పై సమగ్ర దర్యాప్తు జరపాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారని తెలియచేస్తు ,ఎన్నికల కమిషన్ వ్యవహారం, కేంద్ర ప్రభుత్వ వైఖరి పై వాస్తవాలు వివరించేందుకు దేశవ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడడం అంటే ఓటు హక్కును, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే అని డిప్యూటీ సీఎంమల్లు బట్టి విక్రమార్క వివరించారు. ఇవాళ దేశాన్ని పరిపాలిస్తున్న బిజెపి కూటమి ఏదో రకంగా రాజ్యాంగానికి తూట్లు పొడిచి నియంత పాలన ఈ దేశంలో తీసుకురావాలని ప్రయత్నిస్తుందని ఆరోపించారు. బిజెపి పాలన తీరు ప్రజాస్వామ్యం పై దాడి, స్వతంత్రంగా వ్యవహరించాల్సిన, రాజ్యాంగ స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమిషన్ కేంద్రంలోని బిజెపికి లొంగిపోయి వాస్తవాలు బయటపెట్టడం లేదని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఈ దేశంలోని ప్రతి పౌరుడు ముందుకు రావాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ఈ ర్యాలీ లో జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గ ప్రసాద్ జిల్లా నాయకులు మిక్కిలి నేని నరేంద్ర స్థానిక నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతి నిధి ) ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శుక్రవారం మద్యం, మాంసం దుకాణాలు మూత బడ్డాయి. 79 స్వాతంత్ర్య దినోత్సవం సంధరబ్బముగా జిల్లా వ్యాప్తంగా ఈ దుకాణాలు మూత బడ్డాయి. కాగా మద్యం మాంసం ప్రియులు ముందు జాగ్రత్త గా గురువారం రోజే వారికి కావాల్సినంత మద్యం, మాంసం ని కొనుగోలు చేసుకున్నారు. రోజు కంటే గురు వారం కొంచెం ఎక్కువ మొత్తం లో వ్యాపారం జరిగినట్లు మద్యం, మాంసం దుకాణదారులు తెలిపారు.