Monday, 11 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

దేశ ప్రజలకు గుడ్‌న్యూస్ – GSTలో భారీ మార్పులు!

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ దేశ ప్రజలకు శుభవార్త చెప్పారు. ప్రజలపై ఉన్న GST పన్నుల భారాన్ని తగ్గించబోతున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం దేశ వ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు ఉపశమనం ఇవ్వనుంది. ప్రస్తుతం ఉన్న GST స్లాబ్స్ ప్రస్తుతం GSTలో 5 స్లాబ్స్ ఉన్నాయి: 0% 5% 12% 18% 28% కొత్త నిర్ణయం – రెండు స్లాబ్స్ మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఈ 5 స్లాబ్స్‌ను కుదించి కేవలం 2 స్లాబ్స్ (5% మరియు 18%) గా మార్చే ప్రణాళికలో ఉంది. ఏ వస్తువులు ఏ స్లాబ్‌లోకి? 28% నుండి 18%కి👉 TVలు, ACలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు 12% నుండి 5%కి👉 వ్యక్తిగత వినియోగ వస్తువులు 18% నుండి 5% లేదా జీరో స్లాబ్‌కి మారే అవకాశం👉 ఇన్సూరెన్స్ 0% లేదా 5% స్లాబ్‌లోనే కొనసాగేవి👉 ఆహారం, మెడిసిన్స్, విద్య, నిత్యావసర వస్తువులు ఎప్పుడు అమలవుతుంది? GST కౌన్సిల్ సెప్టెంబర్/అక్టోబర్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనుంది. ఆ తర్వాత కొత్త స్లాబ్స్ దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తాయి. ➡️ దీని వల్ల మధ్య తరగతి ప్రజల ఖర్చులు తగ్గి, వినియోగం పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

అన్నమయ్య

చిట్వేల్ మండలంలో ₹3.72 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ”

చిట్వేల్: చిట్వేల్ మండలంలోని పలు పంచాయతీల్లో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన ₹3,72,029 విలువైన చెక్కులను లబ్ధిదారుల గృహాలకు స్వయంగా వెళ్లి అందజేశారు ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు, టీడీపీ పార్టీ ఇంచార్జ్ & KUDA చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారి కుమారుడు యువ నేత ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు. లబ్ధిదారుల వివరాలు: ననబాల నారాయణ – ₹20,614 (రాజుకుంట) రాయిని శారదమ్మ కుటుంబం – ₹56,442 (కేకే వడ్డిపల్లి) తంగుటూరి ప్రేమ్‌కుమార్ – ₹36,608 (వెంకటరాజుపల్లి) బాలే నాగేశ్వర – ₹59,427 (చిట్వేల్ టౌన్) నాగ రాజేశ్వరి – ₹34,560 (నాగవరం చొప్పవారిపల్లి) ఎరబట్టిన వంశీ శంకర్ – ₹43,795 (సి.కందులవారిపల్లి) యెద్దోటి భాస్కర్ – ₹1,20,583 (మార్గోపల్లి) ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు మాట్లాడుతూ – “ప్రజల అవసర సమయంలో అండగా నిలబడటం ప్రభుత్వ ప్రధాన ధ్యేయం. ఇది ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం.” అన్నారు. యువ నేత ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు మాట్లాడుతూ – “ఈ సహాయం లబ్ధిదారుల జీవితంలో వెలుగుని నింపుతుంది. అవసర సమయంలో ప్రజల పక్కన నిలబడే ప్రభుత్వం మనది.” అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అన్నమయ్య

రైల్వే కోడూరు నియోజకవర్గం – కూటమి హామీ అమలు మహిళలకు ఉచిత బస్సు సేవల ఘన ప్రారంభం

రైల్వే కోడూరులో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమలు వైపు మరో కీలక అడుగు వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే పథకం 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఘనంగా ప్రారంభమైంది. రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ & కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి, ప్రభుత్వ విప్ & రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన “తెలుగింటి ఆడపడుచులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం” పథకం మహిళల ఆర్థిక భారం తగ్గించడమే కాక, వారి స్వేచ్ఛాయుత రవాణా హక్కును బలోపేతం చేస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రారంభోత్సవంలో ముక్కా రూపానంద రెడ్డి, అరవ శ్రీధర్ గారు స్వయంగా మొదటి టికెట్ అందించి ఆడపడుచులతో బస్సులో ప్రయాణించారు. ప్రాంతమంతా “జై కూటమి” నినాదాలతో మారుమోగింది. ముక్కా రూపానంద రెడ్డి గారు మాట్లాడుతూ – “ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మహిళలు లాభపడతారు. కూటమి ఎల్లప్పుడూ ఆంధ్ర ఆడపడుచుల అభ్యున్నతికి కట్టుబడి ఉంటుంది. ఈ రోజు మహిళల ముఖంలో కనిపించిన ఆనందమే మా నిజమైన విజయానికి నిదర్శనం” అన్నారు. అరవ శ్రీధర్ గారు మాట్లాడుతూ – “ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం, రైల్వే కోడూరు అభివృద్ధి పథంలో దూసుకుపోవడమే మా లక్ష్యం. ప్రజలు పెట్టుకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమే మా ధ్యేయం” అని అన్నారు. ఈ కార్యక్రమంలో NDA కూటమి నాయకులు, ప్రజలు, మహిళలు, అభిమానులు విస్తృతంగా పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

చంద్రన్న స్త్రీ శక్తి పథకం మహిళలకు వరం.

15-08-2025 ఉదయగిరి చంద్రన్న స్త్రీ శక్తి పథకం మహిళలకు వరం..! ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు స్త్రీ శక్తి బస్సును ప్రారంభించిన ఎంపీపీ మెట్టుకూరి శిరీషా..! ఉదయగిరి ఆగస్టు 15 చంద్రన్న స్త్రీ శక్తి పథకం మహిళలకు వరం అని కలిగిరి ఎంపీపీ మెట్టుకూరి శిరీషా పేర్కొన్నారు. ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయగిరి డిపోలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్త్రీశక్తి బస్సును ఎంపీపీ మెట్టుకూరి శిరీషా చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. ఫ్రీ బస్సు టికెట్ తీసుకొని ప్రయాణం చేశారు. అంతకుముందు బస్సును ప్రత్యేకంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్త్రీ శక్తి పథకం మహిళలకు వరం అని తెలిపారు. చంద్రన్న ఇచ్చిన మాటకు కట్టుబడి ఆగస్టు 15 అనగా ఈరోజు నుండి రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేశారన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చంచల బాబు యాదవ్, మాట్లాడుతూ ఎన్నికల హామీలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయని, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ, ఇచ్చిన మాటకు కట్టుబడి, సంక్షేమ పథకాలను అద్భుతంగా అమలు చేస్తున్నారన్నారు. మహిళలు రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు అన్నారు. ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ ఉదయగిరి అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారని, ఆయన ఆధ్వర్యంలో ఉదయగిరి చిరుల గిరిగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ చక్కని అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ మేనేజర్ రమేష్ డిపో మేనేజర్ శివ కేశవ్ యాదవ్, మండల కన్వీనర్ సిహెచ్ బయన్న, బిజెపి ఇన్చార్జి కదిరి రంగారావు, గండిపాలెం ప్రాజెక్టు చైర్మన్ అడుసు మల్లి వెంకటసుబ్బయ్య, మాజీ జడ్పిటిసి సభ్యురాలు కలివెల జ్యోతి, రాష్ట్ర కార్యదర్శి ఎల్ సి రమణారెడ్డి, ఆర్టీసీ సిబ్బంది మహిళా కండక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పందులు బెడద నుండి శాశ్వత విముక్తి – సర్పంచ్ కొండెపోగు దిలీప్ కుమార్

వరికుంటపాడు గ్రామ పంచాయతీలో పందులు బెడద ఎక్కువగా ఉన్నదని వాటి నుండి శాశ్వత విముక్తి కోసం విరాట్ నగర్ కు చెందిన పందులు కాపరులుతో ముఖాముఖిగా వరికుంటపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ కొండెపోగు దిలీప్ కుమార్ మాట్లాడటం జరిగింది.వరికుంటపాడు , ఆండ్రావారిపల్లి , కనియంపాడు గ్రామాల్లో పందులు అధిక సంఖ్యలో ఉండటం వలన గ్రామస్తులకు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని,మనస్సు ఫౌండేషన్ తోటలో నష్టం కలిగిస్తున్నాయని , భవిష్యత్ లో వ్యాధులు సంక్రమిస్తాయని ముందస్తు చర్యలు చేపట్టి వాటిని అరికట్టే విధంగా పందులు కాపరులకు అల్టిమేట్ జారీచేయడంతో వారు ఈ వారంలో వెహికల్ లో తీసుకొని వెళతామని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి గారు ఉన్నారు.

E-పేపర్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

చంద్రన్న స్త్రీ శక్తి పథకం మహిళలకు వరం

చంద్రన్న స్త్రీ శక్తి పథకం మహిళలకు వరం అని కలిగిరి ఎంపీపీ మెట్టుకూరి శిరీషా పేర్కొన్నారు. ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయగిరి డిపోలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్త్రీశక్తి బస్సును ఎంపీపీ మెట్టుకూరి శిరీషా చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. ఫ్రీ బస్సు టికెట్ తీసుకొని ప్రయాణం చేశారు. అంతకుముందు బస్సును ప్రత్యేకంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్త్రీ శక్తి పథకం మహిళలకు వరం అని తెలిపారు. చంద్రన్న ఇచ్చిన మాటకు కట్టుబడి ఆగస్టు 15 అనగా ఈరోజు నుండి రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేశారన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చంచల బాబు యాదవ్, మాట్లాడుతూ ఎన్నికల హామీలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయని, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ, ఇచ్చిన మాటకు కట్టుబడి, సంక్షేమ పథకాలను అద్భుతంగా అమలు చేస్తున్నారన్నారు. మహిళలు రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు అన్నారు. ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ ఉదయగిరి అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారని, ఆయన ఆధ్వర్యంలో ఉదయగిరి చిరుల గిరిగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ చక్కని అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ మేనేజర్ రమేష్ డిపో మేనేజర్ శివ కేశవ్ యాదవ్, మండల కన్వీనర్ సిహెచ్ బయన్న, బిజెపి ఇన్చార్జి కదిరి రంగారావు, గండిపాలెం ప్రాజెక్టు చైర్మన్ అడుసు మల్లి వెంకటసుబ్బయ్య, మాజీ జడ్పిటిసి సభ్యురాలు కలివెల జ్యోతి, రాష్ట్ర కార్యదర్శి ఎల్ సి రమణారెడ్డి, ఆర్టీసీ సిబ్బంది మహిళా కండక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉచిత బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి

ఉచిత బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి… – సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకంలో భాగంగా శుక్రవారం పొదలకూరులో ఉచిత బస్సులను సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ స్త్రీ శక్తి పథకం రూపొందించి అమలు చేస్తున్న సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే సోమిరెడ్డి చిత్రపటాలకు ఈ సందర్భంగా మహిళలు క్షీరాభిషేకం చేశారు. అనంతరం సోమిరెడ్డి మాట్లాడుతూ మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం నెలకు 162 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందన్నారు. ఏడాదికి 1942కోట్లకు ఖర్చవుతుందన్నారు. స్త్రీ శక్తి పథకం సాధారణ మహిళల నుంచి సచివాలయ ఉద్యోగుల వరకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. మహిళలకు చేయూతనందించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. మహిళలను మహాశక్తిగా తీర్చిదిద్దే లక్ష్యంతో సీఎం చంద్రబాబు అమలు చేస్తున్న పథకాలు సత్ఫలితాలనిస్తున్నాయ ని అన్నారు. తల్లికి వందనం, దీపం -2, స్త్రీ శక్తి పథకాల ద్వారా మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

జోగులాంబ గద్వాల

శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర ఆలయానికి నూతన ఈవో.

అలంపూర్ : ఆగస్టు 15 ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఆర్. పురేందర్ కుమార్ శ్రీ జమ్ములమ్మ & పరశురామ స్వామి దేవస్థానమునకు బదిలీ కాగా, శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానమునకు, శ్రీమతి ఏ. దీప్తి గ్రేడ్-1, కార్యనిర్వహణాధికారిగా అధనపు బాధ్యతలు స్వీకరించారు. మునుపటి ఈవో పురేందర్ కుమార్ దగ్గరుండి నూతన కార్యనిర్వాహణాధికారి శ్రీమతి ఏ దీప్తి కి ఆలయ బాధ్యతలు అప్పగించారు.

తిరుపతి

రక్త దానం చేద్దాం మరో ముగ్గురి ప్రాణాలు కాపాడుదాం వంశీ యాదవ్

ఈరోజు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శ్రీకాళహస్తి కి చెందిన యువతరం సేవ సమితి వాళ్ళు రుయా హాస్పిటల్ సిబ్బంది ఆధ్వర్యంలో మెగా రక్త దానం శిబిరం నిర్వహించారు. కాండదు పంచాయతీ రాచపాలెం గ్రామానికి చెందిన స్వేచ్ఛ ఫౌండేషన్ వంశీ యాదవ్ స్వచ్చందంగా రక్తాధానం చేశారు.ఈ సందర్బంగా వంశీ యాదవ్ మాట్లాడుతూ ప్రతి 3 నెలలకి ఒక్కసారి బ్లడ్ డోనాట్ చేస్తే మంచిది అన్నారు.ఈ కార్యక్రమంలో యువతరం సేవ సమితి అధ్యక్షులు యువ కిషోర్ గారు మరియు ఆ సంస్థ వాలంటీర్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలో! అప్పనపల్లి M.P.P ప్రైమరీ స్కూల్.

ఆగస్టు 15 పున్నమి ప్రతినిధి: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ మామిడికుదురు మండలం అప్పనపల్లి M.P.P ప్రైమరీ స్కూల్ లో భారత దేశ ప్రజలందరికీ 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసారు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీటమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవమును. నా భారత దేశ ప్రజలందరికీ అప్పనపల్లి M.P.P ప్రైమరీ స్కూల్ తరపున అప్పనపల్లి M.P.P ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ N. రఘురామయ్య స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసారు. ఎందరో మహానుభావుల కలల పంట మరెందరో అమరవీరుల త్యాగఫలం ఈనాడు మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్ర ఫలం. వీరుల త్యాగఫలం వృధా కాకుండ మన జాతి గౌరవాన్ని కాపాడటం మనందరి బాధ్యత.ఈ సందర్భంగా ఆనాటి నుండి ఈనాటి వరకు మనదేశ రక్షణకు, అబివృద్ది కి పాటుపడిన నవీన భారతావని ముద్దుబిడ్డలైన నా తోటి భారతీయులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అంటూ మాస్టర్ షబ్బీర్ ర్ హుస్సేన్ ప్రశాంగించారు. “మన దేశానికి స్వాతంత్ర్యం రావడానికి అనేక మంది మహానుభావులు తమ ప్రాణాలను అర్పించారు. వారి త్యాగాల వల్లనే ఈ రోజు మనం స్వేచ్ఛాయుతమైన దేశంలో జీవిస్తున్నాము. స్వాతంత్ర్యం కేవలం మన హక్కుల గుర్తు మాత్రమే కాదు — అది మన బాధ్యతల గుర్తు కూడా అని మాస్టారు B. పెద్దిరాజు ప్రశాంగిచ్చారు. ప్రతి భారతీయుడు తన దేశం పట్ల గౌరవం, సమాజం పట్ల నిబద్ధత, ప్రజాసేవ పట్ల తపన కలిగి ఉండాలి. అభివృద్ధి, ఐక్యత, న్యాయం — ఇవి మన దేశాన్ని ముందుకు నడిపే మూడు స్తంభాలు. భారత మాతకు సేవ చేయడం నా గర్వకారణం. ఈ రోజు మనం ప్రతిజ్ఞ చేద్దాం — మన దేశం కోసం, మన ప్రజల కోసం, మనం శ్రామిద్దాం అంటూ మాస్టర్ బి. రామకృష్ణ ప్రశాంగించారు. అప్పనపల్లి M.P.P ప్రైమరీ స్కూల్ లో హెడ్ మాస్టర్ N.రఘురామయ్య, బి. పెద్దిరాజు, బి. రామకృష్ణ, షబ్బీర్ ర్ హుస్సేన్, Mఅనంత లక్ష్మి దేవి స్కూల్ పిల్లలుకు ఆ గ్రామ పెద్దలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభ సందర్బంగా స్వీట్ పంచి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.