వింజమూరులోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో పదో తరగతి ఉత్తమ ప్రతిభావంతుల అభినందన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జ్ఞాపికలు అందజేశారు. నియోజకవర్గంలోని 63 మంది మెరిట్ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున నగదు ప్రోత్సాహక బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థుల విజయాల్లో ఉపాధ్యాయుల కృషి అమోఘమని ఎమ్మెల్యే అన్నారు. నారా లోకేష్ విద్యా సంస్కరణల ఫలితంగానే ఉత్తమ ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించారు.

పదో తరగతి టాపర్లకు ఎమ్మెల్యే కాకర్ల సత్కారం