మండల తాహసిల్దార్ కు వినతి పత్రం అందజేసిన బీసీ నాయకులు
పున్నమి ప్రతినిధి , రామచంద్రపురం
మండలం
రాయలచెరువు గ్రామానికి చెందిన బీసీ నాయకులు మహిళలు ప్రభుత్వ భూమి ఆక్రమణలను అరికట్టి, ఇల్లు స్థలాలు లేని పేదలకు ఇంటి స్థలాలు ఇప్పించవలసిందిగా సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక లోమండల తాహసిల్దార్ మధుసూదన్ రావుకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన ఇండ్ల పట్టాలకి ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూములను పక్క భూముదారులు జెసిపి లతో చదును చేసి ఆక్రమించుకుంటున్నారని ఆ భూములను ఆక్రముల నుంచి తొలగించి ఇండ్లు లేని పేదవారికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని మండల తాహసిల్దార్ కు విన్నవించామన్నారు. 2021 సంవత్సరంలో భారీ వర్షాల కారణంగా మా గ్రామం రాయలచెరువు 80 శాతం పూర్తిగా ముంపుకు గురైందని ఆ సమయంలో గ్రామస్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఆడి పశువుల రైతులు ఇబ్బందులు పడ్డారని తెలియజేశారు. మా గ్రామానికి బడి, గుడి, పిల్లల ఆట స్థలం పంచాయతీ కార్యాలయం ఏర్పాటుకు స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశామన్నారు. మా వినతికి తాహసిల్దార్ సానుకూలంగా స్పందించి పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేసి ప్రభుత్వ భూమి ఆక్రమణ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశానన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులుమాధవయ్య
నాథముని యాదవ్ ,ప్రసాద్ యాదవ్ ,పొట్టేళ్ల గిరిధర్
మస్తాన్ యాదవ్ ,
రోశయ్య , వెంకటముని ,
భూపతి , మురగయ్య
రోసమ్మ, సుబ్బమ్మ, కృష్ణవేణి బైరమ్మ, గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు





