Tuesday, 11 August 2026
  • Home  
  • మహిళా భద్రతపై విద్యార్థులకు పోలీసుల అవగాహన
- అనకాపల్లి

మహిళా భద్రతపై విద్యార్థులకు పోలీసుల అవగాహన

‘అభయ’ కార్యక్రమంలో సోషల్ మీడియా మోసాలపై హెచ్చరిక అనకాపల్లి జిల్లా, ఆగస్టు 11 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): యలమంచిలి పట్టణంలోని శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో మంగళవారం ‘అభయ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ సావిత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో హైస్కూల్ విద్యార్థులకు మహిళా భద్రత, వ్యక్తిగత రక్షణపై అవగాహన కల్పించారు. సోషల్‌ మీడియా ద్వారా ఏర్పడే పరిచయాలతో ఎదురయ్యే ప్రమాదాలు, అనర్థాలపై పోలీసులు వివరించారు. ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినా, వేధింపులకు పాల్పడినా భయపడకుండా ఫిర్యాదు చేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తమను తాము ఎలా రక్షించుకోవాలి, పోలీసులను ఎలా ఆశ్రయించాలనే అంశాలను వివరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్‌ చంద్రశేఖర్‌, డీన్‌ దత్తు, ఇన్‌చార్జిలు లోకేశ్వరరావు, ఏవో ప్రకాష్‌, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

‘అభయ’ కార్యక్రమంలో సోషల్ మీడియా మోసాలపై హెచ్చరిక

అనకాపల్లి జిల్లా, ఆగస్టు 11 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
యలమంచిలి పట్టణంలోని శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో మంగళవారం ‘అభయ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ సావిత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో హైస్కూల్ విద్యార్థులకు మహిళా భద్రత, వ్యక్తిగత రక్షణపై అవగాహన కల్పించారు. సోషల్‌ మీడియా ద్వారా ఏర్పడే పరిచయాలతో ఎదురయ్యే ప్రమాదాలు, అనర్థాలపై పోలీసులు వివరించారు. ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినా, వేధింపులకు పాల్పడినా భయపడకుండా ఫిర్యాదు చేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తమను తాము ఎలా రక్షించుకోవాలి, పోలీసులను ఎలా ఆశ్రయించాలనే అంశాలను వివరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్‌ చంద్రశేఖర్‌, డీన్‌ దత్తు, ఇన్‌చార్జిలు లోకేశ్వరరావు, ఏవో ప్రకాష్‌, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.