Monday, 10 August 2026
  • Home  
  • సూళ్లూరుపేటలో మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
- తిరుపతి

సూళ్లూరుపేటలో మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

⛔సూళ్లూరుపేటలో మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ⛔డీఎస్సీ అక్రమాలపై లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని వైఎస్ఆర్సిపి నాయకులు డిమాండ్ పున్నమి న్యూస్ రిపోర్టర్ మద్దాలి వెంకయ్య దొరవారిసత్రం 10-08-26 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీఎస్సీ లీకు అక్రమాలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య వైఎస్ఆర్సిపి శ్రేణులు నాయకులు భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహించారు. ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చలేదని మాజీ ఎమ్మెల్యే తెలిపారు. డీఎస్సీ నోటిఫికేషన్ లో కొత్త జీవోలను విడుదల చేసి వెంటనే ఆ జీవోలను రద్దు చేశారని, యువ గళం పాదయాత్రలో నారా లోకేష్ తో అడుగులు వేసిన వాళ్లకు డీఎస్సీలో ఉద్యోగాలు ఇచ్చేందుకు ఈ స్కామ్ జరిగిందని తెలిపారు. ఈ డీఎస్సీలో అవకతవకులపై లోకేష్ రాజీనామా చేయకపోతే ఈ ర్యాలీలు, ధర్నాలు కొనసాగుతాయని తెలిపారు. ఎన్నికలలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా సూపర్ సిక్స్ పథకం సూపర్ హిట్ అయిందని కల్లబొల్లి మాటలు చెబుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట నియోజకవర్గం వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొన్నారు.

⛔సూళ్లూరుపేటలో మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

⛔డీఎస్సీ అక్రమాలపై లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని వైఎస్ఆర్సిపి నాయకులు డిమాండ్

పున్నమి న్యూస్ రిపోర్టర్ మద్దాలి వెంకయ్య దొరవారిసత్రం
10-08-26
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీఎస్సీ లీకు అక్రమాలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని సూళ్లూరుపేట
మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య వైఎస్ఆర్సిపి శ్రేణులు నాయకులు భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహించారు. ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చలేదని మాజీ ఎమ్మెల్యే తెలిపారు.
డీఎస్సీ నోటిఫికేషన్ లో కొత్త జీవోలను విడుదల చేసి వెంటనే ఆ జీవోలను రద్దు చేశారని,
యువ గళం పాదయాత్రలో నారా లోకేష్ తో అడుగులు వేసిన వాళ్లకు డీఎస్సీలో ఉద్యోగాలు ఇచ్చేందుకు ఈ స్కామ్ జరిగిందని తెలిపారు. ఈ డీఎస్సీలో అవకతవకులపై లోకేష్ రాజీనామా చేయకపోతే ఈ ర్యాలీలు, ధర్నాలు కొనసాగుతాయని తెలిపారు. ఎన్నికలలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా సూపర్ సిక్స్ పథకం సూపర్ హిట్ అయిందని కల్లబొల్లి మాటలు చెబుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట నియోజకవర్గం వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.