Monday, 11 May 2026

Blog

జోగులాంబ గద్వాల

శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర ఆలయానికి నూతన ఈవో.

అలంపూర్ : ఆగస్టు 15 ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఆర్. పురేందర్ కుమార్ శ్రీ జమ్ములమ్మ & పరశురామ స్వామి దేవస్థానమునకు బదిలీ కాగా, శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానమునకు, శ్రీమతి ఏ. దీప్తి గ్రేడ్-1, కార్యనిర్వహణాధికారిగా అధనపు బాధ్యతలు స్వీకరించారు. మునుపటి ఈవో పురేందర్ కుమార్ దగ్గరుండి నూతన కార్యనిర్వాహణాధికారి శ్రీమతి ఏ దీప్తి కి ఆలయ బాధ్యతలు అప్పగించారు.

తిరుపతి

రక్త దానం చేద్దాం మరో ముగ్గురి ప్రాణాలు కాపాడుదాం వంశీ యాదవ్

ఈరోజు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శ్రీకాళహస్తి కి చెందిన యువతరం సేవ సమితి వాళ్ళు రుయా హాస్పిటల్ సిబ్బంది ఆధ్వర్యంలో మెగా రక్త దానం శిబిరం నిర్వహించారు. కాండదు పంచాయతీ రాచపాలెం గ్రామానికి చెందిన స్వేచ్ఛ ఫౌండేషన్ వంశీ యాదవ్ స్వచ్చందంగా రక్తాధానం చేశారు.ఈ సందర్బంగా వంశీ యాదవ్ మాట్లాడుతూ ప్రతి 3 నెలలకి ఒక్కసారి బ్లడ్ డోనాట్ చేస్తే మంచిది అన్నారు.ఈ కార్యక్రమంలో యువతరం సేవ సమితి అధ్యక్షులు యువ కిషోర్ గారు మరియు ఆ సంస్థ వాలంటీర్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలో! అప్పనపల్లి M.P.P ప్రైమరీ స్కూల్.

ఆగస్టు 15 పున్నమి ప్రతినిధి: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ మామిడికుదురు మండలం అప్పనపల్లి M.P.P ప్రైమరీ స్కూల్ లో భారత దేశ ప్రజలందరికీ 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసారు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీటమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవమును. నా భారత దేశ ప్రజలందరికీ అప్పనపల్లి M.P.P ప్రైమరీ స్కూల్ తరపున అప్పనపల్లి M.P.P ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ N. రఘురామయ్య స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసారు. ఎందరో మహానుభావుల కలల పంట మరెందరో అమరవీరుల త్యాగఫలం ఈనాడు మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్ర ఫలం. వీరుల త్యాగఫలం వృధా కాకుండ మన జాతి గౌరవాన్ని కాపాడటం మనందరి బాధ్యత.ఈ సందర్భంగా ఆనాటి నుండి ఈనాటి వరకు మనదేశ రక్షణకు, అబివృద్ది కి పాటుపడిన నవీన భారతావని ముద్దుబిడ్డలైన నా తోటి భారతీయులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అంటూ మాస్టర్ షబ్బీర్ ర్ హుస్సేన్ ప్రశాంగించారు. “మన దేశానికి స్వాతంత్ర్యం రావడానికి అనేక మంది మహానుభావులు తమ ప్రాణాలను అర్పించారు. వారి త్యాగాల వల్లనే ఈ రోజు మనం స్వేచ్ఛాయుతమైన దేశంలో జీవిస్తున్నాము. స్వాతంత్ర్యం కేవలం మన హక్కుల గుర్తు మాత్రమే కాదు — అది మన బాధ్యతల గుర్తు కూడా అని మాస్టారు B. పెద్దిరాజు ప్రశాంగిచ్చారు. ప్రతి భారతీయుడు తన దేశం పట్ల గౌరవం, సమాజం పట్ల నిబద్ధత, ప్రజాసేవ పట్ల తపన కలిగి ఉండాలి. అభివృద్ధి, ఐక్యత, న్యాయం — ఇవి మన దేశాన్ని ముందుకు నడిపే మూడు స్తంభాలు. భారత మాతకు సేవ చేయడం నా గర్వకారణం. ఈ రోజు మనం ప్రతిజ్ఞ చేద్దాం — మన దేశం కోసం, మన ప్రజల కోసం, మనం శ్రామిద్దాం అంటూ మాస్టర్ బి. రామకృష్ణ ప్రశాంగించారు. అప్పనపల్లి M.P.P ప్రైమరీ స్కూల్ లో హెడ్ మాస్టర్ N.రఘురామయ్య, బి. పెద్దిరాజు, బి. రామకృష్ణ, షబ్బీర్ ర్ హుస్సేన్, Mఅనంత లక్ష్మి దేవి స్కూల్ పిల్లలుకు ఆ గ్రామ పెద్దలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభ సందర్బంగా స్వీట్ పంచి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఖమ్మం

టూ టౌన్ బిజెపి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవవేడుకలు

ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి ) భారతదేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఖమ్మం టూ టౌన్ కమిటీ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ అధ్యక్షతన ఘనంగా జరిగాయి. గట్టయ్య సెంటర్ నందు జరిగిన కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు, నున్నా రవి కుమార్, పాశం శ్రీనివాస్ రెడ్డి రుద్ర గాని మాధవ తదితరులు పాల్గొన్నారు

తిరుపతి

శ్రీకాళహస్తి లో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

శ్రీకాళహస్తి లో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈ రోజు 79 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శ్రీ కాళహస్తి ఆర్డిఓ కార్యాలయం నందు జాతీయ జెండాను ఎగురవేసిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి. మొదటగా పోలీస్ వందనం స్వీకరించిన ఎమ్మెల్యే ఉత్తమ ఉద్యోగులకు ప్రశంస పత్రాలను ఇచ్చి గౌరవించారు.

ఆంధ్రప్రదేశ్

కర్రసాము పోటీల్లో బొమ్మాలి కగేశ్వరరావుకు గోల్డ్ మెడల్(శ్రీకాకుళం)

శ్రీకాకుళం జిల్లాలో డి ఆర్ డి ఓ ఆధ్వర్యంలో నిర్వహించిన కర్రసాము పోటీలలో నరసన్నపేట మండలానికి చెందిన బొమ్మాలి కగేశ్వరరావు గోల్డ్ మెడల్ సాధించారు. అలాగే, ఆయన శిక్షణనిచ్చిన చిన్నారులు వజ్రోత్సవ మెడల్స్‌ను అందుకున్నారు. ఈ అవార్డులను డి ఆర్ డి ఓ ప్రతినిధులు ఘనంగా బహూకరించారు.ఈ సందర్భంగా డి ఆర్ డి ఓ ప్రతినిధులు మాట్లాడుతూ, “పేద, ధనిక తేడా లేకుండా అందరికీ అన్ని విధాలా శిక్షణ ఇస్తున్న బొమ్మాలి కగేశ్వరరావు సేవలు ప్రశంసనీయమైనవి. ఆయనకు తోడ్పాటునందిస్తున్న రిటైర్డ్ ఆర్మీ సురపు సురేష్ గారు కూడా జిల్లాకి గర్వకారణం” అన్నారు.ఇకముందు కూడా ఇలాంటి సేవలను కొనసాగించి, మరిన్ని విద్యార్థులను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని బొమ్మాలి కగేశ్వరరావు మరియు సురపు సురేష్‌ను అభినందించారు.ఈ కార్యక్రమంలో అధికారులు, పోటీలు విజేతలు, మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

*400 కిలోల నిమ్మకాయలతో గ్రామ దేవత పోలేరమ్మ తల్లి కి ప్రత్యేక అలంకరణ , పూజలు*

నాయుడుపేట, ఆగస్టు, పున్నమి ప్రతినిధి దిలీప్ కుమార్ నాయుడుపేట లో వెలసి ఉన్న గ్రామదేవత శ్రీ పోలేరమ్మ కు శ్రావణమాసం నాల్గవ శుక్రవారం సందర్భంగా 400 కిలోల నిమ్మకాయలతో ప్రత్యేకంగా అలంకరించి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. పట్టణ పరిసర ప్రాంతాల భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్నారు.

ఆంధ్రప్రదేశ్

రక్తదానం ఆనందాన్నిచ్చింది – డబ్బీరు శ్రీనివాస్ (వాసు) “మిత్రబృందం”(శ్రీకాకుళం)

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా శిష్టకరణ సంఘం అధ్యక్షులు డబ్బీరు శ్రీనివాస్ (వాసు) ఆధ్వర్యంలో, స్థానిక అంబేడ్కర్ కూడలిలోని పిజె. నాయుడు రక్తనిధి కేంద్రంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.ఈ శిబిరంలో వాసు మిత్రబృందం సభ్యులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ, “రక్తదానం ప్రాణాధానం. రక్తదానం ద్వారా ప్రాణాలను నిలిపే మిత్రులు దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను” అన్నారు.విశిష్ట అతిథిగా పాల్గొన్న లయన్ పొన్నాడ రవి కుమార్ మాట్లాడుతూ, “శ్రీకాకుళం వజ్రోత్సవ వేడుకలలో భాగంగా మంచి కార్యక్రమం చేయాలనే ఆలోచన గొప్పది. సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి రక్తదానం చేసిన వాసు బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు” తెలిపారు.తరువాత రక్తదాతలకు రక్తనిధి కేంద్ర నిర్వాహకులు డా. పిజె. నాయుడు, వాసు, పొన్నాడ రవి కుమార్, జిల్లా ఎన్.జి.ఓ. సంఘం అధ్యక్షులు హనుమంతు సాయిరాం, ట్రాఫిక్ ఎస్ఐ మెట్ట సుధాకర్ జ్ఞాపికలు అందించి సత్కరించారు.ఈ కార్యక్రమంలో రక్తదాతలు, వాసు మిత్రబృందం, రక్తనిధి కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

దేశభక్తి భావం ప్రతి ఒక్కరిలో ఉండాలి – జి.వి. స్వామినాయుడు

విశాఖపట్నం: ప్రతి ఒక్కరికి దేశభక్తి భావం కలిగి ఉండాలని గురజాడ విద్యా సంస్థల అధినేత జి.వి. స్వామినాయుడు అన్నారు.స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విద్యా సంస్థల ప్రాంగణంలో జాతీయ జెండాను ఎగురవేసి, ఆయన మాట్లాడుతూ – “స్వాతంత్ర్యం, స్వేచ్ఛల కోసం మన పూర్వికులు తమ ప్రాణాలను అర్పించారు. వారి వారసులుగా మనమూ ఆ స్ఫూర్తితో, క్రమశిక్షణతో పనిచేయాలి” అని సూచించారు. ఎన్‌సిసి విద్యార్థుల ప్రదర్శనలు హాజరైన వారిని ఆకట్టుకున్నాయి.ఈ సందర్భంగా వివిధ పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో విద్యా సంస్థల డైరెక్టర్ (సంయుక్త) అంబటి రంగారావు, గాయత్రి కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్‌మెంట్ ప్రిన్సిపాల్ కె.వి.వి. సత్యనారాయణ, మేజర్ మహేష్, గాయత్రి స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీమతి విజయలక్ష్మి, అలాగే ఇతర విద్యా సంస్థల ప్రిన్సిపాళ్లు, అధ్యాపక బృందం పాల్గొన్నారు.

ఖమ్మం

ఖమ్మం పబ్లిక్ స్కూల్ నందు ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి ) ఖమ్మం నగరం లోని రోటరీ నగర్ నందు గల ఖమ్మం పబ్లిక్ స్కూల్ నందు 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చైర్మన్ సాయి మెహర్ డెరెక్టర్ కిషోర్ లు ప్రిన్సిపాల్ సరిత జెండా ఆవిష్కరణ కార్యక్రమం లో పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థిని విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమం లో పాఠశాల అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.