Monday, 11 May 2026

Blog

E-పేపర్

ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు జంబూ సూర్య నారాయణ

నందలూరు మండలంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో శుక్రవారం భాగంగా నాగిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ జంబు సూర్యనారాయణ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ జంబు సూర్యనారాయణ మాట్లాడుతూ స్వతంత్ర సమరంలో ఎందరో మహానుభావులు అమరవీరుల త్యాగ ఫలీతమే బ్రిటిష్ పాలకులపై తిరుగులేని విజయం మన స్వతంత్ర దినోత్సవంఅన్నారు భారత జాతి విముక్తి పొందిన చారిత్రాత్మకమైన రోజు ఆగష్టు 15 న స్వాతంత్ర దినోత్సవ వేడుకలను దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నామన్నారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో సచివాలయ గ్రామపంచాయతీ అధికారులు సిబ్బంది పారిశుద్ధ కార్మికులు. వార్డు సభ్యులు నాగేంద్ర ఆదినారాయణ ప్రసాద్ గంగాధర్ సుబ్బ నరసయ్య మారే శివకుమార్ . తెలుగుదేశం కూటమి నాయకులు ఆదినారాయణ కాన కుర్తి వెంకటయ్య మట్టి బాబు తుమ్మది శివకుమార్ మౌలా మెహర్ పో మ్మల శివ నరసింహలు సురేష్ శివశంకర్ పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

ఖమ్మం

మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పాయ్ కి ఘన నివాళి

ఖమ్మం ఆగష్టు ( పున్నమి ప్రతినిధి ) భారత మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజపేయి వర్ధంతి సం దర్భముగా ఖమ్మం జిల్లా బిజెపి కార్యాలయం లో జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు అధ్యక్షతన వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సం దర్భముగా కోటేశ్వరరావు మాట్లాడుతు వాజ్ పాయ్ దూరదృష్టి, ధైర్యసాహసాలకు ప్రతిరూపం.అని దేశమే ఫస్ట్ అనే నినాదానికి కట్టుబడి జీవితాంతం పనిచేసిన మహనీయులు వాజపేయి నే అని అన్నారు.,రాజకీయాల్లో హూందాతనానికి నిర్వచనంగా నిలిచిన ఆ మహానేత వర్ధంతి వేల నివాళులు అర్పిస్తున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమం లో సీనియర్ నేతలు గేంటెల విద్యాసాగర్, మండదాపు సుబ్బారావు, లతో పాటు రాష్ట్ర జిల్లా మండల స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

నిజామాబాద్

అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న: ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ పెంటయ్య

నిజాంబాద్ జిల్లా: పున్నమి ప్రతినిధి దూపం అంజనేయలు: అమ్మానాన్న అనాథ సేవ ట్రస్ట్ అన్నా నగర్ కాలనీ పోచారం ఘట్కేసర్ మండలం మేడ్చల్ మల్కాజిరి జిల్లాలో గల సంస్థకు నిజాంబాద్ జిల్లా బోధన్ మండలం పెంట కుర్దు గ్రామ క్యాంప్ వాస్తవ్యులు పామ్మి రాజశేఖర్ రెడ్డి, వారి సతీమణి కీర్తి శిష్యులు నాగ సరస్వతమ్మ, వారి జ్ఞాపకార్థం వారి కుమారులు సంతోష్ రెడ్డి, జయరాం రెడ్డి, తన వంతు సహకారం అందించినట్లు వారి కుమారులు తెలిపారు. భవిష్యత్తులో కూడా తన సహాయం కొనసాగిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ట్రస్టు ఎగ్జిక్యూటివ్ మెంబర్ పెంటయ్య ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

నిజామాబాద్

అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న: ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ పెంటయ్య

అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న: ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ పెంటయ్య పున్నమి: ప్రతినిధి దూపం అంజనేయలు: అమ్మానాన్న అనాథ సేవ ట్రస్ట్ అన్నా నగర్ కాలనీ పోచారం ఘట్కేసర్ మండలం మేడ్చల్ మల్కాజిరి జిల్లాలో గల సంస్థకు నిజాంబాద్ జిల్లా బోధన్ మండలం పెంట కుర్దు గ్రామ క్యాంప్ వాస్తవ్యులు పామ్మి జై రాంరెడ్డి వారి సతీమణి కీర్తి శిష్యులు నాగ సరస్వతమ్మ, వారి జ్ఞాపకార్థం వారి కుమారులు రాజశేఖర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, తన వంతు సహకారం అందించినట్లు వారి కుమారులు తెలిపారు. భవిష్యత్తులో కూడా తన సహాయం కొనసాగిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ట్రస్టు ఎగ్జిక్యూటివ్ మెంబర్ పెంటయ్య ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఖమ్మం

గృహ సంపర్క్ అభియాన్ కార్యక్రమం లో పాల్గొన్న దేవకీ వాసుదేవారావు

ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి) గృహ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఖమ్మం రూరల్ మండలంలో కస్న తండ గ్రామంలో భూత్ అధ్యక్షుడు కిషన్ ఆధ్వర్యంలో గృహ సంపర్క్ అభియాన్ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర నాయకులు శ్రీదేవికి వాసుదేవరావు పాల్గొని బిజెపి కరపత్రాలు స్టిక్కర్లు నరేంద్ర మోడీ ప్రవేశ పెట్టి న పథకాలు గురించి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఖమ్మం రూరల్ మండల అధ్యక్షులు జాటోత్ మధు నాయక్ కోట మూర్తి సుదర్శన్ . నల్లమస శ్రీను . పృథ్వి .హిరాలాల్ కిషన్ . కందుల శ్రీ కృష్ణ. సురేష్ రమేష్ తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ

వల్లాల అమరవీరుల స్థూపాన్ని పరిశీలనకు వచ్చిన నాయకులు

నకిరేకల్ :ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి ) శాలిగౌరారం మండలంలోని వల్లాల గ్రామం లోని అమరవీరుల స్థూపాన్ని పరిశీలనకు వచ్చిన కాంగ్రెస్ పెద్దలు హన్మంతరావు గారు, నల్గొండ డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు, నకిరేకల్ నియోజక వర్గం ఎమ్మెల్యే వేముల వీరేశం గారు, శాసనమండలి మాజీ చైర్మన్ విద్యాసాగర్ గారు, మండల కాంగ్రెస్ నాయకులు ప్రజలు పాల్గొన్నారు.

ఖమ్మం

గో సేవలో నెల్లూరు కోటేశ్వరరావు దంపతులు

ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి ) శ్రీ కృష్ణ జన్మాష్టమి సం దర్భముగా ఖమ్మం నగరము లోని శ్రీ కృష్ణ గో శాల నందు నిర్వహించిన గో పూజలో బిజెపి ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు దంపతులు పాల్గొన్నారు. ఈ సం దర్భముగా నెల్లూరు కోటేశ్వరరావు ప్రజల కి శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో గో శాల నిర్వాహకులు పాల్గొన్నారు

ఖమ్మం

హిందూ బంధువులకి శ్రీకృష్ణ అష్టమి శుభాకాంక్షలు తెలిపిన గల్లా

ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి) శ్రీ కృష్ణ జన్మష్టమి సందర్భముగా రాష్ట్ర ప్రజలకి బిజెపి తెలంగాణ రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ శుభాకాంక్షలు తెలియజేసారు..

ఆంధ్రప్రదేశ్

ఘనంగా శర్వాణిలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు(శ్రీకాకుళం జిల్లా – నరసన్నపేట)

నరసన్నపేటలోని శర్వాణి విద్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ పతాక ఆవిష్కరణ ఘనంగా జరిగింది. పాఠశాల ప్రాంగణం దేశభక్తి నినాదాలతో మారుమ్రోగింది. విద్యార్థులు త్రివర్ణ దుస్తులు ధరించి దేశభక్తి గీతాలను ఆలపించగా, చిన్నారులు స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలో పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు.ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీమతి సాయిరాణి గారు పాల్గొని మాట్లాడుతూ – “స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహానీయులను స్మరించుకోవడం మనందరి బాధ్యత. విద్యార్థులు దేశభక్తిని ఆచరణలో పెంపొందించుకొని, సమాజ అభివృద్ధికి కృషి చేయాలి” అని ప్రేరణనిచ్చారు.తల్లిదండ్రులు, గ్రామస్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. పాఠశాల ప్రాంగణం త్రివర్ణ పతాకాలతో, దేశభక్తి నినాదాలతో సందడి చేసింది.

అనంతపురం

వికలాంగులపై అన్యాయం – కూటమి వైఖరిని మార్చుకోవాలి : జైభీమ్ పార్టీ

అనంతపురం, ఆగస్టు 16 పున్నమి ప్రతినిధి వికలాంగుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపడుతూ, తక్షణమే తమ వైఖరిని మార్చుకోవాలని జై భీమ్ రావ్ భారత్ పార్టీ జిల్లా అధ్యక్షుడు వీర నాగరాజు డిమాండ్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ – ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు వికలాంగులకు పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాగ్దానాన్ని విస్మరించి సర్వేల పేరుతో వేలాదిమంది వికలాంగులను జాబితా నుండి తొలగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. “రాష్ట్ర బడ్జెట్‌లో మిగులు చూపించాలనే ఉద్దేశంతో వికలాంగులపై ఉక్కుపాదం మోపడం మానవత్వానికి విరుద్ధం” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం జైభీమ్ పార్టీ తక్షణ చర్యలు చేపడుతుందని, రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వికలాంగులను ఏకతాటిపైకి తెచ్చి పార్టీ అధినేతతో చర్చించి స్పష్టమైన కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే ప్రజల సహకారంతో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.