Monday, 11 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

అనాథలకు అండగా నిలిచిన ఈవిఆర్ ఫౌండేషన్ సామజిక సేవకులు యర్కచెర్ల శివ కూమార్

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో గత నెల 30న మరణించిన తడకమళ్ళ. పెద వెంకన్న–రాములమ్మ గార్లు మరణించి అనాధలైన పిల్లల విషయం సోషల్ మీడియాలో చూసి చలించిపోయి తల్లిదండ్రులు కోల్పోయిన కుటుంబ అనాధ పిల్లలకి చేయూతను అందించడం కోసం ఎర్కచర్ల శివకుమార్ తుంగతుర్తి కి వచ్చి వారికి ఆర్థిక సాహయం పదివేల రూపాయలు అందించడం జరిగింది. పెద్ద కూతురు తడకమల్ల ఉమకి జిఎన్ఎమ్ చేయడం కోసం కాలేజీలో మాట్లాడుతానని హామీ ఇవ్వడం జరిగింది. స్థానిక ప్రజా ప్రతినిధులు ముందుకు వచ్చి వారి బాధ్యతలు తీసుకోవాలని శివ కుమార్ గారు కోరారు. ఈ కార్యక్రమంలో ఖాందాన్ మీడియా మందుల సతీష్, వల్దాస్ రాజు, గోపి, కార్తిక్,కొండగడుపుల నవీన్, మరికంటి.అశోక్, బొంకురి జలంధర్, బొంకూరి రమేష్, మల్లెపాక సురేష్, తడకమల్ల నరేష్, బొంకూరి రవి, కాసర్ల రాజశేఖర్, బొజ్జ వెంకన్న,తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

బస్ షెల్టర్ ప్రారంభం

ఎస్.ఎం.పురం పంచాయతీ పరిధిలోని లింగాలపేట గ్రామంలో శుక్రవారం కొత్త బస్ షెల్టర్‌ను ప్రారంభించారు. ఈ షెల్టర్‌ను పంచాయతీ ఎం.పి.టి.సి కూన అప్పలనాయుడు నిర్మించగా, గాయత్రి కాలేజీ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్‌మెంట్ ప్రిన్సిపాల్ కె.వి.వి. సత్యనారాయణ ప్రారంభించారు. ప్రయాణికులు ఎన్నాళ్లుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించి, ప్రజల సౌకర్యార్థం ఈ నిర్మాణం చేపట్టినట్లు ఎం.పి.టి.సి తెలిపారు. “ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయడమే నిజమైన నాయకత్వం” అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

నిర్మల్

5 గేట్లు ఎత్తి 20వేల క్యూసెక్కుల నీటి విడుదల

నిర్మల్ జిల్లా: (పున్నమి ప్రతినిధి):- వరణుడి జోరు కొనసాగుతోంది. శుక్రవారం రాత్రి వేళ ప్రారంభమైన వర్షం ఇంకా కొనసాగుతునే ఉంది. ఈ క్రమంలో భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు వరద నీరు అధిక మొత్తంలో వచ్చి చేరుతుంది. ఉదయం వేళ నుంచి క్రమక్రమంగా చేరిన వరద నీరు మధ్యాహ్నాం 2.30గంటల ప్రాంతానికి 10500 క్యూసెక్కులకు చేరుకుంది. వరద నీటి చేరికకు అనుగుణంగా ఉదయం వేళలో 2 గేట్లు, అనంతరం 3 గేట్లు, మధ్యాహ్నాం వేళ నుంచి స్వల్ప వ్యవధిలోనే 4, 5 వరద గేట్లను ఎత్తారు. ప్రస్తుతం గడ్డెన్న ప్రాజెక్టులోకి 10500 క్యూసెక్కుల ఇన్ ఫ్లొ ఉండగా, 20 వేల క్యూసెక్కుల ఔట్ ఫ్లో కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 358.7 మీటర్లు ఉండగా, ప్రస్తుత నీటి మట్టం 358.4 మీటర్లకు చేరుకుంది. ఇక నీటి నిల్వల విషయానికి వస్తే ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 1.83 టీఎంసీలు ఉండగా, ప్రస్తుతం 1.658 టీఎంసీలుగా ఉంది. గడ్డెన్న ప్రాజెక్టు ఐదు గేట్లను ఎత్తి సుద్దవాగులోకి 20వేల క్యూసెక్కుల నీటిని వదిలి వేయడంతో పరివాహాక ప్రాంతమంతా జలమయమైంది. ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా సుద్దవాగు పరివాహాక ప్రాంతానికి వరద ముప్పు పొంచి ఉంది. సుద్దవాగును అనుకొని ఉన్న పంట చేలలో వరద నీరు ఉధృతంగా ప్రవహించడం మూలంగా పంట పైర్లు దెబ్బతింటున్నాయి.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కొండపోత వర్షం కురిసింది

సీతారాంపురం మండలం బసనేనిపల్లి గ్రామంలో కొండపోత వర్షం కురిసింది. దీని కారణంగా వర్షపు నీళ్ళు ఇళ్లల్లోకి జరుగు వెళ్లలేక వచ్చింది బసనేపల్లి గ్రామంలో ఇరువైపులా సైడ్ కాలువలు తీగిపోవటం వలన వీళ్లలోకి వర్షపునీలు వచ్చాయి కాబట్టి అధికారులు స్పందించి సైడ్ కాలవలు తీయవలసిందిగా బసినేని పల్లె గ్రామ ప్రజలు కోరుతున్నారు.

తెలంగాణ పెద్దపల్లి

గంగాపురి: మల్లెపూల హనుమాన్ ఆలయం నూతన కార్యవర్గం ఎన్నిక

మంథని, ఆగస్టు 16: పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని గంగాపురిలోని మల్లెపూల హనుమాన్ దేవాలయ నూతన అధ్యక్షుడిగా శనివారం బత్తుల సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా గోరంట్ల సుధాకర్, ప్రధాన కార్యదర్శిగా పుల్లే రవీందర్, కోశాధికారిగా పుల్లె రాధాకృష్ణ, సంయుక్త కార్యదర్శిగా బండి రవి లను ఎన్నుకున్నారు. ఈ కమిటీ రెండు సంవత్సరాల కాలపరిమితి 14 ఆగస్టు 2025 నుండి 14 ఆగస్టు 2027 వరకు కొనసాగుతుందని, ఈ కమిటీకి పద్మశాలి కులస్తులందరూ సహకరించినందుకు పద్మశాలి సంఘంకు నూతన కార్యవర్గం కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గంగాపురి మల్లెపూల హనుమాన్ దేవాలయ నూతన కమిటీ అధ్యక్షులు బత్తుల సత్యనారాయణ మాట్లాడుతూ.. తమకు ఈ ఆలయ బాధ్యతలు నమ్మకంతో అప్పగించినందుకు, తమ బాధ్యతను శిరసా వహిస్తూ, అందరి నమ్మకాన్ని వమ్ము చేయమని, తమ కార్యవర్గం దేవాలయ అభివృద్ధి కోసం పాటు పడతామని నూతన దేవాలయ కార్యవర్గం తెలియజేశారు.

ఆంధ్రప్రదేశ్

కొలిక్కి వస్తున్న సాయిసంతోషి జ్యువెల్లర్స్ దొంగతనం కేసు.

సూర్యాపేట జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించిన బంగారం షాప్ దొంగతనం కేసులు మరో ఇద్దరు దొంగల అరెస్ట్.. కేసులో భాగంగా దొంగతనానికి పాల్పడ్డ ఐదుగురిలో పచ్చిమ బెంగాల్ కి చెందిన మాలిక్ మొల్ల అనే వ్యక్తితో పాటు, దుండగులకు ఖమ్మంలో ఆశ్రయం ఇచ్చిన నేపాల్ కి చెందిన భట్ట అమర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన సూర్యాపేట పోలీసులు. వారి వద్ద నుండి 554 గ్రాముల(55తులాలు) సుమారు 60 లక్షల విలువల బంగారు ఆభరణాలు, 92,500/- నగదు స్వాధీనం. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన సూర్యాపేట జిల్లా SP K. నరసింహ పాల్గొన్న DSP ప్రసన్న కుమార్, CI వెంకన్న, CCS CI శివకుమార్, SI లు హరికృష్ణ, శివతేజ లు ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్

ఇస్కాన్ ఆలయాన్ని సందర్శించిన బీజేపీ జాతీయ నేత నల్లా పవన్

అమలాపురం రూరల్ మండలం జనుపల్లి గ్రామంలో ఉన్న ఇస్కాన్ దేవాలయంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శనివారం ఉదయం నుంచి అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ నేత నల్లా పవన్ ఆలయాన్ని సందర్శించి శ్రీకృష్ణుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్

సర్ధార్ గౌతు లచ్చన్న విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన.. ఉదయగిరి నియోజకవర్గం జై గౌడ ఉద్యమ అధ్యక్షులు పంది మాల్యాద్రి గౌడ్..///

కలిగిరి ఆగస్టు పున్నమి న్యూస్ ప్రతినిధి :/// కలిగిరి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదురు గా సర్ధార్ గౌతు లచ్చన్న 117వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో జై గౌడ ఉద్యమం అధ్యక్షులు పంది మాల్యాద్రి గౌడ్ ఆధ్వర్యంలో జరిగింది. అనంతరం ఆయన స్వాతంత్ర సమరయోధుడు సర్ధార్ గౌతు లచ్చన్న విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ..1909 ఆగస్టు 16న ఆనాటి గంజాం జిల్లా సోంపేటలోని ఒక మారుమూల పల్లెలో జన్మించిన గౌతు లచ్చన్న తనదైన పోరాటాలతో సర్దార్ అనిపించుకున్నారు.ఆయన బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతి కోసం జీవితకాలం అంతా పోరాడారు.ఆయన జీవితమంతా ప్రజా పక్షానే ఉన్నారు.అధికారంలో ఉన్నా లేక ప్రతిపక్షంలో ఉన్నా కూడా తాను సిసలైన ప్రజా నాయకుడిని అని ఎలుగెత్తి చాటారు. బడుగులు కూడా రాజ్యాంగం ప్రకారం అన్ని హక్కులు అందుకోవాల్సిన వారే అని లోకానికి చాటడమే కాదు ఏలిన వారి కళ్ళు తెరిపించి వారికి ఉన్నత మార్గాలను చూపించిన దార్శనీకుడిగా నిలిచారు…అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.ఆయన సంఘ సంస్కర్తగా ఆధునిక రాజకీయ యోధుడిగా చరిత్రలో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్నారు ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం పదవులు సైతం తృణ ప్రాయంగా త్యజించారు. అందుకే ఆయన అనేక పార్టీలలో చేరినా బయటకు వచ్చేసేవారు. ఇక ఆయన ఆంధ్ర రాష్ట్రం 1953లో ఏర్పాటు అయితే తొలి మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అలా ఆయన రాజాజీ ప్రకాశం పంతులు మంత్రివర్గంలో పనిచేసారు.గౌతు లచ్చన్న ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని ఆయన కోరారు. అనంతరం అక్కడే ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు బిస్కెట్లు చాక్లెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గౌడ్ మిత్రులు, మహేష్, జై కృష్ణ, గౌస్ పీర్, జిలాని, తదితరులు పాల్గొన్నారు.

జోగులాంబ గద్వాల

సీఎం ఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన… ఎమ్మెల్యే విజయుడు.

అలంపూర్ : ఆగస్టు 16 ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా, ఉండవెల్లి మండలం, అలంపూర్ చౌరస్తా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ శనివారం అలంపూర్ నియోజకవర్గంలో, లబ్ధిదారులకు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు 14,81,500/- ( పద్నాలాగు లక్షల యేనబైఒక్క వేల ఐదు వందలు ) రూపాయల సీఎం ఆర్ ఎఫ్ చెక్కులు 61 మందికి అందజేచారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు జల్లాపురం లక్కిరెడ్డి కర్ణ సింహారెడ్డి, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం

అటల్ బిహారి వాజ్ పాయి కి ఘన నివాళులు అర్పించిన సత్తుపల్లి బిజెపి శ్రేణులు

ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతి నిధి) ఖమ్మం జిల్లా పరిధిలో ని సత్తుపల్లి లో భారత మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజపేయి lదూరదృష్టి, ధైర్యసాహసాలకు ప్రతిరూపం. దేశమే ఫస్ట్ అనే నినాదానికి కట్టుబడి జీవితాంతం పనిచేసిన మహనీయులు వాజపేయి ,రాజకీయాల్లో హూందాతనానికి నిర్వచనంగా నిలిచిన ఆ మహానేత వర్ధంతి సందర్భంగా సత్తుపల్లి పట్టణం బిజెపి కార్యలయం లో పట్టణ అధ్యక్షులు బానోతు విజయ్, మంద శివ, పాలకొల్లు శ్రీనివాస్ తుర్లపాటి సాయి, తుర్లపాటి శివ,గణేష్, సాయి లు వాజ్ పాయ్ కి ఘన నివాళులు అర్పించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.