Monday, 11 May 2026

Blog

E-పేపర్

కృష్ణాష్టమి వేడుకల్లో చమర్తి

శ్రీకృష్ణుని కృపతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు ఆకాంక్షించారు.శనివారం కృష్ణాష్టమి సందర్భంగా రాజంపేట మండలం మదన గోపాలపురంలో కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామస్తులు ఘన స్వాగతం పలికి మేళా తాళాలతో ఆహ్వానం పలికారు.అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రజలతో కలిసి కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొని శ్రీకృష్ణుని కృపతో ప్రతి ఒక్కరు సుభిక్షంగా ఉండాలని, శ్రీకృష్ణుని లాగా ప్రతి ఒక్కరూ మధ్య ఉన్న మనుషులకు అండగా నిలిచి సాయం చేసే గుణాన్ని ఏర్పరచుకోవాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యాదవ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, శరత్ కుమార్ రాజు, విశ్వనాధ రాజు, నందలూరు టిడిపి మండల అధ్యక్షుడు జంగం శెట్టి సుబ్బయ్య. వీరబల్లి టిడిపి అధ్యక్షుడు భాను గోపాల్ రాజు, క్లస్టర్ ఇంచార్జ్ పసుపులేటి ప్రవీణ్ కుమార్, శ్రీధర్ సుబ్బరాయుడు, కమ్మ సంఘం అధ్యక్షుడు శివ నారాయణ చౌదరి, తెలుగుదేశం పార్టీ నాయకులు గంప శివ, సుబ్రహ్మణ్యం నాయుడు, బిజెపి నాయకులు మహేశ్వర రాజు, కొండ శీను, టిఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షుడు పోలి శివకుమార్, తెలుగు యువత అధికార ప్రతినిధి పాండురాజు, నందకుమార్ నాయుడు, చలపతి, సాయి, పలువురు టిడిపి ముఖ్య నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు ప్రజలు పాల్గొన్నారు.

నిర్మల్

కడెం ప్రాజెక్టు వద్దకి చేరుకున్న శివంగి (పోలీస్) బృందం

నిర్మల్ జిల్లా: (పున్నమి ప్రతినిధి):- రోజులపాటు కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా పోలీసు శాఖ సైతం పూర్తిస్థాయి సిబ్బందితో ఎలాంటి ఆపత్కర పరిస్థితులు ఎదురైనా మేమున్నాం అనే భరోసాను కల్పించేలా ప్రజల రక్షణ కోసం ఎల్లప్పుడు సిద్ధం అనే నినాదంతో.. నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల అప్పటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క ఉండగా ఏర్పడిన బృందమే పోలీసులలో శివంగి బృందం. పోలీసులు ఎలాంటి సమయంలోనైనా ప్రజలకు ధైర్యాన్ని కల్పించడంతోపాటు, ఆత్మవిశ్వాసంతో కూడిన సహాయక చర్యలు చేపట్టడంలో ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు కానీ.. నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల మరో అడుగు ముందుకేసి నిర్మల్ జిల్లా మహిళా ప్రత్యేక బృందంతో శివంగి అనే పేరుతో ఒక బృందాన్ని సిద్ధం చేశారు. ఆపత్కాల పరిస్థితుల్లో ఈ శివంగి బృందం ఎంతగానో ఉపయోగపడుతుంది. కొద్దికాలం క్రితమే ఈ బృందానికి బాసర గోదావరి నదిలో ప్రత్యేక రెస్యూ శిక్షణ ఇవ్వడంతో పాటు, అలల మధ్య గట్టిగా కొట్టే ప్రవాహంలోనూ వారు ధైర్యంగా ప్రాక్టీస్ చేయడంతో పాటు తాడు విసరడం, మునిగిపోయే వారిని పైకి లాగడం, బోట్ల సహాయంతో రక్షణ చేయడం, అత్యవసర సమయంలో ప్రధమ చికిత్స అందించడం వంటి అంశాల్లో వారిని ప్రత్యేక నిపుణులుగా తీర్చి దిద్దారు. అలా వారి అనుభవం వల్ల శివంగి బృందం ఇప్పుడు మరింత ఆత్మవిశ్వాసంతో సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నామని చెబుతూనే కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లోకి చేరిపోయారు. ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనే సత్తా ఉన్న మహిళ పోలీస్ బృందం ఈ శివంగి టీం.

తెలంగాణ

బిటీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

నకిరేకల్ : ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి ) శాలిగౌరారం మండలంలోని వల్లాల గ్రామం నుండి జోలవారిగూడెం వరకు చేపడుతున్న బిటీ రోడ్డు నిర్మాణ పనులను శనివారం (16-8-2025)నాడు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు గారు పరిశీలించి తగు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు.

ఖమ్మం

బోసిబోయిన ఖమ్మం లోని మహా రాష్ట్ర బ్యాంక్ చౌరస్తా.

ఖమ్మం ఆగష్టు ( పున్నమి ప్రతినిధి ) ఎప్పుడు ట్రాఫిక్వ తో వావాహన రాకపోకలతో కల కల లాడే ఖమ్మం నగరము లోని గట్టయ్య సెంటర్రు నందు గల మహా రాష్ట్ర బ్యాంక్స చౌరస్తా వరుసగా గా సెలవులు రావడం తో బోసి పోయి దర్శనం ఇస్తుంది. వ్యాపారాలు కూడా కుంటూ పడ్డాయి అని వ్యాపారాలు అంటున్నారు.

E-పేపర్

ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు జంబూ సూర్య నారాయణ

నందలూరు మండలంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో శుక్రవారం భాగంగా నాగిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ జంబు సూర్యనారాయణ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ జంబు సూర్యనారాయణ మాట్లాడుతూ స్వతంత్ర సమరంలో ఎందరో మహానుభావులు అమరవీరుల త్యాగ ఫలీతమే బ్రిటిష్ పాలకులపై తిరుగులేని విజయం మన స్వతంత్ర దినోత్సవంఅన్నారు భారత జాతి విముక్తి పొందిన చారిత్రాత్మకమైన రోజు ఆగష్టు 15 న స్వాతంత్ర దినోత్సవ వేడుకలను దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నామన్నారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో సచివాలయ గ్రామపంచాయతీ అధికారులు సిబ్బంది పారిశుద్ధ కార్మికులు. వార్డు సభ్యులు నాగేంద్ర ఆదినారాయణ ప్రసాద్ గంగాధర్ సుబ్బ నరసయ్య మారే శివకుమార్ . తెలుగుదేశం కూటమి నాయకులు ఆదినారాయణ కాన కుర్తి వెంకటయ్య మట్టి బాబు తుమ్మది శివకుమార్ మౌలా మెహర్ పో మ్మల శివ నరసింహలు సురేష్ శివశంకర్ పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

ఖమ్మం

మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పాయ్ కి ఘన నివాళి

ఖమ్మం ఆగష్టు ( పున్నమి ప్రతినిధి ) భారత మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజపేయి వర్ధంతి సం దర్భముగా ఖమ్మం జిల్లా బిజెపి కార్యాలయం లో జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు అధ్యక్షతన వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సం దర్భముగా కోటేశ్వరరావు మాట్లాడుతు వాజ్ పాయ్ దూరదృష్టి, ధైర్యసాహసాలకు ప్రతిరూపం.అని దేశమే ఫస్ట్ అనే నినాదానికి కట్టుబడి జీవితాంతం పనిచేసిన మహనీయులు వాజపేయి నే అని అన్నారు.,రాజకీయాల్లో హూందాతనానికి నిర్వచనంగా నిలిచిన ఆ మహానేత వర్ధంతి వేల నివాళులు అర్పిస్తున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమం లో సీనియర్ నేతలు గేంటెల విద్యాసాగర్, మండదాపు సుబ్బారావు, లతో పాటు రాష్ట్ర జిల్లా మండల స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

నిజామాబాద్

అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న: ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ పెంటయ్య

నిజాంబాద్ జిల్లా: పున్నమి ప్రతినిధి దూపం అంజనేయలు: అమ్మానాన్న అనాథ సేవ ట్రస్ట్ అన్నా నగర్ కాలనీ పోచారం ఘట్కేసర్ మండలం మేడ్చల్ మల్కాజిరి జిల్లాలో గల సంస్థకు నిజాంబాద్ జిల్లా బోధన్ మండలం పెంట కుర్దు గ్రామ క్యాంప్ వాస్తవ్యులు పామ్మి రాజశేఖర్ రెడ్డి, వారి సతీమణి కీర్తి శిష్యులు నాగ సరస్వతమ్మ, వారి జ్ఞాపకార్థం వారి కుమారులు సంతోష్ రెడ్డి, జయరాం రెడ్డి, తన వంతు సహకారం అందించినట్లు వారి కుమారులు తెలిపారు. భవిష్యత్తులో కూడా తన సహాయం కొనసాగిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ట్రస్టు ఎగ్జిక్యూటివ్ మెంబర్ పెంటయ్య ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

నిజామాబాద్

అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న: ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ పెంటయ్య

అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న: ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ పెంటయ్య పున్నమి: ప్రతినిధి దూపం అంజనేయలు: అమ్మానాన్న అనాథ సేవ ట్రస్ట్ అన్నా నగర్ కాలనీ పోచారం ఘట్కేసర్ మండలం మేడ్చల్ మల్కాజిరి జిల్లాలో గల సంస్థకు నిజాంబాద్ జిల్లా బోధన్ మండలం పెంట కుర్దు గ్రామ క్యాంప్ వాస్తవ్యులు పామ్మి జై రాంరెడ్డి వారి సతీమణి కీర్తి శిష్యులు నాగ సరస్వతమ్మ, వారి జ్ఞాపకార్థం వారి కుమారులు రాజశేఖర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, తన వంతు సహకారం అందించినట్లు వారి కుమారులు తెలిపారు. భవిష్యత్తులో కూడా తన సహాయం కొనసాగిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ట్రస్టు ఎగ్జిక్యూటివ్ మెంబర్ పెంటయ్య ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఖమ్మం

గృహ సంపర్క్ అభియాన్ కార్యక్రమం లో పాల్గొన్న దేవకీ వాసుదేవారావు

ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి) గృహ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఖమ్మం రూరల్ మండలంలో కస్న తండ గ్రామంలో భూత్ అధ్యక్షుడు కిషన్ ఆధ్వర్యంలో గృహ సంపర్క్ అభియాన్ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర నాయకులు శ్రీదేవికి వాసుదేవరావు పాల్గొని బిజెపి కరపత్రాలు స్టిక్కర్లు నరేంద్ర మోడీ ప్రవేశ పెట్టి న పథకాలు గురించి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఖమ్మం రూరల్ మండల అధ్యక్షులు జాటోత్ మధు నాయక్ కోట మూర్తి సుదర్శన్ . నల్లమస శ్రీను . పృథ్వి .హిరాలాల్ కిషన్ . కందుల శ్రీ కృష్ణ. సురేష్ రమేష్ తదితరులు పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.