Monday, 11 May 2026

Blog

జాతీయ అంతర్జాతీయ

2030 కామన్వెల్త్ క్రీడలకు బిడ్.. ఐవోసీ ఆమోదం

2030 కామన్వెల్త్ క్రీడలకు బిడ్.. ఐవోసీ ఆమోదం బిడ్‌కు ఆమోదం తెలిపిన భారత ఒలింపిక్ సంఘం అహ్మదాబాద్ ఆతిథ్య నగరంగా ఇప్పటికే ఎంపిక ఆగస్టు 31 గడువుకు ముందే ప్రతిపాదనలను సమర్పించనున్న భారత్

ఆంధ్రప్రదేశ్

మన మిత్రలో కొత్త పెన్షన్లు గ్రీవెన్స్ సదుపాయం!ఆగస్టు 15 నుండి

ఆగస్టు 14 పున్నమి ప్రతినిధి : ఆగస్టు 15 నుండి కేవలం కొత్త పింఛన్ గ్రీవెన్స్ కోసం మన మిత్ర యాప్‌లో ప్రత్యేక సదుపాయం ప్రారంభం కానుంది. గ్రామీణ పెదరిక నిర్మూలన సొసైటీ (SERP) అధికారులు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. కొత్త పింఛన్ దరఖాస్తుదారులకు అర్హత, పత్రాల లోపాలు, పేరు సవరణలు, రికార్డు లోపాలు వంటి సమస్యలు ఎదురైనప్పుడు ఇకపై ప్రత్యక్షంగా కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, మొబైల్‌లోనే మన మిత్ర యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఎలా నమోదు చేయాలి? మన మిత్ర యాప్‌లోకి లాగిన్ అయ్యి, “New Pension Grievance” సెక్షన్‌ను ఎంచుకోవాలి. సమస్యకు సంబంధించిన కేటగిరీని ఎంపిక చేసి, అవసరమైన వివరాలు, పత్రాలు అప్‌లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. సంబంధిత అధికారి ఆ ఫిర్యాదును స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. యాప్‌లోనే స్టేటస్‌ను ట్రాక్ చేసే సౌకర్యం కూడా ఉంటుంది. ప్రయోజనాలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. కొత్త పింఛన్ సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి. ప్రభుత్వ ప్రక్రియలో పారదర్శకత పెరుగుతుంది.

తిరుపతి

ఆమె ఆచూకీ తెలియజేయండి.వన్ టౌన్ సిఐ

గతనెల 21 వ తేదీన సాయంత్రం శ్రీకాళహస్తిలో ని స్కిట్ బ్రాంచ్ నందు గల సీడీఎం మిషన్ లో ఒక వ్యక్తి రూ.39000 /-నగదు డిపాజిట్ చేసి వెళ్లిపోగా సీడీఎం మిషన్ డబ్బును తీసుకోకపోవడంతో వెనక్కి వచ్చింది.అది గమనించిన అక్కడే ఉన్న ఒక మహిళ ఆ డబ్బును తీసుకొని వెళ్ళిపోయింది.ఆమె ఆచూకీ తెలిసిన వారు 9440796762 నెంబర్ కి తెలియజేయాలని వన్ టౌన్ సిఐ కోరారు.

ఖమ్మం

జమ్మూ కాశ్మీర్ లో మరణించిన జవాన్ కి నివాళులు అర్పించిన జాతీయ st కమిషన్ సభ్యులు మరియు బిజెపి నేతలు

ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి ) శ్రీనగర్ లో రోడ్డు ప్రమాదంలో వీరమరణం పొందిన జవాన్ బానోత్ అనిల్ కుమార్ జన్మస్థలం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం సూర్య తండాలో అంతిమ యాత్రలో పాల్గొన్న జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు శ్రీ జాటోతు హుస్సేన్ నాయక్ , ఖమ్మం జిల్లా బిజెపి అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు పాలేరు అసెంబ్లీ కంటెస్టెడ్ అభ్యర్థి నున్న రవి కుమార్ గారు మరియు ఎస్టీ మోర్చ ఖమ్మం జిల్లా అధ్యక్షులు అధ్యక్షుడు రవి రాథోడ్. ఖమ్మం రూరల్ మండల అధ్యక్షులు జాటోత్ మధు తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

కృష్ణాజిల్లా మచిలీపట్నం

కృష్ణాజిల్లా పోలీస్ *గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకునే ఉత్సవ కమిటీలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలి – జిల్లా ఎస్పీ శ్రీ ఆర్. గంగాధరరావు, ఐపిఎస్.,* – పర్యావరణ రక్షణకు నిర్వాహకులు పోలీసువారికి సహకరించాలి. – ప్రజారోగ్యం మరియు భద్రత దృష్ట్యా DJ లు, బాణాసంచా పూర్తిగా నిషేదం. – వాహనాల రాకపోకలకు ప్రజాజీవనానికి అంతరాయం కలిగించేలా మండపాలు రోడ్లపై ఏర్పాటు చేయొద్దు. – సంభందిత శాఖల నుండి ముందస్తు అనుమతులు తప్పనిసరి. … *ఆర్.గంగాధర రావు, ఐపిఎస్, ఎస్పి కృష్ణా జిల్లా*. గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకునే నిర్వాహకులు, ప్రజలకు, ఇతరులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పి ఆర్.గంగాధర రావు ఐపిఎస్ గారు ఒక ప్రకటనలో తెలిపినారు. ▪️త్వరలో రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు ఉత్సవ కమిటీలు, యువత ముందస్తు ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని భద్రత పరమైన చర్యల దృష్ట్యా పోలీసు శాఖ సూచించే నియమ నిభందనలు పాటించాలని ఎస్పి గారు కోరారు. ▪️ మట్టి గణపతి ప్రతిమను ప్రతిష్టించి పర్యావరణ పరిరక్షణకు బాధ్యతగా ఉండాలని అన్నారు. ▪️ పరిసరాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకుంటూ, అధిక శబ్దాలతో కూడిన డీజే బాక్సులు వినియోగించడం వంటివి చేయరాదని, ప్రజలకు ఇబ్బంది కలిగేలా బాణసంచా కాల్చే వద్దని సూచించారు. ▪️ మండపాల ఏర్పాటుకు ముందస్తుగా అన్ని శాఖల నుండి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని అన్నారు. ప్రయాణికులకు, సామాన్యులకు, ఇతర మతస్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా మండపాలు ఏర్పాటు చేయడం మంచిది అని తెలిపారు. ▪️ మతసామరస్యాలకు ప్రతీకగా గణేష్ ఉత్సవాలు ఉండాలని అన్నారు. మండపాల వద్ద నిబంధనలు పాటించాలి, పోలీసు అనుమతులు తీసుకోవాలని కోరారు. శాంతి, సామరస్యానికి మనం పాటుపడాలి, సోదరభావంతో అందరూ కలిసి మెలిసి ఉత్సవాలను జరుపుకోవాలని సూచించారు. ▪️ జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు పటిష్ఠమైన పోలీసు భద్రత ఉంటుంది, ప్రశాంత వాతావరణంలో నవరాత్రులు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. *పోలీసు సూచనలు* 👉🏻 రోడ్లు ఆక్రమించి గణేష్ మండపాలు ఏర్పాటు చేయరాదు, ట్రాఫిక్ అంతరాయం కలిగించరాదు. 👉🏻 DJ ల వినియోగానికి , బాణాసంచా పేల్చుటకు కు అనుమతి లేదు. 👉🏻 మండపాల వద్ద మరియు ఊరేగింపు సమయంలో భక్తి సంబంధిత పాటలు మాత్రమే ప్రసారం చేయాలి. 👉🏻 మండపాలు ఏర్పాటు చేసే స్థలం పబ్లిక్ స్థలం అయితే సంబంధిత గ్రామ పంచాయితీ, మున్సిపాలిటీ అనుమతి పత్రం తీసుకోవాలి. 👉🏻 ప్రవేట్ వ్యక్తుల స్థలం అయితే స్థల యజమాని అనుమతి పత్రం తీసుకోవాలి. 👉🏻 ఉత్సవాలు ముగిసే వరకు ఉత్సవ కమిటీ సభ్యులు 24 గంటలు మండపాల వద్ద అందుబాటులో ఉండాలి. 👉🏻 మండపాల వద్ద CC కెమెరాలు అమర్చాలి. 👉🏻 విద్యుత్ శాఖ అనుమతి ఉండాలి. 👉🏻 వివాదాస్పద స్థలాల్లో గణేష్ మండపాలు ఏర్పాటు చేయొద్దు. 👉🏻 ఇతరులను రెచ్చగొట్టే విధంగా, వివాదాస్పదంగా మండపాల వద్ద ప్రసంగాలు చేయరాదు. 👉🏻 నిబంధనలు పాటించకపోయిన లేదా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా అనుమతి కోరిన అర్జీదారులు, ఉత్సవకమిటీ సభ్యులే పూర్తి బాధ్యత వహించాలి.

ఖమ్మం

పోలీస్ సింగ్ తో నేరాల నియంత్రణ క్షేత్రస్థాయిలో రాత్రి గస్తీ పై దృష్టి

పున్నమి Daily న్యూస్ ప్రతినిధి: T. రవీందర్ 👉 *విజబుల్ పోలిసింగ్ తో నేరాల నియంత్రణ….క్షేత్రస్థాయిలో రాత్రి గస్తీపై దృష్టి* 👉 *రైల్వే స్టేషన్, బస్టాండ్ లో విస్తృత తనిఖీలతో చట్ట వ్యతిరే కార్యాకాలాపాల కట్టడి* *నేర నియత్రణలో భాగంగా హోటల్స్, లాడ్జీలలో సోదాలు, అనుమానిత వ్యక్తుల వివరాలు సేకరణ* *గంజాయి సరఫరా, వినియోగాన్ని సమూలంగా నియంత్రించేందుకు ప్రత్యేక బృందాలు…* *సేఫ్టీ అండ్ సెక్యూరిటీ దృష్టిలో పెట్టుకొని సీసి కెమెరాల ఏర్పాటుకు స్థానిక ప్రజలు స్వచ్చద్దంగా ముందుకు రావాలని విజ్ఞప్తి* *పోలీస్ కమిషనర్ సునీల్ దత్..* నేరాల నియంత్రణ,చట్ట వ్యతిరేక కార్యకలాపాలను కట్టడి చేసేందుకు పోలీస్ యంత్రాంగం పోలీస్ కమిషనరేట్ పరిధిలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. విజబుల్ పోలీసింగ్ పటిష్టంగా అమలు చేస్తేనే నేరాలు, దొంగతనాలు నియంత్రణలో వుంటాయన్న నేపథ్యంలో అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో గత వారం రోజులుగా పోలీసు అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పోలీస్ గస్తీ పెంచి, పెట్రోలింగ్ ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. సుమారు 50 హోటళ్ళు, లాడ్జీలపై పోలీసులు సోదాలు నిర్వహించి అనుమానిత వ్యక్తుల పూర్తి వివరాలను సేకరించి, అనంతరం వారికి వెసులుబాటు కల్పిస్తున్నారు. గంజాయి సరఫరా, వినియోగాన్ని సమూలంగా నియంత్రించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి కట్టడిలో పురోగతి సాధించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా సరిహద్దు రాష్ట్రాల మీదుగా గంజాయి , రేషన్ బియ్యం, ఇసుక వంటి అక్రమ రవాణా,పాత నేరస్తుల కదలికలను కట్టడి చేసేలా జిల్లా పోలీస్ యంత్రాంగం వాహన తనిఖీలు ముమ్మరం చేస్తున్నారని తెలిపారు. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ దృష్టిలో పెట్టుకొని సీసి కెమెరాల ఏర్పాటుకు స్థానిక ప్రజలు స్వచ్చద్దంగా ముందుకు రావాలని,వ్యాపారస్తులు ఖచ్చితంగా సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ గారు తెలియజేశారు

జోగులాంబ గద్వాల

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం — మైనర్ బాలికపై అత్యాచారం చేసి గర్భిణిని చేసిన యువకుడు.

అలంపూర్ : ఆగస్టు 13 ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన యువకుడు (21) కు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన కుత్బుల్లాపూర్‌కు చెందిన బాలిక (16) 5 నెలల పరిచయంలోనే దగ్గరై, యువకుడు జూన్‌లో ఐడీపీఎల్ టౌన్‌షిప్‌కి రమ్మని చెప్పగా వెళ్ళిన బాలిక, అక్కడ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి బాలికపై మొదటిసారి అత్యాచారం చేసి ఎవరికి చెప్పొద్దని చెప్పి.. ఆ తర్వాత మరో రెండుసార్లు కోరిక తీర్చుకున్న యువకుడు. వాంతులు చేసుకున్న బాలికను తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లగా, గర్భం దాల్చిందని తెలిపిన డాక్టర్లు. తల్లిదండ్రులు నిలదీయడంతో యువకుడితో జరిగిన విషయాన్ని చెప్పిన బాలిక, బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు.

ఆంధ్రప్రదేశ్

తెలుగుభాషా పురస్కారానికి ఎప్పుడొస్తుందో పుస్తకం

లేపాక్షి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వడ్డీ సుధాకర్ అధ్యక్షతన జరుగు తెలుగు భాష ఉత్సవాలు కార్యక్రమంలో తెలుగు భాషా పురస్కారాన్ని పలమనేరుకు చెందిన లక్ష్మీ శ్రీనివాస్ రాసిన ఎప్పుడొస్తుందో పుస్తకానికి అందిస్తున్నట్టు రచయిత శ్రీనివాస్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మరికొందరు పుస్తక రచయితలకు భాషా పురస్కారాలను అందిస్తున్నట్టు తెలియజేశారు పురస్కారానికి ఎంపిక కావడం పట్ల పలువురు శ్రీనివాస్ కు అభినందనలు తెలియజేశారు

ఆంధ్రప్రదేశ్

లేపాక్షి ఫౌండేషన్ వ్యాసరచన పోటీ ఫలితాలు విడుదల

లేపాక్షి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విజేతలు *లేపాక్షి మండలంలో మైత్రి- వి జెడ్పి పాఠశాల, పి గిరిజ – కేజీబీవీ 3.మానస & భూమిక – ప్రభుత్వ జూనియర్ కళాశాల, హిందూపురం మండలంలో ఆర్ వెన్నెల కేజీబీవీ పాఠశాల,కె.మహేశ్వరరెడ్డి – బాలయేసు జూనియర్ కళాశాల, పి.ఎ తనుషా రెడ్డి – లోటస్ పబ్లిక్ పాఠశాల,డి ప్రశాంతి – కేజీబీవీ , పరిగి మండలంలో 1.డి అఖిల, కె హర్షిని, శాలిని & గాయత్రి ఎంపికయ్యారు.ధర్మవరం మండలంలో ఆర్.భావన, సి.లహరి చిలమత్తూరు మండలంలో పి. సుస్మిత – ప్రభుత్వ జూనియర్ కళాశాల నంబులపూలకుంట మండలం నుండి టి మమత గెలుపొందారు.గెలుపొందిన విజేతలకు 26 న బహుమతులు అందజేయనున్నట్లు అధ్యక్షులు వడ్డి సుధాకర్ తెలియజేశారు.

ఆంధ్రప్రదేశ్

పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే పి-ఫోర్ లక్ష్యం – కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ..!!

కావలి ఆగస్టు పున్నమి ప్రతినిధి: పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే పి-ఫోర్ లక్ష్యమని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు. కావలి ఆర్డీవో కార్యాలయంలో బుధవారం పి-ఫోర్ కార్యక్రమంపై ఆర్డీవో సన్నీ వంశీ కృష్ణ తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అట్టడుగులో ఉన్న కుటుంబాలను ఆదుకోవడం కోసం ఈ పి-ఫోర్ కార్యక్రమాన్ని రూపొందించామని, ముఖ్యమంత్రి స్వయంగా పేద కుటుంబాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ పేద వర్గాలకు మార్గదర్శకులుగా వ్యవహరించాలని కోరారు. కావలి నియోజకవర్గంలో 9000 పేద కుటుంబాలను గుర్తించినట్లు, గ్యాస్ కనెక్షన్లు లేని, ఇంకా కట్టెల మీద వంట చేసుకునే కుటుంబాలు అధికంగా ఉన్నాయని వివరించారు. ఈ కుటుంబాలను “బంగారు కుటుంబాలు”గా మార్చడం లక్ష్యంగా, ప్రతి కుటుంబానికి ఒక మార్గదర్శిని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ సందర్భంలో 1350 మంది పేద కుటుంబాలను దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చారని ఆయన వెల్లడించారు. దత్తత ప్రక్రియపై ఉన్న అపోహలను తొలగిస్తూ, దీని వల్ల ప్రభుత్వాలు లేదా బ్యాంకులు ఇబ్బంది పెట్టవని స్పష్టం చేశారు. మన కుటుంబాలను మాత్రమే కాదు, పక్కింటివారిని కూడా ఆదుకోవాలి అని పిలుపునిచ్చారు. దేవుని సేవ కన్నా, మానవ సేవ గొప్పదని, సమాజంలో సేవ చేసే వ్యక్తులకు గౌరవం లభిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా పేదరిక నిర్మూలనలో ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు, ప్రజలు కలసి పనిచేస్తే సమాజం సంపన్నంగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మార్గదర్శిలు, ప్రజలు, స్వచ్చంద సంస్థలు, తదితరులు పాల్గొన్నారు…

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.