నిర్మల్ జిల్లా భైంసా లో అవినీతి వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో కార్ల ర్యాలీ, బహిరంగ సభ
ఈరోజు భైంసా పట్టణంలో Anti Corruption Committee ఆధ్వర్యంలో కార్ల ర్యాలీ మరియు బహిరంగ సభను ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం శ్రీ బ్యాంకెట్ హాల్‌లో జరిగిన బహిరంగ సభలో అవినీతి నిర్మూలన, ప్రజల్లో అవగాహన కల్పించడం మరియు పారదర్శక పాలన కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.
ఈ కార్యక్రమానికి నేషనల్ ప్రెసిడెంట్ శ్రీ రవీందర్ దేవ్ జీ, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ ALOK DWIVEDI, నేషనల్ ఫోక్ పర్సన్ శ్రీ MOHD SAYEED AHMSD, మహిళా అధ్యక్షురాలు శ్రీమతి MALIKA ANEES FATHIMA, శ్రీ SYED HYDER తదితరులు పాల్గొన్నారు.
అవినీతికి వ్యతిరేకంగా ప్రజలందరూ ఐక్యంగా ముందుకు రావాలని, నిజాయితీతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.




