Tuesday, 22 September 2026
  • Home  
  • యలమంచిలి పురపాలక ఎన్నికలపై టీడీపీ సమీక్ష
- అనకాపల్లి

యలమంచిలి పురపాలక ఎన్నికలపై టీడీపీ సమీక్ష

పున్నమి ప్రతినిధి ఆనంద్ యలమంచిలిలో రాబోయే పురపాలక ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శుభం కళ్యాణ మండపంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. టౌన్ అధ్యక్షుడు గొర్ల శివనారాయణమూర్తి (నానాజీ) అధ్యక్షతన జరిగిన సమావేశానికి మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు, మాజీ ఎమ్మెల్సీ కొండపల్లి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, నియోజకవర్గ ఇన్‌చార్జ్ ప్రగడ నాగేశ్వరరావు, మాజీ జడ్పీ చైర్మన్ లాలం భవాని భాస్కర్ తదితరులు హాజరయ్యారు. కూటమి ధర్మాన్ని పాటిస్తూ ఎన్నికలకు సమష్టిగా సిద్ధం కావాలని నాయకులు పిలుపునిచ్చారు. పార్టీ కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. మున్సిపాలిటీలోని 32 వార్డులకు కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీ చేయాలనుకునే వారి జాబితాతో పాటు చైర్‌పర్సన్ పదవికి ఆసక్తి ఉన్నవారి వివరాలను పరిశీలించారు. ఎన్నికల్లో ఐక్యంగా పనిచేయాలని సూచించారు.

పున్నమి ప్రతినిధి ఆనంద్

యలమంచిలిలో రాబోయే పురపాలక ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శుభం కళ్యాణ మండపంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. టౌన్ అధ్యక్షుడు గొర్ల శివనారాయణమూర్తి (నానాజీ) అధ్యక్షతన జరిగిన సమావేశానికి మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు, మాజీ ఎమ్మెల్సీ కొండపల్లి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, నియోజకవర్గ ఇన్‌చార్జ్ ప్రగడ నాగేశ్వరరావు, మాజీ జడ్పీ చైర్మన్ లాలం భవాని భాస్కర్ తదితరులు హాజరయ్యారు. కూటమి ధర్మాన్ని పాటిస్తూ ఎన్నికలకు సమష్టిగా సిద్ధం కావాలని నాయకులు పిలుపునిచ్చారు. పార్టీ కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. మున్సిపాలిటీలోని 32 వార్డులకు కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీ చేయాలనుకునే వారి జాబితాతో పాటు చైర్‌పర్సన్ పదవికి ఆసక్తి ఉన్నవారి వివరాలను పరిశీలించారు. ఎన్నికల్లో ఐక్యంగా పనిచేయాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.