Wednesday, 23 September 2026
  • Home  
  • భూకబ్జాలపై బీఆర్‌ఎస్‌ది తప్పుడు ప్రచారం: నూతి సత్యనారాయణ గౌడ్
- ఖమ్మం

భూకబ్జాలపై బీఆర్‌ఎస్‌ది తప్పుడు ప్రచారం: నూతి సత్యనారాయణ గౌడ్

ఖమ్మం, : బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భూములు, వేలాది ఎకరాలు కబ్జాకు గురయ్యాయని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ ఆరోపించారు. శుక్రవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. భూకబ్జాలపై నిజాలు నిగ్గు తేల్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా కబ్జాదారుల వివరాలు వెల్లడిస్తామని చెప్పారని గుర్తు చేశారు. 2004లో కేసీఆర్‌ ఎన్నికల అఫిడవిట్‌లో వ్యవసాయ భూములు లేవని పేర్కొన్నారని, ప్రస్తుతం వందల ఎకరాల భూములు ఎలా వచ్చాయో ప్రజలకు వివరించాలని ప్రశ్నించారు. కేటీఆర్‌, హరీశ్‌రావు, సంతోష్‌, కవితలపై కూడా ఆయన ఆరోపణలు చేశారు. 22ఏ జాబితాలో ఉన్న భూ సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తుందని తెలిపారు. నగర కాంగ్రెస్ అధ్యక్షులు నాగండ్ల దీపక్‌ చౌదరి మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ హయాంలో భూ అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రాయల నాగేశ్వరరావు, గజ్జెల్లి వెంకన్న, ఏఐసీసీ సేవాదళ్ కోఆర్డినేటర్ చోటా బాబా, కొత్త సీతారాములు, దొబ్బల సౌజన్య, సయ్యద్ గౌస్, బొడ్డు బొందయ్య, సయ్యద్ ముజాహీద్ హుస్సేన్, మూడుముంతల గంగరాజు యాదవ్, ఖాజా మురళి, లాల్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం,

: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భూములు, వేలాది ఎకరాలు కబ్జాకు గురయ్యాయని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ ఆరోపించారు. శుక్రవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. భూకబ్జాలపై నిజాలు నిగ్గు తేల్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా కబ్జాదారుల వివరాలు వెల్లడిస్తామని చెప్పారని గుర్తు చేశారు. 2004లో కేసీఆర్‌ ఎన్నికల అఫిడవిట్‌లో వ్యవసాయ భూములు లేవని పేర్కొన్నారని, ప్రస్తుతం వందల ఎకరాల భూములు ఎలా వచ్చాయో ప్రజలకు వివరించాలని ప్రశ్నించారు. కేటీఆర్‌, హరీశ్‌రావు, సంతోష్‌, కవితలపై కూడా ఆయన ఆరోపణలు చేశారు. 22ఏ జాబితాలో ఉన్న భూ సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తుందని తెలిపారు.

నగర కాంగ్రెస్ అధ్యక్షులు నాగండ్ల దీపక్‌ చౌదరి మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ హయాంలో భూ అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రాయల నాగేశ్వరరావు, గజ్జెల్లి వెంకన్న, ఏఐసీసీ సేవాదళ్ కోఆర్డినేటర్ చోటా బాబా, కొత్త సీతారాములు, దొబ్బల సౌజన్య, సయ్యద్ గౌస్, బొడ్డు బొందయ్య, సయ్యద్ ముజాహీద్ హుస్సేన్, మూడుముంతల గంగరాజు యాదవ్, ఖాజా మురళి, లాల్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.