శ్రీ కాళహస్తి, సెప్టెంబర్ 03, (పున్నమి న్యూస్): జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పండగలా నిర్వహించినట్లు పార్టీ నాయకులు దండి నరేంద్ర తెలిపారు. నాయకులు, జనసైనికులతో కలిసి పలు ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌లో 200 యూనిట్ల రక్తదాన శిబిరం, శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక రుద్రాభిషేకం, తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులుతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముచ్చివోలు నుండి రేణిగుంట వరకు 200 బైకులతో 78 కిలోమీటర్ల మేర భారీ బైక్ ర్యాలీ చేపట్టి పర్యటించారు. నియోజకవర్గవ్యాప్తంగా అనాథాశ్రమంలో 70 మందికి, పట్టణంలో 500 మందికి అన్నదానం నిర్వహించడంతో పాటు ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కందాడులో మొక్కలు నాటడం, కరకంబాడిలో జెండా ఆవిష్కరణ, వివిధ గ్రామాల్లో కేక్ కటింగ్ కార్యక్రమాల్లో పాల్గొని ఉత్సాహంగా జరుపుకున్నారు. పార్టీ శ్రేణులు, అభిమానులు చూపిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు.

శ్రీకాళహస్తిలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు-దండి నరేంద్ర