శ్రీ కాళహస్తి, సెప్టెంబర్ 03, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి కో-ఆపరేటివ్ పాల సరఫరా సంఘం ఆధ్వర్యంలో శివం కళ్యాణమండపంలో నూతన పాలకోవా తయారీ భవనం ప్రారంభోత్సవం, పాడి రైతులకు ప్రోత్సాహకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ ముఖ్యఅతిథిగా హాజరై, భవనాన్ని ప్రారంభించి రైతులకు ప్రోత్సాహకాలు అందజేశారు. పాడి రైతుల ఆర్థికాభివృద్ధికి, కష్టానికి తగిన ప్రతిఫలం అందించడానికి కో-ఆపరేటివ్ సొసైటీలు కృషి చేస్తున్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. స్థానిక పాల ఉత్పత్తికి సాంకేతికతను జోడించి నాణ్యమైన పాలకోవా తయారు చేయడం వల్ల మార్కెటింగ్ పెరిగి రైతులకు మరింత లాభం చేకూరుతుందని తెలిపారు. సొసైటీ పాలకమండలి సభ్యులు రైతుల సంక్షేమానికి చేపడుతున్న చర్యలను అభినందించారు. కార్యక్రమంలో కో-ఆపరేటివ్ పాల సరఫరా సంఘం డైరెక్టర్లు, స్థానిక నాయకులు, పాడి రైతులు పాల్గొన్నారు.

పాలకోవా తయారీ భవనాన్ని ప్రారంభించిన బొజ్జల బృందమ్మ