శ్రీ కాళహస్తి, సెప్టెంబర్ 03, (పున్నమి న్యూస్): జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పేట బ్రదర్స్ మిత్రబృందం ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పలుచోట్ల మొక్కలు నాటడంతో పాటు నిస్సహాయ స్థితిలో ఉన్న గిరిజన కుటుంబాలకు నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం ద్వారా పేదలకు భోజనాలు అందించారు. ఒక గిరిజన కుటుంబం శాశ్వత జీవనోపాధి పొందేలా నూతనంగా దుకాణాన్ని నిర్మించి ఇచ్చి వ్యాపారాన్ని ప్రారంభించారు. అలాగే ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 50 మంది దాతల నుండి రక్తాన్ని సేకరించారు. ఈ సందర్భంగా నిర్వహకులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జన్మదినాన రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది రక్తదానం చేసి ప్రాణదాతలుగా మారుతున్నారని, లక్షలాది మందికి అన్నదానం జరుగుతోందని పేర్కొన్నారు. ఆయన నిజాయితీ, ధైర్యం సమాజానికి మార్గదర్శకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు, అభిమానులు పాల్గొన్నారు.

పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా పేట బ్రదర్స్ ఆధ్వర్యంలో రక్తదానం శిభిరం