Friday, 4 September 2026
  • Home  
  • ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని జెండా ఆవిష్కరణలు
- తిరుపతి

ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని జెండా ఆవిష్కరణలు

శ్రీ కాళహస్తి, సెప్టెంబర్ 03, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజికవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ కొట్టే సాయి ఆధ్వర్యంలో నియోజకవర్గవ్యాప్తంగా వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. నియోజకవర్గ పరిధిలోని ఆరు ముఖ్య ప్రాంతాలలో జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను కొట్టే సాయి స్వయంగా ముందంజలో ఉండి నిర్వహించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని ఎం ఎం వాడ సర్కిల్, బహదూర్ పేట సర్కిల్‌లతో పాటు శ్రీకాళహస్తి మండలం చెర్లోపల్లె సర్కిల్, సుబ్బా నాయుడు కండ్రిగ అరుంధతివాడ సర్కిల్, తొట్టంబేడు మండలం పూడి అరుంధతివాడ సర్కిల్, రేణిగుంట మండలం కరకంబాడి సర్కిల్‌లలో ఆయన సమక్షంలో జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో వందలాదిగా తరలివచ్చిన జనసైనికులు, అభిమానులు ఉత్సాహంగా పాల్గొని కేక్ కట్ చేశారు. కొట్టే సాయి నేతృత్వంలో పలుచోట్ల పేదలకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.