బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 3న భారీ రైతు సదస్సు
నిర్మల్: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆరు గ్యారెంటీల వైఫల్యాలను ఎత్తిచూపుతూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు గర్జన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
బీఆర్‌ఎస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జ్ కె. రాంకిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 3, 2026న ఉదయం 10:30 గంటలకు నిర్మల్‌లోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో రైతు సదస్సు నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు, ఆరు గ్యారెంటీల వైఫల్యాలు, రైతులకు ఇచ్చిన హామీల అమలులో జరుగుతున్న జాప్యంపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు.
కావుపు నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామం, పట్టణాల నుంచి బీఆర్‌ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రైతు సోదరులు, మహిళా నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.



