అనకాపల్లి జిల్లా సెప్టెంబర్ 2 పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్:
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి (YSR) 17 వ వర్ధంతి వేడుకలు పూడిమడకలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.
పూడిమడకలోని వైఎస్సార్ విగ్రహానికి, గ్రామ పార్టీ అధ్యక్షులు,వైస్ ఎంపీపీ వాసుపల్లి శ్రీనివాసరావు,వైసీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు చోడిపల్లి అప్పారావు, మాజీ వైస్ ఎంపీపీ ఉమ్మిడి అప్పారావు, జిల్లా అధికార ప్రతినిధి ఉమ్మిడి జగన్, యూత్ నాయకులు ఏరిపిల్లి భాను, మేరుగు రాజేష్, వార్డు మెంబెర్స్ మేరుగు అప్పలరాజు, ఏరిపిల్లి పైడియ్య, పొన్నమళ్ళ తాతారావు, దాసరి శ్రీనివాసరావు, ఈరిగిల అప్పారావు, మరియు నాయకులు,కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
వైఎస్సార్ హయాంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధిని నాయకులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీఇంబర్స్మెంట్ వంటి పథకాల ద్వారా ఆయన పేద ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారని కొనియాడారు.


