Wednesday, 2 September 2026
  • Home  
  • *ప్రజల పక్షపాతి మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి
- తిరుపతి

*ప్రజల పక్షపాతి మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి

వైకాపా రాష్ట్ర విద్యార్థి విభాగ ఉపాధ్యక్షులు డాక్టర్ బి ఓబుల్ రెడ్డి* *అక్షయ క్షేత్రంలో దివ్యాంగులకు పండ్లు, బ్రెడ్డు పంఫిణీ* తిరుపతి రూరల్ సెప్టెంబర్ 02 పున్నమి ప్రతినిధి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల పక్షపాతి అని వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ బి. ఓబుల్ రెడ్డి పేర్కొన్నారు. వైయస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ బి. ఓబుళ్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం వైయస్సార్ 17 వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. చెవిరెడ్డి కుటుంబ సామాజిక సేవా స్పూర్తితో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా తిరుపతి రూరల్ మండలం దుర్గ సముద్రంలో గల అక్షయ క్షేత్రంలో అనాధ పిల్లలు, వృద్దులకు పండ్లు, బ్రెడ్లు, స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ.. సుదీర్ఘ పాదయాత్ర లో తెలుసుకున్న ప్రజా సమస్యలను 2004 లో సీఎం అయ్యాక వైయస్ రాజశేఖర్ రెడ్డి పరిష్కరించారని గుర్తు చేశారు. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి అనేక చారిత్రక సంక్షేమ పథకాలకు రూపకల్పన చేశారని కొనియాడారు. తద్వారా రాష్ట్ర బహుముఖ అభివృద్ధికి కృషి చేశారని అభిప్రాయపడ్డారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడుగుజాడల్లో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల పక్షాన ప్రజా వ్యతిరేక విధానాల పైన పోరాడుతున్నారు.విద్యార్థులు, యువత సంక్షేమానికి సీఎంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంతో కృషి చేశారని అన్నారు. రాజకీయాల్లోనూ ఉన్నత పదవుల్లోనూ యువతకు అనేక అవకాశాలు కల్పించారని తెలిపారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా ఎంతో మందికి ఉన్నత విద్యా, ఉద్యోగ అవకాశాలు పొందేందుకు బాటలు పరిచారని తెలిపారు. రాష్ట్రంలో పేదల సంక్షేమానికి అవసరమైన కృషికి ఆనాడే సీఎంగా డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గట్టి పునాది వేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ సేందిల్ కుమార్, విద్యార్థి విభాగం జిల్లా కార్యదర్శి ప్రదీప్ కుమార్ మరియు విద్యార్థి,యువజన సంఘాల నేతలు వెంకటేష్ ప్రశాంత్ భార్గవ్ మహేంద్ర రెడ్డి విజయ్ కుమార్ భరత్ కుమార్ రెడ్డి గని దిలీప్ సాయికుమార్ భూపాల్ మధు ప్రతాప్ మాధవ్, పలువురు విద్యార్థులు యువత, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

వైకాపా రాష్ట్ర విద్యార్థి విభాగ ఉపాధ్యక్షులు డాక్టర్ బి ఓబుల్ రెడ్డి*

*అక్షయ క్షేత్రంలో దివ్యాంగులకు పండ్లు, బ్రెడ్డు పంఫిణీ*

తిరుపతి రూరల్ సెప్టెంబర్ 02 పున్నమి ప్రతినిధి

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల పక్షపాతి అని వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ బి. ఓబుల్ రెడ్డి పేర్కొన్నారు. వైయస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ బి. ఓబుళ్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం వైయస్సార్ 17 వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. చెవిరెడ్డి కుటుంబ సామాజిక సేవా స్పూర్తితో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా తిరుపతి రూరల్ మండలం దుర్గ సముద్రంలో గల అక్షయ క్షేత్రంలో అనాధ పిల్లలు, వృద్దులకు పండ్లు, బ్రెడ్లు, స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ.. సుదీర్ఘ పాదయాత్ర లో తెలుసుకున్న ప్రజా సమస్యలను 2004 లో సీఎం అయ్యాక వైయస్ రాజశేఖర్ రెడ్డి పరిష్కరించారని గుర్తు చేశారు. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి అనేక చారిత్రక సంక్షేమ పథకాలకు రూపకల్పన చేశారని కొనియాడారు. తద్వారా రాష్ట్ర బహుముఖ అభివృద్ధికి కృషి చేశారని అభిప్రాయపడ్డారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడుగుజాడల్లో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల పక్షాన ప్రజా వ్యతిరేక విధానాల పైన పోరాడుతున్నారు.విద్యార్థులు, యువత సంక్షేమానికి సీఎంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంతో కృషి చేశారని అన్నారు. రాజకీయాల్లోనూ ఉన్నత పదవుల్లోనూ యువతకు అనేక అవకాశాలు కల్పించారని తెలిపారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా ఎంతో మందికి ఉన్నత విద్యా, ఉద్యోగ అవకాశాలు పొందేందుకు బాటలు పరిచారని తెలిపారు. రాష్ట్రంలో పేదల సంక్షేమానికి అవసరమైన కృషికి ఆనాడే సీఎంగా డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గట్టి పునాది వేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ సేందిల్ కుమార్, విద్యార్థి విభాగం జిల్లా కార్యదర్శి ప్రదీప్ కుమార్ మరియు విద్యార్థి,యువజన సంఘాల నేతలు వెంకటేష్ ప్రశాంత్ భార్గవ్ మహేంద్ర రెడ్డి విజయ్ కుమార్ భరత్ కుమార్ రెడ్డి గని దిలీప్ సాయికుమార్ భూపాల్ మధు ప్రతాప్ మాధవ్, పలువురు విద్యార్థులు యువత, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.