తిరుపతిలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి అమరావతి ఛాంపియన్షిప్–2026 క్రీడా పోటీల్లో అరకు వ్యాలీ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థిని తామర్ల జ్యోతిక (III బీకాం) జావెలిన్ త్రో విభాగంలో తృతీయ స్థానం సాధించింది. జ్యోతికను కళాశాల ప్రిన్సిపాల్ డా. ఆర్. కుసుమకుమారి, ఫిజికల్ డైరెక్టర్ ఎల్. జ్యోతి అభినందించారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచి కళాశాలకు మంచి పేరు తీసుకురావడం అభినందనీయమన్నారు. విద్యార్థినులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు.

రాష్ట్ర స్థాయి క్రీడల్లో అరకు విద్యార్థినికి తృతీయ స్థానం