ఖమ్మం: ఖమ్మం–నల్గొండ–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి ఇప్పుడే మొదలైంది. 2027 మార్చిలో జరగనున్న ఈ ఎన్నికకు ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. జనసేన తరఫున డాక్టర్ గడల శ్రీనివాసరావు బరిలో దిగుతుండగా, ప్రస్తుత సిట్టింగ్ సభ్యుడు తీన్మార్ మల్లన్న మరోసారి పోటీ చేయనున్నట్లు సమాచారం. బీఆర్‌ఎస్ నుంచి ఏనుగు రాకేష్‌రెడ్డికి అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి ముగ్గురు లేదా నలుగురు నేతలు పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ సైతం బలమైన అభ్యర్థి కోసం వేట కొనసాగిస్తోంది. దీంతో ఈసారి ఎన్నికల్లో పంచముఖ పోరు ఖాయంగా కనిపిస్తోంది.



