Thursday, 3 September 2026
  • Home  
  • మిట్టమీదపల్లిలో ఘనంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ
- తిరుపతి

మిట్టమీదపల్లిలో ఘనంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ

రైల్వే కోడూరు మండలం అంతరాజపేట పంచాయతీ పరిధిలోని మిట్టమీదపల్లి గ్రామంలో శ్రీ వినాయకమయ్య స్వామి ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణలు, ప్రత్యేక పూజల నడుమ ధ్వజస్తంభ ప్రతిష్ఠను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ధ్వజస్తంభ ప్రతిష్ఠతో ఆలయం మరింత ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. గ్రామంలో భక్తి వాతావరణం నెలకొనడంతో భక్తులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అరవ శ్రీధర్, ముక్కా వరలక్ష్మి, రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్రతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు, ఆలయ నిర్వాహకులు, గ్రామ పెద్దలు, భక్తులు హాజరయ్యారు. ఆలయ అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.